Pages

Monday, September 27, 2010

వాతావరణ కాలుష్యాలతో సతమతమైపోతున్న ఆధునిక కాలంలో కర్పూరం నిజంగా ఒక రక్షణ కవచమే.

కర్పూరంతో ఇన్ని లాభాలా?

కర్పూరం వెలిగించడం అంటే అదేదో పూజలో భాగం అనుకుంటామే గానీ, దాని వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలియదు. గాలిలో ఉండే కాలుష్యాలను తొలగించే గుణం కర్పూరానికి అపారంగా ఉంది. వాతావరణ కాలుష్యాలతో సతమతమైపోతున్న ఆధునిక కాలంలో కర్పూరం నిజంగా ఒక రక్షణ కవచమే.

వైరస్, హానికారక బ్యాక్టీరియాతో పాటు దోమలను పారదోలే గుణం కూడా కర్పూరానికి ఉంది. కర్పూరాన్ని నీటిలో కరిగించి ఆ ద్రవంతో ఛాతీ మీద మర్దన చేస్తే దగ్గు, ముక్కుదిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే ప్రముఖ కంపెనీలు కొన్ని గొంతు నొప్పి, దగ్గుకు సంబంధించిన ద్రావణాల తయారీలో కర్పూరాన్ని కలుపుతున్నాయి.

దీనికి చర్మ రంధ్రాల్లోంచి చాలా వేగంగా చొచ్చుకుపోయే గుణం ఉండడం వల్ల దురదలకు, కండరాల నొప్పికి, కీళ్ల నొప్పులకు కూడా ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. గాలిని శుభ్రం చేసే గుణం ఉండడం వల్ల శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల గుండె సమస్యలకు నివారిణిగా కూడా ఉపకరిస్తుంది. గాలి తాకిడికే కరిగిపోయే గుణం ఉండడం వల్ల కర్పూరాన్ని కాల్చకుండానే దోమల్ని నివారించవచ్చు. ఇంట్లో ఏదో ఒక చోట అలా కాసేపు ఉంచితే చాలు అది పూర్తిగా కరిగిపోతుంది.

ఉదయం, సాయంత్రం గదిలో ఇరువైపులా రెండు బిళ్లలు ఉంచేస్తే చాలు. ముఖ్యంగా దోమలు ఎక్కువగా మకాం వేసే మూలల్లో కర్పూరం బిళ్లలు పెడితే అవి పారిపోతాయి. అవసరమనుకుంటే ఓ కప్పు నీళ్లల్లో కర్పూరం బిళ్లలు వే సి పడక గదిలో పెట్టేస్తే ఆ వాసనకు నిద్రాభంగం కలిగించే సూక్ష్మజీవులన్నీ మన ఛాయల్లో లేకుండా పోతాయి. ఇవన్నీ నిజాలే మరి. అనుమానం ఎందుకు ? ఒక సారి ప్రయత్నించి చూడండి మీకే తెలుస్తుంది.

Friday, September 24, 2010

చర్మ సౌందర్యానికి రక్షణ కవచాలు

చర్మం మన దేహానికి బాహ్య రక్షణ కవచం. అంతేకాదు మనల్ని అందంగా చూపించేదీ ఇదే. ఇది చాలా సున్నితమైంది కూడా. అందుకే బాహ్యంగా జరిగే ఎన్నో రకాల మార్పులకు, ప్రభావాలకు ఇది లోనవుతూ ఉంటుంది. కనుక ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు, నివారణ చర్యలతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది.
- అందరి ఇళ్లలోనూ వ్యాజిలైన్ తప్పకుండా ఉంటుంది. దీనితో ఎన్నో రకాల చర్మ సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. పాదాల పగుళ్లతో బాధపడేవారు వ్యాజిలైన్‌ను ప్రతిరోజూ రాత్రి రాసుకున్నట్లయితే పగుళ్లు పోయి పాదాలు అందంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి.

- పాదాలే కాదు చర్మంలో ఎక్కడ పగుళ్లు ఏర్పడినా వ్యాజిలైన్ మంచి నివారిణిగా ఉపకరిస్తుంది. అలాగే చర్మం పొడిబారినట్లుగా ఉంటే దీన్ని రాసుకోవడం మంచిది. ముఖ్యంగా చలికాలంలో ఇది ఎంతో అవసరం.

- చిన్న చిన్న గాయాలు, కాలిన గాయాలపై దీన్ని రాయవచ్చు. సూర్యకిరణాల ప్రభావం నుంచి కూడా ఇది రక్షిస్తుంది.
- ముఖారవిందంలో పెదాల పాత్ర చాలా కీలకం. వాతావరణ ప్రభావంతో సున్నితమైన పెదవులు అంద విహీనంగా మారడం, పగుళ్లివ్వడం జరుగుతుంది. అటువంటి సందర్బాల్లో వ్యాజిలైన్‌ను పెదవులపై రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

- గ్రీన్‌టీ ఆరోగ్యానికి ఎంతో మంచిదని మీకు తెలిసే ఉంటుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో గ్రీన్‌టీ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అలాగే వాడేసిన టీ బ్యాగులను కొన్ని నిమిషాల పాటు డీప్‌ఫ్రీజర్‌లో ఉంచి తర్వాత కళ్లపై ఉంచుకోవడం వల్ల క ళ్లు ఎంతో తాజాదనాన్ని సంతరించుకుంటాయి.

- ఇంట్లో ఉపయోగించే బేకింగ్‌సోడా పొడిని ఒక టేబుల్ స్పూన్ తీసుకుని దాన్ని ఫేసియల్ క్లీన్సర్‌తో కలిపి ముఖంపై రెండు నిమిషాలపాటు మర్దన చేసుకోవాలి. బాడీస్క్రబ్‌ని తయారు చేసుకోవడానికి ఒక టేబుల్ స్పూన్ పంచదార, బేకింగ్ సోడా, కోషర్ సాల్ట్, వేడినీళ్లు, తేనె, ఆలివ్ ఆయిల్‌ను తీసుకోవాలి. వీటన్నింటినీ మంచిగా కలుపుకుంటే పేస్ట్‌లా అవుతుంది. దీంతో స్నానం చేయవచ్చు.

ముఖ్యంగా పొడారినట్లుగా ఉండే మోకాళ్లు, మోచేతులు, మడమలు తదితర ప్రాంతాల్లో ఈ పేస్ట్‌తో రుద్దుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే షేవింగ్ చేసుకున్న తర్వాత ఈమిశ్రమాన్ని వాడకుండా ఉండడం మంచింది.

- దంత సమస్యల్లో కూడా బేకింగ్ సోడాని ఉపయోగించవచ్చు. కొంచెం పొడిని నీటిలో కలుపుకుని ఆ నీటితో నోటిని పుక్కిలించడం వల్ల దంతాలు తెల్లగా మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటాయి.

- చర్మానికి, శిరోజాలకు గుడ్డు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మూడు గుడ్లను తీసుకుని వాటిల్లోని తెల్లసొనని వేరుచేసి ఒక కప్పులో తీసుకోవాలి. దాన్ని పాత మేకప్ బ్రష్‌తో ముఖానికి రాసుకోవాలి. అలా కొన్ని నిమిషాల పాటు ఆరే వరకూ ఉంచి తర్వాత కడిగేయాలి.

- కోడిగుడ్డు సొనకు ఆలివ్ ఆయిల్‌ను కలిపి శిరోజాలకు రాసుకోండి. కొన్ని నిమిషాల తర్వాత షవర్ కింద పదిహేను నిమిషాలపాటు అలానే ఉండండి. అంతే తడారిన తర్వాత చూసుకుంటే మీ శిరోజాలు తళ తళ మెరిసిపోతూ అందంగా కనిపిస్తాయి.

-  జింక్ ఆక్సైడ్ కూడా చర్మ సౌందర్యం పరిరక్షణలో ప్రధాన పాత్రనే పోషిస్తుంది. జింక్ ఆక్సైడ్ సూర్యకిరణాల ప్రభావానికి లోనుకాకుండా చర్మ సౌందర్యాన్ని పరిరక్షిస్తుంది. సూర్యకిరణాల ప్రభావానికి ఎక్కువగా గురయ్యే ప్రదేశాల్లో దీన్ని రాసుకోవడం ప్రయోజనకరం.

- వెనిగర్, నిమ్మరసం, తేనె, ఆలివ్ ఆయిల్, ఓట్‌మీల్ కూడా చర్మ సౌందర్యాన్ని కాపాడేవే.

Thursday, September 23, 2010

ఆరోగ్యంగా ఉండేందుకు ఉల్లాసంగా...... ఉత్సహంగా ......

ఉల్లాసంగా..ఉత్సహంగా
అందం అంటే శ్రద్ద చూపించని ఆడవారుండరు. కొంచెం ఒళ్లు వచ్చినట్లు కనిపిస్తే ఏకంగా భోజనం చేయడం కూడా మానేస్తారు. రకరకాల క్రీములు వాడుతూ తమ అందాన్ని మరింత పెంచుకు నేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. కేవలం సౌందర్యసాధనాల మూలంగా మహిళల అందం పెరగదని, మంచి అహారం తీసుకోవడంతో పాటు ఎప్పుడూ ఆనందంగా ఉంటే అందం దానంతటే అదే పెరుగుతుంది.

faceఆరోగ్యంగా ఉండేందుకు అత్యుత్తమమైన పోషక విలువలు ఉన్న ఆహారం తప్పకుండా తీసుకోవాలి. వీలైనంత మేరకు నూనెతో కూడిన ఆహార పదా ర్థాలకు దూరంగా ఉండడమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఆహారం లో రైస్‌ ఐటమ్స్‌ కూడా తగ్గించాలట. ఎక్కువగా పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం చేస్తూ కార్బో హైడ్రేట్‌లు తక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే ఆరోగ్యానికి, అందానికి కూడా మంచిదని వారి అభిప్రాయం. శాఖాహారులు ఎక్కువగా పీచు పదార్థాలుండే ఆహారం తీసుకుంటే, మాంసాహారులు మాత్రం కోడిగుడ్డులోని తెల్లసొన, కోడికూర, చేపలు తప్పకుండా తీసుకోవాలి. పొట్టేలు, మేకపోతు మాంసానికి కాస్త దూరం వుండటం మంచిదంటున్నారు.

ఆనందం తోడుంటే...
అయితే కేవలం ఆహారం తీసుకున్నంత మాత్రన్నే అందంగా ఉంటామనుకుం టే పొర పాటు. ఆహారపు అల వాట్లు మనిషిని ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడి తే సంతోషం అందాన్ని ఇనుమడింపజేస్తుందట. అందుకే ఎప్పుడూ ప్రశాంతవ దనంతో ఉండడానికి ప్రయత్నించాలి. మన చుట్టూ ఉన్న వాతావరణం ఎల్లప్పు డూ ఆహ్లాదకరంగా ఉంటే మన మనసు సంతోషంగా ఉంటుంది. కనుక పనిచే సే చోట, ఇంట్లో ప్రశాంత వాతవరణం ఉండేలా జాగ్రత్తతీసుకోవాలి. చిన్నచి న్న సమస్యల గురించి పెద్దగా ఆలోచించకుండా వాటిని త్వరితగతిన పరిష్కరిం చుకునేందుకు ప్రయత్నించాలట. దీని వలన మానసిక ఒత్తిడి తగ్గిపోతుందట.ఎప్పుడైతే మానసిక ఒత్తిడి శరీరంలో ఉండ దో అప్పుడు మీ అందం ద్విగుణీ కృతమౌతుంది.

శారీరక ఒత్తిడిని తగ్గించుకోవాలి...
శారీరక ఒత్తిడి మూలంగానే మానసిక పరమైన సమస్యలు తలెత్తు తాయని, అందుకే శరీరానికి ఎప్పుడూ విశ్రాంతిని ఇవ్వడానికి ప్రయత్నించమంటున్నా రు. వారానికి ఒకసారి మసాజ్‌ చేయించు కోవడం, అలసిపోయిన సమయం లో నిద్రకు ముందు మంచి సంగీతాన్ని వినడం, వీలును బట్టి సాయంత్రం పూ ట వివిధ సందర్శనీయ ప్రాంతాలకు వెళ్లి సేద తీరడం చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందట. ఇలా చేయడం వల్ల మహిళలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని,  అప్పుడు మరింత అందంగా కనిపిస్తారని నిపుణులు అంటున్నారు.



