Pages
▼
Tuesday, July 12, 2011
షుగర్ ఉంటే ఊబకాయం!
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మ«ధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?
మధుమేహంతో బాధపడుతున్న వారికి తాజాగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో ఊబకాయ సమస్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. టైప్-2 మధుమేహం ఉన్న ప్రతి అయిదుగురిలో ఒకరు అధికబరువుతో బాధపడుతున్నారు. ఊబకాయం వస్తున్నది. అమెరికాలో ఈ మేరకు జరిపిన అధ్యయనాల్లో బెంబేలెత్తించే వాస్తవాలు బయటపడ్డాయి. అమెరికాలో టైప్ - 2 మధుమేహం సమస్య ఉన్న వారిలో 62శాతం మంది అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారని తేలింది. 20 శాతం మంది మరీ ఎక్కువ బరువైపోయి, కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారని లయోలా హెల్త్ యూనివర్శిటీ చేసిన అధ్యయనాల్లో వెల్లడైంది. మధుమేహంతో పాటు అధిక బరువు సమస్య పెరిగితే భవిష్యత్‌లో పలు చిక్కులు ఎదురవుతాయని ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పౌష్టికాహారం తీసుకోక పోవటం, సోడా వినియోగం పెరగటం, వ్యాయామం తగ్గటం వల్ల మధుమేహంతోపాటు ఊబకాయుల సంఖ్య పెరుగుతోంది. అమెరికా జనాభాలో 7.8శాతం అంటే 2.3 కోట్ల మంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని అంచనా. ఇందులో 90శాతం మందికి టైప్-2 మధుమేహం ఉంది. తగినంత వ్యాయామం లేకపోవడం, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాలతో అక్కడ మధుమేహం సమస్య పెరిగిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఆహారపు ఆలవాట్ల విషయంలో అమెరికా బాట పడుతున్న మనం మరింత జాగ్రత్తగా ఉండాలేమో?
షుగర్ మోసుకొచ్చే 'టీవీ'క్షణం
మీరు రోజుకు రెండు నుంచి మూడు గంటలు టెలివిజన్ చూస్తున్నారా? అయితే మీకు పలు రకాల వ్యాధులు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రతీ రోజు టీవీ ఎక్కువగా చూసే వారిలో మధుమేహం టైప్ 2 ముప్పు వచ్చే అవకాశాలు 20శాతం ఉన్నాయని తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో తేలింది. ఒక్క మధుమేహమే కాదు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 15శాతం అధికంగా ఉంటుంది. టీవీ ఎక్కువగా చూసేవారిలో 13శాతం వివిధ కారణాల వల్ల మృత్యువుకు చేరువ అవుతున్నారని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. టీవీ రోజుకు మూడు గంటలు చూస్తున్నారంటే, ఆ సమయంలో తీసుకుంటున్న ఫ్రైడ్ ఆహారపదార్థాలు, తీపి పానీయాలు కొలెస్ట్రాల్, బ్లడ్‌షుగర్‌లను పెంచుతుందని తేలింది. దీనివల్ల ఒబేసిటీ, బీపీ, హైబ్లడ్‌షుగర్ లాంటి సమస్యలు పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుందని వైద్యులు చెపుతున్నారు. చిప్స్‌లో ఆయిల్, ఉప్పుతో పాటు అధిక కేలరీలు ఉంటాయి. ఇవి తినటం వల్ల వివిధ జబ్బులు వచ్చిపడతాయని యూనివర్శిటీ సదరన్ డెన్మార్క్, హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
షుగర్ ఉంటే ఇలా తినాలి
మధుమేహం ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ పిరమిడ్‌లో సూచించిన విధంగా ఆహారం తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా జీవించే వీలుంటుంది. మధుమేహం ఉన్న వారు స్వీట్లు, ఆల్కహాల్ తీసుకోరాదు. తీసుకున్నా చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. కొవ్వు పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. ఇక పాలు, మాంసాహారాన్ని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.కూరగాయలు, పండ్లు అధికంగా తీసుకోవాలి. ఇక చిరుధాన్యాలు, బ్రెడ్ వంటి పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment