Pages

Monday, October 31, 2011

ఫ్యాటీలివర్ సమస్యకు శాశ్వత పరిష్కారం

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది జీర్ణప్రక్రియకు తోడ్పడే రసాలను ఉత్పత్తి చేస్తుంది. కొందరు అధికంగా బరువు పెరగడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయం కొవ్వును తొలగించలేకపోతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు కాలేయంలో నిలువ ఉండిపోతాయి. కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దగా అవుతుంది. సామర్థ్యం తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీలివర్ అంటారు. ఇతర సమస్యలకోసం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది.

కారణాలు

కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్. ఇదే కాకుండా ఆల్కహాల్, దీర్ఘకాలంపాటు మందులు వాడటం, విల్‌సన్స్ డిసీజ్, రోగనిరోధక వ్యవస్థలో కలిగే లోపాలు ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న వారు, స్థూలకాయులు, హైపర్‌ట్రైగ్లిసరిడీమియా, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిర్థారణ పరీక్షలు

కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సి.బి.పి), లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్.ఎఫ్.టి), సి.టి లివర్, యూఎస్‌జి అబ్డామిన్, లివర్ బయాప్సీ, లిపిడ్ ప్రొఫైల్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఆర్‌బిఎస్ పరీక్షలు చేయించడం ద్వారా కాలేయ పనితీరు, వ్యాధులను నిర్ధారించుకోవచ్చు.

చికిత్స

కాలేయ వ్యాధులకు హోమియోలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పరిశీలించి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే వ్యాధి త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

కార్డస్‌మరైనస్ : ఈ మందు కాలేయం, నరాల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం, శరీరంలో నీరు పట్టడం, కాలేయం పరిమాణం పెరగడం, ఆకలి మందగించడం, మలబద్ధకం, అర్షమొలలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఛెలిడోనియమ్ : కాలేయం సమస్యలు, తల బరువుగా ఉండటం, తల తిరగడం, కాలేయం వాపు, పచ్చకామెర్లు, పిత్తాశయంలో రాళ్లు, మలబద్ధకం, ఆయాసం, మెడనొప్పి, కుడి భుజంనొప్పి, శరీరం పచ్చరంగులోకి మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

సియోనాంతస్ : ఇది కాలేయం, ప్లీహం మీద మంచి ప్రభావం చూపుతుంది. మలేరియా, రక్తహీనత, ప్లీహం వాపు, కుడిపైపు కడుపు నొప్పి, కాలేయ వాపు, నడుం నొప్పి, అర్జంటుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఉపకరిస్తుంది. లైకోపోడియమ్ : కొంచెం ఆహారం తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, కాలేయం వద్ద నొప్పి, శరీరంలో నీరు పట్టడం, కాలేయ వాపు, అర్షమొలలు, మలబద్ధకం, ఉత్సాహంగా లేకపోవడం, తీపిపదార్థాలంటే ఇష్టపడుతుండటం, చల్లదనానికి, రాత్రివేళ నొప్పి నుంచి ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉప యోగించవచ్చు.

కాల్కేరియా కార్బ్ : తెల్లగా, లావుగా ఉండి ఎక్కువ చెమటలు పట్టే తత్వం ఉన్నవారికి మంచి మందు. వంగినపుడు కాలేయం వద్ద నొప్పి, కడుపు ఉబ్బడం, ఇంగ్వైనల్ మీసెంటరిక్ గ్రంథుల వాపు ఉంటుంది. చల్లదనానికి, నిలబడినపుడు ఈ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. పొడి వాతావరణంలో నొప్పి ఉన్న వైపు పడుకుంటే ఉపశమనం ఉంటుంది. ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ మందు వాడవచ్చు.

మెర్క్‌సాల్ : దాహం అధికంగా ఉండటం, జీర్ణశక్తితగ్గడం, కాలేయ వాపు, పచ్చకామెర్లు, రక్తం, జిగురుతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.

