Pages

Saturday, August 21, 2010

గుండె గుట్టు తెలుసుకోండి

గుండె ఎలా పనిచేస్తుంది...
గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరమంతటి నుంచి రక్తం గుండెకు వెళ్ళి, అక్కడ నుండి ఊపిరి తిత్తులకు వెళ్ళడం ద్వారా రక్తంలోని కార్బన్‌డై ఆకై్సడ్‌ బయటకు నెట్టివేయబడుతుంది.అలాగే ఆక్సిజన్‌ ఊపిరితిత్తులనుండి గుండెకు చేరి అక్కడినుండి రక్తంద్వారా ఆహార పదార్ధాలతో కలిసి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది.ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆ భాగం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడాన్ని గాంగ్రిన్‌ అంటారు.

Heartఎందుకంటే ఆ ప్రాంతానికి రక్తం అందక పోవడంతో ఆహారం, ఆక్సిజన్‌ అందదు కదా! గుండె ముడుచుకుపోవడం ద్వారానే రక్తనాళాల ద్వారా ఇలా రక్తం శరీరమంతటికీ చేరుతుంది. కాబట్టి గుండె చేసే కార్యం చాలా గొప్పదే కదా! శరీరమంతటికి వెళ్ళే రక్తం గుండెద్వారా వెళ్తున్నా, గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్నే గుండె పనిచేయడానికి తీసుకుంటుంది. అంటే గుండె ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో గమనించారా ? అదే నిస్వార్ధ బుద్ధి ని, నిర్విరామ కృషిని మనం గుండె నుండి నేర్చుకోవాలి.

గుండె దెబ్బతినేందుకు కారణాలు...
గుండె దెబ్బతిన్నా గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా ఇతర రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా కూడా శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. గుండె దెబ్బతిన్నా, ఏ ప్రాంతంలో రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా మందులతో కాక పోతే శస్తచ్రికిత్సల ద్వారా సరిచేయవచ్చు. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే హార్ట్‌ ఎటాక్‌ (గుండెపోటు) వస్తుంది. మెదడుకు సరఫరా చేసే కెరోటిడ్‌ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. గుండె నిర్విరామంగా కొట్టు కోవాలంటే దాని గోడలు బలంగా ఉండాలి.

గుండె గోడలు నీరసిస్తే గుండె సరిగా కొట్టుకోలేక హార్ట్‌ ఫెయి ల్‌ అవుతుంది. పుట్టుకతోనే గుండె నిర్మాణంలో కొన్ని లోపాలు ఏర్పడవచ్చు. వీటిని కంజెనైటల్‌ హార్ట్‌ డిసీజెస్‌ అంటారు. వీటిని శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు. కాబట్టి పుట్టగానే పిల్లల్లో గుండెలోపాలుంటే నిర్లక్ష్యం చేయక వైద్యులను కలవాలి. ఇది వంశ పారంపర్య అనారోగ్యం. సిగరెట్లు తాగడం, క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకుండా ఉండటం, ఒత్తిడి ఎక్కువ కావడం లాంటి జీవన విధానాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె దెబ్బ తింటుంది. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.గుండె కవాటాల లోపం రావచ్చు, గుండె గోడలలో చిల్లులు ఏర్పడవచ్చు. ఇలా రకరకాల గుండె అనారోగ్యాలు కలుగవచ్చు.

భయపడక్కరలేదు...
గుండె శస్త్ర చికిత్సలనగానే ఛాతీలో ఎముకలు కత్తిరిస్తారు, గుండె కొట్టుకోవడాన్ని ఆపి, కృత్రిమ గుండెకు కలిపి శస్త్ర చికిత్సలు చేస్తారు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.చాలామందికి భయం ఉంటుంది.అది నాటి మాట. మరినేడు గుండెను ఆపకుం డా... బీటింగ్‌ హార్ట్‌మీదే శస్తచ్రికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తు న్నారు. అదీ పెద్ద పెద్ద కోతలు లేకుండా ఒక సన్నటి కీహోల్‌ ద్వారా ఆపరేషన్‌ చేస్తున్నారు.గుండెకి శస్త్ర చికిత్సల్ని కీ హోల్‌ ద్వారా నిర్వహిస్తుండడంతో పెద్దకోతలు చేయాల్సిన పనిలేదు.చిన్న కోతలే కాబట్టి త్వరగా నయం అవుతుంది. రక్తస్రావం బాగా తక్కువ వుతుంది. నొప్పి తక్కువ .

హాస్పటల్‌లో ఉండే సమయం తక్కువ. ఖర్చూ తక్కువే. బైపాస్‌ సర్జరీ, కవాట మార్పిడి లాంటి శస్త్ర చికిత్సల్ని కీ హో ల్‌ ద్వారా గ్లోబల్‌ ఆసుపత్రిలో నయం చేస్తున్నాం. గుండె శస్త్ర చికి త్స లంటే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు.బైపాస్‌ చేయడానికి రక్తనాళం కాలులోంచి తీసు కోవడానికి కుడా పెద్ద గాయం చేయనవసరం లేదు. చిన్న కోతతో ఇప్పుడు కాలులోంచి రక్తనాళాల్ని తీస్తున్నాం.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది...
గుండె అరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకు వంశపారంపర్యంగా వచ్చే వాటిని మనం ఏమీ చేయలేము కానీ, మన అలవాట్లను మాత్రం మానుకోగలం. అలా మానుకుంటూ కొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవడం, గుండె ఆరో గ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడు జీవన విధానం వల్ల యువతీ యువకుల్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు మన పద్ధతులే దానికి కారణం. అందుకని మన జాగ్రత్తతో ఆరోగ్యాన్ని కాపాడు కుందాం. ఒక వేళ అనారోగ్యాలున్నా ప్రథమ దశలోనే గుర్తించాలి. అందుకు ఆరోగ్య అవ గాహనా సదస్సులు తోడ్పడ తాయి. వ్యాధిని ప్రథమ దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స పొందవచ్చు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించినా ఇప్పుడు భయ పడాల్సిన పనిలేదు. అన్నిరకాల చికిత్సలను ఇపుడు దిగ్వి జయంగా నిర్వహిస్తు న్నాం... కీ హోల్‌ లాంటి నూతన విధానాలూ అందు బాటు లో ఉన్నాయి. గుర్తించుకోండి.మీ గుండె ఆరోగ్యం మీచేతుల్లో ఉంది.

- డాక్టర్‌. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే
గుండె శస్తచ్రికిత్సా నిపుణులు,
గ్లోబల్‌ హాస్పటల్స్‌,లకిడికాపూల్‌,
హైదరాబాద్‌-4, మొబైల్‌:98480 45810

No comments:

Post a Comment