Saturday, March 19, 2011

ప్రకృతి రంగుల్ని తినండి..!

ఇంద్రధనస్సులో సప్తవర్ణాలు ఎందుకుంటాయి..? ఆకాశం, భూమి నీలంలోనే ఎందుకు కనిపిస్తాయి..? ప్రకృతి పచ్చగా ఎందుకుంటుంది..? వీటి మధ్య బతికే మనిషి మీద ఈ రంగులన్నీ ప్రభావం చూపిస్తాయా..? అవుననే అంటున్నారు నిపుణులు. నేడు హోలీ సందర్భంగా రంగుల్ని చల్లుకోవడమే కాదు ఈ కలర్‌ఫుల్ ఫ్రూట్ బకెట్‌ను కూడా ఆరగించండి...
1. ఎరుపు : ఈ రంగు ఉద్వేగాలకు ప్రతీక. ఎరుపుతో నిగనిగలాడే స్ట్రాబెర్రీ తింటే, శరీరంలో కలిగే భావోద్వేగాలు క్రమబద్ధీకరించబడతాయి. ఇనుముతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచే జీవశక్తి ఈ ఎర్రపండులో పుష్కలం.

2. కాషాయం : శక్తికి, స్థిరత్వానికి సూచిక కావి (కాషాయ) వర్ణం. ఈ రంగు కలిగిన ఆరంజ్ తింటే విటమిన్-సి దొరుకుతుంది. అధిక రక్తపోటును బాగా నియంత్రిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది.

3. పసుపు : ఆశావాదాన్ని ప్రేరేపిస్తుంది పసుపు. యాంటీ సెప్టిక్‌గా పనిచేసే ఈ రంగు పైనాపుల్, మామిడి పండ్లలో లభిస్తుంది. విటమిన్-సి తోపాటు అనేక పోషకవిలువలున్న ఈ పండ్లను తింటే జీర్ణప్రక్రియను మెరుగుపడుతుంది.

4. ఆకుపచ్చ: ఆరోగ్య ప్రదాయిని ఆకుపచ్చ వర్ణం. అంతఃచ్చేతనాన్ని పెంచే గుణమున్న ఈ రంగు గ్రీన్ క్యాప్సికంలో అధికం. కూర వండుకుని దీన్ని తింటే ఇందులోని విటమిన్-ఎ, బి, సి మనసును నిత్యం ఉత్సాహంగా ఉంచుతుంది.

5. నీలం : దూరం నుంచి చూస్తే భూమి, ఆకాశం నీలవర్ణం కప్పుకున్నట్లు కనిపించడం సహజం. అందుకే మన శరీరం మీద కూడా నీలం ఎంతో కొంత ప్రభావం చూపిిస్తుందన్నది సత్యం. నీలంలో మెరిసే నేరేడు పండ్లు తింటే అందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.

6. ఊదా : ప్రకృతి నుంచి మన శరీరానికి నేరుగా ఔష«««ధాలను అందిస్తుంది ఈ రంగు. అందుకే ఈ రంగుతో కాసిన వంకాయలను తింటే అలాంటి ప్రయోజనం అందరికీ లభిస్తుంది అంటున్నారు నిపుణులు.

7. వైలెట్ : మనసునే కాదు, శరీరాన్ని నిత్యం చురుగ్గా ఉంచుతుంది ఈ రంగు. నల్లద్రాక్ష తింటే ఈ రంగు వల్ల కలిగే ప్రయోజనాలన్నీ మన శరీరానికి లభిస్తాయి. ద్రాక్షలో విటమిన్ - సి ఎక్కువగా దొరుకుతుంది. చదివారు కదా! మీరు రోజూ తినే పండ్లలో ఈ ఏడు రంగులు ఉండేలా చూసుకోండి. ఈ రోజు హోలీని ఎంత ఎంజాయ్ చేశారో జీవితమంతా అంతే హాయిగా గడపండి.

Thursday, March 17, 2011

అడుగుల్లో వొలికే అందం...!

