కత్తులు లేని చికిత్స - నొప్పి తెలియని వైద్యం లేజర దంత వైద్యం
దంత సమస్యలకు చికిత్సలో భాగంగా హార్డ్, సాఫ్ట్ టిష్యూలకు లేజర్ చికిత్స చేస్తుంటారు. లేజర్ యంత్రంలో వీటికి చికిత్స చేసే పైప్స్ వేరువేరుగా ఉంటాయి. పలు రకాల చికిత్సలను అందించేందుకు వీలుగా పలు రకాల ప్రోగ్రామ్‌లు ముందుగానే అందులో లోడ్ అయి ఉంటాయి. ప్రోగ్రామ్ మార్చినప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్‌నివ్వాలి. రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్...ఇలా హార్డ్ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రామ్‌లుంటే, సాఫ్ట్ టిష్యూకోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో సాఫ్ట్ టిష్యూ చికిత్సలో ఉన్న ఎండోడాంటి క్స్ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చెయవచ్చు. బాగా లోతుగా ఉన్న ఇన్‌ఫెక్షన్‌ని అరి కట్టవచ్చు. పంటినిగాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవస రమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్ ద్వారా పన్నుపై భాగాలు అ రిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని, మరో ప్రోగ్రామ్ ద్వారా.. లేజర్ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించవచ్చు.సాధారణంగా అధికరక్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువగా ఉన్న చిగుళ్లని ఇంకో ప్రోగ్రామ్‌తో కత్తి రించవచ్చు. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చి వేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్ అనే కండరము ఏర్పడుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతా యి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసి వేయ వచ్చు లేజర్ కిరణా లతో. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్ టి ష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటి కీ సంబంధించిన ప్రోగ్రామ్‌తో ఉన్నాయి ఈ లేజర్ చికిత్సా యంత్రంలో.
ఇక హార్డ్ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 రకాల వరకూ ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్‌ని కట్ చేయవచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్ అండ్ ఫీజర్ సీలింగ్ పద్ధతి’లో మూసి వేస్తారు. లేజర్ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయ వచ్చు. ఫ్లోరోసిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సిటి వ్‌నెస్ ఎక్కువగా ఉంటే లేజర్ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్ చేయవచ్చు.
ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్..అంటే పాడైపోయిన కణాన్ని కచ్చితంగా అంతవరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు.
ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లో ని చిన్నచిన్న పుళ్లమీదకి లేజర్ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగు గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గి పోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటు వంటి మచ్చపడకుండా.
చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకురావు. అలాంటి పరిస్థితుల్లో లేజర్ కిరణాలతో నొప్పిలేకుండా చిగు ళ్లని కోసి, పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్లమీద జెల్‌ని రాసి,లేజర్ కిరణా న్ని నాలుగు నిముషాలు పంపడం తో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెస్టిబ్యులోప్లాస్టి. . పెదవి లోపలి వైపు ఎముకని లేజర్ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరిభాగం కోసు కుంటుంటే ఆపదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పిలేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్ కిరణాలను పంపి నొప్పి లేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. ఇలా హార్డ్ టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రా మ్‌లున్నాయి.
అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణా లని చికిత్స చేసి నా, గట్టికణాన్ని కత్తి రించినా నొప్పి ఉండదు. రక్తం కారదు.
చిగుళ్లలో పాడైపోయిన భాగా ల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్ ఎఫెక్ట్‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమయం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్ కిర ణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రామ్ పెడితే లేజర్ కిరణాలు ఆ కణాలనే మాడ్చే స్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టు కోకుండా. ఈ లేజర్ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్ లేజర్ కన్నా ఎన్‌డిఆర్ లేజర్ శక్తివంతమైంది. అనస్థేషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.
