Pages

Thursday, July 8, 2010

కురులు చూడతరమా!

జుట్టు అందానికే కాదు మన ఆరోగ్యానికి కూడా ప్రతీక. అయితే అలాంటి ఆరోగ్యమైన అందాన్ని పొందేందుకు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టమంటే మీ జుట్టు పోషణ, దానికి తీసుకోవాల్సిన ఆహారం శ్రద్ధ చూపడం, కొన్ని జాగ్రత్తలు పాటించడం మాత్రమే. కొద్దిపాటి శ్రద్ధ మీ జుట్టును బలంగా, ఒత్తుగా, నిండుగా ఉండేలా చేస్తుంది. పలువురిలో మీ ప్రత్యేకతను చాటుతుంది.

hair-style- శిరోజాలు పెరగాలంటే ముఖ్యంగా పోషకాహారం తీసుకోవాల్సి వుంటుంది.
- పొడవాటి జుట్టును ఇష్టపడేవారు, మరింత పొడవు జుట్టు కావాలనుకునే వారు ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నా ఆహారం తీసుకోవాలి.
- పాల పదార్థాలు, గుడ్లు, పప్పు, మజ్జిగ, ప్రొటీన్ల క్యాల్షియం, ఆకు కూరలు, క్యారెట,్‌ చికెన్‌, పనీర్‌, మామిడికాయలు, ఆప్రికాట్‌, మొలకధాన్యాలు ఎక్కువగా తీసుకుంటే జుట్టు పెరిగేందుకు కావలసిన పోషకాలు అందుతాయి.
- జీవనశైలి కూడా జుట్టుమీద ప్రభావం చూపుతుంది. కాబట్టి వ్యాయామంపై శ్రద్ధచూపాలి.
- ఒక వేళ జుట్టు విపరీతంగా రాలిపోతుంటే కుదుళ్లను బలోపేతం చేసే ట్రీట్‌మెంట్‌ని బ్యూటీపార్లర్‌లో చేయించుకోవచ్చు.
- చుండ్రు ఉన్న వారు ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసాన్ని రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలిపి దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
- ఎండలో బయటికి వెళ్లినపుడు సన్‌స్క్రీన్‌ ప్రొటెక్షన్‌ ఉన్న ఉత్పత్తులను వుపయోగించుకోవచ్చు.
- తలస్నానం చేసిన తరువాత పావుగంట సేపు చిన్నగా వేళ్లతో మసాజ్‌ చేసుకోవాలి.
- చిక్కులతో చిందరవందరగా ఉండే జుట్టు గల వారు గుడ్డులో పచ్చసొనతో మృదువుగా మసాజ్‌ చేసుకోవాలి. అరగంట సేపు ఆగి తలస్నానం చేయాలి. స్నానం చేసిన తరువాత తలను మొత్తటి టవల్‌తో జుట్టుని రుద్దేస్తూ తుడుచుకోకుండా, మృదువుగా మెల్లగా తుడవాలి.
gopika- చుండ్రు సమస్యలు ఉన్నవారు సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాంపులను వాడాలి.
- మార్కెట్‌లో తల స్నానానికి సబ్బులూ అందుబాటులో ఉంటాయి. అయిలీ వెంట్రుకలు గల వారు మాత్రమే వారానికి ఒక్క సారి సబ్బులను వాడాలి.
- తడిగా ఉన్న జుట్టును దువ్వటం వల్ల జుట్టు చిట్టిపోయి పీచులాగా తయారవుతుంది. దీనివల్ల జుట్టు కుదుళ్ళు దెబ్బతింటాయి.
- కమలాపండు రసం తీసుకుని, కొన్ని చుక్కల చందనపు నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెలను కలిపి మిశ్రమంగా చేయాలి. షాంపూ స్నానం తరువాత ఈ మిశ్రమాన్ని వుపయోగించి జుట్టుపై జారుగా పోయాలి.
- జుట్టు విడిపోతున్నట్లుగా ఉండేవాళ్ళు కొబ్బరినూనెలో తాజా నిమ్మకాయరసం కలిపి జుట్టుకి ‚పట్టిస్తే ఫలితముంటుంది.
- జుట్టుకి మంచి షాంపూ కండీషనర్‌లు రాస్తూ శ్రద్ధ తీసుకుంటున్నా చుండ్రు, జుట్టు ఊడిపోవడం మొదలైన సమస్యలు వెంటాడుతుంటాయి. వీరు గుర్తించాల్సింది ఏమిటంటే జుట్టు సంరక్షణ అంటే షాంపూ కండీషనర్ల వాడకమే కాదు మంచి సమతులాహారం కావాలి. కీరదోస, దోస వంటివి ఎంతో మేలు చేస్తాయి.

No comments:

Post a Comment