Pages

Saturday, September 4, 2010

చక్కదనాల వైద్యం ఆయుర్వేదం





faceఅందం ఆరోగ్యం రెండూ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. ఆరోగ్య కరమైన అందం ఆశించదగినది. అదే అందరిలోనూ శోభిస్తుంది కూడా. అనాదిగా వస్తున్న ఆయుర్వేదం ద్వారా అందాన్ని ఆరోగ్యాన్ని ఒకేసారి సొంతం చేసుకోవచ్చు. స్త్రీల సౌందర్య పోషణకు ఆయుర్వేదం ఎన్నో గృహవైద్యాలను ఉద హరించింది. వాటిలో కొన్ని తెలుసుకోండి. ఆచ రించండి. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని చక్కని విధా నాలతో అందాన్ని  మీ సొంతం చేసుకోండి.

 
నోటి దుర్వాసన పోయేందుకు
ఆకుపత్రి,లవంగాలు,పలకులు సమాన భాగాలుగా తీసుకుని పొడిచేసి నోటిలో వేసుకుని నములుతూ ఉంటే నోటి దుర్వాసన నశిస్తుంది.

స్నానచూర్ణం  
సుగంధ పాలవాయువితంగాలు, గంధకచ్చురాలు, వట్టివేర్లు, కస్తూరి, పసుపు, ఎండిన వేప, తులసి, మారేడు ఆకులు, నిమ్మకాయతోలు ఎండినవి,  మంజిష్టా అన్నింటినీ సమభాగాలుగా ఎండబెట్టి చూర్ణించి కలిపి ఉంచుకోవాలి. ఈ చూర్ణాన్ని పొట్టు ఉన్న పెసర్లు దోరగా వేయించి పొడి చేసుకుని   అందులో చూర్ణాన్ని  కలుపుకుని ప్రతి రోజూ శరీరానికి నూనె రాసుకుని ఈ పిండితో నలుగు పెట్టుకుంటే శరీరంపై పేరుకున్న కొవ్వు కరిగిపోయి చర్మం అందంగా మెరుస్తుంది. చర్మవ్యాధులు రావు.

స్త్రీలకు పొట్టమీద ముడుతలకు
తులసి ఆకులను మెత్తగా నూరి కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌గా చేసి పొట్టమీద ఉండే మడతపై రాస్తుంటే ముడుతలు తగ్గుతాయి.

పాదాలు శుభ్రంగా ఉండటానికి
పసుపులో తగినంత నిమ్మరసం కలిపి కాళ్లకు రాసుకుని రెండు మూడు గంటల తర్వాత సున్నిపిండితో బాగా రుద్ది కడుక్కుంటూ ఉంటే పాదాలు శుభ్రంగా ఉంటాయి.

చక్కని గోళ్లకి
నిమ్మరసం, వైట్‌ వెనిగర్‌ వేడినీరు సమాన భాగాలుగా తీసుకుని దానిలో ఒక బ్రష్‌ ముంచి ఆ    మిశ్రమాన్ని గోళ్లమీద  రాయాలి. గోళ్లు చక్కని మెరుపు సంతరించుకోవడానికి ఇది మంచి మార్గం.

కాళ్ల వేళ్ల మధ్యలో పాచిపోతే

నీటిలో బాగా నానడం  వలన పాచిపోయిన కాళ్లు వేళ్ల సందుల్లో జాజికాయ నూరి పైకి పూయాలి.  ఇది యాంటిఫంగల్‌ శక్తి ఉంది. 

No comments:

Post a Comment