Pages

Wednesday, December 15, 2010

వివిధ రకాలుగా ఊపిరితిత్తుల వ్యాధులు

వాతావరణంలో ఉండే కాలుష్య పదార్థాలు మన శరీరంలోని వివిధ అవయవాలపై దుష్ర్పభావాలు చూపిస్తుంటాయి. చర్మం, కళ్లపైనే కాకుండా, ఊపిరితిత్తులపైన కూడా ఈ ప్రభావాలు ఉంటాయి. శ్వాస తీసుకున్నప్పుడు గాలిలో సూక్ష్మంగా ఉండే పదార్థాలు ఊపిరితిత్తులో చేరుతాయి. వీటిలో ఎక్కువ భాగం శ్వాస నాళాలలోని ద్రవ పదర్థాలలో చేరి కఫం ద్వారా బైటికి నెట్టివేయబడతాయి. వ్యాధి నిరోధక శక్తి కలిగించే ఐజి-ఎ యాంటిబాడీస్‌ శ్వాస నాళాలలో చేరే క్రిముల నుండి దేహాన్ని రక్షిస్తాయి. తెల్ల రక్తకణాలు కూడా దీనికి దోహదపడతాయి.

kidnyగాలిలో సూక్ష్మంగా ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లతో పాటు ఫంగస్‌, దుమ్ము, ధూళి, పుప్పొడి లాంటి పదార్థాలు ఉంటాయి. వీటికి తోడు పరిశ్రమలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో వివిధ రసాయన పదార్థాలు సల్ఫర్‌డై ఆకై్సడ్‌, హైడ్రోజన్‌ సలె్పైడ్‌, క్లోరిన్‌, నైట్రికి ఆకై్సడ్‌ తదితరాలు ఉంటాయి. ఇలాంటి రసాయన పదార్థాలు పీల్చినప్పుడు దగ్గు, కఫం, పిల్లికూతలు, ఛాతీ పట్టేయడం జరుగుతుంది. కొందరిలో కెమికల్‌ నీమోనైటిస్‌ అనే సమస్య వస్తుంది. కొందరిలో వాతావరణ మార్పులు జరుగుతు న్నప్పుడు వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి.

వీరిలో జలుబు, జ్వరం, ఒళ్లునొప్పులు, ఆకలి మందగించడం, తలపోటు వంటి లక్షణా లు ఉంటాయి.ఇలా సంవత్సరంలో రెండు,మూడు సార్లు వైరస్‌ ఇన్‌ఫెక్షన్లు రావచ్చు. రెస్పిరేటరీ సిన్నసషియల్‌ వైరస్‌, రైనోవైరస్‌, ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌ దీనికి కారణం, వ్యాధి నిరోధక శక్తి మందగించినప్పుడు ఇలాంటి వారిలో న్యూమెనియా కూడా రావచ్చు. దీనికి కమ్యూనిటీ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. దగ్గినపుడు, తుమ్మినపుడు శ్వాసనాళాలో నుండి వెలువడే గాలి తుంపరల వల్ల ఒకరినుండి మరొకరికి జబ్బులు వస్తాయి. క్షయవ్యాధి ఉన్నవారు దగ్గినప్పుడు వారిలో ఉండే టి.బి. బ్యాక్టీరియా గాలి తుం పర్ల ద్వారా ఇతరుల ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తి వలన నిస్తేజమవుతాయి. కాబట్టి కొద్దిమందిలో మాత్రమే వ్యాధి ప్రబలే అవకాశం ఉంది.

ఈ వ్యాధి ఇతరులకు రాకుండా ఉండాలంటే దగ్గినప్పుడు మొహానికి అడ్డంగా రుమాలు ఉంచుకోవడం ఎంతైనా అవసరం. కొంతమందిలో గాలిలో ఉండే ఫంగస్‌, ఆస్పర్జిల్లస్‌, కాండిడా, పెన్సిల్లియమ్‌లు ఊపిరితిత్తు లోకి చేరి న్యూమోనియా, ఉబ్బసం, ఎక్స్‌ట్రిన్సిక్‌ ఎలెర్జిక్‌ అల్వియోలైటిస్‌ అనే వ్యాధులు కలుగచేస్తాయి. సాధరాణంగా వాడే యాంటిబయోటిక్స్‌ వలన న్యూమోనియా తగ్గినప్పుడు ఫంగస్‌ న్యూమోనియా ఉందేమోననే అనుమానం కలుగుతుంది. క్యాన్సర్‌ వ్యాధి ఉన్న వారిలోనే కాకుండా క్యాన్సర్‌ మందులు వాడుతున్న వారిలో కూడా ఇలాంటివి కనిపిస్తుంటాయి.

