మానసిక ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారపదార్థాలకు భిన్నంగా శరీరానికి, మన సుకు ఒత్తిడినుంచి విముక్తి కలిగించడానికి పండ్లు, వ్యాయమాలు, సం గీతం వంటివి ఎంతగానో ఉపయోగపడుతాయని వారంటున్నారు.
కొబ్బరి : లేత కొబ్బరి నీటిని మించిన పానీయం మరొకటి లేదు. కోల్పో యిన సత్తువ తిరిగి పొందడానికి కొబ్బరి నీరు బాగా తోడ్పడుతుంది. ఆరోగ్య రక్షణలో కొమ్మరి బొండాం బాగా పనిచేస్తుంది. ప్రకృతిలో క్రిము లు లేని అతిశుభ్రమైన, ఉల్లాసాన్నిచ్చే పానీయం.. ఒక గ్రాము ఎండు కొబ్బరిలో 175 కాలరీల శక్తి ఉంటుంది. చక్కెరపదార్థాలు, ఖనిజలవణాలు, విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. రక్తశుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే కొబ్బరినీరు గ్లాసుడు పాలకంటే కూడా పుష్టికరమైనవి. పైగా, ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్ యాసిడ్ లాంటి సుగుణాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.
ఆరెంజ్ : ఆరెంజ్‌లో అత్యధికంగా లభించే సి విటమిన్ వల్ల ఒత్తిడి ఫలితంగా ్రశమించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి మే లు చేకూరుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
చాక్లెట్ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్ (పిఇఎ) ఎండార్ఫిన్ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ - డిప్రెెసెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికాట్‌లోని కెరోటిన్ ఒత్తిడిని తగ్గిస్తే, పెరుగులోని విటమిన్ బి నెర్వస్ నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్ మెదడుకు ఆక్సి జన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు ఒత్తిడిని తగ్గి స్తాయి. పాలలోని ల్యాక్టోస్ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురు కుగా ఉంచేందుకు సహకరిస్తాయి.
బొప్పాయి : బొప్పాయిని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ దీనిలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే కెరోటిన్ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.
బంగాళదుంప : జింక్, విటమిన్ సి పెరిగి రోగనిరోధక శక్తి ఇనుమడిం చి మనస్సును దృఢం గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.
ఒత్తిడి మాయం కావాలంటే : బ్రిస్క్‌వాక్: జాగింగ్ వంటి ఏ వ్యాయా మం అయినా ఫీల్‌గుడ్ ఎండార్ఫిన్లను వి డుదల చేస్తుంది. వీటి తాలూకు ఫలితం దాదాపు 24 గం టల పాటు సాగుతుంది. అలానే బాగా ఇష్టపడే వ్యక్తి చేతిని పట్టుకుం టే కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా సులభంగా విడుదలవుతుంది. ఇది మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి వేస్తుంది.
సంగీతం, సినిమా : మెదడుపై సంగీతం మంద్రమైన ప్రభావాన్ని చూపుతుంది. నవ్వు కార్టిసాల్ స్థాయిల్ని తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ప్రకృతిని వీక్షించడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు పరిస్థితుల్ని సరైనా ఆలోచనతో ఎదుర్కోవడానికి, నాడీవ్యవస్థకు ప్రశాంతత చేకూర్చడానికి సహకరిస్తుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.
No comments:
Post a Comment