మేలు చేసే ఐస్ ముక్కలు
పిల్లలు ఐస్ ముక్కలన్నా...ఐస్ గడ్డలన్నా ఎంతగానో ఇష్టపడతారు. వాటితో వాళ్లు ఆనం దంగా ఆడుకుంటుంటారు. అవి శరీరానికి చల్లగా తగులుతుంటే పిల్లలు అదేపనిగా నోట్లో పెట్టుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ అదేదో ప్రమాదం అన్నట్లు జలుబుచేసేస్తుందని చెప్పి తల్లులు పిల్లలను వారిస్తుంటారు. అరుుతే మంచు ముక్కలు మనకు తెలియకుండానే చాలా సహాయం చేస్తాయట...అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి....
సాదారణంగా సున్నా డిగ్రీల సెల్సియస్ వద్ద నీరు ఘనీభవించి మంచు ముక్కలా తయారవుతుందని మనం చిన్నప్పుడు సైన్స్ పాఠాల్లో చదువుకున్నాం. అదే ఫార్ములాను ఉపయోగిం చి డీప్ ఫ్రిజ్‌లో ఐస్ క్యూబ్ ఫ్రేమ్ బాక్స్‌లో నాలుగు పలకలుగా తయారు చేసుకునే విధంగా అందులో నీరు పోసి ఉంచితే అది గడ్డ కట్టి ఐస్ ముక్కలు తయారవుతాయి. వాటిని బయటకు తీసి కొన్ని రకాల రుగ్మతలకు వైద్యం చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు...ఒక్కోసారి ఆటల్లోగానీ, చిన్న చిన్న ప్రమాదాలలోగానీ బలంగా దెబ్బలు తగిలి కొందరికి రక్తం ఆగకుండా ధారాపాతంగా కారిపోతుంటుంది. అటువంటప్పుడు ఐస్ ముక్కలను మెత్తని గుడ్డలో చుట్టి ఆ భాగం తో దెబ్బ గట్టిగా తగిలిన ప్రాంతంలో నిదానంగా అదుముతు ంటే కొద్దిసేపటికి రక్తం కారడం తగ్గిపోతుంది.
ఒక్కోసారి రక్తం గూడు కట్టినట్లు అనిపించి మన శరీరంలో ఆ భాగమంతా తీవ్రంగా నొప్పి కలిగినా...ఇదే చికిత్సా విధానాన్ని కొనసాగించవచ్చును. దెబ్బల తాలూకు నొప్పి కూడా మెల్లిగా తగ్గిపోతుంది. ముక్కులో రక్తం కారితే..కొందరు పిల్లల్లో ముక్కు నుండి అదే పనిగా ధారాపాతంగా రక్తం కారిపోతుంటుంది. కర్చీఫ్ పెట్టినా...మరేది పెట్టినా అలా ధారలా కారుతుంటుంది. అలాంటప్పుడు ముక్కు రంధ్రం వద్ద ఐస్ ముక్కలతో అదిమిపెట్టి ఉంచితే రక్తం కారడం తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ముక్కు చుట్టూ ఐస్ ముక్కలతో మెల్లిగా రాస్తూ ఉండాలి. బెణుకులకీ..ఒక్కోసారి రోడ్డుమీద మనం వెళుతుండగా...చూడకుండా గోతిలో పడి కాలు జారి పడిపోయే ప్రయత్నంలో పడిపోకుండా మన శరీరాన్ని ఏదో విధంగా ఆపు జేస్తాము. అయితే ఒక్కోసారి శరీరంలో ఏదో ఒక భాగం బెణికి తీవ్రంగా బాధిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంటి వైద్యంగా ఈ ఐస్ ముక్కలను బెణికిన ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గొంతులో కిచ్‌కిచ్.. ఒక్కోసారి మనం ఎన్ని మందులు వాడి నా గొంతు గరగరలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తుం టుంది.
మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. అలాంటప్పు డు ఐస్ ముక్కలను గొంతులో వేసుకోకుండా గొంతు పైభాగంపై పూతలా రాస్తే గరగరలాడే గొంతు మళ్లీ శ్రావ్యతను సంతరించుకుంటుంది. గాయాలకు మందు..శరీరం కాలిపోయి నల్లగా కమిలిపోయినప్పుడు...అందుబాటులో ఉండే చవకైన చికిత్స ఐస్‌ముక్కల వైద్యం మాత్రమే. వెంటనే ఆ భాగంలో ఐస్ ముక్కలు వేసి మృదువుగా రుద్దాలి. కొంత ఫలితం ఉంటుంది. బాధ నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల వ్యాధులకు...కొంత మందికి చిన్న వయసులోనే కీళ్లు , మోకాళ్లు నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఐస్ ముక్కలను తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లకు కీళ్లనొప్పులు మటుమాయం అవుతాయి.
No comments:
Post a Comment