ఇతర వ్యాధుల చికిత్స కోసం ఆసుపత్రులలో అత్యధిక కాలం ఉన్న వారిలో వచ్చే న్యూమోనియాను హాస్పిటల్‌ ఆకై్వర్డ్‌ న్యూమోనియా అంటారు. ఆసుపత్రి వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా సాధారణ వాతావరణంలో ఉండే బ్యాక్టీరియా కంటే భిన్నంగా ఉంటుంది. వీటిలో కెల్సియెల్లా, సూడోమోనాస్‌లు ముఖ్యమైనవి. శక్తివంతమైన యాంటిబయోటిక్స్‌ వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్కొక్కసారి జ్వరం తగ్గకుండా ఉంటుంది. న్యూమోనియా శరీరమంతా పాకి సెప్టిసీమియా వస్తుంది. మామూలుగా కొన్ని సూక్ష్మక్రిములు ముక్కు, గొంతులో జబ్బేమీ కలుగజేయకుండా ఉంటాయి. మత్తు పదార్థాలు సేవించే వారిలో నోటిలోని లాలాజలం, ఆహారంతో పాటు ఇవి స్వరపేటికను దాటి శ్వాస నాళాలలోకి ప్రవేశిస్తాయి.వీటి వల్ల బ్రాంకటైటిస్‌, యాస్పిరేషన్‌ న్యూమోనియా వస్తుంది.

JAMA_LungHealthఊపిరితిత్తుల వ్యాధులు శ్వాస ద్వారానే కాకుండా ఇతర కారణాల వలన కూడా రావచ్చు. కాలేయంలో చీము గడ్డలు ఏర్పడినప్పుడు వాటిలో ఉండే బ్యాక్టీరియా, అమీబా వంటి సూక్ష్బజీవులు డయాఫ్రంను దాటి ఊపిరితిత్తులలోకి చేరుకుంటాయి. న్యూమోనియా, హెపాటిక్‌ పల్మొనరీ అమీబియాసి వీటితో కలిగే వ్యాధులు. ఛాతిలో నీరు, చీము కూడా వస్తుంటుంది.కడుపులో నీరు, చీము ఇదే విధంగా డయాఫ్రంలో ఉండే చిన్న చిన్న రంధ్రాల ద్వారా ముఖ్యంగా కుడివైపున ఉన్న ఫ్లూరల్‌ కేవిటీలోకి చేరి ఫ్లూరల్‌ ఎఫ్యూజన్‌, ఎంపరుూమ వ్యాధులను కలుగజేస్తాయి.

మూత్రపిండాలు, గర్భాశయానికి చెందిన ఇన్‌ఫెక్షన్లు రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరి ఆక్యూట్‌రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధిని కలుగచేస్తాయి. సాధారణంగా ఇటువంటి ఇన్‌ఫెక్షన్లు గ్రామ్‌ నెగటివ్‌ బ్యాక్టీరియా, స్టెఫలోకాకస్‌ బ్యాక్టీరియాలకు సంబంధించినవై ఉంటాయి.చర్మంలో గానీ, శరీరంలోని ఏ ఇతర అవయంలలో కానీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినా అది సెప్టిక్‌ పదార్థాలుగా మారి రక్తం ద్వారా శ్వాసకోశాలకు చేరుతుంది. ఊపిరితిత్తులు ఇలా రక్తం ద్వారా వచ్చే క్రిములను, సెప్టిక్‌ ఎంబాలైలను ఫిల్టర్‌ చేస్తుంది. కనుక ఈ సూక్ష్మక్రిములు ఊపిరితిత్తులలో పేరుకుపోయి లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌ను కలుగచేస్తాయి. రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌ ఉన్న వారిలో గుండెలోని కుడిభాగం కవాటాలు ఇన్‌ఫెక్టై తద్వారా శ్వాసకోశాల్లోకి ఈ ఇన్‌ఫెక్షన్‌ పల్మొనరీ ఆర్డరీ ద్వారా వ్యాపిస్తుంది.

