Pages

Friday, December 24, 2010

స్మూత్ వింటర్!

చలికాలం వస్తే చాలు... మరో భయమూ గడగడలాడించేస్తుంది.
ఇది చలి వల్ల వచ్చే వణుకు కాదు...
చర్మానికి కలిగే హానిని తలచుకుని ఈ ఆందోళన.
మామూలు టైమ్‌లో ఉండే మెరుపు తగ్గిపోయి చర్మం నిస్తేజంగా మారుతుంది.
బాగా పొడిబారిపోయి కాస్త గోరు గీరుకున్నా చారికలు పడిపోయి అసహ్యంగా కనిపిస్తుంది. ‘వింటర్’తో పాటు వచ్చే చర్మ సమస్యలకు ‘స్మూత్’ పరిష్కారమే ఈ ముందుజాగ్రత్త.


చలికాలంలో వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది. దానికి తోడు చల్లటిగాలులు. అందువల్ల చర్మంలోని తేమ, సహజసిద్ధమైన నూనెలు తగ్గిపోతాయి. ఫలితంగా చర్మం పొడిబారి, దురద మొదలవుతుంది. మంటపుడుతుంది. గీరితే పొట్టు రాలుతుంది. చలికాలంలో ఈ సమస్య అందరికీ వస్తుంది. కాకపోతే ఇప్పటికే చర్మ సమస్యలు ఉన్నవాళ్లకి, కొన్ని రకాల మందులు వాడుతున్నవారికి ఎక్కువ. పెదవులు కూడా త్వరగా పొడిబారి, పగులుతూ ఉంటాయి. అజాగ్రత్త చేస్తే ఒక్కోసారి రక్తం కూడా వస్తుంటుంది. ఈకాలంలో జుట్టు కూడా పొడిబారి, కాంతి తగ్గి, బలహీనపడి, ఎక్కువగా ఊడుతుంటుంది.


వింటర్ ఎగ్జియోరోసిస్: ఈ సమస్య చేతులకి, కాళ్లకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. చర్మం బాగా పొడిబారి, దురద మొదలవుతుంది. వీళ్లు తరచూ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ వాడాలి.

ట్యానింగ్: చలిగా ఉంది కదా! అని ఎక్కువసేపు ఎండలోనే ఉండటం వల్ల పొడిబారిన చర్మం కమిలిపోతుంది.

అటోపిక్ డెర్మటైటిస్: ఈ స్కిన్ డిసీజ్ ఏడాది లోపు పిల్లల్లో బుగ్గలు, చేతులు, కాళ్ల మీద మొదలవుతుంది. చర్మం ఎరగ్రా, పొడిబారి దురద వస్తుంది. తరచూ ముక్కుకారడం, డస్ట్ అలెర్జీ, ఆస్తమాసమస్యలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకోకపోతే ఎగ్జిమా శరీరమంతా స్ప్రెడ్ అయిఎరిథ్రోడెర్మస్‌గా మారుతుంది. వీరు డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం అవసరం.

సోరియాసిస్: 30 -40 ఏళ్ల మధ్య వయస్కులు, వయసు పైబడిన వారిలో ఈ సమస్య ఎక్కువ. మోకాళ్లు, మోచేతులు, వీపు మీద ఎరన్రి ప్యాచెస్ వస్తుంటాయి. చర్మం మందంగా మారి, పొట్టు రాలుతూ ఉంటుంది. తలలో కూడా తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. గోళ్లు, కీళ్ల సమస్యలు ఉంటాయి.

రోసాసియ: ఈ చర్మ సమస్య ఉన్నవాళ్లకు బుగ్గలు, ముక్కు, తల ముందుభాగం మీద ఎరగ్రా కందిపోయి ఉంటుంది. ఇది యాక్నెనా, పింపులా అని కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఇది ఆల్కహాల్, మసాలాలు ఎక్కువ తీసుకునేవాళ్లకు వస్తుంది.

యాక్నె, పింపుల్స్: చలికాలంలో చర్మం పొడిబారి మృతకణాలు పెరుగుతాయి. ఇవి చర్మం రంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి. ఫలితంగా బ్యాక్టీరియా ఆకర్షించి మొటిమలు ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది.