చలికాలమే కాదు.. ఎండాకాలంలోనూ పాదాలను కాపాడుకోవాల్సిన అవసరం చాలా వుంది. ఎండకు కమిలి పోవడం.. నల్లగా మారడం.. వంటివి ఇప్పుడు తరచూ జరుగుతుంటాయి. అటువంటి సమయాల్లో పాదాలకు ట్రీట్‌మెంట్‌ తప్పనిసరి. దీనిని ఇంట్లోనే చేసుకోవచ్చు కూడా. ముఖ్యంగా పెడిక్యూర్‌ చేసుకుంటూ వుండాలి అని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.

pedicureపాదాలను శుభ్రం చేసుకోవడానికి ముందుగా నెయిల్‌ బ్రష్‌, నెయిల్‌ క్లిప్పర్స్‌, పూమిస్‌ స్టోన్‌, మసాజ్‌ క్రీమ్‌, నెయిల్‌ వార్నిష్‌, ఒక చిన్న టబ్‌ తీసుకోవాలి.పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు చేయబోయేది పెడిక్యూర్‌. పాదాలకి కావల్సినంత మసాజ్‌, టోనింగ్‌ దీని వల్ల లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలు దృఢంగా ఉంటాయి.

పెడిక్యూర్‌ చేయడానికి...
పెడిక్యూర్‌ చేయడానిి ఒక టబ్‌లో గోరువెెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలో షాంపూ, సగం నిమ్మకాయ, ఏదైనా నూనె, చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు 20 నిమిషాలు ఈ టబ్‌లో కాళ్లు పెట్టి కూర్చోవాలి. అంతన్నా ముందు పాదాల గోర్లపై ఉన్న నెయిల్‌ పాలిష్‌ను రిమూవర్‌ సహాయంతో తొలగించాలి. పాదాలను నీళ్లలో పెట్టిన తర్వాత మడమలు, అరికాళ్లను ప్యూమిస్‌ స్టోన్‌తో లేదా గరుకుగా ఉండే సున్నిపిండి వంటివాటితో రుద్ది శుభ్రం చేయాలి.

గోళ్లను మాలిష్‌ చేస్తూ...
pedicure1గోళ్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని చర్మం వెనుక భాగానికి బాగా తోయాలి. గోళ్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్‌ ఇవ్వాలి. ఈ సమయంలో గాయపడకుండా చూసుకోవాలి. ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోళ్లను, పాదాలను మాలిష్‌ చేయాలి.ఇష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్‌ లేదా వారంలో ఒకసారి స్క్రబ్‌ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి గోళ్లు మెరుపు కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి.

శోభి మచ్చలు తుడిచేయండి

శోభకూ... శోభికీ తేడా ఆ ‘ఇ’కారమే. ఆ - ‘ఇ’కారంతోనే అందంగా కనిపించే చర్మం వికారమవుతుంది. శోభి మచ్చలు హాని చేయవు. కానీ వికారంగా కనిపించేలా చేస్తాయి. చాలామట్టుకు వాటంతట అవే తగ్గుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం తగ్గకుండా ఇబ్బంది పెడతాయి. కొన్ని సూచనలు, మరికొన్ని జాగ్రత్తలు పాటిస్తే అసలు మచ్చలు రాకుండా చూసుకోవచ్చు. వచ్చినా తేలిగ్గా తగ్గించుకోవచ్చు. అలా మచ్చ రాకుండా తీసుకోవాల్సిన ‘ముందుజాగ్రత్త’లు ...

శోభి లేదా తెల్లమచ్చలు అనేది చర్మానికి వచ్చే అతి సామాన్యమైన వ్యాధి. ఇది చాలా సందర్భాల్లో దానంతట అదే తగ్గిపోయినా... ఒక్కోసారి ఎక్కువరోజులు ఉంటుంది. ఇది చర్మం పైపొరమీద వచ్చే ఒక రకమైన ఫంగల్ ఇన్‌ఫెక్షన్. సాధారణంగా పెద్ద వయసు వారిలోను, మధ్యవయస్సు వారిలోను కనిపిస్తుంది. దీనికి ఆడమగ భేదం లేదు. చర్మం మీద రంగులో మార్పులు వచ్చే కారణంగా దీనిని వెర్సికలర్ అని, తెలుగులో శోభి లేదా తెల్లమచ్చలు అని అంటారు.
ఎవరిలో ఎక్కువ...!
తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో, వేడి వాతావరణంలో ఉండేవారిలో