ఫ్రెంచ్ ఫ్రైస్.. ఇక ఎన్నైనా తినొచ్చు!

మీకు బంగాళదుంపతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తెలుసు కదా? ప్రపంచంలో చాలామందికి ఇవంటే ప్రాణం. కానీ తినాలంటేనే భయం. ఎందుకో తెలుసా? బంగాళదుంపల్లో అధిక శాతం పిండి పదార్థం ఉండడమే దానికి కారణం. తింటే ఎక్కడ లావెక్కుతామో అని చాలామంది వీటిని దూరం పెడుతుంటారు. కానీ ఇకమీదట ఆ బాధ లేదు.

ఎంచక్కా మీరు తినగలిగినన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగించేయొచ్చు. ఎందుకంటే సిమ్లాలోని సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు ఇటీవల జన్యుమార్పిడి పద్ధతి ద్వారా ప్రొటీన్లు అధిక శాతం ఉండే బంగాళదుంపను సృష్టించారు. వ్యవసాయ శాస్త్రవేత్త శుభ్ర చక్రవర్తి ఆధ్వర్యంలో ఆయన సహచర బృందం ఈ బంగాళదుంపను సృష్టించారు. దక్షిణ అమెరికాలో విరివిగా దొరికే అమరంత్(తోటకూర) మొక్క నుంచి తీసిన జన్యువును దేశీయ బంగాళదుంప వంగడంలో ప్రవేశపెట్టడం ద్వారా 60 శాతం ప్రొటీన్లు కలిగిన కొత్త రకం బంగాళదుంప రూపుదిద్దుకుంది.

అంతేకాదు న్యూఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే మన దేశంలోని మూడు ప్రాంతాల్లో రెండేళ్లుగా ఈ రకం బంగాళదుంపలను పండించి చూశారు. "ప్రొటీన్లు అధికంగా కలిగిన ఈ బంగాళదుంపను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

ఈ రకం బంగాళదుంపలను వాణిజ్య పంటగా పండించేందుకు అవసరమైన అనుమతుల కోసం మేం జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీకి దరఖాస్తు చేశాం. తొలిదశ అనుమతి కూడా లభించింది. త్వరలోనే రెండో దశ అనుమతి కూడా లభించే అవకాశం ఉంది..'' అని చక్రవర్తి చెప్పారు.

Wednesday, September 22, 2010

'మహానారాయణ తైలం' * ఈ తైలంతో నొప్పులకు కళ్లెం

శరీరంలోని కండరాలు బలహీనపడితే కీలక భాగాల పనితీరు కూడా కుంటుపడుతుంది. ఆ స్థితి రాకుండా నివారించే శక్తి తైల మర్ధనకు ఉంది. ఈ ప్రక్రియలో ఆయుర్వేద మూలికలతో తయారు చేసే తైలాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ ప్రత్యేకతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని రకాల ఆయుర్వేద తైలాల గురించి  తెలుసుకుందాం. అందులో భాగంగా 'మహానారాయణ తైలం' గురించి తెలుసుకుందాం.
ఈ తైలం తయారీలో 'శతావరి' అనే మూలికను ప్రధానంగా వాడతారు. శతావరికి నారాయణి అనే పర్యాయపదం ఉండడం వల్ల ఈ తైలాన్ని నారాయణ తైలమని, మహానారాయణ తైలమని పిలుస్తారు. చర్మంపైన అభ్యంగ (మసాజ్) రూపంలోగానీ, కడుపులోకి తీసుకోవడానికి గానీ ఈ తైలాన్ని వాడతారు. అయితే తాగడంలో ఇబ్బంది ఏమైనా ఉంటే వస్తి (ఎనిమా) రూపంలోనూ శరీరానికి అందించవచ్చు. చెవి, ముక్కు వ్యాధుల్లో, ఆ భాగాల్లో వేసే చుక్కల మందుగా కూడా ఈ తైలం వాడుకలో ఉంది.

తైలంలో...
ఇందులోని అంశాలు మూడు రూపాల్లో ఉంటాయి .
కల్కాంశం :
దోష్టు, ఏలకులు, మంచిగంధం, బలా మూలాలు, జటామాంసీ, ఛఠీలా, సైందవ లవణం, అశ్వగంధ, వచా, రాస్నా, సోంపు, దేవదారు, సుగంధిపాల, పాఠా, మాషపర్ణీ, ముద్గపర్ణీ, తగర వీటన్నిటినీ పొడిచేసి, నీటితో కలిపి ముద్దగా (కల్కం) చేసి పెట్టుకోవాలి.

తైలాంశం:
తయారు చేసుకున్న ముద్ద తూకానికి నాలుగు రెట్లు నువ్వుల నూనె తీసుకోవాలి.
ద్రవాంశం:
అశ్వగంధ, బలామూలాలు, బిల్వమూలాలు, బృహతీద్వయం, పల్లేరు, సంబరేణు, పాఠామూలాలు, పునర్నవా, ముద్గ, రాస్నా, ఏరండమూలం, దేవదారు, ప్రసారణీ, అరణీ ఈ మూలికలకు నీళ్లు చేర్చి సిద్ధం చేసిన కషాయద్రవం ఒక భాగం, శతావరీ రసం ఒక భాగం, పాలు ఒక భాగం. ఇవన్నీ కలిపి తైలాంశానికి మళ్లీ నాలుగు రెట్లు తీసుకోవాలి. వీటన్నిటినీ ఒక పెద్ద పాత్రలో కలిపేసుకుని, ద్రవాంశం పోయి, తైలాంశం మాత్రమే మిగిలేలా పొయ్యి మీద ఉడికించాలి.

తైలగుణాలు:
తైలం తయారీలో ఉపయోగించిన ఈ మూలికలన్నీ శరీరంలో విషమించే వాతదోషాల్ని ఉపశమింపచేసేవి, శక్తిని ప్రసాదించేవి. మూలికల గుణాలను శరీరానికి అందించడంలో తైలం ఒక వాహకంలా పనిచేస్తుంది. ఈ తైలంతో చర్మం మీద మర్దన చేసినప్పుడు చేష్టానాడులు, రక్త వహి సిరా ధ మనులు, స్నాయు, పేశీకండరాలు ప్రేరణ పొంది మరింత శక్తివంతమవుతాయి.

బలహీనపడిన అవయవాలు బలపడి తమ విధులను శక్తివంతంగా నిర్వహిస్తాయి. మర్ధనలోని హస్తలాఘవం (మానిప్యుటేషన్ స్కిల్స్) ప్రభావంతోనే ఈ శరీర క్రియలు సాధ్యమవుతాయి. ఫిజియోథెరపీలో వివిధ తైలాలతో చేసే 'మసాజ్' ప్రాచుర్యానికి రావడానికి ఈ విధానమే కారణం.

ఈ మసాజ్‌కు నారాయణ తైలం కూడా తోడైతే ఫలితాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అవయవాల శక్తిసామర్థ్యాన్ని పెంచడంతో పాటు నొప్పులను త గ్గించడంలో నారాయణ తైలానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం పైపూతగానే ఈ తైలం ఎక్కువగా వాడుకలో ఉంది.

అయితే ఈ తైలాన్ని కడుపులోకి తీసుకున్నప్పుడు ఇది నొప్పిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే చెవిలో చుక్కలుగా వేయడం వల్ల చెవినొప్పి, ముక్కులో వేయడం వల్ల తలనొప్పి, తలకు సంబంధించిన మరికొన్ని ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. రోగి పక్షవాతం వంటి సమస్యలతో కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు మర్ధన గానీ, కడుపులోకి ఇవ్వడం గానీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి స్థితిలో నారాయణ తైలాన్ని ఎనీమాగా పేగుల్లోకి ఎక్కించ వచ్చు.ఇలా చేయడం వల్ల పేగుల్లోని పొర (మ్యూకోజా) ద్వారా ఔషధ గుణాలు శరీరానికంతా వెళ్లే అవకాశం ఉంది.

ఏ వ్యాధులకు..?
వాత వ్యాధులకు, కీళ్లు, కండరాల నొప్పులను తగ్గించడంలో నారాయణ తైలానికి ప్ర«థమ స్థానం ఉంది. వీటితో పాటు పక్షవాతం, అర్థత వాతం (ఫేషియల్ పెరాలిసిస్), దవడ-మెడ పట్లు, భుజాలు పడిపోవడం (బ్రేకియల్ పాల్సీ) కటిశూల (డిస్క్, బ్యాక్‌పెయిన్) పార్శ్వశూల, కుంటడం, నడుము వంగిపోవడం, గృధసీ వాతం (సయాటికా) వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఈ తైలం బాగా పనిచేస్తుంది.

వీటితో పాటు అవయవాలు ఎండిపోవడం, చెవినొప్పి, వినికిడి లోపం, వృషణాల నొప్పి, తలనొప్పి, కండరాలు పట్టేయడం వంటివి ఈ తైలంతో తగ్గుముఖం పడతాయి. సర్వైకల్, లుంబార్ స్పాండిలోసిస్ ఉన్నవారు మర్ధనంతో పాటు కడుపులోకి కూడా తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వస్తి (ఎనిమా) కూడా చేయించుకుంటే లామినెక్టమీ శస్త్ర చికిత్స అవసరమే లేకుండా పోతుంది.

పైన పేర్కొన్న అన్ని వ్యాధుల్లోనూ నారాయణ తైలంతో మర్ధన చేసి ఆ తరువాత వేడినీళ్లతో స్నానం చేయడం గానీ, నొప్పిగా ఉన్న చోట వేడినీళ్లతో కాపడం పెట్టడం చేయవచ్చు. ఇలా చేయడం వల్ల ఫలితం రెట్టింపుగా ఉంటుంది. నారాయణ తైలంతో పాటు ఆయుర్వేద పైద్యుడి పర్యవేక్షణలో చంద్రప్రభావటి, యోగరాజ గుగ్గులు వంటి సాధారణ ఔషధాలు కూడా తీసుకుంటే అద్భుత ఫలితాలు మీ సొంతమవుతాయి.

డాక్టర్ చిలువేరు రవీందర్ ఎండి (ఆయుర్వేద)
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్, ఫోన్: 9848750720.

Saturday, September 18, 2010

ఆయురారోగ్యాల చిరునామా ప్రకృతి వైద్యం

మహాత్మాగాంధీ ‘ గ్రామస్వరాజ్‌’ ‘స్వాతంత్రోద్యమం’,‘అస్ప్రశ్యత’, ‘ఖాదీ’ వంటి ఎన్నో అంశాలను ప్రపంచం దృష్టికి తెచ్చినవారు. అట్లాగే ‘ప్రకృతి చికిత్స’కు వారే‘ అంబాసిడర్‌’గా ఉండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. స్వయంగా మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రకృతి చికిత్స అందజేసి సమకాలికులకు ఆదర్శ నాయకులయ్యారు.


housesద్రోణంరాజు వెంకటచలపతి శర్మ జర్మనీ భాషలో ఉన్న ప్రకృతి చికిత్సా విధానానికి సంబంధించిన పుస్తకాలను తెనిగించి ఆ చికిత్సను 1890లోనే మనకు పరిచయం చేశారు. ఆ తర్వాత 1933లో గుంటూరు జిల్లాలో ప్రకృతి ఆశ్రమాన్ని డా. వేగిరాజు కృష్ణంరాజు స్థాపించారు. అది 1944 నుంచి భీమవరంలో శ్రీ రామకృష్ణ ప్రకృతి ఆశ్రమం పేరిట స్థిరపడి శాఖోపశా ఖలుగా విస్తరించింది. ఇప్పుడు వేగిరాజు కుటుంబీకులైన డా.రవివర్మ, డా. కమలాదేవి, డా.గోపాలరాజు మొదలైనవారు సేవలందిస్తున్నారు.ప్రకృతి నుంచి దూరం జరిగే కొద్ది మనిషిలో వికృతి పెరుగుతుంది. ఈ వికృతి శరీరంలోనూ, మనసులోనూ చోటు చేసుకోవడంతో అనారోగ్యం మొదలవుతుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆరోగ్యం అంటే ఏంటో నిర్వచించింది.కేవలం రోగం లేకపోవడం లేదా వైల్యం లేకపోవడమే ఆరోగ్యం అనిపించుకోదు. భౌతికంగా, సామాజికంగా కూడా సంపూ ర్ణంగా స్వస్థత కలిగి ఉండడమే ఆరోగ్యం.