కాలుష్యంతో ఆరోగ్యానికి ముప్పు...
రోజురోజుకీ జనాభా పెరగిపోతోంది. పరిశ్రమలు, వాహనాలతో కాలుష్యం మరింత ఎక్కువవుతోంది.పెరుగుతున్న కాలుష్య ప్రభావం మనమీద ఎంతగానో ఉంటోంది. రకరకాల రోగాలు ప్రబలుతున్నాయి. మనలో పెరుగుతున్న దురలవాట్ల ప్రభావం కూడా దీనికి తోడవుతుంది. ధూమపానం చేసే వాళ్ల ముక్కు, గొంతులలలో దురద, ఇన్‌ఫెక్షన్స్‌, ఆస్త్మాలాంటి వ్యాధులు రావచ్చు. పొగత్రాగేవాళ్లలో కొందరికి క్యాన్సర్‌ రావచ్చు. చిన్నప్పటి నుంచి పొగత్రాగే వాళ్లలో పాదాలకు రక్తప్రసరణ తగ్గి బర్జర్స్‌ డిసీజ్‌ రావచ్చు. ఈ వ్యాధిలో క్రమంగా వేళ్లు, పాదాలలోని సన్నని రక్తనాళాలు దెబ్బతిని, రక్త ప్రసరణ లేక గాంగ్రీన్‌ వస్తుంది. క్రమంగా కాళ్లని తీసి వేయాల్సిన పరిస్థితిరావచ్చు.

గర్భిణీ స్ర్తీలు పొగత్రాగనే కూడదు. పక్కనుండే వాళ్లు పొగత్రాగినా వారి ప్రభావం వీళ్ల మీద పడుతుంది.దీని వల్ల పుట్టిన పిల్లలో బరువు తక్కువ ఉంటుంది. నెలలు నిండకుండానే డెలివరీ రావచ్చు. కారణం లేకుండా పిల్లలు చనిపోవచ్చు. పొగత్రాగడం వల్ల త్రాగేవారికి అనారోగ్యం కలుగుతుంది. అంతేకాదు, వీళ్లు విడిచే పొగని పీల్చే చుట్టు ప్రక్కల వాళ్ల ఆరోగ్యం పాడవుతుంది కూడా. వాతావరణంలోకి పొగని విడిచిపెట్టే వాహనాలకు, వీళ్లకు తేడా ఉండదు. ముఖ్యంగా చంటి పిల్లల ముందు సిగరెట్‌ లాంటివి కాల్చడం మరీ ప్రమాదకరం. ఇలాంటి కలుషిత గాలి పీల్చడం వల్ల చిన్న పిల్లల్లో న్యుమోనియా, దగ్గు, ఆయాసం, పిల్లి కూతలలాంటివి వస్తాయి.

మనం పీల్చే ఇన్‌హేలర్స్‌లో క్లోరోఫ్లోరో కార్బన్స్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్రమంగా వాతావరణంలోకి ప్రవేశించి రేడియేషన్‌ దుష్ర్పభావాన్నుంచి మనల్ని కాపాడుతున్న ఓజోన్‌ పొరని దెబ్బతీస్తాయి. ఒజోన్‌ పొర దెబ్బతింటే ఫిల్టర్‌ కాకుండా సరాసరి వచ్చే అట్ట్రావయోలెట్‌ కిరణాల వ్లస్కిన్‌ క్యాన్సర్స్‌, కెటరాక్ట్‌ లాంటి వ్యాధులు రావచ్చు. ఎసి. ఫ్రిజ్‌లోనూ ఈ క్లోరో ఫ్లోరో కార్బన్‌లుంటాయి. పరిశ్రమలు కూడా విపరీతంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి వదిలే కాలుష్యాల వల్ల రకరకాల రోగాలొస్తున్నాయి. ఉదాహరణకి కాటన్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాల్లకి బైసినోసిస్‌, షుగర్‌కేర్‌ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకి బాగాసోసిస్‌, యాస్బెస్టాస్‌ కంపెనీలో పనిచేసే వాళ్లకి యాస్టెస్టోసిస్‌ అనారోగ్యాలు కలుగుతాయి.

ఇలాంటి వృత్తుల్లో పనిచేఏ వాళ్లు ముక్కుకు మాస్క్‌ని ధరించడంతో పాటు మిగతా జాగ్రత్తలూ తీసుకోవాలి.జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యక్తులకు కొంత మేలు జరుగవచ్చు. గానీ వాతావరణ కాలుష్యం పెరుగుతుంది కదా.గాలిలో కలిసి ఉండే దుమ్ము, ధూళీ, గ్యాస్‌ పార్టికల్స్‌ సూర్యకిరణాలలలో కలసి రసాయనిక సంయోగం చెంది ఫొటోకెమికల్‌ సొల్యూషన్‌ ఉత్పత్తి అవుతుంది. సల్ఫర్‌ డయాకై్సడ్‌, క్లోరిన్‌ లాంటి వాయువులు వాతావరణంలో కలిసిపోయి ప్రజల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి.