స్టెరాయిడ్లు తీసుకునేవారిలో

పౌష్టికాహార లోపం ఉన్నవారిలో

ధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో (ఈస్ట్, చర్మం మీద ఫంగస్ మొదలైనవి రాకుండా వ్యాధినిరోధక వ్యవస్థసరిగా రక్షణ కల్పించ లేకపోయినప్పుడు)

గర్భవతులలో

చెమటపట్టే శరీరధర్మం ఉన్నవారిలో

జిడ్డు చర్మం ఉన్న వారిలో

హార్మోన్ల అసమతౌల్యత ఉన్నవారిలో... ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

కొందరిలో వంశపారంపర్యంగా వస్తుంది. అంతేకాక ఆరోగ్యవంతులకు కూడా ఒక్కోసారి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దగా కంగారుపడవలసిన అవసరం లేదు.

కారణాలు: చర్మం లోపల ఉండే మెలసీజియా ఫర్‌ఫర్ అనే ఫంగస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఇది చర్మం మీద ఉండే నూనెలను, మృతకణాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ ఫంగస్ మాత్రం అందరి చర్మంలోనూ ఉన్నా కొంతమందిలో మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది. దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు కొందరి శరీరం మీద మచ్చలు వస్తాయి. వాతావరణం తేమగా, వేడిగా ఉన్నప్పుడు ప్రధానంగా వేసవిలో ఈ వ్యాధి కనిపించడానికి అవకాశం ఉంది. అయితే వాస్తవానికి ఇది ఫలానా కారణంగా వస్తుందని ఇప్పటికీ నిర్ధరించలేదు.

తెల్లమచ్చలు కనిపించడం వల్ల నలుగురిలో కి వెళ్లడానికి కొంత ఇబ్బందిగా అనిపించడం సాధారణం. ఈ వ్యాధిలో చర్మం సహజరంగును కోల్పోయి, మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలు ముదురు ఎరుపు, లేత గోధుమ, తెలుపు వర్ణాలలో ఉంటాయి. ఒక్కోసారి ఈ మచ్చలున్న చోట దురదగా అనిపించి చికాకుగా అనిపించవచ్చు. అయినప్పటికీ దీనివల్ల ఇబ్బంది ఉండదు. ఎక్కువ చెమట పట్టడం, అధికవేడి కారణంగా ఈ దురదలు రావచ్చు. ఈ మచ్చలు సాధారణంగా వీపు, భుజాలు, చేతులు, ఛాతీ, మెడ ప్రాంతాలలో కనిపిస్తాయి. అప్పుడప్పుడు ముఖం మీద కూడా కనిపిస్తాయి. చిన్నపిల్లలలో ఈ లక్షణాలు ముఖం మీద కనిపిస్తాయి. చర్మం మీద ముదురురంగు మచ్చలు ఏర్పడినప్పుడు, ఆ ప్రాంతంలో చర్మం సహజరంగు కోల్పోవడం సర్వసాధారణం.


వాతావరణం బాగా వేడిగా ఉన్నప్పుడు దాని ప్రభావం ఈ మచ్చల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ మచ్చల తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది. కొందరిలో తెల్ల రంగులో చిన్న చిన్న చుక్కలుగా కనిపిస్తే, మరికొందరిలో ఇవి ఎక్కువగా ఉంటాయి. అవి చూడటానికి సహజంగానే అనిపించినప్పటికీ ఒక్కోసారి సమస్యాత్మకంగా ఉంటాయి.

చికిత్స, నివారణ: ఈ సమస్యను చాలా తేలికగా నివారించవచ్చు. చికిత్స చాలా సులభం. ఈ మచ్చలు తొందరగా తగ్గిపోవడానికి అనేక మార్గాలున్నాయి. వేడి నీటితో స్నానం చేయడం, వ్యాయామం చేయడం వంటి చిట్కాలు పాటించడం వల్ల ఈ మచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి. అయితే చర్మపురంగు యథాస్థితికి రావడానికి మాత్రం చాలారోజులు పడుతుంది. వాతావరణం సాధారణస్థితిలోకి అంటే అధిక ఉష్ణోగ్రత నుంచి సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి వచ్చేసరికి రంగులో మార్పు వస్తుంది. అదృష్టవశాత్తూ, శోభి లేదా తెల్లమచ్చలు అంటువ్యాధి కాదు. ఒకవేళ ఈ వ్యాధి వచ్చినప్పటికీ కొద్దిరోజులకే తగ్గిపోతుంది.