స్టెరిలైజింగ్ కోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతు లకన్నా ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగం. రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్తేషి యా లాంటివి అక్కర్లేదు.అవసరమైన చోటికే లేజర్ని పంపడం,ఎంత వేగం తో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
దంత అనారోగ్యం కలిగితేనే కాదు - చికిత్స కూడా బాధాకరం అనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ పళ్లు పుచ్చిపోతే లోపలి భాగాల్ని తొలగించడం, దంతాల చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్‌ని తొలగిం చడం, నోట్లో గడ్డలు ఎక్కుడున్నా తీసివేయడం, హిమాంజిె మా లవంటి వాటిని తొలగించడం, నోటిలో అల్సర్స్‌ని తగ్గించడం, పళ్ల హైపర్ సెన్సిటివిటిలాంటివి తగ్గించడం వంటి చికిత్సల్ని- కత్తి తో సంబంధం లేకుండా కాంతితో, ఏమాత్రం నొప్పి, రక్తస్రావం లేకుండా మన రాష్ట్రంలో చేయగ లుగుతున్నామంటే దంతవైద్య విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందిందో వేరుగా చెప్పనక్కర్లేదు.
లేజర్ కిరణాల సాయంతో వినూత్న పరికరం ద్వారా దంతాలు, చిగుళ్లు, నోటి ఎముకకు సంబ ంధించిన అనేక చికిత్సల్ని చేస్తున్నారు...ఇంతకు ముందు మెత్తటి కణాలకి చికిత్స చేసే లేజర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి.
‘ఔఅఖిఉ’ పదాన్ని విస్తరిస్తే ‘లైట్ యాంప్లికేషన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్’.
లేజర్ యంత్రం నుంచి హార్డ్ టిష్యూ, సాఫ్ట్ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్- వేరు వేరుగా ఉం టాయి.
దెబ్బతిన్న సాఫ్ట్ టిష్యూని తొలగించే సన్నటి పైప్‌కి చివర్న గాస్‌టిప్ ఉంటుంది. దీనిలోంచి లేజర్ కిరణాన్ని అవసరమైన ప్రాంతంలోకి ప్రసరించేట్టు చేస్తారు చికిత్సలో. ఇది ఫైబర్ ఆప్టిక్ ట్యూబ్. తర్వాత చికిత్సలో అప్పుడు పైనున్న టిప్‌ని తీసివేస్తే, టిప్‌ని పెంచుతారు. ఇలా క్రమంగా ఈ ఫైబర్ ఆప్టిక్ ట్యూబ్ అయిపోవచ్చు. అప్పుడు కొత్త తీగని వేసుకోవలసి వస్తుంది.
ఇదే మెషిన్‌కి-హార్డ్ టిష్యూకి చికిత్స చేయడానికి వీలుగా ఎక్కువ లేజర్ కిరణాన్ని ప్రసరింపజేసే ట్యూబ్ ఉంటుంది. ఇవి రెండూ ఒకే మిషిన్‌కి ఉండటం విశేషం. ఈ మెషీన్ విద్యుచ్ఛక్తి సాయంతో పనిచేస్తుంది.మామూలుగా వైద్యులకు హస్త వాసి అంటారు. చేతు లతోనే శస్తచ్రికిత్సలు, అన్ని చికిత్సలు చేస్తుంటారు. అందుకని చేతులతో నేర్పుండాలి, అనుకుంటాం. కానీ ఈ లేజర్ మెషీన్‌ని ఆపరేట్ చేయాలంటే చేతులతో నైపుణ్యమే కాదు, కాళ్లలో నైపుణ్య మూ ఉండాలి. ఎందుకంటే లేజర్ కిరణా న్ని ప్రసరింపచేసే పైప్‌ని రోగి నోటిలోని ఆ భాగం వరకూ తీసుకువచ్చినా కింద పాదంతో పెడల్ మీద అవసరమైనంత ఒత్తిడిని కలిగించినప్పుడే లేజర్ కిరణాలు బయటకు రావడం ప్రారంభిస్తాయి. ఎప్పుడు పాదాన్ని పైకెత్తి తే అప్పుడే లేజర్ కిరణాలు బయటికి ప్రసరించడం ఆగిపోతుంది.