Nasyaఈ నిర్వచనాన్ని ఆధారంగా చేసుకుని ప్రకృతి వైద్యవిధాన శాస్త్ర అంశాలను మేళవించి చాలా వరకు సంఘసేవా దృష్టితో ప్రజలకు సేవలందిస్తున్న అసలైన ఆరోగ్య కేంద్రాలు ప్రకృతి చికిత్సాలయాలు. గత కొని సంవత్సరాలుగా యోగా కూడా ఈ వైద్యవిధానంలో ఒక భాగమైంది.ముందులు వేయకుండా జబ్బులను నయం చేయడం వల్ల మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశం ప్రజలకు చాలా తక్కువ ఖర్చుతో వైద్యాన్ని ప్రకృతి చికిత్స అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఇది ఒక జీవిత విధా నంగా మారింది. ఇది ఒక దేశానికో, జాతికో మతానికో పరిమితమైంది కాదు అంతర్జాతీయ చికిత్సా విధానంగా గుర్తింపు పొందింది. ఈ వైద్య చికిత్స క్రింది మూడు అంశాలు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతుంది.

1.శరీరంలో పేరుకు పోయిన మలినాలు
2.శరీరంలోని రక్తం మలినం కావడం
3.శరీరంలోని ప్రాణశక్తి తగ్గిపోవడం

walkపై మూడు అంశాలను దూరం చేసే సహజ చికిత్సలను ప్రకృతి వైద్యం అందిస్తుంది. అలోపతి వైద్యవిధానం సూక్ష్మజీవుల మూలంగా జబ్బులు కలుగుతాయని చెప్తుంది. కాని శరీరంలో మలినాలు పేరుకుపోవడం మూలంగానే సూక్ష్మజీవులు ఏర్పడతాయని ప్రకృతి వైద్యం చెప్తుంది. వీటిని తొలగించే క్రమంలోనూ ప్రాణశక్తిని పెంచే మార్గంలోనూ ప్రకృ తిలోని పంచభూతాలను నీరు, మట్టి, సూర్యరశ్మి, వాయువు, ఆకాశం ...వినియోగంలోకి తెస్తుంది.

జలచికిత్స: ఎనిమా, తొట్టిస్నానం, ఆవిరిస్నానం, మొదలైన విధానాల ద్వారా కడుపులోని,ఇతరత్రా వున్న మలినాలను తొలగించే చికిత్స ఇది.

మట్టి చికిత్స: రోగికి కడుపుమీద శుభ్రమైన తడి మట్టి ఉన్న గుడ్డను పెట్టడం వల్ల కడుపులోని అవయవాల పనితనం పెరుగుతుంది. శరీర మంతా తలనుంచి అరికాళ్లదాకా శుభ్రమైన మట్టిని బురదగా మార్చి పూయడం మూలంగా శరీరంలోని వేడిని తీసివేయగలుగుతుంది.

రంగుచికిత్స/ భిన్న వర్ణ చికిత్స:
scan పటకంలో నుంచి సూర్యుని కిరణాలు ఏడు రంగులుగా విడుదల అవుతాయి. వీటిలో ఒక్కో రంగుకు ఒక్కో శక్తి ఉంటుంది.ఎరుపు రంగు శక్తినిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది. నీలంరంగు నాడీ మండలాన్ని ప్రేరేపిస్తుంది.బిపిని తగ్గిస్తుంది. ఆకుపచ్చరంగు పిట్యూటరీ గ్రంథిని క్రమబద్ధం చేస్తుంది. మానసికమైన డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. తెలుపురంగు రుతువులు మారి నపుడు వచ్చే జబ్బుల మీద పనిచేస్తుంది. మంచి నిద్రకు దోహదపడుతుంది. పసుపు రంగు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. ఆల్ట్రా వయోలెట్‌ కిరణాలు విట మిన్‌ డిని అందజేస్తాయి.కొలెస్ట్రాల్‌ తగ్గిస్తుంది. బిపిని తగ్గిస్తుంది. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి. రక్దప్రసరణను క్రమబద్ధం చేస్తాయి.

మర్ధన చికిత్స: శిరస్సునుంచి అరికాలు దాకా తైలమర్థనం చేయడం ద్వారా శరీరంలోని నొప్పులు తగ్గుతాయి. పట్టుకున్న నరాలు కీళ్లు వదులవుతాయి. కండరాలకు బలం చేకూరుతుంది. అంతేకాదు రక్త ప్రసరణ క్రమబద్దమై మలినాలు విడుదలకు దోహదం చేస్తుంది. సాధారణంగా మర్థన చికిత్సతో పాటు ఆవిరిస్నానం చేయిస్తారు. దీంతో శరీరం లోని మలినాలు చెమట ద్వారా బయటకు వస్తాయి. దీన్ని స్వేదన చికిత్స అంటారు.

వమనక్రియ:
bead వమన క్రియను వారానికి ఒకసారి చేయిస్తుంటారు. ఐదారు గ్లాసుల ఉప్పు నీటిని తాగించి వమనం చేయించడం ద్వారా కడుపులోనూ ఇతరాత్రా వున్న మలినాలు కఫం, బయటకు వచ్చేస్తాయి. పైత్యం తగ్గుతుంది. దీంతో పాటుగా జలనేతి ప్రక్రియను చేప డతారు. నీటిని ఒక రంధ్రం నుంచి పంపి మరోరంధ్రం ద్వారా బయటకు వచ్చేట్టు చేస్తారు. దీనివల్ల ముక్కుకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి.

ఉపవాసం: సహజంగా ప్రతి మనిషిలో ప్రాణశక్తి వుంటుంది. మాలిన్యాలు, ఇతర కారాణాలు దాన్ని సూర్యున్ని మేఘం లాగా కప్పెస్తాయి. అందువల్ల ప్రకృతివైద్య విధానంలో ఉపవాసం ద్వారా ఆ అడ్డంకులను పక్కన నెట్టి ప్రాణశక్తిని మేల్కోలుపు తారు.

ఆహారచికిత్స: ప్రకృతి వైద్యంలో మనం తీసుకునే ఆహారానికి ఉన్నతస్థానం ఉంది. ఆహారం అన్నది రోగం రాకుండా నివారించేందుకు ఉన్న రోగాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

పంచకర్మ చికిత్స: మానసిక వత్తిడిని కంప్యూటర్‌ సంబంధించిన ఉద్యోగులకు ఏర్పడే సమస్యల నివారణకు శిరోధార చికిత్సను అందజేస్తారు.

ఫిజియోథెరపి: కీళ్లనొప్పులు, ఇతరాత్రా జబ్బులకు ఫిజియోథెరపి విధానాలను కూడా ప్రకృతి వైద్యం ఆమోదిస్తుంది. పై చికిత్సలకు చౌకధరలకు అందజేసే ప్రకృతి చికిత్సాలయం హైదరాబాదులోని రాజేంద్రనగర్‌ పరి సరాలలో నెహ్రూ జూ పార్కుకు 3 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు హైవేకు వందగజాల దూరంలో ఉంది. ఇది కస్తుర్బా ప్రకృతి చికిత్స యోగ సంస్థ 1964 నుంచి సేవలందిస్తోంది. గాంధేయ విశ్వాసాలలో పనిచేసే సర్వోదయ ట్రస్ట్‌ పది ఎకరాల ప్రశాంత వాతావరణంలో దీన్ని ఏర్పరిచింది. ఇది 60 పడకలున్న వైద్యాలయం. బయటి రోగులకు కూడా చికిత్స అందజేస్తారు. ఇంట్లో ఉంటూనే ప్రకృతి వైద్య చికిత్సా పద్ధతులను అనుసరించి జీవించడానికి వీలుగా మార్గదర్శకత్వం వహి స్తారు. జనరల్‌ వార్డులతో పాటు ఎ/సి రూములు కూడా అందు బాటులో ఉన్నాయి. ఈ సంస్థ అధికబరువు,బి,పి, షుగరు, కీళ్లనొప్పులు, మెడ, నడుమునొప్పులు, ఎసిడిటి, మల బద్ధకం, సైనసైటిస్‌, ఆస్తమా, పక్షవాతం, చర్మవ్యాధులు, మానసిక వ్యాధులు మొదలగు వాటికి చికిత్సలు అందిస్తుంది.

chari
- డా. జె.వి.ఎన్‌. చారి
ఎన్‌డి(ఉస్మానియా), సిఎచ్‌ఓ

ఔషధం కానిదేదీ ఈ జగత్తులో లేదు

ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధినిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. ఈ నేపథ్యంలో అందరికీ పరిచయం ఉండి, సులభంగా అందుబాటులో ఉండే మొక్కలు, వాటిలో ఆరోగ్య విలువలను తెలియచేయడం ద్వారా సాధారణ ఆరోగ్య సమస్యలకు సులభమైన నివారణోపాయాలు తెలియచేస్తున్నాం. ఆహార ధాన్యాలన్నింటికీ కొన్ని ఉపయోగాలు ఉంటాయి.

ఆహార ధాన్యాలు - ఔషధీ విలువలు
good-rice 
వరి, బియ్యం - బలాన్ని కలిగిస్తాయి.. జ్వరం తగ్గాక శక్తిని కలిగిస్తాయి. వాంతులు నోటిపూత, కుసుమ వ్యాధులను నివారిస్తాయి.
గోధుమలు - పుష్టినిస్తాయి.జ్వరంలో వాడతగినవి.మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.
రాగులు - పుష్టినిస్తాయి. చిన్న పిల్లలకు, వృద్ధులకు మంచిది. వెంట్రుకలు బాగా పెరుగుతాయి
bitterGourd 
జొన్నలు- మధుమేహం కలవారికి మంచి ఆహారం.ఎండాకాలంలో తక్షణ శక్తి ఇస్తుంది.
కందులు - పుష్టినిస్తాయి, రక్తాన్ని శుభ్రపరుస్తాయి
పెసర్లు - పప్పు ధాన్యాలు అన్నింటికన్నా ఎక్కువ మేలు చేస్తుంది
మినుములు - వీర్యవృద్ధిని, మూత్రపిండాలకు బలము కలుగచేస్తుంది
black-grams 

శనగలు - స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది. కడుపులో క్రిములను చంపుతుంది. నూనెతో వేయించి తనడం మంచిది కాదు. సౌల్యం ఉన్నవారు తినరాదు.
ఉలువలు - మూత్రంలో రాళ్ళు, క్షయ, అతి మూత్రం, రుతుబద్ధతను తగ్గిస్తాయి.
వేరుశనగలు - చిన్న పిల్లలకు పుష్టికరం. మొలకలు తీసి వాడాలి. శరీర పుష్టిని కలిగిస్తుంది.
బఠాణీలు - శరీర పుష్టిని కలిగిస్తాయి
brinjelsమసూరపప్పు - విరోచనాలు, అతి మూత్ర వ్యాధిని తగ్గిస్తుంది
నువ్వులు - వీర్యవృద్ధిని, చర్మ ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. పండ్లను గట్టి పరుస్తుంది, ఋతు బద్ధాన్ని విప్పుతుంది
అలసందలు- స్తన్యవృద్ధిని, వీర్యవృద్ధిని కలిగిస్తుంది.
కాయగూరలు - ఔషధీ విలువలు
తోటకూర/ పెరుగు తోట కూర - స్ర్తీలలో ఎర్రబట్ట, ఆర్శమొలలు,వాతవ్యాధులు నివారించబడతాయి
carrot

