'ఏంటే లంచ్ చెయ్యవా..'? 'లేదే... ఉపవాసం'.
'ఎప్పుడూ లేనిది ఏంటీ ఈరోజు స్పెషల్! ఏ పండగో పబ్బమో కూడా లేదు కదా!'
'హూ.. ఏం చెప్పనే. నిన్న పెళ్లికి వెళ్లామా.. అన్ని వెరైటీలు చూసేసరికి నోరూరిపోయింది. ఒక్కోటి ఒక్కో ముద్ద రుచి చూశాను గానీ రోజూ తినేదాని కన్నా రెండొంతులు పొట్టలోకి వెళ్లిపోయింది. ఆ ఆయాసం ఇప్పుడే తగ్గింది. అసలే డైటింగ్ మొదలుపెట్టి వారమే అయ్యింది. అందుకే ఈ రోజంతా తినడం మానేస్తే సరి. అంతా సర్దుకుంటుందని నిర్ణయించా.' నీరసంగా బదులిచ్చింది నీరజ.ఆమె లాంటి వాళ్లు చాలామందే ఉంటారు. కాని అలా కడుపు మాడ్చుకోవడం సరికాదంటున్నారు నిపుణులు.
*** ఒక క త్రీనా కైఫ్... ఒక కరీనా కపూర్.... జీరో ప్యాక్! అమ్మాయిల ఆకాంక్ష ఇది. నాజూకైన శరీరం కోసం పడని పాట్లు లేవు. ఎక్కడ ఏ ఫిట్‌నెస్ సెంటర్ కనిపించినా బరువు తగ్గించుకోవడానికి అక్కడ వాలిపోతూ ఉంటారు. డైటింగ్‌లతో కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. డైటింగ్ చేయడం అంటే తిండి మానేయడం కాదు... క్రమబద్ధంగా తినడం అని అర్థం. కానీ ఉపవాసాలు చేయడమే డైటింగ్ అనే అపోహ చాలామందిలో ఉంది. నోటికి రుచిగా ఉంది కదా అని ఏది పడితే అది ఎడాపెడా లాగించేయడం... తరువాత పశ్చాత్తాపపడి రెండు రోజులు తిండి మానేయడం... చాలామందికి ఇది అలవాటయిపోయింది. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.
ఏది డైటింగ్...?
ఏదైనా జబ్బు చేస్తే కొద్దిరోజులు మందులు వాడతాం. అవసరమైన చికిత్సలు తీసుకుంటాం. కొన్నాళ్ల తరువాత అనారోగ్యం తగ్గగానే వాటి అవసరం ఉండదు. కానీ డైటింగ్ అలా కాదు... అధిక బరువు జబ్బు కాదు... డైటింగ్ చికిత్స కాదు. ఏదో కొంతకాలం డైటింగ్ పాటించేస్తే ఇక సమస్యలు రావు అనుకోవడానికి. జీవితాంతం పాటించాల్సిన విధానమిది. డైటింగ్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుంటారు.
కొందరు పూర్తిగా పచ్చి కూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకోవాలంటారు. మరి కొందరు రోజుకి ఒక పూటే భోజనం చేయాలంటారు. నిజానికివేవీ కరెక్ట్ కాదంటారు పోషకాహార నిపుణులు. మన శరీరానికి ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు ఎంత అవసరమో కేలరీలు కూడా అంతే అవసరం. కాకపోతే ఇవి కాస్త తక్కువ మోతాదులో అవసరం. కేలరీలు తక్కువ అయితే కూడా పోషకాహార లోపం ఏర్పడి జబ్బు పడవచ్చు. కేవలం పచ్చి కూరగాయలు తిని వుండటం వల్ల శరీరానికి కేలరీలు అందవు.
మూడు పూటల భోజనం ఒక్కపూటే లాగించేయడమూ సరికాదు. కేలరీలందించే వాటితో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు సమపాళ్లలో తీసుకుంటేనే అందమూ, ఆరోగ్యమూను. కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత చురుగ్గా పనిచేయగలుగుతుంది. కడుపులో ఎలకలు పరుగెట్టి, కళ్లు తేలేసేంత ఆకలి కాకముందే ఏదో ఒకటి తినేస్తాం కాబట్టి ఎక్కువ మోతాదు ఆహారం తీసుకోం. అందుకే క్రమబద్దమైన ఆహారమే మేలు.
