పేరు కృష్ణ. వయస్సు 30. చేసేది డిజైనింగ్. రాత్రింబవళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, వేళకు తిండి లేక పోవడం, చాయ్ విపరీతంగా తాగడం, నిరంతరం కూర్చునే ఉండటం వల్ల మలబద్ధకం మొదలైంది. ‘ఓ రోజున మోషన్‌కు వెళ్లేటప్పుడు బ్లీడింగ్ (రక్త స్రావం) అయ్యింది. ఒకటే నీరసం, కాళ్లు పీకేస్తున్నాయి. మల ద్వారంలో పిలకలు బయటికి రావడంతో నడకలో ఇబ్బంది. మలద్వారంలో తీవ్ర నొప్పి ఉందంటూ’ వాపోయాడు. విశ్రాంతికి అవకాశం లేదంటూ తొందరగా నయం చేయాలని కోరాడు. ఇదీ ఆధునిక జీవిత సమస్య! మూలశంక!
రోగలక్షణాలు :
- మలబద్ధకం, అజీర్ణం, పుల్లటి తేన్పులు, ఆకలి మంద గించడం.
- కడుపంతా గ్యాస్ నిండినట్లు, మలద్వారం ఎండిపోయిన భావన.
- కాళ్లలో బలహీనత, నడిస్తే ఆసనం లో గుచ్చుకొంటున్నట్లు విపరీతమైన నొ ప్పి. ఒక్కోసారి కోసేసినట్లు మంటతో కూడిన నొప్పి.
- అలసట, నీరసం, నిద్ర తగ్గిపోవడం, పిక్కలో తరచూ పట్టేయడం.
- గ్యాస్ వెళ్లేటప్పుడు శబ్దం రావడం, వచ్చే ముందు నొప్పి.
- మలద్వారం ఉబ్బి బయటకు వచ్చినట్లుండటం, పిలకలు చేతికి తగలడం.
- చిరాకు, అసహనం, కోపం.
- తలనొప్పి,బద్దకం,ఒళ్లంతా పిసికేసినట్లుండటం, దాహం.
- కొంచెం జ్వరం
- కళ్లు, గోళ్లు, మూత్రం, మలం, చర్మం కొంచెం పచ్చగా కనిపించడం.
- మలంతో కూడి రక్తం ధారలు, రక్తం కలిసి ఉండటం.
- ఇలాంటి లక్షణాలు ఆయుర్వేదంలో ‘పిత్తజఅర్శ’గా చెబుతారు. అతని వృత్తి, జీవన విధానం పరిశీలన కూడా దాన్నే తెలియ జేస్తుంది. రక్తం అర్శలు ఎందుకొస్తుంటాయి? వృత్తితీరు, ఎక్కువగా కష్టపడటం, నిరంతరం నిలబడి ఉండటం, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం, మలబద్దకం, వేళకు భోజనం చేయక పోవడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, రక్తహీనత, శరీర ప్రకృతిని బట్టి నడుచుకోలేకపోవడం, మల బద్దకం నివారించుకోపోగా ముక్కడం, గరుకుగా ఉండే పదార్థాలు తింటూ నీరు సరిగ్గా తీసుకోక పోవడం... లాంటి వాటివల్ల ‘రక్తజ అర్శస్సు’ వస్తుంది.పైన చెప్పిన కారణాల వల్ల మలద్వారంపై విపరీతమైన వత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల అక్కడ వుండే రక్త నాళాలు బాగా వాచిపోతాయి. మలద్వారం బాగా ఇరుకైపోతుంది. మల ద్వారంలో అతి బలమైన మాంస పేశీలపైనున్న సున్నిత పొరపై వాపు వస్తుంది. ఉండల్లా ఉన్న గట్టిపడిన మలం బలవంతంగా బయటికి వచ్చేటప్పుడు వాచిన రక్తనాళాలపై కోత పడటంతో రక్తం మలంతో వస్తుంది. వీటినే పైైల్స్ అంటారు. బయటికి సాగిలపడ్డ మాంసపేశీలపై భాగాలు పిల కల్లా వస్తాయి. మలవిసర్జన తర్వాత కడిగేటప్పుడు చేతికి తగులుతూ ఉంటాయి. చికిత్స దీపన, పాచన, సంశమన, రక్త సంగ్రహణ, శోఫహర, రసాయన ఔషధాలను ఎంచుకొని చికిత్స చేయగా, మొదటి నెలలోనే లక్షణాలు 60 శాతం వరకు తగ్గాయి. రక్తస్రావం తగ్గింది. మలబద్ద కం తగ్గి ఆకలి పెరిగింది. రోగి పెద్దగా విశ్రాంతి కూడా తీసుకోలేదు. వేళకు భోజనం చేయడం, మధ్యాహ్నం కొంత విశ్రాంతి తీసుకొన్నారు. తర్వాత ఓ నాలుగు వారాల్లో ఫైల్స్ సమస్య తీరింది. నివారణ ఎలా సాధ్యమైంది? చికిత్స