Pages

Sunday, September 5, 2010

పాపే కావాలా..? అయితే పాటించండి !

baby-nameలండన్‌: ఈ వార్త ఆశ్చర్యం కలిగించినా...నమ్మకతప్పుదు. జన్మించే బిడ్డ.. అమ్మాయో, అబ్బాయో తెలుసుకునే వీలుంది కానీ, అమ్మాయి లేదా అబ్బాయే ఖచ్చితంగా కావాలనుకునే వారికి ఆ చాన్స్‌ అన్ని సందర్భాల్లోనూ లభించదు. హలెండ్‌లోని మాస్ట్రిచ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తల పరిశోధనలో తల్లిదండ్రులు పుట్టబోయే బిడ్డ అమ్మాయే కావాలనుకుంటే అది సాధ్యమేనని నిరూపించారు. దీని కోసం వారు కొన్ని ఆహార చిట్కాలను రూపొందించారు. వాటిని పాటిస్తే పాప పుట్టడం ఖాయమంటున్నారు. ప్రత్యేకంగా ఉప్పు, అరటిపండుకి దూరంగా ఉండేలా.... 23 నుండి 42 సంవత్సరాల మధ్యనున్న యూరప్‌కి చెందిన 172మంది మహిళలను తీసుకుని చేసిన పరిశోధనలో అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నెలల నిండక ముందు మహిళ తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. పరిశోధన కోసం నియమించిన 172 మంది మహిళల్లో కొంతమందికి డెలివరీ అయ్యేంతవరకు అరటిపండు, ఉప్పు తక్కువ ఉన్న పదార్ధాలను ఇచ్చారు.

పరిశోధకుల సలహాలను పాటించిన వారిలో 80 శాతం మందికి అమ్మాయిలే జన్మించారు. దీంతో శాస్తవ్రేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక నుంచి పాపే పుట్టాలనుకునేవారికి ఈ సలహా ఖచ్చితంగా మేలు చేస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. సమయానికి తిండి, శృంగారం, నిద్ర ఉంటే జన్మించే బిడ్డలు ఆరోగ్యంగా, చలాకీగా ఉంటారని అందరికీ తెలిసిందే.

కానీ అమ్మాయి పుట్టాలంటే... మాత్రం సోడియం, పోటాషియం, హై కేలరీలున్న ఆహారపదార్ధాలకి (ఆలీవ్‌, బేకన్‌, సాల్మన్‌ చేప, రొయ్యలు, బంగాళాదుంపలు, రొట్టె, ప్రేస్టిస్‌) దూరంగా ఉండాలంటున్నారు శాస్తవ్రేత్తలు. వీటికి బదులుగా కాల్షియం, మాగ్నిషియం, ఉన్న పదార్ధాలను ( ఓట్స్‌, క్యాబేజీ, బాదం, ఆరెంజ్‌, క్యాషూవ, గోధుమ పదార్థాలు, బీన్స్‌) పుచ్చుకుంటే మంచిదంటున్నారు. అయితే శాస్తవ్రేత్తలు సూచించిన ఈ ఆహార సూచి పురుషుల్లో పెద్దగా ప్రభావాన్ని చూపించదంటున్నారు. పాపకే జన్మనివ్వాలనుకుంటున్న మహిళ ఈ పోషకపదార్థాలని తప్పక తీసుకోవాలంటున్నారు. కేవలం అండాల విడుదల సమయంలోనే కాకుండా క్రమం తప్పకకుండా శృంగారంలోనూ పాల్గొనాలని పరిశోధకులు సూచించారు. సో ప్రత్యేకంగా అమ్మాయే కావాలనుకునేవారు శాస్తవ్రేత్తలు ఇచ్చిన సలహాలను పాటిస్తే... పండంటి పాప పుట్టడం గ్యారంటీ.

No comments:

Post a Comment