పక్క వీధిలోని పాలబూత్‌కి వెళ్లాలంటే బండి స్టార్ట్ చేయాల్సిందే... కిలోమీటర్ దూరం వెళ్లి కూరగాయలు కొనుక్కు రావాలంటే బండి కావాల్సిందే... బట్టలుతకడానికి వాషింగ్ మెషీన్... అంట్లు కడగడానికి ఓ పనిమనిషి... పచ్చళ్లు దంచిపెట్టడానికి మిక్సీ.... ఇదీ మారిన మన లైఫ్‌స్టైల్. చివరకు మనకు మిగిలిందేమిటి.... వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లకై వెదుకులాట.
* * * పది కిలోమీటర్లు నడిచివెళ్లి చిన్న చిన్న వస్తువులు కొనితెచ్చుకోవడం.., చదువుకోవడానికి నాలుగైదు కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లడం.... చేతులరిగిపోయేలా తిరగలి తిప్పడం..... ఇలాంటి కష్టాలన్నీ పోయాయి. చేతిలో డబ్బుంటే చాలు... అన్నీ మన ముందుకే వస్తాయి. అయితే ఆధునిక సౌకర్యాలతో పాటు ఎక్కడబడితే అక్కడ బరువుతగ్గించే సెంటర్లు కూడా పెరిగిపోయాయి. కారణం... ఊబకాయులు పెరిగిపోతుండటమే. దీనికి ఆడామగా, చిన్నా పెద్దా తేడా లేదు. బరువు పెరగడానికి వయసుతో పనిలేదు.
వెయిట్ తగ్గించే అద్భుతాలు
స్లిమ్మింగ్ క్యాప్సుల్స్, ఆయిల్స్, క్రీములు, పౌడర్లు, టీలు (డాక్టర్ టీ), డైట్ సప్లిమెంట్లు... ఇలా చెప్పుకొంటూ పోతే బరువు తగ్గించేవని చెప్పేవి మార్కెట్లో సవాలక్ష ఉన్నాయి. కొన్ని ఫిట్‌నెస్ సెంటర్లయితే వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్ల పేరుతో మనీ బ్యాక్ పాలసీ లాంటి రకరకాల ఆఫర్లతో ఆకర్షిస్తున్నాయి. అల్ట్రాసౌండ్ చికిత్సలు, మసాజ్‌లు, రేడియేషన్ల వంటి వాటితో కొవ్వు కరిగిస్తామంటున్నాయి. కొన్ని జేబుకు చిల్లు పడటమే తప్ప వీటివల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు బాధితులు. 'స్లిమ్మింగ్ మెషీన్ సహాయంతో మీ శరీరంలో ఎక్కడ కొవ్వు పేరుకుపోయినా తగ్గించేస్తామన్న మాటలు నమ్మి లక్షన్నర రూపాయలు చెల్లించాను.
స్లిమ్మింగ్ పరికరం ఉత్పత్తి చేసే వేడి కొవ్వును కరిగిస్తుందని నమ్మబలికారు. కానీ ఒక ఇంచు కూడా బరువు తగ్గలేదని వాపోయారు హైదరాబాద్‌కు చెందిన ఓ యాంకర్. మొత్తం బాడీ మసాజ్ చేయడం వల్ల కొవ్వు కరిగిపోతుందని వెళ్లిన కాల్‌సెంటర్ ఉద్యోగిని అయిన ప్రమీల వాళ్లు చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయింది. రోజూ అరగంట సేపు వాకింగ్, తరువాత మరో అరగంట ఎక్సర్‌సైజ్ చేయడం వారానికి మూడుసార్లు తమ సెంటర్‌లో ఓ గంటసేపు మసాజ్...
నెలరోజుల్లో అయిదు కిలోల బరువు తగ్గుతారని చెప్పడంతో ఇక తను తీసుకునే ఆహారం, వ్యాయామంపై దృష్టి పెట్టింది ప్రమీల. ఇలాంటి అనుభవాలు ఎన్ని ఎదురైనా అలా బయటకు వెళితే చాలు.. ఏ బేకరీకో, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కో వెళ్లడం రుచిగా ఉన్నదల్లా లాగించెయ్యడం... తరువాత బరువు పెరిగిపోతున్నామని బాధపడటం... ఇటీవలి కాలంలో ఈ తరహా ధోరణి ఎక్కువయింది. ఎక్కువ కష్టపడకుండా వెంటనే బరువు తగ్గిపోవాలన్న కోరికతో స్లిమ్‌బెల్టులు, స్లిమ్ మెషీన్లు కొని తెచ్చిపెట్టుకోవడం, స్లిమ్ క్యాప్సుల్స్, యాంటి ఒబేసిటీ మందుల్లాంటివి వాడటం వల్ల అనుకున్న ఫలితం పొందడం మాట అటుంచి ఇతరత్రా సైడ్ ఎఫెక్టులు కలిగే అవకాశం ఉంది.
అసలైన మంత్రం
అందుకే బరువు తగ్గడానికి రాచబాట లాంటి వ్యాయామాన్ని వదిలేసి యంత్రాలపై ఆధారపడటం సరికాదు. వ్యాయామం చేసేందుకు సమయం సరిపోవట్లేదంటారు చాలామంది. కానీ ఆరోగ్యాన్ని మించిన ముఖ్యమైన పని మరొకటి లేదు. ఎంత అర్జెంట్ పనులున్నా వ్యాయామం కోసం కనీసం ఓ అరగంట సమయాన్ని కేటాయించాలి. మన రోజువారీ పనుల్లో కూడా కాస్త బద్దకాన్ని వదిలితే బరువు తగ్గించుకోవడం మన చేతుల్లో పనే. ఫస్ట్‌ఫ్లోర్‌కి వెళ్లడానిక్కూడా లిఫ్ట్ వాడేబదులు నాలుగు అంతస్థులున్నా మెట్లు ఎక్కండి. పక్కనున్న షాప్‌కి నడిచే వెళ్లండి. మీ బాబును స్కూల్లో దింపడానికి బండి తీయకండి.
సాధ్యమైనంతవరకూ కాళ్లకు పనిచెప్పండి. 'హాస్పిటల్‌లో ఏ ఫ్లోర్‌కి, ఎన్నిసార్లు వెళ్లాల్సి వచ్చినా లిఫ్ట్ అసలే వాడను. బరువు పెరగకుండా, ఆరోగ్యంగా ఉండటంలో నా రహస్యం అదే' అంటారు హైదరాబాద్‌లోని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ సోమరాజు. అండుకే మీరూ బద్దకాన్ని వదిలి కొవ్వును కరిగించే వ్యాయామంపై దృష్టిపెట్టమంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. ఎన్ని వెయిట్ లాస్ ట్రీట్‌మెంట్లు తీసుకున్నా ఆహారంలో జాగ్రత్తలు, వ్యాయామం లేకపోతే మాత్రం ఎక్కడి కొవ్వు అక్కడే ఉంటుంది. అందుకే ఒకరిని చూసి ఒకరు వెయిట్ లాస్ సెంటర్ల వైపు పరుగులెత్తకుండా మంచి తిండి తినండి, బాడీకి పని పెట్టండి, ఆరోగ్యంగా ఉండండని సూచిస్తున్నారు.

-కె.రచన
No comments:
Post a Comment