Pages

Monday, October 4, 2010

ఆధునిక జీవితంలో.. ఒత్తిడి - నివారణ

ఆధునిక కాలంలో జీవితం వేగవంతమైపోయింది. గొంతుకోతల పోటీ మధ్య నిత్యం ఉరుకులు పరుగులు, లక్ష్యాలు సాధిచడంలో ఉత్థాన పతనాలు మనను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ఉన్నదానితో సంతృప్తి చెందడమంటే వైఫల్యం చెందడమేననే భావన పాతుకుపోయింది. వేగంగా మారుతున్న జీవన విధానాలతో, సాంకేతిక, పారిశ్రామిక అభివృద్ధితో సమానంగా పరుగులు తీయడంలో మానవుడు విఫలం చెందుతున్నాడు. ఫలితంగా ఒంటరితనం, తమకు సరైన గుర్తింపు రావడం లేదన్న భావన, కోపం, ఒత్తిడి, ఆందోళన వంటి వాటి తో వ్యక్తులు సతమతమవుతున్నారు.


stressగత శతాబ్దం పురోగమనానికి చెందినదైతే, ప్రస్తుత శతాబ్దం ఆందోళన, ఒత్తిడి, విచారం, అనుమానాలు, వివాదాలు, అసంపూర్ణ నిర్ణయాలతో కూడిన కార్యకలాపాలకు చెందిన కాలమని జేమ్స్‌ సి. కోలమన్‌ అంటా రు. గతంలో ఒత్తిడి ఎప్పుడైనా బయటపడి సమస్యగా మారుతుండేది కానీ నేడు అది నిత్యసత్యమైపోయింది.ఇంతకీ ఒత్తిడి అంటే ఏమిటి? అందరం నిత్యం దానిని ఎదుర్కొంటున్నా కొందరు మా త్రమే దానిని గుర్తించి సులభంగా వివరించగలరు. అంతర్గతంగా విధ్వంసాన్ని సృష్టించగల బహిర్గత ఉద్దీపనలే ఒత్తిడి. మానసిక అసమతుల్యాన్ని సృష్టించి ప్రమాదకారిగా మారగల శక్తిగలది. ఒత్తిడి మరీ ఎక్కువైనప్పుడు అది మన క్రియాత్మక సమగ్రతను కూడా దెబ్బతీయగలదు. మనం ఆశిస్తున్న దానికి, మన దృ ష్టికోణానికి మధ్య ఉన్న అసమతుల్యత. సులువుగా చెప్పాలంటే, మన మనస్సు అసహనం గా, వ్యాకులంగా, ఆందోళనతో, భారంగా, ఉ ద్రిక్తంగా ఉన్నప్పుడు ఒత్తిడిలో ఉన్నామన్నమాట.

మానసికంగా, భౌతికంగా మనం ప్రమాదాన్ని లేదా సవాలును ఎదుర్కొంటున్నామన్నప్పుడు లోనయ్యే స్థితే ఒత్తిడి అని సాంకేతికంగా చెప్పవచ్చు. ఆధునిక జీవితం ఒత్తిళ్ళమయం కావడంతో నిత్యం ఈ ఒత్తిడికి సం బంధించిన ప్రతిస్పందనలు రేకెత్తేందుకు ఆస్కారం ఇస్తుం టాం. అయితే ఈ రోజువారీ ఒత్తిళ్ళలో కొన్నిం టిని మాత్రమే స్పష్టంగా గుర్తించగలం. భౌతికమైన ఒత్తిళ్ళు మనకు ప్రమాదకరంగా అనిపించడం లేదు. మేధోపరమైన ఒత్తిళ్ళను గు ర్తించడం, వివరించడం సంక్లిష్టం. ఈ లక్షణా లు మెదడులో రసాయనిక మార్పులకు దారి తీస్తుంది. ఉద్వేగాలపరమైన ఒత్తిడి అధికమైనప్పుడు న్యూరోట్రాన్స్‌మిటర్లు పెరుగుతాయి.

tensionసెరొటోనిన్‌, ఆడ్రినాలిన్‌, అసిటైల్కోలైన్‌, డోపమైన్‌, కార్టిసాల్‌ స్థాయిలలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు నిత్యం, అసందర్భంగా జరుగుతున్నప్పుడు దీనికి అవసరమైన శక్తిని సమకూర్చేందుకు శరీరంలో ఉన్న శక్తిని పీలుస్తాయి. ఇది సుదీర్ఘకాలం పాటు నిత్యకృత్యం అయితే ఒత్తిడికి సంబంధించిన వ్యాధులైన మైగ్రేన్‌, హైపర్‌టెన్షన్‌, ఆసిడ్‌ పెప్టిక్‌ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఆర్థరైటిస్‌, మలబద్ధకం తదితర వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది.

ప్రమాద సంకేతాలు:
1. ఏకాగ్రత కుదరక పోవడం. 2. విపరీతమైన అలసట 3.తల నొప్పులు 4. పొట్టలో గడబిడ 5. నిద్ర సమస్యలు 6. లైంగిక జీవి తం పట్ల ఆసక్తి సన్నగిల్లడం 7. నిరాశ, నమ్మకాన్ని కోల్పవడం 8. చికాకు పెరగడం. 9. మద్యం, ధూమపానం అధికం కావడం.వ్యాధి నివారణకు ఆయుర్వేదమెప్పుడూ మనశ్చర్య సంబంధిత మార్గాన్ని ఎంచుకుంటుంది కనుక పాశ్చాత్య వైద్యానికి భిన్నంగా ఉంటుంది. కనుక ఆయుర్వేదంలో ఎప్పుడూ శరీరం, మనస్సు సమగ్రతలకు ప్రాధాన్యతనిచ్చి చికిత్స ఉం టుంది. శారీరక సం బంధమైన వ్యాధులలో కూడా మానసిక అంశాలను నిర్లక్ష్యం చేయదు. అలాగే మానసిక సమస్యలలో శారీరక అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది.

చికిత్స:
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రధానంగా రిలక్సేషన్‌ టెక్నిక్‌లను సాధన చేయడం ఎంతో తోడ్పడుతుంది. ధ్యానం, వ్యాయామం, ఎయిరోబిక్స్‌, ఆక్యుప్రెషర్‌, హైడ్రోథెరపీ, యోగా, శ్వాస సంబంధిత వ్యాయామాలు, హాస్యం, ఆహారం, నాట్యం, ఈత కొట్టడం, సంగీతం అన్నీ కూడా ఒత్తిడి తగ్గించేందుకు తోడ్పడతా యి. ఒత్తిడిని తగ్గించడంలో ఆయుర్వేదం ఎం తో ఉపయుక్తమైన పాత్ర పోషించగలదు. ఆయుర్వేదంలోని దినచర్య, రాత్రి చర్య, రుతు చర్య, ఆ చార రసాయన, స్వస్థివృత్త వంటి వన్నీ కూడా ఒత్తిడిని తగ్గించడంలో విజయం సాధిం చాయి. దీనిపై మరింత లోతుగా పరిశోధనలు జరపవలసి ఉన్నది.

ఆయుర్వేదం ప్రకారం ఒత్తిడి నిర్వహణకు...
1. సత్వగుణాన్ని వృద్ధి చేయడం.
2. ఒత్తిడి కలిగించే అంశాల నుంచి మనసును మళ్ళించడం
3. స్వస్థత కలుగచేసే మందులు ఇవ్వడం
4. మానసిక సమస్యలను తగ్గించేందుకు కొన్ని చర్యలు. వీటిని సాధించేందుకు సాత్వికాహారం తీసుకోవాలని ఆయుర్వేదం చెప్తుం ది. కూరగాయలు, పాల సంబంధిత ఆహారం తీసుకోవాలని చెప్తుంది. కటువైన, వేడి చేసి ఆహారాలను, గంజ, భంగ్‌, ఛరస్‌, పొగా కు, మద్యాలకు దూరంగా ఉండాలంటుంది.

ఒత్తిడి నివారణకు ఔషధాలు
మూలికలు: బ్రహ్మి, హరీటకి, అమలకి, శతావరి, మండూకపర్ణి, పునర్నవ, పిప్పలి, రస్నా, బ్రహ్మి, శంఖ పుష్పి, వచ కూష్మాండ, పర్సిక్యావని, సర్పగంధ, నాగకేశర్‌, జ్యోతిష్మతి, జటామాంసి వగైరా...

లవణ సంబంధిత: మనశిల, శిలాజిత్‌, అభ్రక, సువర్ణ, మౌటిక, ప్రవల, మాణిక్య గోమేధ పుష్పరాగ...
ఇతర: పాలు, నెయ్యి, నువ్వుల నూనె, ధారజల, గోమూత్ర, యుష్‌

మానసిక ఉద్దీపకాలు:
వచ, బ్రాహ్మ, మండూకపర్ణి జ్యోతిషమతి, శంఖపుష్పి. వీటితో పాటుగా బ్రహ్మి రసాయన, ఆమ్లకి రసాయన, చ్యవన ప్రాస, హరితక్యాది రసాయన, నాగబల అవలేహ వంటి లేహ్యాలు, కళ్యాణ ఘృత, భల్లాతక ఘృత, పంచకావ్య ఘృత, బ్రహ్మి ఘృత, మయూర ఘృత వంటి ఘృతాలను లోపలకి తీసుకోవడానికి, సర్సాప తైల, పరిసేక, చందన తైల, ఘృత, సరస్వతీ తైలం వంటి వాటిని బాహ్యంగా ఉపయోగించడానికి వాడతారు. వీటితోపాటుగా సరస్వతారిష్ఠ, ద్రాక్షారిష్ఠ, అశ్వగంధారిష్ఠ వంటి ద్రవాలను అంతర్గతంగా తీసుకోవడానికి ఇస్తారు. అయితే ఈ మందులను వైద్యుని సలహా లేకుండా తీసుకోరాదు.

శరీరం పై ఒత్తిడి ప్రభావం
గమనిక: ఈ వ్యాసం వ్యాధి పట్ల చైతన్యం కలిగించేందుకు ఉద్దేశించినదే తప్ప స్వయం చికిత్సను ప్రోత్సహించేందుకు కాదు. ఏ మందైనా తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యుని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఔషధాల అవసరం లేకుండానే జీవన విధానంలో మార్పుల ద్వారానే అనేక లక్షణాలను తగ్గించవచ్చు.


table
swathi

No comments:

Post a Comment