మాగ్‌మూర్ : ఇది కాలేయంపైన మంచి ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి లోపించిన మహిళలకు ఇది దివ్యౌషధం. గర్భాశయ సమస్యలతో బాధపడే వారు ఉపయోగించవచ్చు. నాలుకు పచ్చరంగులో ఉండటం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అర్షమొలలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

నక్స్‌వామికా : తేన్పులు, వికారం, వాంతులు, జీర్ణశక్తిలోపించడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నక్స్‌వామికా మందు పనిచేస్తుంది.

ఫాస్‌ఫరస్ : ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, మలబద్ధకం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు.
నివారణ

* అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
* ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
* కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.

డాక్టర్ టి. ప్రభాకర్, ఎండి హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, 
ఫోన్ :955000339, 9550001188

Saturday, October 29, 2011

మలినాలను కడిగే పంచకర్మలు

ఎంత సేపూ వ్యాధి లక్షణాలను తగ్గించే వైద్య చికిత్సల కోసం వెళతాం కానీ, వ్యాధి కారకమైన ఆ మూలాల మీదికి చాలా సార్లు మన దృష్టే వెళ్లదు. శరీరంలో పేరుకుపోయిన కల్మషాలను తొలగించుకోకుండా ఏ వ్యాధైనా శాశ్వతంగా పోదుకదా! అందుకే ఆయుర్వేదం ఆ కల్మషాలను తొలగించే పంచకర్మ చికిత్సలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ప్రత్యేకించి సొరియాసిస్ వ్యాధి నిర్మూలనలో ఈ పంచకర్మ చికిత్సలు మరీ ముఖ్యమైపోయాయి.

శరీరంలో పేరుకుపోయిన మాలిన్యాలు సొరియాసిస్ రావడానికి అతి ముఖ్యమైన కారణం. ఈ మాలిన్యాలకు మానసిక ఒత్తిళ్లు కూడా తోడైతే, సమస్య మరీ తీవ్రమవుతుంది. అందుకే సొరియాసిస్‌కు ఈ రెండు కోణాల్లోంచి చికి త్సలు అందించవలసి ఉంటుంది. ఈ క్రమంలో శరీరంలోని మలినాలను తొలగించడానికి ఉద్దేశించినవే పంచకర్మ చికిత్సలు.

వమనం, విరేచనం, వస్తి, నస్య, రక్తమోక్షణం అనే ఈ ఐదు చికిత్సలు సొరియాసిస్ నిర్మూలనలో అద్భుతంగా తోడ్పడతాయి. శరీరాన్ని పంచకర్మ చికిత్సలకు సిద్ధం చేయడానికి కూదా కొన్ని విధానాలు ఉంటాయి. వీటినే పూర్వకర్మలు అంటారు. అందులో భాగంగా స్నేహం ( తైలమర్ధనం) స్వేదం ( స్టీమ్) ఉంటాయి.

చర్మ వ్యాధుల్లో సాధారణంగా శరీరం పొడిబారిపోయి ఉంటుంది. ఔషధాలు కలిసిన నెయ్యి గానీ, నూనె గానీ ఇచ్చే ఈ స్నేహపాన ం వల్ల ఆ పొడితనం పోయి చ ర్మానికి ఒక నూనెతనం, ఒక మృదుత్వం వస్తాయి. ఈ చికిత్స మూడు నుంచి ఏడు రోజుల దాకా ఉంటుంది. ఈ ప్రక్రియలో వాడే నూనె లేదా నెయ్యికి సహజంగా జిడ్డుతనం, జారుడు గుణం ఉంటాయి. వీటివల్ల శరీరంలో పేరుకుపోయి, గ ట్టిపడిన దోషాలను ఇది మెత్తబడతాయి. ఆ తరువాత శరీరానికి చెమట పట్టించే స్వేదం చేస్తాం. దీనివల్ల అప్పటికే మెత్తబడిన మలినాలన్నీ కడుపులోకి వచ్చేస్తాయి. వాటిని కడుపులోంచి బయటికి పంపించడానికి ఇక పంచకర్మ చికిత్సలు అవసరమవుతాయి.

