Pages

Thursday, September 9, 2010

అంతర్గత ఆరోగ్యం

 cookingభాహ్య సౌందర్యం మీద శ్రద్ధ పెరిగి అంతర్గత ఆరోగ్యం గురించి నేడు మరచిపోతున్నారు. ముఖం కడిగి, పౌడర్‌పూసి, జుట్టు దువ్వి అందంగా తయారయ్యే ప్రయత్నం చేస్తున్నాం. మన చర్మానికి తగిన సబ్బు, పౌడర్‌, హెయిర్‌ ఆయిల్‌ గురించి తెలుసుకుని, పరీక్షించి మరీ వాడుతున్నాం. ఒక వేళ ఏదన్నా తేడా వస్తే వెంటనే మార్చేసుకుంటాం. వీటిపెై ఇంత శ్రద్ధ పెడుతున్నా అప్పుడప్పుడు శరీరం లో జరిగే పనుల గురించి కూడా కాస్త తెలుసుకోవాలి. మన శరీరంలో ప్రతి అంశం ఒక ముఖ్యమైన పనిచేస్తుంది. శరీరంలో చేరిన మలిన పదార్థాలను బయటకు పంపటం, ప్రమాదకరపదార్థాలను విచ్ఛిన్నంచేసి ప్రమాదరహితమైనవిగా మార్చుటం చేస్తాయి. కాలేయం, మూత్రపిండాలు ఇటువంటి బాధ్యతను నిర్వహిస్తాయి. ఇవేకాక శోషరస వ్యవస్థ ప్రముఖపాత్ర వహిస్తుంది. అటువంటి వ్యవస్థలు దెబ్బతినకుండా చూసూకోవాలి. వాటి మెరుగెైన పనితీరుకు వీలెైన పదార్థాలు అందించాలి. మీ అంతర్గత అంగాల పనితీరు బాగుండాలంటే శరీరానికి తగినంత నీరు అందించాలి. కేవలం దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్లు తాగుతాం అనుకుంటే ఇబ్బంది వస్తుంది.

రక్తంలో పలురకాల మలినాలు చేరుతుంటాయి. వాటిని వదిలించకపోతే పలు అనారోగ్యాలు వస్తాయి. అందుకు తగిరంత నీరు తాగి రక్తశుద్ధికి సహకరించాలి. ఎంత స్వచ్ఛమైన నీరు, ఎంత ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరానికి అంత మంచిది. గాలికూడా ఒకరకమైన ఇంధనం. గాలి బాగా పీల్చి వదలగలిగిన యోగ, ఎయిరో బిక్స్‌ వంటివి తప్పకుండా చేయాలి. జీర్ణ వ్యవస్థలో తయారయ్యే వ్యర్థాలు బయటికి వెళ్లిపోయే క్రియలు సక్రమంగా వుండాలి. ఇవన్నీ క్రమ పద్ధతిలో వుండాలి. ఆహార విషయంలో జాగ్రత్త వహించాలి. తాజా కూరగాయలుఎ, ఆకుకూరలు, ఆహారంగా తీసుకోవాలి. శరీరం విషయంలో మనం కొద్దిపాటి శ్రద్ద చూపితే ఆ శరీరంలోని అంగాలు మనకు ఆరోగ్యం, ఆనందం అందిస్తాయి. బతికినంత కాలం హుషారునిస్తాయి.

No comments:

Post a Comment