పుదీనా - అజీర్ణాన్ని తొలగించి ఆకలిని కలిగించును
కొత్తిమీర - ఆకలిని కలిగించును, నోటిపూత, పంటినొప్పి, మానసిక వత్తిడిని నిర్మూలిస్తుంది
కరివేపాకు - జిగట విరేచనాలు, రక్తవిరేచనాలు తగ్గిస్తుంది
పొన్నగంటికూర - నేత్ర వ్యాధులు కలవారికి, కడుపులో క్రిములు కలవారికి మేలు చేస్తుంది
అవిశ ఆకు - రేచీకటి, మలబద్ధకాన్ని తొలగిస్తుంది
Curry_Leaves
మునగాకు, కాయ - చెవి వ్యాధులు, ఆర్శ మొలలు తగ్గిస్తుంది. స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది.
ముల్లంగి - దుంపలలో ఉత్తమమైనది, మూత్రములో రాళ్ళు పుట్టకుండా చేస్తుంది
గాజర - రక్తాన్ని వృద్ధి చేస్తుంది. మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది
కంద - ఆర్శ మొలలు, కడుపులో క్రిములు కలవారికి మంచిది
అరటికాయలు - శిశువులలో అజీర్ణం, జిగట విరేచనాలు తగ్గిస్తుంది. ఆయువును పెంచుతుంది. green-chellisకడుపులో పుండ్లను మాన్పుతుంది.
బూడిద గుమ్మడి - శరీరంలో వేడిని తగ్గిస్తుంది. బలాన్నిస్తుంది. మూత్రంలో రాళ్ళు, జిగట విరేచనాలు తగ్గిస్తుంది.
అల్లం - ఆకలి కలిగిస్తుంది. అజీర్ణం, జలుబు తగ్గిస్తుంది
ఉల్లి (నీరుల్లి) - ఆకలి కలిగిస్తుంది. వడదెబ్బ తొలిగిస్తుంది.
potao
కాకరకాయలు - మధుమేహం, కడుపులో క్రిములు తగ్గిస్తుంది
కామంచికూర - కడుపులో క్రిములు, హృదయరోగాలు గలవారు వాడదగినది
బీరకాయలు - వేడిని తగ్గిస్తుంది. అన్ని రకాల వ్యాధులకు పథ్యం
కొబ్బరికాయ - పుష్టినిస్తుంది, వడదెబ్బను అలసటను పోగొడుతుంది.
చింతపండు- వాతవ్యాధులు, మూత్రంలో రాళ్ళు రాకుండా చేస్తుంది. సంవత్సరం పాతది మంచిది.
Pudina
చింతచిగురు - ఆర్శ మొలలు కలవారికి మంచిది
మెంతికూర- వేడిని, ఆర్శమొలలను, మధుమేహం, జిగట విరేచనాలను తగ్గిస్తుంది.
పాలకూర - పొట్టలో జబ్బులు కలవారికి మంచిది
చుక్కకూర - ఆకలిని కలిగిస్తుంది. కీళ్ళ నొప్పులు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
బచ్చలి - ఆకలిని పెంచుతుంది. జ్వరం కలవారు తినరాదు
గోంగూర - మలబద్ధకాన్ని, రేచీకటిని తొలగిస్తుంది
red-grantes
వంకాయలు- ఆకలిని, రక్తాన్ని వృద్ధి చేస్తాయి. లేతవి మేలు
చిలగడ దుంపలు- వేడిని తగ్గిస్తాయి. రక్త వృద్ధి చేస్తాయి
సొరకాయ - రుచిని కలిగిస్తుంది. మూత్రమును జారీ చేస్తుంది.
పచ్చి మిరపకాయలు - ఎక్కువగా తింటే వీర్య నష్టం కలుగుతుంది
పొట్లకాయ - అందరు రోగులకు మంచిది. వీర్యపుష్టిని కలిగిస్తుంది
wheats

బుడ్డ కాకర కాయ - ఆకలిని కలిగిస్తుంది. చర్మవ్యాధులు, కడుపులో పుండ్లు తగ్గిస్తుంది
చామకూర- ఆర్శ మొలలు, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
చామదుంపలు - మూత్రపిండాలకు బలాన్ని చేకూరుస్తుంది.
ఆలుగడ్డలు - పుష్టికరం, బలకరం, ఎక్కువగా తినరాదు
whiteradish
ఇంకా మనం వంటలో ఉపయోగించే పదార్ధాలనేకంలో పోషక విలువలు ఉంటాయి. ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారం మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. అది పప్పు ధాన్యాలైనా, కాయగూరలైనా, పళె్ళైనా, వంట దినుసులైనా, మూలికలైనా. అయితే ఈ ఆహారాన్ని కూడా మోతాదులో తీసుకున్నప్పుడు మాత్రమే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మారుతున్న ఋతువులకు అనుగుణంగా తీసుకోవలసిన ఆహారం, ఆహార ధాన్యాలలో ఉన్న పోషకాలు వీటి గురించి తదుపరి తెలుసుకుందాం.

Dr.Swathi 
- డా స్వాతి, ఎం.డి (ఆయుర్వేద)
ఫోన్‌: 9390957168, 08956156961

వివిధ రుతువుల్లో ఆరోగ్య, ఆహార నియమాలు

ఆరోగ్య పరిరక్షణ, రోగనివారణ అనేవి ఆయుర్వేద శాస్త్ర ప్రధాన లక్ష్యాలు. ఆయువు నిర్వహణలో సహజసిద్ధమైన వనమూలికల పాత్ర నిర్వివాదం. ప్రస్తుతం ప్రపంచ ప్రసిద్ధం కూడా. మానవుడు ప్రాణవాయువు, నీరు, ఆహారం, వస్త్రం, వసతి మొదలైన సర్వ అవసరాలకు మొక్కలపైనే ఆధారపడి ఉన్నాడు. మొక్కలే లేకుంటే మనిషి మనుగడే లేదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మొక్కల ఆధారంగా జీవించే మానవుడు రోగగ్రస్తుడైనప్పుడు అతడి శరీరం సహజంగానే వనమూలికలను కోరుకుంటుంది. అందువల్లనే వనమూలికలతో తయారైన ఔషధాలు ఎలాంటి విపరీత లక్షణాలు కలుగనీయకుండా రోగాలను నివారించగలుగుతున్నాయి. వనమూలికలు ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిర్మూలనలో మేలు చేస్తాయని, వాటి ఉపయోగం అత్యంత లాభదాయకమని ఆధునిక అభిప్రాయం. వీటితో పాటుగా కాలానికి తగ్గట్టుగా ఆహారం తీసుకుంటూ జీవనం సాగించినప్పుడే మానవుడు ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. రుతువును బట్టి మనిషి నడచుకోవలసిన పద్ధతులను కూడా ఆయుర్వేద తెలిపింది.

వివిధ రుతువుల్లో పాటించవలసిన జాగ్రత్తలు
వర్ష రుతువు (జులై 16- సెప్టెంబర్‌ 15)
matheranబలం చాలా తక్కువగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది కనుక పాత బియ్యం, గోధుమలు, బార్లీ శొంటి మొదలైనవి సేవించాలి. కాచిన నీటిని, తేనె కలిపిన నీటిని వినియోగించాలి. అన్నం పొడిగా, తేలికగా జీర్ణమయ్యేట్లు పులుపు, ఉప్పు మొదలైన వాటితో తినాలి. నలుగు పెట్టుకోవడం, వేడి నీటి స్నానం వంటివి పాటించాలి. పగటి నిద్ర, వ్యాయామం, కాలి నడక, పలుచని పదార్ధాలు, సంభోగం నిషేధించాలి.

శరదృతువు (సెప్టెంబర్‌ 16- నవంబర్‌ 15)
మధ్యమ బలం, ఆకలి కొంచెం ఎక్కువగా ఉంటుంది కనుక వగరు, తీపి, చేదు రసాలతో కూడిన చల్లని పానీయాలు శ్రేష్ఠం. వరి, గోధుమలు, బార్లీ, పెసలు, చక్కెర తేనె మొదలైనవి తీసుకోవాలి. సన్నని వస్తమ్రులు ధరించి మేడపైన నిద్రించాలి. కడుపు నిండా తినరాదు. పెరుగు, నూనె పదార్ధాలు, ఎండకు తిరగటం, ఎదురుగాలి, హోరుగాలి, మంచు, మద్యపానము, పగటి నిద్ర పనికి రావు.

హేమంత, శిశిర రుతువు (నవంబర్‌ 16- మార్చి 15):
winterఈ సమయంలో మనుషులకు బలం అధికంగా ఉంటుంది. ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది కనుక బలమైన ఆహారం తీసుకోవాలి. ఉదా: మినుములు, మాంసం, బెల్లం, చెరకు, పాల పదార్ధాలు, వేడి అన్నం, తైలం. వ్యాయామం, నలుగుపెట్టుకోవడం, తలస్నానం, కాటుక పెట్టుకోవడం చెయ్యాలి. ఈ రుతువులో తీపి, పులుపు, ఉప్పు, నీరు, నెయ్యి అధికంగా సేవించాలి.

వసంత రుతువు (మార్చి 16- మే 15)
బలం తక్కువగా ఉంటుంది. ఆకలి తక్కువగా ఉంటుంది. కనుక తేనె, బార్లీ, గోధుమలు, శొంఠి నీరు, తేనె కలిపిన నీరు ఎక్కువగా తీసుకోవాలి. బలమైన ఆహారం, చల్లనివి, పగ టి నిద్ర, పుల్లనివి, తీయనివి, నూనె పదార్ధాలు, పెరుగు ఈ రుతువులో నిషేధించాలి.

గ్రీష్మ రుతువు (మే 16- జులై 15)
బలం చాలా తక్కువగా ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. కనుక కొత్త కుండలో నీరు, పానకము, చక్కెర కలిపిన మంచుగడ్డలు, రుచిగల చల్లని ద్రవప్రాయంగా ఉన్న అన్నం, ఎర్ర రాజనాల బియ్యం, పాలు, నెయ్యి, ద్రాక్ష, కొబ్బరి నీరు, పంచదార వినియోగించాలి. పగలు నీడపడే ఏర్పాట్లున్న గృహంలో, రాత్రిపూట మేడపై విశ్రమించాలి. వ్యాయామం, ఎండకు తిరగడం, కారం, ఉప్పు, పులుపు, రసాలు, వేడి చేసేవి, కల్లు వంటి పదార్ధాలు వదిలి పెట్టాలి.

Dr.Swathi 
- డా స్వాతి,
ఎం.డి (ఆయుర్వేద)
హైదరాబాద్‌,ఫోన్‌: 9390957168,08956156961

మూలశంక ప్రమాదమే

పేరు కృష్ణ. వయస్సు 30. చేసేది డిజైనింగ్‌. రాత్రింబవళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, వేళకు తిండి లేక పోవడం, చాయ్‌ విపరీతంగా తాగడం, నిరంతరం కూర్చునే ఉండటం వల్ల మలబద్ధకం మొదలైంది. ‘ఓ రోజున మోషన్‌కు వెళ్లేటప్పుడు బ్లీడింగ్‌ (రక్త స్రావం) అయ్యింది. ఒకటే నీరసం, కాళ్లు పీకేస్తున్నాయి. మల ద్వారంలో పిలకలు బయటికి రావడంతో నడకలో ఇబ్బంది. మలద్వారంలో తీవ్ర నొప్పి ఉందంటూ’ వాపోయాడు. విశ్రాంతికి అవకాశం లేదంటూ తొందరగా నయం చేయాలని కోరాడు. ఇదీ ఆధునిక జీవిత సమస్య! మూలశంక!