వమనం
సొరియాసిస్ మచ్చలు మందంగా ఉండి దురద కలిగిస్తూ, నలుపెక్కి ఉంటే శరీరంలో ఖఫదోషం ఎక్కువగా ఉన్నట్లు భావించబడుతుంది. ఈ దోషాన్ని నిర్మూలించడానికి 'వమన క్రియ' అవసరమవుతుంది. ఇది ఔషధాలు కలిపిన ద్రవాలు ఇచ్చి వాంతి చేయించే ప్రక్రియ. వమన క్రియ వల్ల కడుపులోకి చేరిన మలినాలన్నీ బయటికి వెళ్లిపోతాయి.

విరేచన క్రియ
సొరియాసిస్ మచ్చలు ఎర్రబడి, పొట్టు ఎక్కువగా రాలుతూ ఉండడం వాతం ఎక్కువగా ఉన్నట్లు చెప్పే సూచనలు. ఈ స్థితిలో విరేచన క్రియ అవసరమవుతుంది. వాతాన్ని తొలగించడంలో విరేచన క్రియను మించింది లేదు. ఇది మలద్వారం ద్వారా శరీరంలోని మలినాలన్నిటినీ బయటికి పంపించే ప్రక్రియ.

వస్తికర్మ
సొరియాసిస్ చికిత్సలో వస్తికర్మ పాత్ర చాలా తక్కువ. కాకపోతే, సమస్య సొరియాసిస్ ఆర్థరైటిస్‌గా పరిణమించిన స్థితిలో మాత్రం వస్తికర్మ అవసరమవుతుంది. ఈ సమస్యేమీ లేనప్పుడు వస్తికర్మ అవసరం లేదు. నిజానికి సొరియాసిస్ చికిత్సలో వమన, విరేచనాలదే కీలక పాత్ర అవుతుంది.

నస్యకర్మ
ఔషధపు చుక్కలను నాసిక రంద్రాల్లో వేసే ప్రక్రియను నస్యకర్మ అంటారు. ఇది శారీరక ప్రధానమే కాకుండా మానసిక ప్రధానం కూడా. ఈ చికత్సతో ప్రతికూల ప్రేరకాలన్నీ తొలగిపోయి మెదడు చైతన్యవంతమవుతుంది. అలాగే అస్తవ్యస్తమైపోయిన మెదడులోని అల్ఫా, బీటా, గామాలు నియంత్రణలోకి వస్తాయి.

ఇవి తరంగాల వంటివి. వీటి ఆధారంగానే మనిషి ఆలోచన సరళి ఉంటుంది. ఆ తరంగాలను నియంత్రించడం నస్యకర్మ వల్ల సాధ్యమవుతుంది. దీనివల్ల భయాందోళనలు, దిగులు, డిప్రెషన్ తొలగిపోయి, మానసిక ప్రశాంత ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్య కూడా తొలగిపోతుంది.

రక్తమోక్షణం
కొందరిలో సొరియాసిస్ మచ్చలు కొన్ని చోట్ల మందంగా మారిపోతాయి. అక్కడ గడ్డకట్టుకుపోయిన చెడు రక్తమే ఇందుకు కారణం. ఆ చెడు రక్తాన్ని తీసివేయకుండా ఎన్ని మందులు వాడినా ఆ మచ్చలు తగ్గవు. గడ్డకట్టుకుపోయిన ఆ చెడు రక్తాన్ని, జలగల సహాయంతో తీసివేయవలసి ఉంటుంది. ఇలా చేసే ప్రక్రియనే రక్తమోక్షణం అంటారు. ఆ తరువాత కూడా ఆ వ్యాధి మళ్లీ రాకుండా ఒక ఏడాది పాటు మందులు వాడవలసి ఉంటుంది.

