Pages

Thursday, September 16, 2010

నలుపే బంగారమాయే...

కొంతమంది నల్లగా ఉన్నామని బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే నల్లగా ఉన్నామని బాధపడకుండా కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే అతి తక్కువ కాలంలోనే మేనిఛాయను మెరుగు పర్చుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా, లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా కింది చిట్కాల్ని ప్రయోగిస్తే మంచి ఫలితముంటుందంటున్నారు వారు. అందుకు కొన్ని సలహాలను సూచిస్తున్నారు.

beauty-మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయాలి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేస్తే రంగులో తేడా గమనించవచ్చు.
-నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
-బంగాళా దుంపల రసం తీసి ముఖానికి రాసుకోవాలి. అర్ధగంట వరకూ అలాగే ఉంచి కడిగాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయాలి.
-పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉన్నా, పచ్చిపాలు, పసుపు మిశ్రమం చర్మంలో నునుపు, కలిగించడంతోపాటు నలుపు రంగునూ కొంత వరకు తగ్గిస్తుంది.
-శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయగా కాంతి వంతంగా ఉంటుంది.
-ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాలముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఫలితముంటుంది.
-ఎండలో వెళ్లేప్పుడు ఖచ్చితంగా సన్‌ స్క్రీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. గొడుగును ఉపయోగించాలి.
-గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని లేదా లేదా బాదం పాలు ముఖానికి, శరీరానికి రోజూ పట్టించినా, ఛాయలో మార్పుంటుంది.
-నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మారునాడు ముఖం కాంతివంతంగా ఉంటుంది.
-స్నానం చేయడానికి సబ్బుని కాకుండా సున్ని పిండి లేదా శనగపిండిని వుపయోగించుకోవచ్చు.
-వారానికి రెండు సార్లు ముల్తానీ మట్టిని రోజ్‌ వాటర్‌లో కలిపి కూడా రాసుకోవచ్చు.
-టమోటా రసం ఎండలో కమిలిన చర్మానికి మంచి మందుగా వుపయోగపడుతుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొద్దిగా రసాన్ని తీసుకుని ముఖానికి రాసుకున్నా ఫలితం వుంటుంది.
-మోచేతులు, మెడ భాగాల్లో నలుపు పోవడానికి నిమ్మకాయ చెక్కతో రుద్దితే ఫలితం వుంటుంది.
-బకెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిస్తే ఫలితముంటుంది.

No comments:

Post a Comment