శారీరక శ్రమ
రోజూ ఎన్ని మెట్లు ఎక్కుతున్నారో పరిశీలించండి. ఎంత దూరం నడుస్తున్నారో గమనించండి. రోజు రోజుకి ఫిజికల్ యాక్టివిటీ పెరిగేలా ప్లాన్ చేసుకోండి. ఆఫీసులో లిఫ్ట్ ఉన్నా మెట్ల ద్వారానే ఎక్కండి. కొలీగ్స్‌తో పనిపడితే ఫోన్ చేయకుండా వాళ్ల దగ్గరకి వెళ్లి మాట్లాడండి. చిన్న చిన్న వ్యాయామాలే కదా అని పట్టించుకోకుండా వదిలేయకండి. ఇవే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడతాయి.
హెల్తీ లైఫ్‌స్టైల్
ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని అలవాటు చేసుకోండి. కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవడాన్ని ఒక ఛాలెజింగ్‌గా తీసుకోండి. వ్యాయామం చేసేటప్పుడు స్నేహితులతో కలిసి వెళ్లండి. కొత్త కొత్త వ్యాయామాలను చేయండి. స్నేహితులతో కలిసి కాసేపైనా మనసారా నవ్వుకోండి. ఒత్తిడి తగ్గితే గుండెకు చాలా మంచిదని గుర్తు పెట్టుకోండి.
కొవ్వు పదార్థాలు
ఏదైనా ఒక వస్తువు తినేముందు దానిపైన ఉండే లేబుల్‌ను చదవండి. షుగర్స్, ఇతర పదార్థాలు మీ బరువు పెరగటానికి దోహదపడతాయి. ఇది కొలెస్ట్రాల్ పెరగటానికి దారితీస్తుంది. సాచ్యురేటెడ్ ఫాట్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోకండి.
సిలియం
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే డైట్‌లో తగినంత ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అయితే అన్ని రకాల ఫైబర్స్ ఒకేలా పనిచేయవు. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి 'సిలియం ఫైబర్' బాగా ఉపకరిస్తుంది. సిలియం ఫైబర్ ఉండే పౌడర్(మెటామ్యూసిల్) ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తోంది. అయితే దీన్ని వాడేముందు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి.
డిహెచ్ఎ
ఇది పాలీఅన్‌సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. దీన్ని తీసుకోవడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్(ఎల్‌డీఎల్)ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్)పెరిగేలా చేస్తుంది. డీహెచ్ఎ ఎక్కువగా చేపలలో లభిస్తుంది. ఒకవేళ మీకు సీ ఫుడ్ తినడం ఇష్టం లేనట్లయితే ఫిష్ ఆయిల్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.
No comments:
Post a Comment