నిజానికి, పంచకర్మల తరువాత శరీరంలో మందులను గ్రహించే శక్తి బాగా పెరుగుతుంది. పంచ కర్మ చికిత్సలకు ముందే మందులు వాడితే, 50 శాతం ఉండే ప్రయోజనం ఆ చికిత్సల తరువాత అయితే 100 శాతం ఉంటుంది. కాకపోతే, పంచకర్మ చికిత్సలతో శరీరం పరిశుద్ధంగా మారి, మందులతో వ్యాధి తగ్గినా, అది శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగినట్లేమీ కాదు.

ఆ శక్తి పెరగకపోతే మళ్లీ ఏదో ఒక వ్యాధి వచ్చే వీలుంది. అందుకే పంచకర్మ చికిత్సలు తీసుకున్నాక వ్యాధి నిరోధక శక్తిని పెంచే రసాయన చికి త్సలు తప్పనిసరి అవుతాయి. అశ్వగంధ, శతావరి, గుడూచి, బ్రాహ్మి, యష్టిమధు వంటి ఔషధాల మిశ్రమంతో తయారయ్యే ఈ రసాయనాలు శరీరాన్ని సర్వశక్తివంతంగా తయారుచేస్తాయి. దీని వల్ల శరీరం వ్యాధిగ్రస్తం కాకుండా స్థిరంగా ఉంటుంది.

Saturday, October 22, 2011

స్థూలకాయానికి సిసలైన పరిష్కారం

స్థూలకాయంతో కదలికలు కష్టం కావడమే కాదు శరీరం పలురకాల దుష్ప్రభావాలకు గురవుతుంది. 21 శతాబ్ధంలోని అతి తీవ్రమైన సమస్య స్థూలకాయమే. శరీరాన్ని రోగగ్రస్తం చేయడమే కాకుండా అంతిమంగా ఇది మనిషి ఆయుష్షును తగ్గించివేస్తుంది.
ఎందుకొస్తుంది?
స్థూలకాయానికి, మౌలికంగా జీవన శైలి లోపాలు, ఆహారపు అలవాట్లే కారణంగా ఉంటాయి. అంటే అవసరానికన్నా ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం, ఆహారం తీసుకోవడానికి ఒక నిర్ధిష్టమైన సమయమేదీ పాటించకపోవడం, పగటిపూట అతిగా నిద్రించడం, నిరంతరం కూర్చుని ఉండే ఉద్యోగ వ్యాపారాలు, బొత్తిగా శరీర శ్రమ లేకపోవడం వంటి కారణాలే ప్రధానంగా ఉంటాయి. వీటికి తోడు కొందరికి జన్యుపరమైన కారణాలతో కూడా స్థూలకాయం రావచ్చు.
వైద్యపరమైన కారణాలు
మనం తీసుకునే ఆహారం సక్రమంగా జీర్ణమైతేనే అది శరీరానికి శక్తినిస్తుంది. అయితే కొంద రిలో జీవక్రియలేవీ సరిగా పనిచేయవు. ఫలితంగా కొవ్వు, మలిన పదార్థాలు శరీరంలో పేరుకుపోతాయి. ఇది స్థూలకాయానికి దారి తీయడంతో పాటు అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలకు దారి తీస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్యలు, హార్మోన్, బహిష్టు సమస్యలు మొదలవుతాయి. గర్భాశయం తీసివేసిన కారణంగా కూడా కొందరిలో ఈ సమస్యలు తలెత్తవచ్చు. కొందరిలో ఈ స్థితిలో రక్తహీనత సమస్యకూడా ఏర్పడుతుంది.
స్థూలకాయంతో చిక్కులు
స్థూలకాయంతో అధిక రక్తపోటు, మధుమేహం మాత్రమే కాదు, ఆస్తమా, కీళ్లనొప్పులు, గుండె జబ్బులు కూడా వస్తాయి. శరీరంలో కొవ్వు అతిగా పేరుకుపోవడం వల్ల శరీరంలోని అతి కీలక భాగాలైన గుండె, లివర్, కిడ్నీలు కూడా దె బ్బ తింటాయి. శరీరంలో అతిగా కొవ్వు పేరుకుపోయిన వారు ఇతరుల కన్నా 30 శాతం కన్నా ఎక్కువగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది.