ప్రారంభించే ముందే, చికిత్స ఎలా చేయాలో ముందస్తుగా ప్లాన్ చేశాము. మొదట డైట్ విషయాల్లో ముఖ్యంగా వేళకు భోజనం చేయడం, ఉప్పు,కారం,మసాలా, టీలు తగ్గించి, పొట్టు, నార కల్గిన పదార్థాలు తీసుకోవడం లాంటివి చేశారు. తీసుకోవలసిన ఆహారం విషయంలో కౌన్సి లింగ్ ఇచ్చాం. ఆకలిని పెంచడానికి, అజీర్ణం తగ్గడానికి, కడుపులో గ్యాస్ తగ్గడానికి, రక్తం ఆగి పోవడానికి, మలం తొందరగా రావడా నికి, మలద్వారంలో వచ్చిన వాపు తగ్గడానికి, లివర్ రసాయానిక ప్రక్రియ వేగవంతం కావ డానికి, హిమోగ్లోబిన్ పెరగడానికి శొంఠి, చిత్రమూలం, కుట్కి, హింగువ, సైందవ లవణం, మండూరభస్మం, పునర్నన, ఇసబ్ గోల్ పసుపు, గుగ్గులు లాంటి ఔషధా లు ఇచ్చాము. రోగి తీవ్రతను ‘మాత్ర’ (డోసు) నిర్ణ యించాము. రెండు మూడు తడవలు లేప నంగా పూయడానికి వేప, లజ్జాలు లాంటి ఔషధాలతో చేసిన ఆయింట్ మెంట్ ఇచ్చాం. అక్కడ నొప్పి తొందరగా తగ్గడానికి వావిలి లాంటి పత్రాలతో చేసిన కషాయంతో టఠీజ్ట్డీ ఛ్చజూఠీ రోజూ ఇచ్చాము. గుగ్గులు లో ఉండే కాట్వెన్, ఎలిని యోల్, జెలాని యాల్, బోర్నిల్, ఆసిటేట్ రసాయనాలు మలద్వారంలోనున్న నొప్పిని, తొందరగా తగ్గించాయి. కరకతాని కాయలోని ఎల్లాజిక్ ఆమ్లం, గాలిక్ ఆమ్లం, చెబుతాజిక్ ఆమ్లం అజీర్ణం, మలబద్ధకాన్ని తగ్గించాయి.
మూల శంకకు కొత్తవైద్యం
మూలశంక రోగులకు ఆశాకిరణం 'స్టాపైయిల్స్' వైద్యం. హైదరాబాద్‌లోని జూబ్లిd హిల్స్‌లో అత్యాధునిక చికిత్సతో ఈ రోగానికి 'చెక్' పెడుతు న్నారు. డా|| కిషోర్ రోగులకు అభయహస్తం యిస్తున్నారు. ఇకపై మూలశంక కారణంగా బాధ వుండబోదంటున్నారు.
సాధారణంగా మూల శంక ఆపరేషన్ అంటేనే రోగులు బాధ పడే పరిస్థితి. ఎంతో బాధను తట్టుకోవాలి. ఏనల్, రెక్టాల్ రోగాన్ని అశ్రద్ధ చేయరాదు. రోగులు ముందుగా తమ గోడును చెప్పటానికే సంకోచిస్తారు. స్టాపైల్ వైద్యవిధానంలో ఏనల్ రెక్టాల్ రోగ గ్రస్తులలను గోప్యంగా వుంచుతారు. వ్యాధిని ప్రచారం చెయ్యరు. పైల్, ఫిస్సర్, ఫిస్టులాలకు 'స్టాపైల్'లో చికిత్స చేస్తారు.
అల్ట్రాయిడ్ హెమరాయిడ్ అమెరికావైద్య విధానాన్ని స్టాపై ల్స్‌లో డాక్టర్ సుజాత అందిస్తు న్నారు. ఈ చికిత్సలో మళ్లిd మూలశంక పునరావృతం కాదు. నొప్పి వుండదు. దీనికి సర్జరీ అవసరం లేదు. రోగి చికిత్స అనంతరం తన విధులకు హాజ రు కావొచ్చును. పిస్సర్, ఫిస్టూ లకు రోగి వ్యాధి తీవ్రతను బట్టి సర్జరీ వుంటుంది. అమెరికాలోని ఎఫ్.డి.ఎ నాణ్యతలను అను సరించి మందులను యిస్తారు. వీటిని అమెరికా నుండి దిగు మతి చేస్తారు.
'స్టాపైల్స్' లో పూర్తిగా రోగ పరీక్షలు వుంటాయి. జీవనశైలి, ఆహారం, నిద్ర, శారీరక పరిస్థితిని అంచనావేస్తారు. రోగి తీసు కోవాల్సిన ఆహారాన్ని తెలియజేస్తారు. హెమరైడ్స్ వచ్చాయంటే, ఆ రోగి సరైన ఆహార నియమాలు పాటించలేదు. ముఖ్యంగా పీచు పదార్థాలను తగిన నిష్పత్తిలో తింటే హెమరైడ్స్‌రావు.
మూల శంకను ఆదిలోనే చికిత్స చేయించాలి. ఆపరేషన్ దశచేరే దాకా అశ్రద్ధ చేయరాదు. స్టాపైల్స్‌లోని నూతన వైద్య విధానం కారణాన దీర్ఘరోగులకు స్వస్థత చేకూరుతుంది.
No comments:
Post a Comment