లేజర్ పనిచేసేది ‘ధెర్మకోయాగ్యులేటివ్ ఎఫెక్ట్’తో. ఈ లేజర్ కిరణాలలో చాలా ఉష్ణముం టుంది. 200 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకూ ఉంటుంది. కానీ కాలదు. నొప్పి ఉండదు. రక్తస్రావముం డదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఉష్ణము నొప్పి కలిగించని కిరణాల ద్వారా ప్రవహించి చిి త్స తోడ్పడుతోందంటే!
హార్డ్, సాఫ్ట్ టిష్యూలకు చికిత్స చేసే పైప్స్ వేరువేరుగా ఉండడమే కాదు ప్రోగ్రామ్ మార్చిన ప్పుడల్లా చికిత్సా విధానం మారుతుంది. ఎలాగంటే చిగుళ్లకి చికిత్స చేయాలంటే ఒక విధమైన ప్రోగ్రామ్ నివ్వాలి. రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్‌కి మరో ప్రోగ్రామ్...ఇలా హార్డ్ టిష్యూ చికిత్స కోసం 40 ప్రోగ్రా మ్‌లుంటే, సాఫ్ట్ టిష్యూ కోసం మరో 40 ప్రోగ్రామ్‌లున్నాయి ఈ మెషీన్లో.
సాఫ్ట్ టిష్యూ చికిత్సలో వున్న ప్రోగ్రామ్స్‌ని కొన్నింటిని చూద్దాం. ఎండోడాంటిక్స్ ప్రోగ్రామ్స్‌తో రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ చెయవచ్చు. బాగా లోతుగా వున్న ఇన్‌ఫెక్షన్‌ని అరికట్టవచ్చు. పంటిని గాని, చిగుళ్లనిగాని, ఎముకనిగాని అవసరమైనంత కత్తిరించవచ్చు. మరో ప్రోగ్రామ్ ద్వారా పన్ను పై భాగాలు అరిగి జివ్వున లాగుతుంటే- ఆ ప్రాంతంలోని అతిస్పందనని మరో ప్రోగ్రామ్ ద్వారా.. లేజర్ కిరణాన్ని ఆ ప్రాంతంలోకి పంపి సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించే ప్రోగ్రామ్ ఉంది.
సాధారణంగా అధికరక్తపోటు, మూర్ఛలతో బాధపడే వాళ్లకు చిగుళ్లు వాస్తే ఎక్కువవున్న చిగుళ్లని కత్తిరించవచ్చు ఇంకో ప్రోగ్రామ్‌తో. మరో ప్రోగ్రామ్‌తో చిగుళ్లని ఓపెన్ చేయకుండానే కాంతి కిరణాలతో లోపల దెబ్బతిన్న చిగుళ్ల కణాన్ని మాడ్చివేయవచ్చు. నోట్లో చీముగడ్డలు ఏర్పడితే వాటిని తీసి వేసే ప్రోగ్రామ్ ఉంది. కొంతమందిలో రెండు పళ్లమధ్య ఫ్రీనమ్ అనే కండరము ఏర్ప డుతుంటుంది. దీంతో పళ్లమధ్య సందులు ఏర్పడతాయి. అలా సందులు ఏర్పడకుండా ఫ్రీనమ్‌ని తీసివేయవచ్చు లేజర్ కిరణాలతో.. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి సాఫ్ట్ టిష్యూ చికిత్సలకి. ఒక్కమాటలో చెప్పాలంటే నోటిలోని మెత్తటి కణాలన్నింటికీ సంబం ధించిన ప్రోగ్రాంలు ఉన్నాయి ఈ లేజర్ చికిత్సా యంత్రంలో.