ఇవీ మా చికిత్సలు
వాస్తవానికి స్థూలకాయాన్ని తగ్గించడంలో ఆయుర్వేదం అత్యంత సురక్షిత వైద్య విధానం. ప్రపంచ ప్రసిద్ధిపొందిన ఆర్య వైద్య ఫార్మసీ లిమిటెడ్ (కోయంబత్తూర్)తో ఒప్పదం కుదర్చుకున్న మా మంజూష ఆయుర్వేద హాస్పిటల్ స్థూలకాయాన్ని శాశ్వతంగా తొలగించగలుగుతోంది. మూల దోషాలను తొలగించడం, పేరుకుపోయిన కొవ్వు, వ్యర్థపదార్థాలను శరీరం నుంచి తొలగించడం, స్థూలకాయపు దుష్ప్రభావాలను తొలగించడం ప్రధాన లక్ష్యాలుగా ఈ చికిత్సలు కొనసాగుతాయి.
ప్రత్యేకంగానే...
సమస్య స్థూలకాయమే అయినా, ఆ స్థితి ఏర్పడటానికి వ్యక్తి వ్యక్తికీ వేరు కారణాలు ఉంటాయి. అందుకే ఆయా వ్యక్తుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, జీవక్రియల పనితీరు, శరీర ప్రకృతి, దోషాల స్థితి, మొదటి నుంచి ఆరోగ్య పరిస్థితులు వీటన్నిటినీ ప్రత్యేకంగా పరీక్షి స్తాం. శరీర వ్యవస్థను సమూలంగా చక్కదిద్దడానికి కడుపులోకి కొన్ని మందులు కూడా ఇస్తాం. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, మలినాలనూ తొలగించడానికి ఉద్దేశించి ఆయుర్వేదంలో 150 థెరపీల దాకా ఉన్నాయి. వ్యక్తుల శరీర ధర్మాన్ని , వాత, పిత్త , కఫ దోషాలను అనుసరించి ఆ థెరపీలను ఎంపిక చేస్తాం. ఆయుర్వేద వైద్య చికిత్సలతో బరువు తగ్గడంతో పాటు శరీరం చక్కని ఆకృతి పొందుతుంది. వీటితో పాటు అధికరక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు నియంత్రణలోకి వస్తాయి. శరీరాన్ని బాహ్యంగా, అంతర్గతంగా పరిశుభ్రం చేయడం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తాం. బరువు త గ్గించే క్రమంలో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, ఆస్టియో పొరోసిస్ సమస్యలు తొలగిపోతాయి. వీటికి తోడు కండరాలు, ఎముకలు శక్తివంతమవుతాయి.
పలు విధానాల్లో...
వైద్య విధానాల్లోని కొన్ని ప్రత్యేక థెరపీలతో కేవలం నాలుగైదు వారాల్లో 5 నుంచి 10 కిలోల బరువు తగ్గుతారు. శరీర ఆకృతిలో 15 నుంచి 25 సెంటీ మీటర్లు తగ్గుతారు. మా హాస్పిటల్‌లో శరీర ఆకృతిని చక్కదిద్దే కొన్ని ప్రత్యేకమైన తైల మర్ధనలు ఉన్నాయి. ఈ చికిత్సలు తీసుకున్న తరువాత ఒక పరిపూర్ణ మైన ఆకృతి వారి సొంతమవుతుంది. చికిత్స అయిపోయిన తరువాత మరో మూడు మాసాల దాకా శరీరం బరువు అలా తగ్గుతూనే ఉంటుంది. అదే క్రమంలో శరీర ఆకృతి కూడా చక్కబడుతూనే ఉంటుంది. ఆ తరువాత మేము సూచించే విధానాలను అనుసరిస్తే, వారి శరీర బరువు, ఆకృతి, ఆశించిన రీతిలోనే నిలకడగా ఉంటాయి.