ఈ వ్యాధి సోకిన వారందరికీ చికిత్స ఒకేలా ఉండదు. అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స సూచిస్తారు. ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు, వ్యాధి సోకిన వ్యక్తికి సంబంధించిన మెడికల్ హిస్టరీ... వంటి వాటిని ఆధారం చేసుకుని చికిత్స ఉంటుంది. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నివారణకి తేమ వాతావరణం అనేది తప్పనిసరి. వాటితోటు శరీరంలో సహజంగా ఉండే నూనెలు కూడా దీనిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.


కొందరు శోభిని చూసి తామర (రింగ్‌వార్మ్) గా భ్రమపడుతుంటారు. తామర వ్యాధి సోకిన భాగంలో మచ్చకు చుట్టూ అంచులు స్పష్టంగా కనపడతాయి. అలాగే దురద కూడా ఉంటుంది. వీటినే కొందరు విటిలిగో, పిటీరియాసిస్ ఆల్బా, సోరియాసిస్‌గా కూడా భ్రమపడుతుంటారు. అందువల్ల డెర్మటాలజిస్టులు ‘కెఓహెచ్’ పరీక్ష ద్వారా ఇది ఏ రకమైన చర్మవ్యాధి అనేది నిర్ధరించి, దానికి తగిన చికిత్స సూచిస్తారు.


ఇన్‌ఫెక్షన్ తగ్గాక కూడా శరీరపు రంగు యథాస్థితికి రావడానికి కొన్ని నెలలు పడుతుంది. ఇది మళ్లీ మళ్లీ రాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు పాటించడం మంచిది. ఎక్కువచెమట పట్టకుండా చూసుకుంటూ, కెటొకోనటోల్ ఉండే పౌడర్‌ను కొన్ని నెలలు వాడితే మంచిది. ఈ సూచనలు పాటించి అందమైన, ఆరోగ్యకరమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి.

జాగ్రత్తలు
ఈ వ్యాధి రాకుండా నివారించడానికి కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. అవి...

చర్మాన్ని నిరంతరం శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి

శరీరం మీద అధిక తేమ ఉండకుండా జాగ్రత్తపడాలి

గోరువెచ్చని నీటితో కాని, కొద్దిగా వేడిగా ఉన్న నీటితో కాని స్నానంచేయాలే కాని వేడివేడి నీటితో స్నానం చేయకూడదు. మరుగుతున్న నీటితో స్నానం చేయటం వలన చర్మం చిట్లినట్టుగా అయ్యి లోపల ఉండే నూనె పదార్థాలు ఉత్తేజితమయ్యి, నూనె గ్రంథులు ఏర్పడి, అధిక నూనెను బయటకు విడుదల చేస్తాయి. దీని వల్ల చర్మం మీద ఉన్న ఫంగస్ రెట్టింపవుతుంటుంది

ఎక్కువ చెమట పట్టకుండా జాగ్రత్తపడాలి

శరీరం మీద నూనె కాని నూనెకు సంబంధించిన పదార్థాలను కాని పూయకూడదు

బిగుతుగా, గాలిచొరకుండా ఉండే వస్ర్తాలను ధరించకూడదు.
మందులు
ఫంగస్ చర్మపు పైపొర మీద ఉంటుంది కనుక, చర్మానికి పై పూతగా వాడే మందులు బాగా పనిచేస్తాయి. ఒకవేళ ఈ మచ్చలు ఎక్కువగా ఉంటే, యాంటీ ఫంగల్ మందులను కడుపులోకి తీసుకోవలసి ఉంటుంది. మందులు వాడాక ఈ మచ్చలు తగ్గినట్టు అనిపించినప్పటికీ, కొంతకాలం తరవాత మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. కనక ఈ ఫంగస్ పూర్తిగా తగ్గడానికి మందులు వాడడం తప్పనిసరి.