ఇక హార్డ్ టిష్యూ..గట్టి కణాల చికిత్సకొస్తే అవీ 40 ఉన్నాయి. డెంటిన్‌ని, ఎనామెల్‌ని కట్ చేయ వచ్చు. పంటి మీద ఎత్తుపల్లాలు ఏర్పడి క్రమంగా పళ్లలో కంతలు ఏర్పడవచ్చు. ఇలా పళ్లు పుచ్చి పోకుండా కంతలు ఏర్పడుతున్న ప్రదేశాన్ని ‘ఫిట్ అండ్ ఫీజర్ సీలింగ్ పద్ధతి’ లో మూసి వేస్తారు. లేజర్ కిరణాలతో పన్నునే కాదు, ఎముకనీ కట్ చేయవచ్చు. పుచ్చిన పళ్లని తీసివేయవచ్చు. ఫ్లోరో సిస్‌వల్ల పళ్ల మీద పసుపు పచ్చని పొర ఏర్పడుతుంటే దాన్నీ తీసివేయవచ్చు. పళ్ల పై భాగంలో సెన్సి టివ్‌నెస్ ఎక్కువగా ఉంటే లేజర్ కిరణాలతో ఆ భాగాన్ని డిసెన్సిటైజ్ చేయవచ్చు.
ఎక్కువున్న చిగుళ్లని కట్‌చేయవచ్చు. గ్రాన్యులేషన్..అంటే పాడైపోయిన కణాన్ని ఖచ్చితంగా అంత వరకే తీసివేయవచ్చు. నోట్లో ఏర్పడే రకరకాల గడ్డల్ని హార్డ్‌లేజర్‌తో తొలగించవచ్చు. ముఖ్యంగా హిమాంజియోమాలు.. రక్తపు గడ్డల్ని తీసివేయడం కష్టం. వాటిని కొద్దిగా కత్తిరిస్తే చాలు రక్తం ధారగా కారుతుంటుంది. అలాంటి గడ్డల్ని రక్తస్రావం కాకుండా కాల్చివేయవచ్చు. ఒక్కపన్ను దగ్గరే చిగురువాస్తే దానిని తీసి వేయవచ్చు. క్రేన్‌ని పెంచడంకోసం చిగుళ్లని పెంచవుచ్చు. నోట్లోని చిన్న చిన్న పుళ్లమీదకి లేజర్ కిరణాన్ని పంపగానే నొప్పి తగ్గిపోతుంది. ఇరవైనాలుగ్గంటల్లో పుళ్లు పూర్తిగా తగ్గిపోతాయి. అంతేకాదు...ఆ ప్రాంతంలో నున్నగా తయారవుతుంది ఎటువంటి మచ్చ పడకుండా.
చిన్నపిల్లల్లో కొందరికి పళ్లు చిగుళ్లలో ఉండిపోతాయి. త్వరగా బయటకు రావు. అలాంటి పరిస్థి తుల్లో లేజర్‌కిరణాలతో నొప్పిలేకుండా చిగుళ్లని కోసి, పళ్లు బయటకు వచ్చేట్టు చేయవచ్చు. పళ్ల మీద జెల్‌ని రాసి, లేజర్ కిరణాన్ని నాలుగునిముషాలు పంపడంతో పళ్లని తెల్లగా చేయవచ్చు. వెసి ్టబ్యూల్‌లోప్లాస్టి....పెదవి లోపలివైపు ఎముకని లేజర్ కిరణాలతో కత్తిరించవచ్చు. పంటి చివరి భాగం కోసుకుంటుంటే ఆ పదునుని తగ్గించవచ్చు. ఎక్కడ ఎముక ఏమాత్రం ఎక్కువ వున్నా నొప్పి లేకుండా కత్తిరించవచ్చు. జ్ఞానదంతాలు ఓ పట్టాన బయటకు రాకుండా నొప్పి పెడుతుంటే లేజర్ కిరణాలను పంపి నొప్పిలేకుండా పైనున్న చిగుళ్లని కత్తిరించి దంతాలు బయటకు వచ్చేట్టు చేయ వచ్చు. ఇలా హార్డ్‌టిష్యూ లేజర్‌లో కూడా ఎన్నో ప్రోగ్రామ్‌లున్నాయి.