డా. మంజుషా
మంజుషా ఆయుర్వేదిక్ హాస్పిటల్,
మాదాపూర్, హైదరాబాద్,
ఫోన్ : 8978 222 777, 8978 222 888,
040-64507090.

మెరిసే చర్మానికి...

బొప్పాయి పండు తింటే కంటికి మంచిది, గుండెకి బలం అని అందరికీ తెలుసు. కాని చర్మసౌందర్యానికి కూడా బొప్పాయి బోలెడు మేలు చేస్తుంది. బొప్పాయి పండు ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలో ......

* ముఖంపై ఉండే బ్లాక్‌హెడ్స్‌ని తొలగించడంలో బొప్పాయి గుజ్జు చాలా ఉపయోగపడుతుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపాలు, రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, ఒక టేబుల్ స్పూను శెనగపిండి వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. దీని వల్ల బ్లాక్‌హెడ్స్ తొలగిపోవడమే కాకుండా చర్మం మెత్తగా తయారవుతుంది.

* ప్రతి రోజు ముఖం శుభ్రంగా కడుకున్నాక ఓ నాలుగు బొప్పాయి పండు ముక్కలతో ముఖంపై రుద్దితే నిర్జీవంగా ఉన్న చర్మం కాంతివంతంగా అవుతుంది.

* దీనితో పాటు మీరు తినే పండ్లలో ఎక్కువగా బొప్పాయి ఉండేలా చూడండి. దీని వల్ల కళ్లు ఆరోగ్యంగానే కాదు, కాంతివంతంగా కళకళలాడుతూ ఉంటాయి.

Saturday, October 15, 2011

నరాల్ని నులిమేసే నొప్పి

ముఖం మీద అత్యంత తీవ్రమైన నొప్పి కలిగించే వ్యాధి ట్రైజెమినల్ న్యూరాల్జియా. ప్రతి 15 వేల మందిలో ఒక రు ఈ సమస్యకు లోనవుతుంటారు. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ వ్యాధికి గురయ్యే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గురవుతుంటారు. ముఖం మీదుగా వెళ్లే ట్రైజెమినల్ నరానికి అనుబంధంగా ఆప్తాల్మిక్, మ్యాక్జిలరీ, మాండిబులార్ అనే మూడు నరాల విభాగాలు ముడివడి ఉంటాయి.

ఇవి ముఖ సంబంధమైన స్పర్శనూ, నొప్పినీ ప్రసరింపచేస్తాయి. ఆప్తాల్మిక్ నరం, నుదుటి కీ, మాక్జిలరీ నరం చెంపలకూ, ముక్కుకూ, మాండిబులర్ నరం దవడభాగానికి ఈ నొప్పినీ, స్పర్శనూ ప్రసరింప చేస్తాయి. ఇవి కాకుండా మోటార్ నరం అనే ఒక నరం, నమలడానికి సంబంధించిన కండరాలకు ప్రసరింపచేస్తుంది.

మరీ తీవ్రం

ముఖమంతా విద్యుత్తు తాకినట్లు తీవ్రమైన నొప్పి వస్తుంది. కాకపోతే నొప్పి కొద్ది క్షణాలే ఉండి తగ్గిపోతుంది. ఈ నొప్పి, మాక్జిలరీ, మాండిబులార్ విభాగాల్లోనే ఎక్కువగా వస్తుంది. బలమైన గాలి వీయడం, చల్లని పదార్థాలు తినడం, గడ్డం గీసుకోవడం, బ్రష్ చేసుకోవడం వ ంటివి ఈ నొప్పిని ప్రేరేపిస్తుంటాయి. ఈ నొప్పి కొద్ది క్షణాల నుండి, కొద్ది నిమిషాల దాకా కొనసాగుతుంది. అయితే ఈ నొప్పి రోజుకు ఏ 25 సార్లో వచ్చిపోతూ ఉంటుంది.

