చలికాలమే కాదు.. ఎండాకాలంలోనూ పాదాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎండకు కమిలి పోవడం.. నల్లగా మారడం.. వంటివి ఇప్పుడు తరచూ జరుగుతుంటాయి. అటువంటి సమయాల్లో పాదాలకు ట్రీట్‌మెంట్ తప్పనిసరి. దీనిని ఇంట్లోనే చేసుకోవచ్చు కూడా. ముఖ్యంగా పెడిక్యూర్ చేసుకుంటూ వుండాలి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
పాదాలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా నెయిల్ బ్రష్, నెయిల్ క్లిప్పర్స్, పూమిస్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ వార్నిష్, ఒక చిన్న టబ్ తీసుకోవాలి.పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు చేయబోయేది పెడిక్యూర్. పాదాలకి కావల్సినంత మసాజ్, టోనింగ్ దీని వల్ల లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలు దృఢంగా ఉంటాయి.
పెడిక్యూర్ చేయడానికి...
పెడిక్యూర్ చేయడానిి ఒక టబ్‌లో గోరువెెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలో షాంపూ, సగం నిమ్మకాయ, ఏదైనా నూనె, చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు 20 నిమిషాలు ఈ టబ్‌లో కాళ్లు పెట్టి కూర్చోవాలి. అంతన్నా ముందు పాదాల గోర్లపై ఉన్న నెయిల్ పాలిష్‌ను రిమూవర్ సహాయంతో తొలగించాలి. పాదాలను నీళ్లలో పెట్టిన తర్వాత మడమలు, అరికాళ్లను ప్యూమిస్ స్టోన్‌తో లేదా గరుకుగా ఉండే సున్నిపిండి వంటివాటితో రుద్ది శుభ్రం చేయాలి.
గోళ్లను మాలిష్ చేస్తూ...
గోళ్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని చర్మం వెనుక భాగానికి బాగా తోయాలి. గోళ్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్ ఇవ్వాలి. ఈ సమయంలో గాయపడకుండా చూసుకోవాలి. ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మాలిష్ చేయాలి.ఇష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్ లేదా వారంలో ఒకసారి స్క్రబ్ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి గోళ్లు మెరుపు కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.
No comments:
Post a Comment