ఆస్టియోటిక్ ఎగ్జిమా: ఈ సమస్య వృద్ధులకు వస్తుంది. పొలం ఎండి బీటలు వారినట్టు చర్మం కూడా అలా కనిపిస్తుంటుంది.

కాగ్నైటల్ డిజార్డర్
ఈ సమస్య పుట్టుకతోనే మొదలవుతుంది. చర్మం అంతా పొడిబారి చేపల పొలుసుల్లాగ ఊడిపోతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి చాలా సివియర్ ప్రాబ్లమ్ అవుతుంది. ఈ పిల్లలకు పుట్టిన దగ్గర నుంచే చికిత్స ఇవ్వాల్సి ఉంటుంది.
అభ్యంగన స్నానంతో అందం, ఆరోగ్యం...
శీతల వాతావరణంలో చర్మానికి లభించే రక్తప్రసరణ మందగిస్తుంది. అందువల్ల చర్మానికి కావలసిన పోషకపదార్థాలు తక్కువవుతాయి. ఫలితంగా చర్మం పొడి బారుతుంది. అలెర్జ్జీలు, ఎగ్జిమాలు సునాయాసంగా వస్తుంటాయి. అనంతరం ఇన్‌ఫెక్షన్లు ఆవహిస్తాయి.
చర్మ ఆరోగ్య సూత్రాలు: రోజూ ఉదయం పూట కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి. రోజు మొత్తంలో 4-5 లీటర్ల నీళ్లు తాగడం ఆరోగ్యదాయకం.

తగినంత వ్యాయామం చేయడం ద్వారా శరీరానికి చెమట వచ్చేట్టు చేయాలి. తలకు కూడా చెమట పడితే వ్యాయామం పూర్తిగా చేసినదానికి చిహ్నం.
అభ్యంగనం: ఇది చర్మానికి చేసే తైలమర్దనం. నువ్వుల నూనె లేదా ఆవనూనె మర్దనాకు మంచిది. ఆ తర్వాత నలుగు కోసం సున్నిపిండి వాడాలి. పెసరపిండి నాలుగుపాళ్లు, వరిపిండి ఒకపాలు తీసుకొని తగినన్ని నీళ్లలో కలిపి ముద్దగా చేయాలి. పెసరపిండికి బదులు శనగపిండిని కూడా వాడుకోవచ్చు.
స్వేదకర్మ: వేడినీటి ఆవిరితో శరీరానికి చెమట పట్టేట్టు చేయాలి. దీనినే స్టీమ్ బాత్ అంటారు. పావుగంట పాటు ప్రభాత సూర్యకిరణాలు తాకేట్టు ఎండలో కూర్చుంటే మంచిది.

ఔషధాలు: పసుపు, బావంచాలు, అగరు (మొక్క బెరడులోని చేవ) ద్రవ్యాలను సమపాళ్లలో మెత్తగా పొడి చేసి నలుగుకు వాడితే చాలా మంచిది.
ముస్తా (తుంగముస్తలు), కరక్కాయ, మంజిష్ఠ ద్రవ్యాలు కలిపి నలుగుకు వాడుకోవచ్చు.

బొప్పాయి పండు ముద్ద, క్యారట్, కీరా గుజ్జు, పాల మీగడలలో ఏదైనా ఒకదానిలో కొంచెం నిమ్మరసం కలిపి చర్మంపై లేపనం చేస్తే నల్లని, గోధుమరంగు మచ్చలు తగ్గుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. ముడతలు కూడా తగ్గుతాయి.

రోజూ రాత్రి పది గ్రాముల త్రిఫలా చూర్ణాన్ని నీళ్లలో కలిపి తాగితే మృదువుగా విరేచనం అవటమే కాకుండా, చర్మపు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయలను త్రిఫలాలు అంటారు.

శారిబాద్యాసవ/ ఖదిరారిష్ట/ మహామంజిష్టాది: ఈ మూడు ద్రావకాలలో ఏదైనా ఒకటి నాలుగు చెంచాలు తీసుకొని సమానంగా నీళ్లు కలిపి, రెండు పూటలా తాగితే, రక్తం శుద్ధి అవుతుంది. ఫలితంగా చాలా చర్మ రోగాలకు నివారణగా పనిచేస్తుంది.