ఈ నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలియదు. తరుచూ వచ్చే ఈ నొప్పి కారణంగా వృత్తి పరమైన పనుల మీద మనసు లగ్నం కాదు. ఫలితంగా జీవన ప్రమాణాలు పడిపోతాయి. మామూలుగా అయితే ఈ నొప్పి ముఖానికి ఏదో ఒక వైపునే వస్తుంది. కానీ, చాలా అరుదుగా కొందరికి రెండు వైపులా రావచ్చు. సమస్య ఒకసారి మొదలైతే, రోజులు గడిచే కొద్దీ, ఎక్కువ సార్లు నొప్పి రావడం, మరింత ఎక్కువ తీవ్రతతో రావడం జరుగుతూ ఉంటుంది. నొప్పి ఇలా నిరంతరం వేధిస్తూ ఉండడం వల్ల దాన్ని తట్టుకోలేక కొందరు ఆత్యహత్యలు చేసుకుంటారు. అందుకే ఈ వ్యాధిని సూసైడ్ డి సీజ్ అని కూడా అంటారు.

ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధి రావడానికి గల సరియైన కారణం ఇంతవరకూ తెలియదు. కాకపోతే పక్కపక్కగా వెళే9్ల రక్తనాళం, రక్త దమనుల మధ్య సహజంగా దూరం లేకపోవడం ఈ వ్యా«ధిగ్రస్తుల్లో కనిపిస్తుంది. ఒకదానికి ఒకటి ఆనుకోవడం వల్ల నిరంతరం వచ్చే ప్రకంనలే నరాల్లో ఒక కంపరాన్ని, నొప్పినీ కలిగిస్తాయనేది ఒక పరిశీలన.

కానీ, నొప్పికలిగించే కారణాలేమిటన్నది ఇప్పటికీ అంత కచ్ఛితమైన సమాచారం లేదు. ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించే వీలుంది. ప్రారంభంలో ఈ వ్యాధి చికిత్స మందులతోనే ఉంటుంది. కార్బమేజ్‌పైన్ అనే మాత్రల్ని ఈ వ్యాధికి ఎక్కువగా ఇస్తారు. దీనికి తోడు బాక్‌లోఫఫెన్, లామోట్రిజిన్, ఫెనిటాయిన్, డులాక్సిటిన్ వంటి మందులు కూడా ఈ నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న వారికి మందుల ద్వారా 50 నుంచి 60 శాతమే ఉపశమనమే లభిస్తుంది.

ఈ నొప్పి తగ్గించడానికి పలురకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి. మాక్రోవాస్కులర్ డికాంప్రెషన్ అనేది వాటిలో ప్రధానమైనది. మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ విధానంలో చెవి వెనుక భాగంలో ఒక చిన్న కోతతో ఈ శస్త్ర చికిత్స చేస్తారు. రక్తనాళం, దమని మధ్యదూరం పెంచడమే ఈ శస్త్ర చికిత్స ఉద్దే«శం వాటి మధ్య దూరాన్ని పెంచడానికి ఆ రెండింటి మధ్య 'సెల్ట్' అనే పదార్థాన్ని పెడతారు. ఈ శస్త్ర చికిత్స 90 శాతం మందికి శాశ్వత ఉపశమనం ఇస్తుంది. శస్త్ర చికిత్స జరిగిన కొద్ది రోజుల్లోనే తిరిగి తమ విధులకు హాజరు కావచ్చు. శస్త్ర చికిత్స తరువాత ఇక ఏ మందులూ అవసరం ఉండదు.

డాక్టర్ టివిఆర్‌కె మూర్తి
న్యూరో సర్జన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

అలర్జీకి అద్భుత నివారిణి

అలర్జీలు రావడానికి కారణాలు తెలియనప్పటికీ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ అలర్జీల బెడద ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, మంచు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల చెట్లు, పూల పుప్పొడి, పెర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్ మొదలైన వాటి వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.