రోగలక్షణాలు :
  • మలబద్ధకం, అజీర్ణం, పుల్లటి తేన్పులు, ఆకలి మంద గించడం.
  • కడుపంతా గ్యాస్‌ నిండినట్లు, మలద్వారం ఎండిపోయిన భావన.
  • కాళ్లలో బలహీనత, నడిస్తే ఆసనం లో గుచ్చుకొంటున్నట్లు విపరీతమైన నొ ప్పి. ఒక్కోసారి కోసేసినట్లు మంటతో కూడిన నొప్పి.
  • అలసట, నీరసం, నిద్ర తగ్గిపోవడం, పిక్కలో తరచూ పట్టేయడం.
  • గ్యాస్‌ వెళ్లేటప్పుడు శబ్దం రావడం, వచ్చే ముందు నొప్పి.
  • మలద్వారం ఉబ్బి బయటకు వచ్చినట్లుండటం, పిలకలు చేతికి తగలడం.
  • చిరాకు, అసహనం, కోపం.
  • తలనొప్పి,బద్దకం,ఒళ్లంతా పిసికేసినట్లుండటం, దాహం.
  • కొంచెం జ్వరం
  • కళ్లు, గోళ్లు, మూత్రం, మలం, చర్మం కొంచెం పచ్చగా కనిపించడం.
  • మలంతో కూడి రక్తం ధారలు, రక్తం కలిసి ఉండటం.
  • ఇలాంటి లక్షణాలు ఆయుర్వేదంలో ‘పిత్తజఅర్శ’గా చెబుతారు. అతని వృత్తి, జీవన విధానం పరిశీలన కూడా దాన్నే తెలియ జేస్తుంది.
  • రక్తం అర్శలు ఎందుకొస్తుంటాయి? వృత్తితీరు, ఎక్కువగా కష్టపడటం, నిరంతరం నిలబడి ఉండటం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, మలబద్దకం, వేళకు భోజనం చేయక పోవడం, జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం, రక్తహీనత, శరీర ప్రకృతిని బట్టి నడుచుకోలేకపోవడం, మల బద్దకం నివారించుకోపోగా ముక్కడం, గరుకుగా ఉండే పదార్థాలు తింటూ నీరు సరిగ్గా తీసుకోక పోవడం... లాంటి వాటివల్ల ‘రక్తజ అర్శస్సు’ వస్తుంది.పైన చెప్పిన కారణాల వల్ల మలద్వారంపై విపరీతమైన వత్తిడి ఏర్పడుతుంది. దీనివల్ల అక్కడ వుండే రక్త నాళాలు బాగా వాచిపోతాయి. మలద్వారం బాగా ఇరుకైపోతుంది. మల ద్వారంలో అతి బలమైన మాంస పేశీలపైనున్న సున్నిత పొరపై వాపు వస్తుంది. ఉండల్లా ఉన్న గట్టిపడిన మలం బలవంతంగా బయటికి వచ్చేటప్పుడు వాచిన రక్తనాళాలపై కోత పడటంతో రక్తం మలంతో వస్తుంది. వీటినే పైైల్స్‌ అంటారు. బయటికి సాగిలపడ్డ మాంసపేశీలపై భాగాలు పిల కల్లా వస్తాయి. మలవిసర్జన తర్వాత కడిగేటప్పుడు చేతికి తగులుతూ ఉంటాయి. చికిత్స దీపన, పాచన, సంశమన, రక్త సంగ్రహణ, శోఫహర, రసాయన ఔషధాలను ఎంచుకొని చికిత్స చేయగా, మొదటి నెలలోనే లక్షణాలు 60 శాతం వరకు తగ్గాయి. రక్తస్రావం తగ్గింది. మలబద్ద కం తగ్గి ఆకలి పెరిగింది. రోగి పెద్దగా విశ్రాంతి కూడా తీసుకోలేదు. వేళకు భోజనం చేయడం, మధ్యాహ్నం కొంత విశ్రాంతి తీసుకొన్నారు. తర్వాత ఓ నాలుగు వారాల్లో ఫైల్స్‌ సమస్య తీరింది. నివారణ ఎలా సాధ్యమైంది? చికిత్స ప్రారంభించే ముందే, చికిత్స ఎలా చేయాలో ముందస్తుగా ప్లాన్‌ చేశాము. మొదట డైట్‌ విషయాల్లో ముఖ్యంగా వేళకు భోజనం చేయడం, ఉప్పు,కారం,మసాలా, టీలు తగ్గించి, పొట్టు, నార కల్గిన పదార్థాలు తీసుకోవడం లాంటివి చేశారు. తీసుకోవలసిన ఆహారం విషయంలో కౌన్సి లింగ్‌ ఇచ్చాం. ఆకలిని పెంచడానికి, అజీర్ణం తగ్గడానికి, కడుపులో గ్యాస్‌ తగ్గడానికి, రక్తం ఆగి పోవడానికి, మలం తొందరగా రావడా నికి, మలద్వారంలో వచ్చిన వాపు తగ్గడానికి, లివర్‌ రసాయానిక ప్రక్రియ వేగవంతం కావ డానికి, హిమోగ్లోబిన్‌ పెరగడానికి శొంఠి, చిత్రమూలం, కుట్కి, హింగువ, సైందవ లవణం, మండూరభస్మం, పునర్నన, ఇసబ్‌ గోల్‌ పసుపు, గుగ్గులు లాంటి ఔషధా లు ఇచ్చాము. రోగి తీవ్రతను ‘మాత్ర’ (డోసు) నిర్ణ యించాము. రెండు మూడు తడవలు లేప నంగా పూయడానికి వేప, లజ్జాలు లాంటి ఔషధాలతో చేసిన ఆయింట్‌ మెంట్‌ ఇచ్చాం. అక్కడ నొప్పి తొందరగా తగ్గడానికి వావిలి లాంటి పత్రాలతో చేసిన కషాయంతో టఠీజ్ట్డీ ఛ్చజూఠీ రోజూ ఇచ్చాము. గుగ్గులు లో ఉండే కాట్వెన్‌, ఎలిని యోల్‌, జెలాని యాల్‌, బోర్నిల్‌, ఆసిటేట్‌ రసాయనాలు మలద్వారంలోనున్న నొప్పిని, తొందరగా తగ్గించాయి. కరకతాని కాయలోని ఎల్లాజిక్‌ ఆమ్లం, గాలిక్‌ ఆమ్లం, చెబుతాజిక్‌ ఆమ్లం అజీర్ణం, మలబద్ధకాన్ని తగ్గించాయి.
    Doctor-mahesh
    - డాక్టర్‌ బి.మహేశ్‌ బాబు ఆయుర్వేద వైద్యనిపుణులు, గురు ఆయు కేర్‌ ముషీరాబాద్‌, హైదరాబాద్‌ 98853 0609
     
    ********************

    మూల శంకకు కొత్తవైద్యం

    -
    మూలశంక రోగులకు ఆశాకిరణం 'స్టాపైయిల్స్‌' వైద్యం. హైదరాబాద్‌లోని జూబ్లిd హిల్స్‌లో అత్యాధునిక చికిత్సతో ఈ రోగానికి 'చెక్‌' పెడుతు న్నారు. డా|| కిషోర్‌ రోగులకు అభయహస్తం యిస్తున్నారు. ఇకపై మూలశంక కారణంగా బాధ వుండబోదంటున్నారు.
    సాధారణంగా మూల శంక ఆపరేషన్‌ అంటేనే రోగులు బాధ పడే పరిస్థితి. ఎంతో బాధను తట్టుకోవాలి. ఏనల్‌, రెక్టాల్‌ రోగాన్ని అశ్రద్ధ చేయరాదు. రోగులు ముందుగా తమ గోడును చెప్పటానికే సంకోచిస్తారు. స్టాపైల్‌ వైద్యవిధానంలో ఏనల్‌ రెక్టాల్‌ రోగ గ్రస్తులలను గోప్యంగా వుంచుతారు. వ్యాధిని ప్రచారం చెయ్యరు. పైల్‌, ఫిస్సర్‌, ఫిస్టులాలకు 'స్టాపైల్‌'లో చికిత్స చేస్తారు.
    అల్ట్రాయిడ్‌ హెమరాయిడ్‌ అమెరికావైద్య విధానాన్ని స్టాపై ల్స్‌లో డాక్టర్‌ సుజాత అందిస్తు న్నారు. ఈ చికిత్సలో మళ్లిd మూలశంక పునరావృతం కాదు. నొప్పి వుండదు. దీనికి సర్జరీ అవసరం లేదు. రోగి చికిత్స అనంతరం తన విధులకు హాజ రు కావొచ్చును. పిస్సర్‌, ఫిస్టూ లకు రోగి వ్యాధి తీవ్రతను బట్టి సర్జరీ వుంటుంది. అమెరికాలోని ఎఫ్‌.డి.ఎ నాణ్యతలను అను సరించి మందులను యిస్తారు. వీటిని అమెరికా నుండి దిగు మతి చేస్తారు.
    'స్టాపైల్స్‌' లో పూర్తిగా రోగ పరీక్షలు వుంటాయి. జీవనశైలి, ఆహారం, నిద్ర, శారీరక పరిస్థితిని అంచనావేస్తారు. రోగి తీసు కోవాల్సిన ఆహారాన్ని తెలియజేస్తారు. హెమరైడ్స్‌ వచ్చాయంటే, ఆ రోగి సరైన ఆహార నియమాలు పాటించలేదు. ముఖ్యంగా పీచు పదార్థాలను తగిన నిష్పత్తిలో తింటే హెమరైడ్స్‌రావు.
    మూల శంకను ఆదిలోనే చికిత్స చేయించాలి. ఆపరేషన్‌ దశచేరే దాకా అశ్రద్ధ చేయరాదు. స్టాపైల్స్‌లోని నూతన వైద్య విధానం కారణాన దీర్ఘరోగులకు స్వస్థత చేకూరుతుంది.  

Friday, September 17, 2010

చూడ చక్కని శరీరాకృతికి

yoga-poses2నాజూకైన నడుము, చూడముచ్చటైన శరీరాకృతి కావాలంటే ప్రశాంతంగా కాస్త వ్యాయా మం చేయడం ఉత్తమమైన మార్గం. కాస్త సమయం కేటాయించడం వల్ల ఆరోగ్యమైన అందమైన ఫలితాలు సొంతమవుతాయి. అది ఎలాగంటే..

సమాంతరంగా ఉన్న నేల పైవెల్లకిలా పడుకొని చేతులను జోడించి తల వెనక్కి నిటారుగా పెట్టాలి. ఇప్పుడు కుడి మోకాలును నెమ్మదిగా పైకి లేపాలి. పాదం నేలకు సమాంతరంగా ఆనుకునే వరకు ఇలా చేయాలి. తల వెనక్కి పెట్టిన చేతులలానే కుడికాలును కూడా ముందుకు నిటారుగా అంటే పాదం పూర్తిగా ముందుకు వంచగలిగినంత వంచాలి. ఇప్పుడు తల వెనక్కి జోడించి పెట్టిన చేతులను మీ ఎడమ కాలిమీదకు అలాగే నిటారుగా తీసుకోవాలి. ఇలా ముందుకు, వెనక్కు మోచేతులు ఏమాత్రం వంచరాదు. తరువాత కుడికాలును అలానే ఉంచి ఎడమకాలును నేలకు 90 డిగ్రీల కోణంలో పైకి లేపాలి. ఇదే భంగిమలో ఉండి శ్వాసను మాములుగానే తీసుకుంటుండాలి. ఇలా ఐదు సెకండ్లు ఉంచాలి. శిరస్సు వెనక్కి ఉన్న చేతులను అలానే తెచ్చి మీ ఎడమ కాలును తాకించాలి. ఈ ప్రయత్నం లో మెడను జాగ్రత్తగా ముందుకు వంచాలి. ఊపిరి మామూలుగానే తీసుకుంటూ ఈ వ్యాయామాన్ని అనేక సార్లు చేయాలి.

నమస్కార భంగిమలో...
yoga-posesచేతులను ఛాతిపైకి తీసుకురావాలి. నమస్కారం చేసే విధంగా తల నుంచి మీ భుజాల వరకు మాత్రం అలా గాలిలోనే ఉండాలి. ఇప్పుడు జోడించిన చేతులను ఎడమ కాలిని తాకిన చోటికీ, ప్రస్తుతం ఉన్న చోటికీ అదే ఆకారంలో ముందుకూ, వెనక్కీ మార్చాలి. ఇలా చేసే క్రమంలో కుడికాలు పాదం నేలకు పూర్తిగా ఆనుకుని ఉండేలా చూసుకోవాలి. కాళ్లు కాస్త దూరంగా ఉండేలా నిలబడి రెండు చేతులను తలపైకి నిటారుగాపెట్టాలి. ఒక చేతితో మరొ క చేతి వేళ్లను పట్టుకొని రెండు పక్కలకు నడుమును వంచుతూ వ్యాయామం చేయాలి. చేసేటప్పుడు మోకాళ్లు నిటారుగా ఉండేలా చూసుకోవాలి.

నాజూకు నడుముకు...
నిటారుగా పెట్టిన తరువాత కుడివైపుగా వంగినపుడు కుడిచేతితో విడిగా కుడి కాలును తాకించాలి. ఎడమవైపుకు వంగినపుడు ఇదే విధంగా ఎడమచేతితో విడిగా ఎడమకాలును తాకాలి. ఇలా కొన్నిసార్లు చేయాలి. పక్కకు వంగి చేతితో కాలిని తాకినపుడు అలానే పదిసెకన్లు పాటు ఉంచాలి. మీ శక్తిని పూర్తిగా ఉపయోగించి అలా చేసిన తరువాత నిటారుగా నిలుచుని మళ్ళీ రెండవ పక్కకు శరీరాన్ని వంచి ఇదే వ్యాయామాన్ని కొనసాగించాలి.

