Pages

Saturday, October 15, 2011

నరాల్ని నులిమేసే నొప్పి

ముఖం మీద అత్యంత తీవ్రమైన నొప్పి కలిగించే వ్యాధి ట్రైజెమినల్ న్యూరాల్జియా. ప్రతి 15 వేల మందిలో ఒక రు ఈ సమస్యకు లోనవుతుంటారు. సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలోనే కనిపించే ఈ వ్యాధికి గురయ్యే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా గురవుతుంటారు. ముఖం మీదుగా వెళ్లే ట్రైజెమినల్ నరానికి అనుబంధంగా ఆప్తాల్మిక్, మ్యాక్జిలరీ, మాండిబులార్ అనే మూడు నరాల విభాగాలు ముడివడి ఉంటాయి.

ఇవి ముఖ సంబంధమైన స్పర్శనూ, నొప్పినీ ప్రసరింపచేస్తాయి. ఆప్తాల్మిక్ నరం, నుదుటి కీ, మాక్జిలరీ నరం చెంపలకూ, ముక్కుకూ, మాండిబులర్ నరం దవడభాగానికి ఈ నొప్పినీ, స్పర్శనూ ప్రసరింప చేస్తాయి. ఇవి కాకుండా మోటార్ నరం అనే ఒక నరం, నమలడానికి సంబంధించిన కండరాలకు ప్రసరింపచేస్తుంది.

మరీ తీవ్రం

ముఖమంతా విద్యుత్తు తాకినట్లు తీవ్రమైన నొప్పి వస్తుంది. కాకపోతే నొప్పి కొద్ది క్షణాలే ఉండి తగ్గిపోతుంది. ఈ నొప్పి, మాక్జిలరీ, మాండిబులార్ విభాగాల్లోనే ఎక్కువగా వస్తుంది. బలమైన గాలి వీయడం, చల్లని పదార్థాలు తినడం, గడ్డం గీసుకోవడం, బ్రష్ చేసుకోవడం వ ంటివి ఈ నొప్పిని ప్రేరేపిస్తుంటాయి. ఈ నొప్పి కొద్ది క్షణాల నుండి, కొద్ది నిమిషాల దాకా కొనసాగుతుంది. అయితే ఈ నొప్పి రోజుకు ఏ 25 సార్లో వచ్చిపోతూ ఉంటుంది.

ఈ నొప్పి ఎప్పుడు వస్తుందనేది ఎవరికీ తెలియదు. తరుచూ వచ్చే ఈ నొప్పి కారణంగా వృత్తి పరమైన పనుల మీద మనసు లగ్నం కాదు. ఫలితంగా జీవన ప్రమాణాలు పడిపోతాయి. మామూలుగా అయితే ఈ నొప్పి ముఖానికి ఏదో ఒక వైపునే వస్తుంది. కానీ, చాలా అరుదుగా కొందరికి రెండు వైపులా రావచ్చు. సమస్య ఒకసారి మొదలైతే, రోజులు గడిచే కొద్దీ, ఎక్కువ సార్లు నొప్పి రావడం, మరింత ఎక్కువ తీవ్రతతో రావడం జరుగుతూ ఉంటుంది. నొప్పి ఇలా నిరంతరం వేధిస్తూ ఉండడం వల్ల దాన్ని తట్టుకోలేక కొందరు ఆత్యహత్యలు చేసుకుంటారు. అందుకే ఈ వ్యాధిని సూసైడ్ డి సీజ్ అని కూడా అంటారు.

ట్రైజెమినల్ న్యూరాల్జియా వ్యాధి రావడానికి గల సరియైన కారణం ఇంతవరకూ తెలియదు. కాకపోతే పక్కపక్కగా వెళే9్ల రక్తనాళం, రక్త దమనుల మధ్య సహజంగా దూరం లేకపోవడం ఈ వ్యా«ధిగ్రస్తుల్లో కనిపిస్తుంది. ఒకదానికి ఒకటి ఆనుకోవడం వల్ల నిరంతరం వచ్చే ప్రకంనలే నరాల్లో ఒక కంపరాన్ని, నొప్పినీ కలిగిస్తాయనేది ఒక పరిశీలన.

కానీ, నొప్పికలిగించే కారణాలేమిటన్నది ఇప్పటికీ అంత కచ్ఛితమైన సమాచారం లేదు. ఎంఆర్ఐ పరీక్ష ద్వారా ఈ సమస్యను గుర్తించే వీలుంది. ప్రారంభంలో ఈ వ్యాధి చికిత్స మందులతోనే ఉంటుంది. కార్బమేజ్‌పైన్ అనే మాత్రల్ని ఈ వ్యాధికి ఎక్కువగా ఇస్తారు. దీనికి తోడు బాక్‌లోఫఫెన్, లామోట్రిజిన్, ఫెనిటాయిన్, డులాక్సిటిన్ వంటి మందులు కూడా ఈ నొప్పిని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. కాకపోతే దీర్ఘకాలికంగా ఈ సమస్య ఉన్న వారికి మందుల ద్వారా 50 నుంచి 60 శాతమే ఉపశమనమే లభిస్తుంది.

ఈ నొప్పి తగ్గించడానికి పలురకాల శస్త్ర చికిత్సలు ఉన్నాయి. మాక్రోవాస్కులర్ డికాంప్రెషన్ అనేది వాటిలో ప్రధానమైనది. మైక్రోస్కోప్ లేదా ఎండోస్కోప్ విధానంలో చెవి వెనుక భాగంలో ఒక చిన్న కోతతో ఈ శస్త్ర చికిత్స చేస్తారు. రక్తనాళం, దమని మధ్యదూరం పెంచడమే ఈ శస్త్ర చికిత్స ఉద్దే«శం వాటి మధ్య దూరాన్ని పెంచడానికి ఆ రెండింటి మధ్య 'సెల్ట్' అనే పదార్థాన్ని పెడతారు. ఈ శస్త్ర చికిత్స 90 శాతం మందికి శాశ్వత ఉపశమనం ఇస్తుంది. శస్త్ర చికిత్స జరిగిన కొద్ది రోజుల్లోనే తిరిగి తమ విధులకు హాజరు కావచ్చు. శస్త్ర చికిత్స తరువాత ఇక ఏ మందులూ అవసరం ఉండదు.

డాక్టర్ టివిఆర్‌కె మూర్తి
న్యూరో సర్జన్
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

No comments:

Post a Comment