ముల్తానీ మిట్టి వాతావరణ ప్రభావం చర్మం కోల్పోయిన తేమను, ఆయిల్‌ను తిరిగి చేకూరుస్తుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది. చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చర్మ రంధ్రాలలో వున్న మురికిని తొలస్తుంది.
మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తుంది.
మిట్టిని ఫేస్ మాస్క్‌గా వుపయోగించుకోవచ్చు. ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి, అరస్పూన్ కొబ్బరి నీళ్లు, అర స్పూన్ ఆరంజ్ రసం, అరస్పూన్ పైనాపిల్ జూస్. ఒక బంతి ఆకు, పూల ముద్ద, ఒక స్పూన్ గులాబీ రేకుల పేస్ట్ బాగా కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి.
దీన్ని ముఖానికి మాస్క్‌గా వేయాలి. వరుసగా 45 రోజులు ఇలా చేసినట్టయితే మీ చర్మ సౌందర్యం, మెరుపు మీరే నమ్మలేనంత అద్భుతంగా వుంటుంది.
రెండు స్పూన్ల ముల్తానీ మిట్టిలో పావు స్పూన్ చందనం పొడి, రెండు స్పూన్లు కొబ్బరి నీళ్లు, రెండు స్పూన్లు దోసకాయ రసం కలిపి పేస్టులాగా చేయాలి. దీన్ని ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం మరింత ఆకర్షణీయంగా తయారవుతుంది.
తొందరగా చెమట పట్టే వారికి ముఖం తొందరగా వాడిపోయినట్లు అవుతుంది. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్వచ్ఛమైన ముల్తానీ మిట్టిని కొద్దిగా నీటితో కలుపుకోవాలి.
దీన్ని మెత్తటి క్రీం లాగా తయారు చేసుకుని ముఖానికి పట్టించుకోవాలి. అలా పది నిముషాలు వుంచితే చాలు, ముఖం తేటగా కనిపిస్తుంది.
ముల్తానీకి కొద్దిగా నిమ్మరసం, పుదీనా రసం కలిపి ముఖానికి పట్టించినా మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు నెమ్మదిగా తగ్గుతాయి.
రెండు స్పూన్ల తులసి, పుదీనా రసం తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మకాయ, ముల్తానీ మిట్టి కలిపి ముఖానికి రాసుకోవాలి. అది ఆరిపోయిన తరువాత చల్లటి నీటితో కడగాలి. కాంతి విహీనంగా తయారైన ముఖానికి ఇంది ఎంతో మేలు చేస్తుంది.
ముల్తానీ మిట్టిని చర్మ రకాన్ని బట్టి నీటితో లేదా గులాబీ నీరుతో కూడా కలిపి ముఖంపై మాస్క్‌లా వేసుకోవచ్చు. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగితే ముఖం కాంతి వంతంగా అయిపోతుంది.
పొడిగా చర్మం వున్న వారు ముల్తానీ మిట్టిలో పాలమీగడ కలుపుకుని ముఖానికి రాసుకుంటే పొడిబారిన చర్మం బాగవుతుంది.
ప్యాక్ వేసుకుని వేసుకుని కడుగునేప్పుడు సబ్బును వుపయోగించడం మంచిది కాదు. వీలైనంత వరకు మంచినీటినే వుపయోగించండి.
కురులకు ముల్తానీ..
ఈ ముల్తానీ మిట్టిని శిరోజాలకు పట్టిస్తే అవి మరింత మెరుస్తూ, ఆరోగ్య కరంగా వుంటాయి. జుట్టుకు మరింత నలుపు రంగును చేకూరుస్తుంది.
కొందరికి పొడుగాటి వెంట్రుకలు వున్నప్పటికీ అవి కళావిహీనంగా, డల్‌గా అనిపిస్తాయి. అంటే వాటికి తగినంత మెరుపు వుండదు. అలాంటి వారు చిన్న చిట్కా పాటిస్తే ఆకట్టుకునే శిరోజాలు పొందవచ్చు.
రెండు స్పూన్ల ముల్తానీ మిట్టిని తీసుకుని ఒక స్పూన్ పెరుగు, రెండు స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించాలి. ఇది పూర్తిగా పొడిగా అయిపోయిన తరువాత తల స్నానం చేయాలి. అప్పుడు వెంట్రుకలు నిగనిగలాడుతూ ఫ్రెష్‌గా కనిపిస్తాయి.
తేనెతో సౌందర్య రక్షణ
తేనె నాణ్యమైన మాయిశ్చరైజర్. గోరు వెచ్చని తేనెను ముఖానికి పట్టించి 20 నిమిషాలాగి కడిగేయాలి. మదువుగా తేమగా మిలమిలలాడుతుంది మీ చర్మం.చెంచా తేనెకు రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి ముఖానికి పట్టించండి. పిగ్మెంటేషన్‌కు ఇది చక్కటి పరిష్కారం.
పొడిచర్మం వున్న వారు అరచెంచా తేనెకు రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి ముఖానికి పట్టిస్తే చాలు. మీ చర్మం గులాబీలా మృదువుగా తయారవడం ఖాయం.
తేనె, నిమ్మకాయ కలిపి ముఖానికి పట్టించినా కూడా మంచి ఫలితముంటుంది.
క్రమం తప్పకుండా తేనెను ముఖానికి రాసుకుంటే ముఖంలోని మచ్చలు తొలగిపోతాయి.
పొడిబారిన పెదవులపై కొద్దిగా తేనెను రాసుకుంటే పగుళ్ళు మాయం అవుతాయి.
తేనె జుట్టుకు మంచి కండిషనర్. పాలు తేనెల మిశ్రమాన్ని తలకు పట్టిస్తే జుట్టు పట్టులా నిగనిగలాడుతుంది.
ఎన్నో ఔషదాలలోనూ తేనెను వుపయోగిస్తారు.
తేనెను రోజూ కొద్దిగా తీసుకుంటే స్వరపేటికకు సంబంధించిన రుగ్మతలు కూడా దూరం అవుతాయి.
No comments:
Post a Comment