అన్ని రకాల దంత చికిత్సల్ని లేజర్‌తో చేయవచ్చు. మెత్తటి కణాలని చికిత్స చేసినా, గట్టికణాన్ని కత్తిరించినా నొప్పి ఉండదు. రక్తం కారదు. చిగుళ్లలో పాడైపోయిన భాగాల్ని చిగుళ్లని కత్తిరించ కుండా కాంతిని పంపి మాడ్చేయువచ్చు. సైడ్ ఎఫెక్ట్‌స ఉండవు ఈ చికిత్సలో. చికిత్సకి పట్టే సమ యం కూడా మామూలు విధానంతో పోలిస్తే తక్కువ. కేవలం రెండు నిముషాలలో కావలసిన ప్రోగ్రామ్‌ని సెట్ చేసుకోవచ్చు. ఏ ప్రోగ్రామ్‌ని సెట్‌చేస్తే లేజర్ కిరణాలు ఆ ప్రోగ్రామ్‌నే చేస్తాయి. మిగతా కణాన్ని ముట్టుకోవు. ఉదాహరణకు చిగుళ్లులోపల దెబ్బతిన్న కణాల్ని మాడ్చటానికి ప్రోగ్రా మ్ పెడితే లేజర్ కిరణాలు ఆ కణాలనే మాడ్చేస్తాయి మిగతాకణాల్ని ఏమాత్రం ముట్టుకోకుండా.
ఈ లేజర్ యంత్రాలలో కూడా కార్బన్‌డయాకై్సడ్ లేజర్ కన్నా ఎన్‌డిఆర్ లేజర్ శక్తివంతమైంది. అనస్థీషియా లేకుండానే ఈ శస్తచ్రికిత్సలన్నీ చేయవచ్చు.
లేజర్ అంటే..?
ఒక పద్ధతి లేకుండా ప్రయాణించే అనేక ఎలక్ట్రోమేగ్నిటిక్ వేవ్స్ మాములు కాంతిలో ఉంటాయి. దీనిని ‘ఇన్‌కొహెరెంట్ లైట్’ అంటారు. లేజర్‌కాంతి కిరణాలకు మూడు ప్రత్యేక ధర్మాలుంటాయి. ఇది తిన్నగా ఒకే దారిలో వెళ్తుంది. దూరం ప్రసరింపచేసిన చాలా కొద్దిగా మాత్రమే వంగుతుంది. ఇందుకు భిన్నంగా మామూలు కాంతికిరణాలు విస్తరిస్తాయి. లేజర్ కిరణాల రెండవ ధర్మం ఒకటే రంగుని కలిగి ఉంటుంది. మామూలు కాంతిలో ఇందుకు భిన్నంగా ఎన్నో వేవ్‌లెంత్స్ రంగులుం టాయి. లేజర్ యంత్రంలో లేజర్ కేవిటీలో లేజర్ కిరణాలు ఉత్పత్తి అవుతుంటాయి. లేజర్ కేవిటీలో మూడు ముఖ్యమైన విభాగాలున్నాయి. లేజర్ కిరణాలు ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్ జన రేటర్ ఒక ముఖ్యభాగం. లేజర్ కిరణాలని ఉత్పత్తి చేసే ప్రాంతం పవర్ జనరేటర్ ఒక ముఖ్య భాగం. లేజర్ కిరణాలని ఉత్పత్తి చేసే సోర్స్ ఘనరూపంలో ఉండవచ్చు.ద్రవరూపంలో ఉండ వచ్చు.వాయురూపలో ఉండవచ్చు. ఘన రూపంలో ఉండే సోర్‌స సిలెండ్రికల్ లేజర్ క్రిస్టల్ సాధా రణంగా వైద్యంలో వాడే లేజర్ క్రిస్టల్స్ Nd ; YAG, Er: YAG ( Neodimium yttrium- aluminium ganate, Erbium, yttrium- aluminium Gamate ఈ యాక్టివ్ మీడియమే... లేజర్‌నుంచి వచ్చే కాంతి వేవ్ లెంత్‌ని నిర్థారిస్తుంది. ఉదాహరణకి ND: YAG వేవ్‌లెంత్ 1.06 YM అయితే Er: YAG వేవ్‌లెంత్ 2.94. రెండవది యాక్టివ్ మీడియా పరమాణువుల్ని స్టిమ్యులేట్ చేసే ఎనర్జీ సోర్స్ పల్స్‌డేలో ప్రెజర్ జినాన్ ఫ్లాష్‌లాంప్.
