Pages

Sunday, October 24, 2010

అధిక బరువు... నష్టాలు

స్థూలకాయులు అధిక బరువుతో కలిగే సమస్యల నుంచే కాకుండా మూత్రపిండాల వంటి శరీరాంతర్గత అవయవాల సంబంధిత వ్యాధులతో కూడా బాధపడే అవకాశాలున్నాయి.స్థూలకాయులకు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
మూత్రపిండాల్లో రాళ్లు
obesityముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనుపిస్తుంటుంది. సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య 50 శాతం తక్కువే అయినప్పటికీ స్థూలకాయం గల మహిళల్లో సమస్య ఎక్కువగా ఉంటుంది. కొవ్వు అధికంగా ఉండడం వల్ల శరీరం ఇన్సులిన్‌కు తగిన రీతిలో స్పందించలేదు. దీని కారణంగా మూత్రంలో మార్పులు సంభవించి, మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలున్నాయని బోస్టన్‌లో ఉన్న బ్రిస్టన్‌లోని బ్రిగ్‌హామ్‌ అండ్‌ ఉమెన్స్‌ హస్పిటల్‌కు చెందిన డాక్టర్‌ ఎరిక్‌ టేలర్‌ స్పష్టం చేశారు. ఈ అంశంలో మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు ఆయన అన్నారు.

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోవడంతో ఆ కణాలు క్రమంగా కాలేయంలోకి చేరుకోవడం ప్రారంభిస్తాయి.ఇలా కాలే యంలో కొవ్వులు పేరుకు పోవడాన్ని స్టీటోసిస్‌ అంటారు. కాలేయంలో కొవ్వు కణాలు పేరుకుపోయి కలిగే ఇన్‌ఫ్లమేషన్‌ను నాష్‌ నాన్‌ ఆల్కహాల్‌ ఫాటీ లివర్‌ డిసీస్‌ అని ఎందుకంటున్నారంటే ఆల్కహాల్‌ తాగేవాళ్ల లివర్‌ దెబ్బతిన్నట్టే ఈ సిండ్రోమ్‌లోనూ లివర్‌ దెబ్బతింటుంది.అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ నాన్‌ ఆల్కహాలిక్‌ ఫాటిలివర్‌ డిసీజ్‌ కనిపిస్తుంటుంది.

Ayushఅధిక బరువు వల్ల శరీరంలో ఇన్సులిన్‌ రెసిసెటన్స్‌ పెరుగుతుంది. దాంతో ఎక్కువ మొత్తాలలో ఇన్సులిన్‌ ఇంజక్షన్‌ ద్వారా తీసు కుంటున్నా ఫలితాలు అంతగా ఉండవు. ఇలా అధిక బరువువల్ల మధుమేహంతో బాధపడుతుంటారు. మధుమేహం వ్యాధికాదు కాని డైజెస్టివ్‌ డిజార్డర్‌. దీని ప్రభావం క్రమంగా శరీరంలోని మూత్రపిండాలు, కాలేయంతో పాటు నరాలు కూడా దెబ్బతినడం తో నొప్పి తెలియదు. అందుకే సైటెంట్‌ హార్ట్‌ ఎటాక్స్‌ వస్తుంటాయి. బరువు పెరగడం, గుండె పోటుకు మధ్య ప్రత్యక్ష సంబం ధమే ఉంది.బరువు పెరగడం వల్ల అధిక రక్తపోటు కలుగుతుంది. లిపిడ్స్‌ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ లిపిడ్స్‌ స్థాయి పెరుగుతుంది. కొలెస్ట్రాల్‌ అయిన హెడిఎల్‌ కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కాబట్టి వీటన్నింటి ప్రభావం బరువు పెరిగే కొద్దీ ఎక్కువవుతుంది.

పరిశోధనలను బట్టి ఆడ,మగ, ఇద్దరిలో బిఎంఐ 23-25 కన్నా ఎక్కువ ఉంటే కరోనరి హార్ట్‌ డిసీజ్‌...అంటే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు పూడుకుపోయి గుండె పోటు వచ్చే అవకాశాలు 50 శాతం ఉన్నాయి.40-65 సంవతత్సరాల మధ్య వ యస్సు వాళ్లలో బిఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 25-29 మధ్య ఉంటే గుండె పోటు వచ్చే అవకాశాలు 72 శాతం ఉంటాయి. అధిక బరువున్న వాళ్లలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ అయ్యే అవకాశాలు ఎక్కువ. గుండె ముడుచుకుపోవడం వల్ల రక్తం శరీర భాగా లన్నీంటికీ వెళుతుంది.

మనం ఒక కిలో బరువు పెరిగామంటే గుండె మీద రోజుకు మరో 30 కిలోమీటర్ల దూరం రక్తాన్ని నెటా ్టల్సిన భారం పడుతుంది. అంటే బరువు పెరిగిన కొద్దీ గుండె, మరింత గట్టిగా ముడుచుకోవలసి వస్తుంది. దాంతో బరువు పెరిగే కొద్దీ గుండె కండరాల మీద భారం పెరుగుతుంది. అవి తొందరగా అలసిపోయే ప్రమాదం ఉంది. మాములు బరువున్న వాళ్లల్లో కన్నా స్థూలకాయులలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు మూడు రేట్లు అధికం.అధిక రక్తపోటున్న వాళ్లకు గుండెపోటే కాదు పక్షవాతం వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే. డైలేటెడ్‌ కార్డియోమయోపతితో పాటు గుండె రిథమ్‌ తప్పడం లయ తప్పి కొట్టుకోవడం వల్ల అధిక బరువున్న వాళ్లలో మరణాలు సంభవిస్తాయి.

ఊపిరితిత్తుల మీద అధిక బరువు ప్రభావం
Ayush-finalగుండెమీద ఎక్కువ రక్తాన్ని పంప్‌ చేయాల్సిన బాధ్యత పడినప్పుడు ఆ ప్రభావం ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఎందుకంటే గుండె పంప్‌ చేసిన రక్తమంతా శుభ్రపడడానికి, ఆక్సిజన్‌ తీసుకోవడానికి ఊపిరితిత్తులకు చేర్చాల్సి ఉంటుంది. దాంతో గురక లాంటివి ప్రారంభం కావచ్చు. ఇలాగే స్లీప్‌ అప్నియాలింటి ఇబ్బందులూ కలుగవచ్చు. నిద్రలో గొంతులోకి శ్వాసనాళాలు ముడు చుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిని గుర్తించిన వెంటనే వాళ్లను లేపాలి.నిద్రలేవగానే శ్వాసకండరాలు మాములుగా అవుతాయి. ఇలా స్లీప్‌ ఆప్నియాలో ఒక రాత్రిలో చాలాసార్లు శ్వాస ఇబ్బంది కలగవచ్చు. మాటిమాటికి వాళ్లని లేపుతుండడంతో నిద్ర చాలక పగలూ కునికి పాట్లు పడే అవకాశం ఎక్కువ. అధిక బరువు వల్ల శ్వాస నాళాలలో ఊపిరితిత్తులో ఎన్నో సమస్యలు రావచ్చు.

డా. కె.ఎస్‌. లక్ష్మి
ఒబెసిటి సర్జన్‌, లక్డీకాపూల్‌,
గ్లోబల్‌ హాస్పిటల్స్‌
ఫోన్‌: 9849713853, 23244444

No comments:

Post a Comment