కొవ్వును తగ్గించుకునేలా...
ఇలా ప్రయత్నం చేస్తూ పోతే చేయి కాలి పాదాన్ని ఆ తరువాత నేలను తాకే స్థాయికి శరీరాన్ని రెండు పక్కలకు వంచగలుగుతారు. అప్పుడు నడుముకు చుట్టుపక్కల అనవసరమైన కొవ్వు కనిపించకుండాపోయి నడుము నాజూకుగా, బలంగా తమారవుతుంది. రెండు కాళ్ళ మధ్య నాలుగడుగుల దూరం ఉండేలా నిటారుగా నిలబడాలి. రెండు చేతుల ను తలపైకి నిటారుగా పెట్టి రెండు అరచేతుల వేళ్ళను ఒకదానిలోకి ఒకటి జొప్పించి, వెనక్కి విరిచి పెట్టినట్లుగా వీలైనంత ఎత్తుకు చేతులను చాచడానికి ప్రయత్నించాలి. మోచేతులను మాత్రం నిటారుగా ఉంచాలి. ఇప్పుడు శ్వాసను వీలైనంత తీసుకుని ఐదుసెకన్ల తరువాత నెమ్మదిగానే బయటకు వదలాలి.

పొట్ట కండరాలను...
yoga-poses1నేలపై బోర్లా పడుకోండి. ముఖంనుంచి పాదాల వేళ్లవరకూ నేలకు ఆనేలా నిటారుగా పడుకోవాలి. అలా పడుకున్నపుడు రెండు ఆరచేతులూ తొడల కింద చేర్చాలి. పాదాలనుంచి తల వరకూ శరీరంలో ప్రతి భాగం నిటారుగా ఉంచేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా వెన్ను నిటారుగా పెట్టాలి. తరువాత నెమ్మదిగా కుడికాలును ఎంతవరకు లేపగరో అంతవరకు పైకి లేపాలి. ఈ సమయంలో మామూలుగానే శ్వాస తీసుకుంటూ మధ్యలో ఆరు సెకన్లు వ్యవధి ఉండేలా చూసుకోవాలి. ఇలా కాలును ఉంచగలిగినంత సేపు ఉంచి తరు వాత నెమ్మదిగా శ్వాసను వదులుతూ కాలును నేలకు ఆన్చాలి. తరువాత ఇదే విధానాన్ని రెండవ కాలుకు కూడా పాటించాలి. తరువాత నుదురును నేలకు ఆన్చి రెండు కాళ్లను ఒకే సారి పైకి లేపాలి. ఇలా కాళ్లను లేపేటపుడు శ్వాసను బిగ్గరగా తీసుకోవాలి. ఈ సమయంలోనూ మోకాళ్లు నిటారుగానే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇలా ఎంతసేపు గాలిలో కాళ్లను నిటారుగా ఉంచగలరో అంతసేపూ ఉంచాలి. తరువాత నెమ్మదిగా కాళ్లను నేలకు ఆన్చి తల ఒక పక్కకు వాల్చి విశ్రాంతి తీసుకోవాలి.

చక్కని శరీరాకృతి...
ఈ పద్దతులన్నీ పాటించినట్లైతే మీ కాళ్లు, పొట్ట కండరాలకు అత్యవసరమైన శక్తిని చేకూర్చుతాయి. శరీరానికి చక్కని తీగలాంటి ఆకృతిని కూడా పొందుతారు. నిత్యజీవితంలో మనకు ఎదురయ్యే ఒత్తిడినుంచి దూరం అవుతారు. దీనితోపాటు మంచి పోషక విలువలు ఉండే ఆహారం...ప్రతినిత్యం నీరు అధికమోతాదులో తాగుతూ ఉండాలి...కొవ్వును కలిగిం చే ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి. పీచు పదార్ధాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

Thursday, September 16, 2010

నిమ్మతో.. నిగనిగ

మనం తినేపదార్థాల రుచి పెరగాలంటే దాంట్లో నిమ్మరసం పడాల్సిందే. నిమ్మ రుచిని పెంచడమే కాకుండా ఆకలిని నియంత్రిస్తుంది కూడా. దీనిలో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. నిమ్మరసాన్ని అధికంగా తీసుకుంటే కార్బోహైడ్రేడ్‌లు నెమ్మదిగా కరుగుతాయి.

Lemon- నిమ్మరసం తాగినా...నిమ్మతో చేసిన ఆహారపదార్థాలు తిన్నా...చాలాసేపటి వరకు ఆకలిగా అనిపించదు.
- నిమ్మరసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న టాక్సిన్లు వెలుపలకు నెట్టివేయబడతాయి.
- ఒక్కరోజు శరీరానికి సరిపడా కావాల్సిన సివిటమిన్‌ను నిమ్మ అందిస్తుంది.
- ఆరోగ్యపరంగానే కాక నిమ్మ సౌందర్య సాధనంగా పనిచేస్తుంది.
- తల స్నానం చేసే ముందు నీటిలో నిమ్మరసాన్ని కలిపిన నీటితో స్నానంచేస్తే కురులు నల్లగా మెరుస్తాయి.
- నిమ్మరసాన్ని పెరుగులో కలిపి చర్మానికి పట్టించి స్నానం చేస్తే మేనిఛామ పెరుగుతుంది.
- ఎండకు కమిలిన ప్రాంతమైనా, కూరగాయలు కోసేప్పుడు చేతులు రంగుమారినా నిమ్మరసాన్ని పట్టిస్తే ఆ మచ్చలు నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి.
- ఎండిన నిమ్మను మెత్తని పొడిగా చేసుకొని సున్నిపిండిలో కలిపి స్నానం చేస్తే చర్మంమీది మృతకణాలన్నీ తొలగిపోతాయి.
- కంటికింద ఉన్న నల్లటి వలయాలు తగ్గాలంటే దూదితో నిమ్మరసాన్ని అద్ది మునివేళ్లతో సున్నితంగా మర్ధనచేయాలి. వారం పాటు ఇలాచేస్తే కళ్లచుట్టూ కనిపించే నల్లని వలయాలు నెమ్మదిగా కనుమరుగవుతాయి.
health_skin_care- నిమ్మరసం ముఖంమీద జిడ్డుని తొలగించి ఎప్పుడూ తాజాగా ఉంచగల్గుతుంది కూడా.
- నిమ్మరసాన్ని చెంచాలో తీసుకొని దానిలో కాసింత ఉప్పుని కలిపి తీసుకుంటే వికారం తగ్గుతుంది.
- నిమ్మరసాన్ని ముల్తానామట్టిలో కలిపి ముఖానికి పట్టించి ఆరాక కడిగిస్తే ముఖం నిగనిగలాడుతుంది.
- నిరాహారదీక్ష విరమించేటప్పుడు కూడా నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేస్తారు. ఎందుకంటే ఖాళీకడుపులో గ్యాస్‌ చేరుకుని ఒక్కసారిగా ఏదైనా ఆహారపదార్థం తిన్నా...వెంటనే వాంతి అయిపోతుంది. ఒక్క నిమ్మరసం మాత్రమే శరీరం హరాయించుకుంటుంది.
- పరగడుపున నిమ్మరసం, తేనె కలిపి అందులో కొద్దిగా నీళ్లు కలుపుకుని ప్రతిరోజూ తాగుతుంటే శరీరం బరువు తగ్గుముఖం పడుతుంది.
సోయాతో సౌందర్యం
- నానబెట్టిన సోయా గింజల్ని, దోసకాయ ముక్కలను కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని స్నానం చేసే ముదు శరారమంతా పట్టించి మృదువుగా రుద్దుకోవడం వల్ల శరీరం నునుపుదేలి, మేని వర్ణం మెరుగవుతుంది.
- రెండు చెంచాల సోయాపిండిలో అరచెంచా తేనె, కొద్దిగా టమాటా రసం కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయడం వల్ల ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది.
- ఒక స్పూను సోయాపిండి, అరస్పూను నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని చేతులకు రాసుకుని పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్ర పరచడం వల్ల చేతులు మృదుత్వాన్ని సంతరించుకుంటాయి.
- పదిహేను సోయాగింజలు, నాలుగు బాదం పప్పులను నాలుగైదు గంటలసేపు నానబెట్టాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ విశ్రమంలో టీ స్పూన్‌ తేనె, నాలుగైదు చుక్క నిమ్మరసం కలిపి ముఖం, మెడ, చేతులకు పల్చగా పట్టించాలి. అర్ధ గంట తర్వాత మృదువుగా రుద్ది కడిగేయాలి. వారానికోసారి ఈ విధంగా చేయడం వల్ల చర్మం కోమల త్వాన్ని, నిగారింపును సంతరించుకుంటుంది.
- సోయాపిండి, పెసరపిండి సమ భాగాలుగా తీసుకుని స్నానం చేసేటప్పుడు సబ్బుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఈ పిండిని ఉపయోగించడం వల్ల సహజసిద్ధమైన రీతిలో చర్మం పరిశుభ్రపడి నునుపుగా మారుతుంది.
- మొటిమల వల్ల ముఖం మీద నల్లమచ్చలు ఏర్పడిన వారికి ఓ సులువైన పరిష్కారమార్గం వుంది. సోయాపాలలో శగపిండి, కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేయాలి. ఇందవల్ల నల్లమచ్చలు క్రమేపీ కనుమరుగవుతాయి.ఇలా మన ఇంట్లోనే చౌకగా లభ్యమయ్యే పండ్లు, కూరగాయలతో సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ పేస్ట్‌ను తయారు చేసుకుని తరచుగా ముఖానికి పట్టిస్తుంటే...ఆరోగ్యానికి ఆరోగ్యం...అందానికి అందం మెరుగవుతాయి.

చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే .... కారణాలు - పరిష్కారం * బాధించే చుండ్రు.. * నిగనిగలాడే జుట్టు కోసం...


చుండ్రుతో బాధా..?!
టీవీలో యాడ్‌... దువ్వుకుంటుంటే పొట్టులా రాలి బ్లాక్‌ కోట్‌ మీద తెల్లగా పొడి రాలుతూ ఉంటుంది.తలలో విపరీతమైన దురదా? అయితే చుండ్రే కారణం అంటూ మోడల్‌ ఓ షాంపూను చేతిలో పెడుతుంది. ఇది నిత్యం మనం టీవీల్లో చూసేవి. కానీ కేవలం షాంపూలు వాడితేనే తగ్గిపోయే సమస్య కాదు ఇది. ఈ చుండ్రు అనేది ఆడ, మగ భేదం లేకుండా బాధించే సమస్యలలో ఒకటి. కాకపోతే ఎక్కువ శాతం ఈ చుండ్రుతో బాధపడేవారి సంఖ్య పురుషుల కన్నా స్ర్తీలలోనే ఉంటుంది.అసలు చుండ్రు అనేది ఎందుకు వస్తుందంటే కారణాలు చాలా ఉన్నాయి. అవి ఏంటి... వాటికి పరిష్కారం ఏంటీ అంటే...

aloe-showerసరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవ డం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌...లాంటి కారణాలు అనేకం ఉన్నాయి. అయి తే చాలా మంది చుండ్రు నివారణకు రకరకాల మందులు వాడుతుంటారు. అలాంటి వైద్యం కన్నా మనమే సొంతంగా ఇంటి వద్దే చుండ్రు నివారణ మందును తయారు చేసుకొని వాడవచ్చు.

పొట్లకాయరసంతో :

సహజసిద్ధంగా చుండ్రు నివారణ మందును ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు ను. మార్కెట్లో దొరికే పొట్లకాయను ఒకటి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో వేసి జ్యూస్‌ మాదిరిగా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పొట్లకాయరసంలో వేరే ఏదీ కలపకుండా దానిని వడగట్టి ఆపళంగా తలంతా వెంట్రు కల మొదళ్ల నుంచి చివరిదాకా పట్టించా లి. అవసరం అనుకుంటే మరో పొట్లకా యను జ్యూస్‌ చేసుకుని మొత్తాన్ని వాడాలి.ఇరవై నిమిషాలపాటు ఆరనిచ్చి ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన క్రమంగా చుం డ్రు మటుమాయం అవుతుంది. చుండ్రు నివారణకు పొట్లకాయ రసం బాగా పనిచేస్తుంది.పైగా వెం ట్రుకలు నిగనిగలాడేలా చేయడం లోనూ పొట్లకాయ రసం బాగా ఉపకరిస్తుంది.