మూడవ ముఖ్యమైన భాగం ఆఫ్టికల్ రిజోనేటర్. లేజర్‌కేవిటీకి రెండు చివర్లలోనూ రెండు హైలి పాలిష్ట్ మిర్రర్స్ ఉంటాయి. ఇవి ఉత్పత్తి అయ్యే లేజర్ కిరణాలు ప్రక్కలకు వెళ్లకుండా ముందుకు వెళ్లే మార్గాన్ని నిర్దేశిస్తాయి.
లేజర్ కిరణాలు ఉత్పత్తి కాగానే లేజర్‌బీమ్ డెలివరి సిస్టమ్ ద్వారా ముందుకు పంపబడతాయి. అక్కడ నుంచి పైప్ ద్వారా ఆ కిరణాల్ని నోటిలో ఏ ప్రదేశంలోకి పంపాలో ఆ ప్రదేశంలోకి పంపడం జరుగుతుంది.
మనుషుల మీద ఈ లేజర్ కిరణాల ప్రభావం యంత్రం నుంచి ఉత్పత్తి ఆయ్యే రేడియంట్ ఎనర్జీ వేవ్ లెంత్‌ని బట్టి ఉంటుంది. విచిత్రమేమిటంటే ఎంతో ఉష్ణము లేజర్ కిరణాలలో వున్నా ఏమా త్రం కాలదు, నొప్పి అనిపించదు. శరీరంలో ఏ ప్రాంతంలోనయినా లేజర్ కిరణాలు తాకగానే ఆ ప్రాంత అవయవాలు వాటిని పీల్చుకుంటాయి. ఈ పీల్చుకున్న లేజర్ కిరణాలు ఖచ్చితంగా ప్రోగ్రా మింగ్ ప్రకారమే పనిచేస్తాయి. ఎంత ఎక్కువ ఎనర్జీ లోపలకు తీసుకుంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది.
అవసరమైన చోటికే లేజర్ని పంపడం,ఎంత వేగంతో కావాలంటే అంత వేగంతో పంపడం వైద్యుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.
వైద్యంలో ఉపయోగించే లేజర్స్ ప్రధానంగా నాలుగురకాలు. మొదటివి గాస్ లేజర్స్ (Co2 Argon,Hene etc) రెండో రకం సాలిడ్ స్టేట్ లేజర్స్. ఇవి.Er ; YAG ND: YAG,KTP లాంటివి. మూడవరకం లిక్విడ్ (డై) లేజర్స్. నాల్గవ రకం డియోడ్ లేజర్స్.
Er: YAG ని అబ్జార్బ్ చేసుకునే క్రోమోఫోర్స్ - నీరు, హైడ్రాక్సియాపటైట్ హార్డ్ డెంటల్ టిష్యూ చికిత్సకి ఈ లేజర్ కిరణాల్ని వాడతారు. రక్తస్రావం లేకుండా రక్తం గడ్డకట్టకుండా, ఇన్‌ఫెక్షన్ రాకుండా సాఫ్ట్ డెంటల్ టిష్యూని కట్ చేయవచ్చు.
ND : YAG లేజర్ కిరణాలు మెలనిన్, హిమోగ్లోబిన్‌లలోకి నెమ్మదిగా పీల్చబడుతుంది. సాఫ్ట్ డెంటల్ టిష్యూని కోయడానికి...చికిత్సకి ఇది తోడ్పదుతుంది. ఇన్‌ఫెక్షన్ తొలగించడానికి, పళ్లు తెల్లగా మారడానికి కూడా తోడ్పడుతుంది.
KTP లేజర్ ND.YAG ఫ్రీక్వెన్సీకి రెట్టింపు, మెలనిన్, హిమోగ్లోబిన్‌లో అబ్జార్బ్ అవుతుంది. కట్ చేయడానికి, ఇన్‌ఫెక్షన్ పోగొట్టడానికి తోడ్పడుతుంది.