మాడితే బరువు పెరగడం ఖాయం
నిజానికి కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బరువు పెరిగే అవకాశం రెండింతలుందంటున్నారు నిపుణులు. తగినంత ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. నీరసించిపోతారు. శరీరం బలహీనమైతే మెదడు కూడా చురుగ్గా పనిచేయదు. బలహీనంగా ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్ల అవకాశాలూ పెరుగుతాయి.
అంతేగాకుండా ఎప్పుడైతే సరిపడా ఆహారం తీసుకోమో.. వెంటనే మన శరీర ం తాను నిలవ చేసుకున్న కొవ్వులను కరిగించి ఆ కేలరీలను శక్తి వినియోగానికి వాడేస్తుంది. ఈ కొవ్వు నిల్వలు అయిపోయిన తరువాత...? ఈ ముందుచూపు మన శరీరానికీ ఉంది. అందువల్ల మనం తిన్న ఆహారంలో ఎక్కువ మొత్తంలో కొవ్వులుగా మార్చేసి నిల్వ చేసుకుంటుంది. దాంతో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఆ తరువాత మనం ఆహారం మామూలుగా తీసుకున్నప్పటికీ శరీరం తన అలవాటును మార్చుకోదు. అలా కడుపు ఖాళీగా ఉంచినా కొవ్వు పెరిగే అవకాశాలుంటాయి. అంతేగాక గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే కడుపు మాడ్చితే బరువు తగ్గుతామన్నది కేవలం అపోహే.
శరీరానికీ క్రమశిక్షణ
మనం ఎలా అలవాటు చే స్తే మన శరీరం అలా తయారవుతుంది. పొట్టకి కొంచెమే ఆహారం ఇస్తే అక్కడితోనే సరిపెట్టుకుంటుంది. ఎక్కువ వేస్తూ పోతే అది కూడా బెలూన్‌లా ఉబ్బిపోతుంది. తిరిగి అంతే మోతాదులో తింటే తప్ప కడుపు నిండదు.
అందువల్ల మొదట్లోనే శరీరాన్ని క్రమశిక్షణలో పెడితే ఆ తరువాత అనారోగ్యాల పాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడవు. రోజూ ఒకే సమయానికి తింటే ప్రతిరోజూ ఠంచనుగా అదే సమయానికి ఆకలేస్తుంది. ఎన్ని ముద్దలు తింటే కరెక్ట్‌గా అంత తినగానే ఆకలికి బ్రేక్ పడుతుంది. కాబట్టి బరువు పెరిగిన తరువాత బాధపడి కడుపు మాడ్చుకునే బదులు ముందుగానే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం సరైన డైటింగ్ పద్ధతి అన్నది నిపుణుల సూచన.
డైటింగ్ సూత్రాలు
*ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినండి. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి (ఫాస్ట్‌ఫుడ్ కాకుండా) తినండి. వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే త్వరగా కడుపు నిండుతుంది. తిన్న తృప్తి ఉంటుంది.
* ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు. ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజులో నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోండి.
* సలాడ్స్ మేలు చేస్తాయని అన్నం తినడం మానేసి పూర్తిగా సలాడ్స్‌పైనే ఆధారపడటం మంచిది కాదు.
* ఎక్కువగా ఫ్రై చేసిన వాటి జోలికి వెళ్లవద్దు. మరీ తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి కొద్దిగా రుచి చూడండి.
* కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రొటీన్స్ ఉన్న ఆహారానికి పెద్దపీట వేయండి.
*మనం పోషకపదార్థం పరిగణించని ముఖ్యమైన పోషకం మంచినీళ్లు. సరిపడా నీళ్లు తాగడం మరవకండి.
* ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ లేబుల్స్ చూసి ఎంతైనా తీసుకోవచ్చని భ్రమపడకండి. అవి కేలరీ ఫ్రీ కాదు. ఎక్కువ కేలరీలు తీసుకుంటున్నారంటే ఎక్కువ ఫ్యాట్ ని ఆహ్వానిస్తున్నట్టే. అందుకే ఏదైనా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.
* ఆహారంతో పాటు ప్రధానమైనది వ్యాయామం. మంచి ఆహారంతో పాటు వాకింగ్ కూడా దినచర్యలో భాగమైతే బరువు పెరిగితే అడగండి.

No comments:
Post a Comment