కాలం మారింది. నేడు భౌతికమైన సౌందర్యానికీ ప్రాముఖ్యత పెరిగింది. అందుకే సౌందర్య సాధనాలను ఉత్పత్తి చేసే కంపెనీలు లాభాల బాటను వదలడం లేదు. అయితే ఈ ఖరీదైన, రసాయన ఆధారిత ఉత్పత్తుల కన్నా సహజమైన, మన చర్మానికి హాని చేయని ఉత్పత్తులు మనకు అందుబాటులోనే ఉంటాయి. అవి మన వంటింట్లోనే దొరుకుతాయి. కాకపోతే ఏది ఎందుకు ఉపయోగించాలో, దాని వల్ల లాభమేమిటో తెలుసుకుంటే చాలు...
క్లెన్సర్లు:
పాలు, చెరకు, ద్రాక్ష పండ్లు ముఖాన్ని శుభ్ర పరచడంలో అత్యుత్తమంగా పని చేస్తాయి.అలాగే ఆలివ్ ఆయిల్‌ను, ఆవనూనెను మేకప్‌ను తొలగిం చేందుకు వినియోగించవచ్చు.మొటిమలు బాగా వస్తుంటే స్ట్రాబెర్రీలను వినియోగించ వచ్చు. ఇందులో సహజంగా ఉండే సలిసైలిక్ ఆసిడ్ చర్మం లోని అధిక జిడ్డును పీల్చి వేసి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది.
స్క్రబ్స్:
ఓట్స్‌ను కచ్చపచ్చాగా దంచి ఉపయోగిస్తే అది అన్ని రకాల చర్మాలకు మంచి క్లెన్సర్‌లాగానూ, స్క్రబ్‌లానూ పని చేస్తుంది.కమల, నారింజ తొక్కులు, బాదం పప్పు వంటివి కూడా మంచి స్క్రబ్‌లుగా పని చేస్తాయి.
అలాగే అక్రూట్ పొడి, తేనె, నిమ్మరసం ఒక టీ స్పూన్ చొప్పున తీసుకొని కలిపి ఉపయోగిస్తే చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.
మాయిశ్చరైజర్లు:
చర్మం ఎండిపోయినట్టు ఉంటే బాగా పండిన అరటిపండు, బొప్పాయిని చిదిమి, అందులో గుడ్డును కలపడం వల్ల చర్మానికి తగినంత మాయిశ్చర్ అందుతుంది. అలాగే, గసగసాలు, బఠాణీలు వంటి వాటిల్లో సహజ నూనెలు ఉం టాయి. వాటిని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించడం వల్ల మంచి మెరు పు వస్తుంది. డల్‌గా ఉండే చర్మానికి పెరుగు కూడా మంచి మందు.జిడ్డోడే చర్మానికి గుడ్డులో ఉండే తెల్లసొన చాలా మంచి ఆహారం లాంటిది. మెంతులు, కం దులు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డును నియంత్రించి, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది.
ఆస్ట్రింజెంట్/ టోనర్:
దోసకాయ, పైనాపిల్, నిమ్మరసం వంటివన్నీ సహజమైన ఆస్ట్రింజెం ట్లగా పని చేస్తాయి.
మంచి ఫలితాల కోసం:
ఇంట్లో సౌందర్య పోషణ చేసుకునే ముందుగా ముఖానికి ఆవిరిపడితే చర్మ రంధ్రాలు తెరుచుకొని సహజ ఉత్పత్తులో ఉండే పోషకాలను చ ర్మం మరింత బాగా పీల్చుకుంటుంది. ముఖం నున్నగా, పట్టులా మృదువుగా ఉండాలంటే షవర్ చేసే సమయంలో బేకింగ్ సోడాను శరీరం మొత్తానికి పట్టించాలి. ముఖం మీద బ్లాక్ హెడ్స్‌ను తొలగించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది బాహుమూలాల్లో, అరికాళ్ళల్లో చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటుంది. అటువంటివారు వెనిగర్‌ను, నీటిని సమపాళ్ళలో తీసుకుని డియోడరెంట్‌కి బదులుగా దానిని వాడాలి.
పసుపు చేసే మేలు ఎంతటిదో వేరే చెప్పనవసరం లేదు. దానిలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలతో పాటు కళ్ళ చుట్టూ ఉండే నలుపు, ఉబ్బులు, పాదాలలో పగుళ్ళు, పిగ్మెంటేషన్, ముడతలు తగ్గించి ముఖానికి మంచి మెరుపును ఇస్తుంది. ఎండ కారణంగా నల్లబడిన చర్మానికి ఆలివ్ ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. గోరు వెచ్చని ఆలివ్ నూనెలో గోళ్ళను ముంచి కాసేపు ఉంచడం ద్వారా అవి బలంగా, ఆరోగ్యంగా కనుపిస్తాయి. మనకు అందుబాటులో ఉండే వస్తువులను ఉపయోగించుకొని అందాన్ని కాపాడుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవంటున్నారు నిపుణులు.
No comments:
Post a Comment