Pages

Monday, October 4, 2010

ఆహారం మానేయకుండానే శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చు ......

చిక్కిన అందం
ఈ రోజుల్లో ఎక్కడ చూసినా అధికబరువుతో బాధపడేవారి సంఖ్య అంతకంతకూ ఎక్కువరుుపోతోంది. పాపం కొంతమంది ఆడవారు డైటింగ్‌ పేరిట పోషకాహారం కూడా తీసుకోకుండా ఉన్న కొద్దిపాటి అందానికి కూడా దూరం అరుుపోతున్నారు. వైద్యులను సంప్రదించకుండానే వాళ్లంతట వారే నిర్ణయాలు తీసేసుకుని వారంలో ఒక రోజో లేక రెండు రోజులో ఆహారం తీసుకోకుండా ఉంటే బరువు తగ్గిపోతామనే అపోహలో ఉంటారు కొందరు. ఖాళీ కడుపుతో ఆహారం తీసుకునేటప్పుడు అంతకు ముందు రోజు ఉపవాసం ఉన్నామనే భావనతో కొందరు ఎక్కువగానే తినేస్తుంటారు. దీనితో ఊబకాయం సమస్య తలెత్తుతోంది. అరుుతే ఆహారం మానేయకుండానే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శరీరాన్ని నాజూగ్గా ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు.

ఎక్కువ మంది బంధువులు, మిత్రులు ఉన్నవారు వాళ్లింటికి తరచుగా వెళ్లడం వలన వారు పెట్టే అమితాహారాన్ని తీసుకుని మొహమాటంతో కాదనలేక ఏది పడితే అది తినేస్తుంటారు. కొందరు అలా కూడా ఊబకాయం సమస్య పెరిగిపోతోంది.

చిరుతిళ్లు :
article-కొందరు ఆహారాన్ని పూర్తి స్థాయిలో తగ్గించేసి చిరుతిళ్లకు ప్రాధాన్యం ఇస్తుం టారు. అసలు ఆహారం కన్నా ఈ చిరుతిళ్లే ఎక్కువ చేటు తెస్తాయి. సాధారణంగా ఆడవారు ఇళ్లల్లో టీవీ సీరియల్‌ చూస్తున్నప్పుడు చిరుతిళ్లు ఎక్కువగా తినేస్తుంటారు. వాటిల్లో ఉండే ఆయిల్‌ వలన కొలెస్ట్రాల్‌ శాతం కూడా పెరిగిపోతుంటుంది. అలాగే కొం దరు గురువారాలని, శనివారాలని ఆహారం తినేయడం మానేశాం అను కుంటుంటారు. ఆ మర్నాడు తీసుకునే ఆహారం అంతకు ముందు రోజుకన్నా ఎక్కువ తీసేసుకుంటుంటారు. ఆహారంలో అధిక కేలరీలు, తక్కువ కేలరీలు ఇచ్చేవి ఉంటాయి.

ఎంత తినాలి :
అధిక కేలరీలు ఇచ్చేవాటిని నియమానుసారం, కొద్దిపాటి మోతాదు తీసుకుంటే సరిపోతుంది. ఉదాహరణకు ఉదయం అల్పాహారం తీసుకునేటప్పుడు ఇడ్లీ తీసుకుంటుంటారు కొందరు. అలా తీసుకునే ఇడ్లీలలో కేలరీలు అధికశాతం ఉండటంతో కేవలం నాలుగు లేక ఐదు ఇడ్లీలతో మళ్లీ నాలుగు లేక ఐదు గంటలు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండవచ్చు. హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లకని వారానికి ఒకరోజు ఫ్యామిలీతో హాయిగా గడిపేస్తుంటారు కొందరు. రోజువారి నియమాలను పక్కన పెట్టేసి కొవ్వు శాతం ఎక్కువ, ఆయిల్‌ పర్సంటేజ్‌ ఎక్కువ ఉన్న ఫుడ్డును తీసుకుని మోయలేని శరీర బరువును స్వయంగా వాళ్లే కొనితెచ్చుకుంటుంటారు కొందరు.

కాస్త నడక మంచిది :
ఎక్కడికి వెళ్లాలన్నా వాహనం లేనిదే బయ టకు కదలలేని పరిస్థితి. అందుకని వీలయితే ఎక్కువగా నడవడానికి ప్రయత్నిస్తుండాలి. లేకపోతే కనీసం సైకిల్‌ తొక్కుకుంటూ దగ్గరలో ఉన్న మార్కెట్‌కు, సెంటర్‌కు వెళ్లివస్తుండాలి. శరీ రకండరాలకు తగిన వ్యాయామం లేకపోవడంతో ఊబకాయం మరింతగా పెరిగిపోయి చూసేవాళ్లకు కూడా అసహ్యంగా కనిపిస్తాము. వెనకటి కాలంలో అయితే ఎంత దూరం అయినా సరే నడుచుకుంటూ వెళ్లి వచ్చే వారు. తగినంత శారీరక వ్యాయామం ఉండేది. పైగా ఇళ్లల్లో కూడా రోటి పచ్చళ్లు చేసుకునేవారు. ఇడ్లీ, దోశల పిండి కూడా స్వయంగా రుబ్బు కునేవారు. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్‌ యుగంలో అన్నీ ఇన్‌స్టెంట్‌ ఫుడ్‌లకు అలవాటుపడిపోయి సులభ మార్గాలు వెతుక్కుంటున్నాము. తగిన శారీరక వ్యాయామం లేక ఊరికే ఊబకాయం పెరిగిపోయి నేడు ప్రపంచస్థాయిలో అనేక మంది బాధపడుతున్నారు.

ఎక్కువ ఆకలి వేస్తే :
సాధారణంగా ఆహారం తీసుకున్న తర్వాత కనీసం మూడు లేక నాలుగు గంటలు ఎటువంటి ఆహారం తీసుకోక పోవడం మంచిది. అంతగా మరీ గంటకే ఆకలి అనిపిస్తే ఏదైనా పండ్లు, జ్యూస్‌లు తీసుకోవడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మన శరీరం ఎత్తు, బరువును బట్టి మనం తీసుకునే ఆహారం ఉండాలి.

కొద్ది పాటి వ్యాయామం :
hiroinశారీరక వ్యాయామం చేసేటప్పుడు, జాగింగ్‌, మార్నింగ్‌ వాకింగ్‌ చేసేటప్పుడు ఎంత శాతం కేలరీలు ఖర్చ వుతాయో తెలుసుకుని వాటిని సరిగ్గా పాటించగలిగితే ఊబకాయాన్ని దూరం చేయవచ్చు. అలాగే తీసుకునే ఆహారం సాత్వికంగా ఉండి, ఆయి ల్‌, కొవ్వు శాతం తక్కువ ఉండేలా జాగ్రత్త వహించాలి. సాధారణంగా ఆడ వారు పెళ్లి కాకముందు డైటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అదే పెళ్లికాగానే ఏది పడితే అది తినేస్తుంటారు. దీనితో పెళ్లి కాని వారి కన్నా ...పెళ్లయిన వారిలోనే అధికశాతం ఊబకాయం సమస్య తలెత్తుతోంది. ఊబకాయంతో అవస్థలు పడేవారికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ స్థాయిలో ఉంటుంది. అధిక బరువు ఉన్నవాళ్లు ఆకలి వేసిందనిపిస్తే... నీరు తాగడం మంచిది. నియమబద్ధంగా కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే ఊబ కాయం సమస్య కాదు.

No comments:

Post a Comment