HO: YAG నీరు అబ్జార్బింగ్ క్రోమోఫోర్. కటింగ్, ఇన్‌ఫెక్షన్‌లను పోగొట్టడానికి ఈ లేజర్ కిర ణాలు తోడ్పడతాయి Co2 లేజర్‌కి అబ్జార్బింగ్ క్రోమోఫోర్ నీరు సాఫ్ట్ టిష్యూని కట్‌చేయడానికి ఇన్‌ఫెక్షన్ పోగొట్టడానికి తోడ్పడుతుంది. డియోడ్‌కి అబ్జార్బింగ్ క్రోమోఫోర్స్ మెలనిన్, హిమో గ్లోబిన్ సాఫ్ట్ టిష్యూ కటింగ్‌కి, ఇన్‌ఫెక్షన్ పోగొట్టడానికి పళ్లని తెల్లగ చేయడానికి ఈ లేజర్ తోడ్ప డుతుంది.
లేజర్ పెరామీటర్స్ వేవ్ లెంత్ (NM) పవర్ (W) రెపిటేషన్ రేట్ -ఫ్రీక్వెన్సి (H2) పల్స్ డ్యురేషన్ (MS OR Ms). లేజర్ కిరణాలు ఒక తరంగ దైర్ఘ్యంలో ప్రసరిస్తాయి. అదే వేవ్‌లెంత్ లేజర్ వేవ్‌లెంత్ 400 NM 700NM మధ్య ఉన్నప్పుడే కాంతి కంటికి కనిపిస్తుంది.
లేజర్ ద్వారా ఎంత ఎనర్జీ ఉత్పత్తి అయ్యేది అన్నది పవర్ వైద్యం కోసం ఉపయోగించే లేజర్స్‌ని ప ల్స్‌మోడ్‌లో ఆపరేట్ చేస్తారు. పల్స్ రిపిటిషన్ రేట్ ప్రకారం లేజర్ కిరణాలు ప్రసరిస్తాయి. సాధా రణంగా సెకండుకి 10 పల్స్‌స్ రేట్ ప్రకారం లేజర్ కిరణాలు ప్రసరించేట్టు చూస్తుంటారు.
పల్స్ డ్యూరేషన్ అంటే పల్స్ విడ్త్. లేజర్ పల్స్ లెంత్‌ని చెబు తుంది. లేజర్ ఎనర్జీని ప్రసరింపచేయడానికి పట్టేకాలం.
పల్స్ ఎనర్జి (j) అంటే లేజర్ పల్స్‌లో వున్న రేడియంట్ ఎనర్జి. పీక్ పవర్ (w) ఇండివిడ్యువల్ లేజర్ పల్స్‌తో పవర్ స్థాయిని పల్స్ ఎనర్జి అంటారు. స్పాట్ సైజ్ (NM) ఫ్లూయెన్స్ (J/ CM2) అంటారు.
థెర్మోకోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్ వల్ల గత ఇరవై సంవత్సరా లు గా లేజర్ కిరణాలను దంత వైద్యానికి సంబంధించిన వివిధ చికిత్సలకి ఉపయోగిస్తున్నారు. సాఫ్ట్ టిష్యూ చికిత్సలకి ND : YAG లేజర్‌తో బాగా నిర్వహించవచ్చు - స్టెరిలైజింగ్ కోయాగ్యులేటింగ్ ఎఫెక్ట్‌వల్ల మామూలు పద్ధతులకన్నా ఈ లేజర్ చికిత్స ఎంతో ఉపయోగం.
రక్తస్రావం,నొప్పి ఉండవు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్‌స కూడా ఉండవు. మందుల అవసరం ఉండదు. అనస్థీషియాలాంటివి అక్కర్లేదు.
డాక్టర్ సుధీర్ చౌదరి
దంత వైద్యనిపుణులు
అమీర్‌పేట్ డెంటల్ స్పెషాలిటీస్
అమీర్‌పేట్, హైదరాబాద్
No comments:
Post a Comment