లులిఫిన్ వంటి యాంటీ ఫంగల్ క్రీమ్‌ను ఉపయోగించవచ్చు. దీనిని సుమారు పదిరోజుల పాటు రోజుకి ఒకసారి చొప్పున మచ్చలున్న చోట అప్లై చేయవలసి ఉంటుంది. అలాగే క్లోట్రిమాజోల్, కెటొకోనజోల్ వంటి క్రీమ్స్‌ను రెండు వారాలపాటు రోజుకి రెండుసార్లు చొప్పున వాడవచ్చు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్ అధికంగా ఉంటే, ఓరల్ ట్యాబ్లెట్లను తీసుకోవలసి ఉంటుంది. ఏ మందులనైనా నిపుణులైన డెర్మటాలజిస్టు సలహా, సూచనల మేరకు తీసుకోవలసి ఉంటుంది.

Monday, March 14, 2011

స్థూలకాయం సమస్యకుపరిష్కారం .... బేరియాట్రిక్ సర్జరీ

అది జబ్బు కాదు... కానీ చాలా రకాల జబ్బులకు కేంద్రబిందువు. బిపి నుంచి గుండెజబ్బుల దాకా, కిడ్నీ నుంచి కీళ్లనొప్పుల దాకా... రకరకాల సమస్యలకు మూలకారణం. అదే.... స్థూలకాయం. అధిక బరువు నుంచి స్థూలకాయం దశకు చేరుకున్న తరువాత ఇక చిన్నచిన్న చికిత్సలేవీ పనిచేయవు. బేరియాట్రిక్ సర్జరీ ఒక్కటే మార్గం అంటున్నారు ప్రముఖ బేరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు. ఆయన అందిస్తున్న వివరాలు....

మనదేశంలో 14 శాతం మంది పురుషులు, 18 శాతం మంది మహిళలు అధిక బరువు ఉండగా, 5 శాతం మంది స్థూలకాయులేనని సర్వేలు తెలుపుతున్నాయి. కాలి వేలి నుంచి తల వరకు అధిక బరువు ప్రభావం చూపించని శరీర భాగమే లేదు. కనబడకుండా కబళించే జబ్బు ఇది. అధిక బరువు స్థూలకాయంగా పరిణమించిందంటే ఇక రోజురోజుకీ అనారోగ్యాలకు దగ్గరవుతున్నట్టే.

అధిక రక్తపోటు, గుండెపోటు, కీళ్లనొప్పులు, కిడ్నీ వ్యాధులు, మధుమేహం.... ఇలా జబ్బుల లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది. ఆధునిక జీవన విధానం తెచ్చిన ఈ సమస్యలన్నింటినీ కలిపి మూకుమ్మడిగా మెటబోలిక్ సిండ్రోమ్ అంటారు. ఈ స్థితికి వచ్చిన తరువాత బరువు తగ్గడం కోసం మనం ఇంట్లో కూర్చుని చేసే ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వవు. ఎంత డైటింగ్ చేసినా, ఎన్ని వ్యాయామాలు చేసినా ఫలితం ఆశాజనకంగా ఉండదు. ఇలాంటప్పుడు ఉపయోగపడేదే బేరియాట్రిక్ సర్జరీ.

ఎవరికి అవసరం?

మన ఎత్తు, బరువుల ఆధారంగా గణించి చెప్పేది జీవక్రియ ఆధారిత రేటు(బేసల్ మెటబోలిక్ ఇండెక్స్). అధిక బరువు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల బిఎంఐ 25 ఉంటుంది. బిఎంఐ విలువ 25 నుంచి 30 ఉంటే మంచి ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ బిఎంఐ 35 నుంచి 40 ఉంటే అధిక బరువు అంటాం. అధిక బరువు ఉన్నా, మధుమేహం, హైపర్‌టెన్షన్ సమస్యలుంటే అలాంటివాళ్లకి బేరియాట్రిక్ సర్జరీ అవసరం అవుతుంది. బిఎంఐ విలువ 40కన్నా ఎక్కువ ఉంటే వాళ్లు స్థూలకాయులన్నమాట. వీళ్లకి ఎటువంటి సమస్య లేకపోయినా భవిష్యత్తులో వచ్చే అవకాశాలెక్కువ.

కొవ్వు తీయడమేనా...?