శనగపిండి:
శనగపిండి నాల్గు స్పూన్లు తీసుకుని ఒక కప్పు పెరుగులో ఈ మిశ్రమాన్ని గడ్డలు లేకుండా కల పాలి. మెత్తగా పేస్ట్‌ మాదిరిగా ఉండాలి. ఆ తర్వాత పల్చ గా వచ్చిన పిండిని వెంట్రుకల మొదళ్లనుంచి చివళ్ల దాకా వచ్చేలా పట్టించాలి. అరగంటసేపు ఆరనిచ్చి తలస్నానం చేయా లి. ఇలా కొన్ని వారాల పాటు చేసినట్లయితే చుండ్రు ఏ మందులూ లేకుండానే క్రమంగా తగ్గిపోతుంది.

నిమ్మ, జామరసం మిశ్రమంతో:
నిమ్మకాయరసంలో జామ ఆకుల రసాన్ని మేళవించి రెండూ కలి పి వెంట్రుకల లోపల దాకా వేళ్లేట్లుగా పట్టించాలి. పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నా నం చేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చొప్పున చేస్తుంటే చుండ్రు మటుమాయం అవుతుంది.

హెన్నా :
వెంట్రుకల రంగు మార్చుకోవడానికి హెన్నాను వాడుతుంటారు. అయితే మార్కెట్లో మంచి బ్రాండ్‌ హెన్నాను వాడితే చాలా మంచిది. హెన్నా చుండ్రును అరికట్టడంలో దివ్యంగా పనిచేస్తుంది.

మెంతులు, పెరుగు పేస్ట్‌ :
మెంతులు ముందురోజు రాత్రి పెరుగులో నానబెట్టి ఆ తర్వాత మిక్సీలో వేసి గుజ్జులా చేసుకుని వెంట్రుకలకు పట్టించాలి. మెంతులు చుండ్రు నివారణలో దివ్యంగా పని చేస్తాయి.

గోరింటాకు :
గోరింటాకు కోసుకురాగానే ఆ ఆకుల రసం తీసి తలకు పట్టించినట్లయితే చుండ్రు నివారణ అవుతుంది.అందులోకి ఆమ్ల (పెద్ద ఉసిరి) పొడిని కలుపుకుంటే మరింత అనుకూలమైన ఫలితం వస్తుంది.

వెనిగర్‌ :
మార్కెట్లో దొరికే నాణ్యమైన వెనిగర్‌ బాటిల్‌ను తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్‌ చొప్పున కలుపుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి.ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కేవలం నాలుగు నెలల్లో మీ చుండ్రు సమస్య నివారణ అవుతుంది.

ఉసిరికపొడి :
పెద్ద ఉసిరికాయలను తెచ్చి నూరి వాటిని ఎండబెట్టి ఆ తర్వాత పొడిచేసుకోవాలి. లేకపోయినా ఉసిరిక పొడి అన్ని ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు. ఉసిరిక పొడిలో నిమ్మరసం కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకుని తల కుదుళ్లకు పట్టించాలి. ఆ తర్వాత ఎవరిచేతనైనా తల మాలిష్‌ చేయించుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే కొన్నాళ్లలో తలలో ఉండే చుండ్రు నివారణ అవుతుంది.

పోషకాహారం :
ఇవన్నీ ఒక ఎత్తయితే... మనం తీసుకునే పోషకపదార్ధాలు ఒక ఎత్తు. ఎక్కువగా ఏ కాలంలో వచ్చే పండును ఆ కాలంలో తప్పక తీసుకోవాలి. చుండ్రు నివారణలో మనం తీసుకునే పండ్లు, వాటి రసాలు ఎంతగానో ఉపకరిస్తాయి. చుండ్రు ఉన్నవాళ్లు ఎక్కువగా సిట్రస్‌ పండ్లు తీసుకోకపోవడమే మంచిది. అలాగే చుండ్రు తగ్గేదాకా అరటిపండును కూడా తినవద్దు. ఎక్కువ ఆయిలీ పదార్థాలు, పిజ్జాలు, బర్గర్ల వంటివి తగ్గించాలి.



 
బాధించే చుండ్రు.. 

అందాన్ని రెట్టింపు చేసే శిరోజాలు అస్తమానం ఊడిపోతుంటే, మీ అందం అడవి కాచిన వెన్నెల అవుతుంది కదూ! దానికి కారణం చండ్రు. తలలో దురద పెట్టి చికాకు పెట్టడం కారణం కావడమే కాకుండా మాటిమాటికీ తలలో చెయ్యి పెట్టడం చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. దీని కారణంగా చేసే పనిలో ఏకాగ్రత కూడా తగ్గుతుంది.చుండ్రు నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చుండ్రుకు బాహ్యకారణాలు దారితీస్తాయని అందరూ సాధారణంగా భావిస్తారు. జీన్స్‌, చర్మతత్త్వాలు అంతర్గతంగా ప్రధానపాత్ర వహించే కారణాలు.

dandruff 
వెంటనే తొలగించాలి...
చుండ్రువల్ల జుట్టు బాగా రాలిపోతుంది. బాగా దురద పెడుతుంది. ముఖం, వీపు, మెడలపై పడి చికాకు పుట్టిస్తుంది. ముఖం పై మొటిమలు కావడం, తలనొప్పికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుం ది. చుండ్రుతో పాటు మొఖం పై అవాంఛిత రోమాలు, స్థూలకా యం, రుతుక్రమంలో తేడాలు కనిపిస్తే పాలిసిస్టిక్‌ ఓవేరియన్‌ సిం డ్రోమ్‌ ఉందేమో తెలిపే వైద్య పరీక్ష చేయించుకోవాలి. చండ్రుతో తరుచు ఇబ్బంది పడేవారు మాడుపై పొట్టురేగడం తగ్గగానే, యాంటీ డాండ్రఫ్‌ షాంపూ వాడకాన్ని ఆపేస్తారు. కానీ ఇలా చేయకూడదు.

చుండ్రు నివారణకు...
చుండ్రు తొలగించడానికి పార్లర్లకు వెళ్ళి చికిత్స తీసుకో అవసరం లేదు. ఇంట్లోనే పాటించే అనేక చిట్కాలవల్ల చుండ్రు తగ్గే అవకాశం ఉంది.
- అరకప్పు పెరుగులో రెండు టేబుల్‌ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకు పట్టించాలి. ఆరగంటాగి కడిగేయాలి. ఈ విధంగా వారానికోసారి చేస్తుండాలి.
- ఒక టీ స్పూన్‌ నిమ్మపండు రసంలో రెండు టీ స్పూన్‌ల వెనిగర్‌ని కలపాలి, దానితో తలని మసాజ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి.
-వెనిగర్‌ రెండు టేబుల్‌స్పూన్లు మాడుకు పట్టించి అరగంట తర్వాత షాంపూ చేసుకోవాలి. తేలిగ్గా తలను మసాజ్‌ చేసుకుని కడిగేయాలి.
- మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయాలి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి. మసాజ్‌ అయ్యాక ఓ అరగంట తరువాత షవర్‌ బాత్‌ చేస్తే చుండ్రు ఉండదు.
-ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూన్‌ తాజా నిమ్మరసం కలిపి తలస్నా నం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కోవాలి. దీనివల్ల చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గిపోవడమే కాకుండా జుట్టుకు మెరుపు చేకూరుతుంది.
- సెలీనియా, సలె్ఫైడ్‌ లేదా స్యాలి సిలిస్‌ ఆమ్లంతోగానీ ఉండే షాం పులను వాడాలి.ఇవి సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలవు.
- మలస్సేజియా గ్లోబస్తా అనే ఫం గస్‌ తాలూకు జన్యువు 50,90 శా తంమందికి చర్మంపై పెరుగుతుంది. ఈ జన్యువు చుండ్రు, ఇతర చర్మసంబంధిత సమస్యలకు కారణం కావచ్చు. వీటిలో సహజీవనం సా గించే కొన్ని జన్యువులు కూడా ఉండ డం వల్ల మలస్సేజియాసెక్స్‌కు అనుకూలంగా ఉంటుందని, దీని వల్ల వీటి విస్తరణకు అవకాశం అధికం గా ఉంటుందని నిపుణులు అం టున్నారు. దీనిని అరికట్టేం దుకు యాంటీ డాండ్రఫ్‌ షాంపూలు ఉపకరిస్తాయి.
-ప్రపంచలో 90 శాతం మంది ప్రజల్ని చుండ్రు బాధిస్తున్నదని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఈ పరిశోధన కోసం వారు పది లీటర్ల ఫంగస్‌ను వృద్ధి చేశారు. ఇది కోటిమంది ప్రజల తలపై ఉండే ఫంగస్‌కు సమమైంది.

నిగనిగలాడే జుట్టు కోసం...
హెన్నా మిశ్రమంలో మందార ఆకులను పేస్ట్ చేసి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

కప్పు పెరుగులో రెండు కోడిగుడ్ల సొన కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి గంటన్నర తరవాత షాంపూతో తలస్నానం చేయాలి. పది రోజులకి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే నిగనిగలాడే జుట్టు సొంతం అవుతుంది.

నలుపే బంగారమాయే...

కొంతమంది నల్లగా ఉన్నామని బాధపడుతుంటారు. నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే నల్లగా ఉన్నామని బాధపడకుండా కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే అతి తక్కువ కాలంలోనే మేనిఛాయను మెరుగు పర్చుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. నలుపు రంగు పుట్టుకతో వచ్చినా, లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా కింది చిట్కాల్ని ప్రయోగిస్తే మంచి ఫలితముంటుందంటున్నారు వారు. అందుకు కొన్ని సలహాలను సూచిస్తున్నారు.

beauty-మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయాలి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా అక్కడ మసాజ్‌ చేస్తే రంగులో తేడా గమనించవచ్చు.
-నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో లిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించాలి. 20నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి.
-బంగాళా దుంపల రసం తీసి ముఖానికి రాసుకోవాలి. అర్ధగంట వరకూ అలాగే ఉంచి కడిగాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయాలి.
-పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉన్నా, పచ్చిపాలు, పసుపు మిశ్రమం చర్మంలో నునుపు, కలిగించడంతోపాటు నలుపు రంగునూ కొంత వరకు తగ్గిస్తుంది.
-శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్‌ చేయాలి. ఇలా చేస్తే మీ పొడిబారిన చర్మం పై ఉన్న మురికి తొలగిపోతుంది. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయగా కాంతి వంతంగా ఉంటుంది.
-ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి. స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాలముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేస్తే ఫలితముంటుంది.
-ఎండలో వెళ్లేప్పుడు ఖచ్చితంగా సన్‌ స్క్రీన్‌ లోషన్‌ను రాసుకోవాలి. గొడుగును ఉపయోగించాలి.
-గంధం పొడిని, పసుపు, రోజ్‌వాటర్‌ మిశ్రమాన్ని లేదా లేదా బాదం పాలు ముఖానికి, శరీరానికి రోజూ పట్టించినా, ఛాయలో మార్పుంటుంది.
-నానబెట్టిన బాదం పప్పుల్ని పచ్చిపాలలో కలిపి పేస్టులా చేయాలి. ఈ పేస్టును ముఖం మీద కనీసం ప్రతిరోజూ ఒక గంటసేపు ఉంచు కోవాలి. రాత్రిపూట దీన్ని రాసుకుని పడుకుంటే మారునాడు ముఖం కాంతివంతంగా ఉంటుంది.
-స్నానం చేయడానికి సబ్బుని కాకుండా సున్ని పిండి లేదా శనగపిండిని వుపయోగించుకోవచ్చు.
-వారానికి రెండు సార్లు ముల్తానీ మట్టిని రోజ్‌ వాటర్‌లో కలిపి కూడా రాసుకోవచ్చు.
-టమోటా రసం ఎండలో కమిలిన చర్మానికి మంచి మందుగా వుపయోగపడుతుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు కొద్దిగా రసాన్ని తీసుకుని ముఖానికి రాసుకున్నా ఫలితం వుంటుంది.
-మోచేతులు, మెడ భాగాల్లో నలుపు పోవడానికి నిమ్మకాయ చెక్కతో రుద్దితే ఫలితం వుంటుంది.
-బకెట్‌ నిండా నీళ్లు తీసుకుని దాన్లో రెండు నిమ్మకాయలు పిండి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీనిని కొన్ని నెలలవరకూ కొనసాగిస్తే ఫలితముంటుంది.

