మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే నిలువ ఉంచిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండటమే సరెైన చర్య అని వెైద్యులు చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల గుండెకే కాక మన రుచి గ్రంధులకు కూడా హాని కలుగుతుందని వారంటున్నారు. అందుకే మీ వంటింట్లో తాజా ఆహారాన్ని ఉంచడమే ఆరోగ్యానికి తొలి మెట్టని వారంటున్నారు. వాస్తవానికి గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం అతి తేలికైన విషయమని అందుకు ఆహార నియమాలు కూడా సులువెైనవేనని వెైద్యులు చెప్తున్నారు. అయితే అందుకు మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడమే కావలసింది. జీవన విధానంలో మార్పులు అంటే తెల్లవారుజామునే లేవడం వంటి సంప్రదాయ పద్ధతులే కాదు తాజా పదార్ధాలను కొని తెచ్చుకునే ఓపికను కలిగి ఉండడం. కనుక మీకు సమీపంలో తాజా కూరలు, మాంసం వంటివి దొరికే దుకాణాలను గుర్తించండి.
నిల్వ ఉంచి ఆహారానికి, కాన్డ్ ఫుడ్స్‌కు వీడ్కోలు పలకండి. ఎందుకంటే ఈ ఆహారంలో సోడియం అధికంగా ఉండి కార్బోహైడ్రేట్లు స్వల్పంగా ఉంటాయి. మీ వండే వంటకి మంచి సువాసన రావాలంటే తులసి, పుదీనా వంటి మూలికలను వేయండి తప్ప కృత్రిమ ఫ్లేవర్ల జోలికి వెళ్ళ వద్దు. వెన్నకు బదులుగా ఆలివ్ నూనె, వెజిటేబుల్ ఆయిల్‌ను ఉపయోగించండి. ఈ రెండూ కూడా ఆరోగ్యాన్ని, రుచిని ఇనుమడింప చేస్తాయి. బ్రెడ్‌లో బటర్‌ను ఉపయోగించే బదులు తాజా తులసి ఆకులను ఆలివ్ నూనెకు చేర్చి సర్వ్ చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి ఉంటుంది. వేపుళ్ళు మానడం మంచిది. బేకింగ్ చేయడం, ఉడకబెట్టడం వంటివి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు. ఏ పదార్ధానె్నైనా నిదానంగా వండటం వల్ల దాని రుచి, ఘుమ ఘుమ పెరుగుతాయి.
మాంసాహారం తీసుకునేవారు చికెన్, చేపలు వంటివి ఎక్కువగా తీసుకోవడం మంచిది. దీనికి కారణం ఈ రెండింటిలో కూడా కొవ్వు మితంగా ఉంటుంది. అంతేకాక చేపలో ఒమేగా ఫ్యాటీ ఆసిడ్లు ఉంటాయి. ఇది కొలెస్టరాల్‌ను నియంత్రించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. రెడ్ మీట్, పోర్క్ వంటి ఆహారాలను పరిమితం చేయాలి. ఈ పదార్ధాలలో కొవ్వు శాతం అధికంగా ఉండడం వల్ల దమనులు మందంగా తయారెై హృద్రోగాలకు కారణమవుతాయి. కేకులు, ఐస్‌క్రీములకు బదులు తాజా పళ్ళతో డెసర్ట్ తీసుకోవడం మంచిది. మద్యం తీసుకునేవారు పరిమితంగా తీసుకోవడం మంచిది. అధికంగా మద్యాన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు వంటివి వస్తాయి. ఆహారం తీసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకోవడం మంచిది.

No comments:
Post a Comment