అలర్జిక్ రైనైటిస్

మనకు సరిపడని ప్రేరణలు ముక్కుకు తగిలి, అలర్జీ మొదలైతే హిస్టామిన్ విడుదలవుతుంది. దీంతో ముక్కులోని పొరలు ఉబ్బిపోతాయి. తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం, తరువాత ముక్కులు బిగుసుకుపోవడం(నాసల్ బ్లాక్), కళ్లలో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. దుమ్ము, ధూళి, చల్లటి పదార్థాలు, ఘాటు వాసనలు, వాతావరణ మార్పుల మూలంగా ఈ బాధలు అధికమవుతాయి. ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచిన కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది.

అలర్జిక్ సైనసైటిస్

ముక్కుకు ఇరువైపులా నుదుటిపైన సైనస్ గదులు ఉంటాయి. ఈ గదుల గుండా గాలి స్వేచ్ఛగా లోపలికి రావడం, బయటకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే మ్యూకస్ గాలిలోని సూక్ష్మక్రిములను అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు లేక ఇతర ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ గదుల్లో చీము చేరి నొప్పి ఏర్పడుతుంది. చీముతో గదులు మూసుకునిపోవడం వల్ల గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.

దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. దీన్నే సైనసైటిస్ అంటారు. తలనొప్పి, కళ్ల మధ్య, బుగ్గలపైన, నొసటిపైన నొప్పితో పాటు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, చెవి నొప్పి వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం కూడా జరుగుతుంది. తరచుగా జలుబు చేయడం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, అలర్జీ కారణాల వల్ల సైనసైటిస్ వస్తుంది. చల్లటి గాలికి తిరగడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం కూడా కారణమే. ఆల్కహాల్, స్మోకింగ్, కొన్ని రకాల ఫర్‌ఫ్యూమ్‌లు సైనసైటిస్‌కు కారణమవుతాయి. అలాగే ముక్కులోపల పాలిప్స్ పెరగడం, ముక్కు దూలం వంకరంగా ఉండటం కూడా కారణమవుతుంది.

ఆస్తమా

ముక్కుల్లో వచ్చే అలర్జీ, ఊపిరితిత్తులలోనికి పాకితే ఆస్తమా,బ్రాంకైటిస్ వంటివి మొదలవుతాయి. శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది. సాధారణ జలుబు, తమ్ములు, ముక్కుకారడంతో మొదలయి దగ్గు. ఆయాసం, పిల్లి కూతలు వంటి లక్షణాలు ఆస్తమాలో కనిపిస్తాయి. చల్లగాలి, దుమ్ము, ధూళి, అలర్జీ కారకాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి ఆస్తమాకు కారణమవుతాయి. ఆస్తమా త్రీవమైతే శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది.

నాసల్ పాలిప్స్

ముక్కులోపల నీటి తిత్తుల్లా పెరుగుతాయి. వీటివల్ల ముక్కు మార్గాలు మూసుకుపోయి, శ్వాస ఆడక, రాత్రిపూట ఇబ్బందిపడతారు. శస్త్రచికిత్స చేసినా ఇవి తిరిగి ఏర్పడుతుంటాయి.

చికిత్స

అలర్జీ సమస్యకు అల్లోపతిలో యాంటీ హిస్టామైన్స్, డీకంజెస్టంట్స్, కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తారు. వీటివల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోదు. అంతేకాకుండా ఈ మందుల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీన పడి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించి అలర్జీని తగ్గించడంలో తోడ్పడతాయి. హోమియో చికిత్స తీసుకోవడంతో పాటు ఏయే పదార్థాల అలర్జీ వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. శస్త్రచికిత్సతో ప్రయోజనం ఉంటుంది కానీ, మూల కారణాన్ని గుర్తించి, నివారించకపోతే జీవితాంతం అలర్జీ సమస్య బాధిస్తూనే ఉంటుంది. అలర్జీని సమూలంగా తొలగించాలంటే హోమియో మందుల వల్లే సాధ్యమవుతుంది.


డా. మధు వారణాసి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు
ప్లాట్ నెం 188,
వివేకానందనగర్ కాలనీ,
కూకట్‌పల్లి, హైదరాబాద్,72,
ఫోన్ : 8897331110, 040-23161444.