Saturday, September 11, 2010

జంతు'యోగం'

ఏ జంతువునైనా కరకరా నమిలి జీర్ణం చేసుకుంటుంది సింహం. ఎంతటి విషంకక్కే పాములను మింగినా సరే, నెమలి నిగనిగలాడుతూనే ఉంటుంది. మెరుపు వేగంతో పరిగెత్తే కుందేలుకు అలసట అంటే తెలీదు. మైళ్లదూరం ప్రయాణమంటే గద్దకు లెక్కేలేదు. తలకు మించిన బరువును సైతం లాగిపడేస్తుంది వృషభం. నిప్పుల కొలిమిలాంటి ఎడారిలో ఒంటె హాయిగా జీవించేస్తుంది. ఇరుకైన ప్రదేశానికి తగ్గట్టు పాము తన శరీర పరిమాణాన్ని మార్చుకుంటుంది. ఏమిటీ జీవ రహస్యం..? ఒక్కో జంతువుకు ఒక్కో అపురూప జీవలక్షణాలను అందించిన ప్రకృతి మహత్యమది. అలాంటి అన్ని లక్షణాలు మనుషులకూ వస్తే, ఇంకెంత ఆరోగ్యంగా ఉంటారు..? అన్న ఆలోచన నుంచే పుట్టాయి ఈ యోగాసనాలు.... వీటిని మనకు వివరించారు భారతీయ యోగా సంస్థాన్ హైదరాబాద్ అధ్యక్షులు ప్రకాష్‌రావు.

ఊష్ట్రాసనం
ఊష్ట్రం అంటే ఒంటె. ఈ ఆసనంలో శరీరం ఒంటెలాగ ఒంకరటింకరగా కనిపిస్తుంది. ఒంటె సాధు జంతువైనా బలిష్టంగా ఉంటుంది. మన శరీరం కూడా ఒంటెలాగ బలంగా ఉండేందుకు ఈ ఆసనం తోడ్పడుతుంది. ఈ ఫొటోలో ఉన్నట్లు.. మోకాళ్ల మధ్యన భుజాల మధ్య ఉన్నంత వెడల్పు ఉంచాలి. పాదాలు ఆకాశం వైపు చూడాలి. తల వెనక్కి వంచాలి. అరచేతులు అరికాళ్లపైన ఉంచాలి. కళ్లు మూసుకొని వెన్నెముక మీద కలిగే ప్రభావాన్ని గమనించాలి.

ప్రయోజనం : మనం చేసే రోజువారీ పనుల్లో ఎక్కువ సమయం ముందుకు వంగి చేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వెన్నుపూసలు దగ్గరై.. వాటి నడుమ ఉన్న గ్రంధులు ఒత్తిడికి గురవుతాయి. ఈ ఆసనంలో వెనక్కి వంగడం వల్ల రక్తప్రసరణ జరగని భాగాలు సర్దుకుంటాయి. మెడభాగం (సర్వికల్), నడుము మధ్య భాగం ( డోర్సల్) , నడుం కిందిభాగం (లంబార్) ఆరోగ్యంగా ఉంటాయి.  

సింహాసనం
సింహం అడవికి రాజు. అది ఎంత కఠినమైన ఆహారం తిన్నా అరిగించుకుంటుంది. సింహం తరచూ గర్జించడం వల్ల దాని లోపలి అవయవాలు చురుగ్గా తయారవుతాయి. సింహ ఆసనం వేసేవాళ్లకూ ఆ ఆరోగ్య ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఫోటోలో చూపిన విధంగా కాళ్లు మడిచి కూర్చున్నాక, చేతులు ముందుకుచాపి నిటారుగా వంగాలి. నోరు పెద్దగా తెరిచి, నాలుకను బయట పెట్టి సింహంలా గర్జించాలి. కంఠం, ఛాతీ పూర్తిగా తెరుచుకోవాలి.

ప్రయోజనం : కంఠానికి సంబంధించి ఎలాంటి వ్యాధులున్నా ఈ ఆసనం వాటిని పోగొడుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. కళ్లు, ముక్కు, చెవుల పనితీరును మెరుగు పరుస్తుంది. పిత్తాశయంలో రాళ్లు చేరకుండా కాపాడుతుంది. ఒకవేళ ఇప్పటికే రాళ్లు ఏర్పడి ఉంటే.. మూత్రం ద్వారా బయటికి పంపుతుంది ఈ ఆసనం.  

భుజంగాసనం
పాముకు శరీరాన్ని ఎలా కావాలంటే అలా తిప్పుకొనే సౌకర్యం ఉంటుంది. పాము శరీరానికి ఉన్న లాభం మన శరీరానికి కూడా కలిగేలా చేస్తుంది భుజంగాసనం. రెండు చేతులనూ భూమికి ఆనించి, తలపైకెత్తి చూడాలి. వెన్నుపూసను కొద్దిగా వంచాలి.

ప్రయోజనం : మన శరీరానికి ఆధారం వెన్నుపూస. ఈ ఆసనం వేయడం వల్ల వెన్ను బలిష్టంగా తయారవుతుంది. వెన్నుపూస సమస్యలన్నీ తొలగిపోతాయి. వీపునొప్పి వెంటనే తగ్గిపోతుంది. మూల నాడులు, నాడీమండలం దృఢమవుతాయి. సెర్వికల్ నొప్పితో బాధపడే మహిళలకు ఈ ఆసనం ఎంతో ఉపయోగం.  



మయూరాసనం
పాములు నెమలికి ఆహారం. అయినా పాముల్లోని విషం నెమళ్లను ఏమీ చేయలేదు. విషాహారాన్ని కూడా జీర్ణం చేసుకోగల శక్తిని మయూరాసనం ఇస్తుంది. రెండు అరిచేతులను నేల మీద ఆన్చాలి. చేతులు పాదాల వైపు తిరిగుండాలి. నాభికి చెరోవైపు రెండు మోచేతులను ఉంచాలి. శరీరం కేవలం రెండు అరిచేతుల మీద నిటారుగా ఉంచాలి. ఈ స్థితిలో మెల్లగా శ్వాసను పీల్చాలి.

ప్రయోజనం : ఈ ఆసనం వల్ల కోలన్ నాడి (పెద్ద పేగులు) ప్రభావితం అవుతాయి. ఎంతో కాలం నుంచి వేధించే మలబద్ధకం అయినా తగ్గిపోతుంది. జఠరాగ్ని పెరుగుతుంది. నాభిని సరైన స్థానంలోకి తీసుకురావడం ఈ ఆసనంలోని ప్రత్యేకత. హెర్నియా, సయాటికా దోషాలు తగ్గుతాయి.
 
గరుడాసనం
శరీరాన్ని గరుడ పక్షి (గద్ద) ఆకారంలో ఉంచితే అది గరుడాసనం అవుతుంది. గద్ద ఎంత దూరం ప్రయాణించినా ఆయాసపడదు. ఆ లక్షణం మనకూ రావాలంటే ఈ ఆసనం వేయాలి. రెండు చేతులు, కాళ్లు మెలితిరిగినట్లు, పెనవేసుకున్నట్లు శరీరాన్ని ఉంచాలి. శ్వాసను బయటికి వదిలి సాధ్యమైనంత వరకు ఆపాలి. ఇదే ఆసనాన్ని తిరిగి రెండవకాలు, చేయితో చేయాలి.

ప్రయోజనం : నిల్చుని చేయడం వల్ల నడుము కింది భాగంలోని దోషాలు నయమవుతాయి. నడుంనొప్పి, స్లిప్ డిస్క్ దూరమవుతాయి. అండకోశం వృద్ధి చెందుతుంది. హెర్నియా బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలసట, ఆయాసాలను దూరం చేస్తుంది.
 
గోముఖాసనం
ఆవు ఆకారంలో ఈ ఆసనం ఉంటుంది. ఫొటోలో ఉన్నట్లు కుడికాలును ఎడంవైపుకు.. ఎడం కాలును కుడివైపుకు మడవాలి. రెండు చేతులను వెనక్కి తీసుకొచ్చి, ఇంటర్‌లాక్ చేయాలి. సాధారణ శ్వాస తీసుకోవాలి. కొంతసేపయ్యాక వ్యతిరేక దిశలో రిపీట్ చేయాలి.

ప్రయోజనం : అతిగా మూత్రం వెలువడేవారికి ఇది ఎంతో ఉపకరిస్తుంది. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. నీరసాన్ని తొలగిస్తుంది. నరాల నీరసాన్ని తగ్గించి, మనసుకు ఉల్లాసాన్ని ఇస్తుంది. అండకోశం అనవసర పెరుగుదలను ఆపుతుంది.  


వృషభాసనం
వృషభం (ఎద్దు) ఎంత గట్టిగా ఉంటుందో మనకు తెలుసు. సుఖాసనంలో కూర్చున్నట్లే ఒక కాలు అటు, మరొక కాలు ఇటు మడిచి కూర్చోవాలి. రెండు చేతులను మోకాలిమడమ దగ్గర పెట్టుకోవాలి.

ప్రయోజనం : వృషభాసనం వేస్తే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి. నడుంనొప్పిని కూడా ఇది దరి చేరనీయదు. సుఖాసనం లాంటిదే. ప్రయోజనాల మాట అటుంచితే, కాసేపు కూర్చోవడానికి ప్రశాంతంగా ఉంటుంది.  





మార్జాలాసనం
మార్జాలం అంటే పిల్లి. దాని ఆకారం వచ్చేలా ఈ ఆసనాన్ని వేయాలి. మోకాళ్లు, అరచేతుల మీద వంగి ఉండాలి. తలను కిందికి వంచాలి. ప్రయోజనం : మధుమేహాన్ని చక్కగా నియంత్రిస్తుంది. పొత్తి కడుపు భాగాలు గట్టిపడతాయి.

ముఖ్యంగా మహిళలకు నాభి కింది భాగం సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. గర్భవతులు కూడా ఈ ఆసనాన్ని యోగా నిపుణుల సలహాతో చేయవచ్చు. సులువుగా ప్రసవం అయ్యేందుకు మార్జాలాసనం తోడ్పడుతుంది.  


శశాంకాసనం
శశాంకం అంటే కుందేలు. కుందేలు ఎంత వేగంగా, ఎంత దూరం పరిగెత్తినా ఊపిరి తీసుకొనేందుకు ఇబ్బంది పడదు. ఈ ఆసనం వేస్తే మీరు కూడా శ్వాసలో స్వేచ్ఛను అనుభవిస్తారు. మోకాళ్ల మీద కూర్చుని నెమ్మదిగా చేతులు ముందుకు చాపాలి. నిదానంగా చేతులను నేలకు తాకిస్తూ ఈ ఫొటోలో ఉన్నట్లు ముందుకు వంగి కాసేపు అలాగే ఉండాలి.

ప్రయోజనం : ఊపిరితిత్తులు, గుండె పనితీరు మెరుగుపడుతుంది. పేగుల్లో సమస్యలు తొలగిపోతాయి. నడుం దగ్గర కొవ్వు కరిగిపోతుంది. ఉదర సంబంధిత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఆకలిని బాగా పెంచి అజీర్తిని నివారిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలను పోగొడుతుంది.
 
మండూకాసనం
కప్ప ఆకారాన్ని పోలిన ఈ ఆసనంతో ఎన్నో ఉపయాగాలున్నాయి.మోకాళ్ల మీద కూర్చోవాలి. రెండు పిడికిళ్లు బిగించి పొట్టదగ్గర పెట్టుకోవాలి. మెల్లగా ముందుకు వంగి తలను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.

ప్రయోజనం : రోజూ మండూకాసనం వేస్తే, ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యంగా జరుగుతుంది. మధుమేహవ్యాధిగ్రస్తులకు ఎంతో ఉపకరిస్తుంది. ప్రొస్టేట్ గ్రంథి సమస్యలను రాకుండా కాపాడుతుంది. బొజ్జ బాగా తగ్గిస్తుంది.