మనం ఎలా శ్వాసిస్తున్నాం...
మనం మామూలుగా గాలిని ముక్కు ద్వారా పీల్చుకుంటాం. శ్వాసతోనే మనం జీవిస్తాం. వాతావరణంలో తక్కువ తేమతో ఉండే చలిగాలి సరాసరి శ్వాసనాళాలలోకి వెళ్లకుండా ముక్కు ద్వారా వెచ్చగా అయి నీటి ఆవిరిని కూడా కలుపుకొని శ్వాసనాళాల్లోకి వెళ్తుంది. ముక్కు నుంచి నేసోఫారింక్స్‌, లారింక్స్‌ ఆ తరువాత ట్రేకియాలోకి వెళ్తుంది. ట్రేకియా చివరి భాగంలో శ్వాసనాళం రెండుగా చీలి ఉంటుంది. వీటిని బ్రాంకై అంటారు. ఇవి విడివిడిగా ఒక్కొక్క ఊపిరితిత్తులోకి వెళ్తాయి. క్రమంగా ఈ నాళంరెండుగా చీలుతూ ఊపిరితిత్తులను ఆక్రమిస్తాయి. రెండు మి.మీ.ల కంటే సన్నగా ఉండే శ్వాసనాళాలను స్మాల్‌ ఎయిర్‌వేస్‌ అంటారు.

ఊపిరితిత్తులలో ఈ శ్వాసనాళాల చివరి భాగాలు టెర్మినల్‌ బ్రాంకియోల్‌, రెస్పిరేటరీ బ్రాంకియోల్‌, ఆల్వియోలార్‌ డక్ట్స్‌లోకి చేరి అంతమవుతాయి. ఊపిరితిత్తులు రెండూ గొంతు దిగువ భాగాన ఛాతీ కుహరంలో ఒకదాని పక్కన మరొటి ఉంటాయి. ఈ రెండింటి మధ్య భాగంలో ఉండే ఖాళీ స్థలాన్ని మీడియస్టినమ్‌ అంటారు.. మీడియాస్టినమ్‌ మధ్య భాగంంలో గుండె, దాని నుంచి వచ్చే రక్తనాళాలు ఉంటాయి. ఒక్కొక్క ఊపిరితిత్తిని ఒక్కొక్క పొర ఆవరించి ఉంటుంది. ఊపిరితిత్తికి అతుక్కొని ఉండే పొరను విస్రల్‌ఫ్లూరా అంటారు. దాని పైభాగంలో ఉండే పొరని పెరైటల్‌ప్లూరా అంటారు. ఈ రెండు పొరల మధ్య ఉండే స్థలాన్ని ప్లూరల కేవిటీ అంటారు.

దీనిలో రక్తం నుంచి వచ్చే సీరమ్‌ సుమారు ఐదు నంచి పది మిల్లీ లీటర్లు ఉంటుంది.ఈ పొరల మధ్య నీరు, గాలి, ఇన్‌ఫెక్షన్‌ చేరితే అనారోగ్యానికి గురువుతాం.ఊపిరితిత్తులు పిరమిడ్‌ల ఆకారంలో ఉంటాయి.చిన్న ిపిల్లలు ఊదుకునే బెలూన్స్‌లా ఇవి చాలా మెత్తటి అవయవాలు. బ్రౌనిష్‌ రెడ్‌ రంగులో ఉంటాయి. కుడివైపు ఉండే ఊపిరితిత్తిలో మూడు, ఎడమవైపు ఉండే ఊపిరితిత్తిలో రెండు లోబ్స్‌ ఉంటాయి. అయితే కుడివైపు ఊపిరితిత్తిలో మూడు భాగాలున్నా సైజులో మాత్రం చిన్నగా ఉంటుంది.ఎడమ ఊపిరితిత్తి పరిమాణం 55 శాతం ఉంటే కుడి ఊపిరితితి ్తపరిమాణం 45 శాతం ఉంటుంది.                                                
shyam-dundar

డా బి.శ్యామ్‌సుందర్‌ రాజు,
పల్మొనాలజిస్ట్‌.
ఫోన్‌ నెం. 93940 18040

No comments:

Post a Comment