Pages

Friday, October 29, 2010

యోగాతో నిగనిగ

యోగా గురించి కొత్తగా చెప్పేదేముంది..? ఆ కాలంలో ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో కానీ ఇటీవలి కాలంలో మాత్రం అందరూ యోగా వెంట పడుతున్నారు. ఆధునిక జీవనశైలిలో ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగాకంటే పెద్ద ఔషధం లేదని విశ్వసించే వాళ్ల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది.

ఇదే అభిప్రాయాన్ని మరింత శాస్త్రీయంగా రుజువుచేశారు ఉత్తరాఖండ్‌లోని ఐ.ఐ.టి. రూర్కీ పరిశోధకులు. యోగా చేస్తున్న వాళ్ల, యోగా చేయని వాళ్ల ఆరోగ్యాన్ని పరిశీలించారు. రెండు బృందాలలోని సభ్యుల గుండె పనితీరును అధ్యయనం చేశారు. పరిశోధనలో పాల్గొన్న వారందరికీ ఎలక్ట్రోకార్డియోగ్రామ్స్ (ఈసీజీ) తీశారు.

దాన్నించి తెలిసిందేమిటంటే- క్రమం తప్పకుండా యోగా చేస్తున్న వారి హృదయ ప్రకంపనలు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. శరీరంలోని రక్తనాళాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. గుండె కవాటాలలో కొవ్వు చేరలేదు. యోగా చేయని వారి గుండె...? దాని పనితీరు అసంబద్ధంగా ఉందని తేల్చారు. 'ఆధునిక ఉద్యోగాల పనివేళలు కఠినంగా ఉండటంతో జీవనశైలి మారిపోయింది.

సమయంతో పోటీపడి పనిచేయక తప్పడంలేదు. దీంతో ఒత్తిడి పెరిగి గుండె ఆయుష్షు సన్నగిల్లుతోంది. అందుకే ప్రతి ఒక్కరు యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలిత' అని ఈ పరిశోధన చేసిన ఐ.ఐ.టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకులు రమేష్ కుమార్, వినోద్ కుమార్ చెప్పారు.

No comments:

Post a Comment