కుంకుమపువ్వు (శాఫ్రన్):
దీనితో చేసిన నూనె పై పూతకి మంచిది. 200 మి.గ్రా కుంకుమ పువ్వును గ్లాసు పాలతో కలిపి తాగితే చర్మకాంతి మెరుగవుతుంది.

ఆహారం: పులుపు, ఉప్పు, కారాలు తగ్గించాలి. ఆకుకూరలు, మునక్కాయ, తాజా పండ్లు తీసుకోవడం మంచిది. రోజూ ఒక ఉసిరికాయ తినటం శ్రేష్ఠం.

గమనిక:
అలెర్జీ కలిగించే ఆహారపదార్థాలు తీసుకోకూడదు. అలాగే కొన్ని రసాయనక్రిములు, ఔషధాలు, వేడి ఎక్కువగా ఉన్న సూర్యరశ్మి, సబ్బులకు దూరంగా ఉండటం వల్ల చర్మానికి కలిగే హానిని నివారించుకోవచ్చు.


చలికాలం - చర్మ జాగ్రత్తలు

స్నానం చేసే అరగంట ముందు ఆలివ్ లేదా కొబ్బరి నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. స్నానానికి మాయిశ్చరైజింగ్ సబ్బులు వాడాలి. చర్మ సమస్యలు ఉన్నవారు స్నానం చేసే నీటిలో 10 చుక్కలు నూనె వేసుకొని చేస్తే ఇంకా మంచిది.

స్నానం చేసి, తడి తుడుచుకున్న వెంటనే డీప్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాసుకోవాలి. ఈ క్రీమ్ రోజుకు 3- 4 సార్లు వాడితే మంచిది.

చలికాలంలో కొందరు స్నానానికి చాలా వేడి నీళ్లు వాడతారు. వేడినీళ్లు చర్మంలో ఉన్న సహజసిద్ధమైన నూనెలను తీసేసి, ఇంకా పొడి చేస్తుంది. అందుకని స్నానానికి ఎక్కువ వేడినీళ్లు వాడకూడదు.

సమతుల ఆహారం చర్మాన్ని పొడిబారనివ్వదు. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీరు తప్పకుండా తీసుకోవాలి. నీళ్లు తక్కువగా తీసుకుంటే చర్మం త్వరగా పొడిబారుతుంది.

బయట ఎక్కువగా తిరిగేవాళ్లు ముఖానికి చేతులకు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఎందుకంటే ఈ కాలంలో ట్యానింగ్ సమస్య ఎక్కువ.

ముఖానికి క్లెన్సర్లు ఈ కాలంలో వాడకూడదు. ఇవి చర్మాన్ని ఇంకా పొడిబారేలా చేస్తాయి.

పాదాలకు, చేతులకు కాటన్ గ్లౌజ్ వేసుకుంటే వెచ్చగా ఉండి, ఎక్కువ పొడిబారనివ్వవు.

తల స్నానానికి 2 గంటల ముందు మాడుకు నూనెతో మసాజ్ చేసుకోవాలి. నూనె కండిషనర్‌గా పనిచేస్తుంది. పొడి జట్టు వాళ్లయితే షాంపూ ఉపయోగించిన తర్వాత కండిషనర్ వాడాల్సి ఉంటుంది.

జుట్టు తడి ఆరబెట్టడానికి ఈ కాలంలో బ్లో డ్రయ్యర్లు వాడకూడదు. ఇవి జుట్టుకు మరింత హాని చేస్తాయి. బయటకు వెళితే జుట్టును సిల్క్ స్కార్ఫ్‌తో కవర్ చేసుకోవడం మంచిది.

శిరోజాలకు కలరింగ్‌లు, ఐరనింగ్‌లు చేయించుకోకూడదు. ఎందుకంటే వీటి వల్ల జుట్టులోని తేమ తగ్గి వెంట్రుకలు ఎక్కువగా ఊడిపోతాయి.

పెదాలు:  పెట్రోలియమ్ జెల్లీ లేదా లిప్ బామ్‌ని తరచూ పెదాలపై రాస్తూ ఉండాలి. ఇంట్లో ఉన్నప్పుడు తరచూ వెన్న రాసుకుంటే మంచిది.

No comments:

Post a Comment