మనం తినేపదార్థాల రుచి పెరగాలంటే దాంట్లో నిమ్మరసం పడాల్సిందే. నిమ్మ రుచిని పెంచడమే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది కూడా. దీనిలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మరసాన్ని అధికంగా తీసుకుంటే కార్బోహైడ్రేడ్‌లు నెమ్మదిగా కరుగుతాయి.
- నిమ్మరసం తాగినా...నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా...చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.
- నిమ్మరసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు వెలుపలకు నెట్టివేయబడతాయి.
- ఒక్కరోజు శరీరానికి సరిపడా కావాల్సిన సివిటమిన్‌ను నిమ్మ అందిస్తుంది.
- ఆరోగ్యపరంగానే కాక నిమ్మ సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
- తల స్నానం చేసే ముందు నీటిలో నిమ్మరసాన్ని కలిపిన నీటితో స్నానంచేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.
- నిమ్మరసాన్ని పెరుగులో కలిపి చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛామ పెరుగుతుంది.
- ఎండకు కమిలిన ప్రాంతమైనా, కూరగాయలు కోసేప్పుడు చేతులు రంగుమారినా నిమ్మరసాన్ని పట్టిస్తే ఆ మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
- ఎండిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండిలో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
- కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.
- నిమ్మరసం ముఖంమీద జిడ్డుని తొలగించి ఎప్పుడూ తాజాగా ఉంచగల్గుతుంది కూడా.
- నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
- నిమ్మరసాన్ని ముల్తానామట్టిలో కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
- నిరాహారదీక్ష విరమించేటప్పుడు కూడా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే ఖాళీకడుపులో గ్యాస్ చేరుకుని ఒక్కసారిగా ఏదైనా ఆహారపదార్థం తిన్నా...వెంటనే వాంతి అయిపోతుంది. ఒక్క నిమ్మరసం మాత్రమే శరీరం హరాయించుకుంటుంది.
- పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది.
సోయాతో సౌందర్యం
- నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముదు శరారమంతా పట్టించి మృదువుగా రుద్దుకోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.
- రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది.
- ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
- పదిహేను సోయాగింజలు, నాలుగు బాదం పప్పులను నాలుగైదు గంటలసేపు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ విశ్రమంలో టీ స్పూన్ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టించాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమల త్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది.
- సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది.
- మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది. సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇందవల్ల నల్లమచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి.ఇలా మన ఇంట్లోనే చౌకగా లభ్యమయ్యే పండ్లు, కూరగాయలతో సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్ పేస్ట్‌ను తయారు చేసుకుని తరచుగా ముఖానికి పట్టిస్తుంటే...ఆరోగ్యానికి ఆరోగ్యం...అందానికి అందం మెరుగవుతాయి.
No comments:
Post a Comment