ఈ సర్జరీ పేరు వినగానే శరీరంలో కొవ్వు తీసివేయడమేమో అనుకుంటారు. కానీ ఆ పద్ధతి వేరు.. ఈ చికిత్స వేరు. తొడలు, పిరుదులు, పొట్ట... ఇలా ఒకచోట పేరుకుపోయిన కొవ్వును తీసివేయడాన్ని లైపోసక్షన్ అంటారు. బేరియాట్రిక్ సర్జరీ అంటే కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే చికిత్స. శరీరం లోపల జీర్ణవ్యవస్థలో చిన్న మార్పులు చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

జీర్ణకోశం పరిమాణం తగ్గించడం, లేదా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా ఆనకట్ట వేయడం.. బేరియాట్రిక్ సర్జరీలో ఉన్న అంశాలు ఈ రెండే. జీర్ణకోశాన్ని నిలువుగా కోసి కొంత భాగాన్ని తీసివేయడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గిస్తారు. ఈ తీసివేసే భాగంలో గ్రెలిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతుంది. గ్రెలిన్ ఆకలి పెంచే హార్మోన్. ఈ పద్ధతి ద్వారా జీర్ణాశయ పరిమాణం తగ్గిపోవడం వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిపోతుంది. అంతేగాకుండా గ్రెలిన్ ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి ఆకలి కూడా తగ్గిపోతుంది. తద్వారా మెల్లమెల్లగా తీసుకునే కేలరీలు తగ్గుతాయి.

జీర్ణాన్ని ఆపే పద్ధతి

మరోపద్ధతి మాల్ అబ్‌సార్‌ప్షన్ పద్ధతి లేదా రెస్ట్రిక్టివ్ ఆపరేషన్. ఈ పద్ధతిలో జీర్ణకోశాన్ని అడ్డంగా స్టేపుల్ చేస్తారు. అంటే పిన్ లాంటి నిర్మాణంతో జీర్ణాశయం ఒక చివరను మూసేస్తారు. సిలికాన్ బ్యాండింగ్ మరో పద్ధతి. సన్నని ట్యూబు ద్వారా మాత్రమే ఆహారం ప్రయాణిస్తుంది. దీనివల్ల చాలా కొద్ది పరిమాణంలో ఆహారం జీర్ణాశయానికి వెళ్తుంది. మిగిలింది పూర్తిగా జీర్ణం కాకుండానే బయటకు వెళ్లిపోతుంది.

ఈ పద్ధతి ద్వారా అవసరాన్ని బట్టి బిగించిన చివరను వదులు చేసుకోవచ్చు. బైపాస్ పద్ధతి ద్వారా కూడా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేయవచ్చు. జీర్ణాశయం నుంచి డైరెక్ట్‌గా చిన్నపేగుకు దాదాపు చివరి భాగానికి బైపాస్ చేయడం వల్ల ఆహారం జీర్ణాశయం నుంచి వెంటనే ఆ చివరి భాగానికే వెళ్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఆహారం జీర్ణం కాదు. కేలరీలు ఎక్కువగా అందవు. అలా నెమ్మదిగా బరువు తగ్గుతారు.

సురక్షితమేనా?

130, 150 కిలోలు... ఇలా వంద కిలోలకు మించి బరువున్నవారికి ఆపరేషన్ చేయడం చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటివాళ్లకి కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు(క్లాట్స్) ఏర్పడే ప్రమాదం ఉంది. ఇవి ఊపరితిత్తుల వైపు వెళ్లి మరింత ప్రమాదకర పరిస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల క్లాట్స్ ఏర్పడకుండా ప్రత్యేకమైన పరికరం ద్వారా కాళ్లకు వైబ్రేషన్స్ పంపిస్తారు. రక్తం పలుచబడటానికి బ్లడ్ థిన్నింగ్ ఏజెంట్లు, హిపారిన్ ఇంజెక్షన్లు ఇస్తారు. స్లీప్ అప్నియా ఉంటే సర్జరీకి వారం ముందు నుంచే పడుకునేటప్పుడు బైపాప్ పరికరం ద్వారా ఆక్సిజన్ అందిస్తూ సర్జరీకి ప్రిపేర్ చేస్తారు.

ఇలాంటి జాగ్రత్తలెన్నో తీసుకోవడం వల్ల ఎలాంటి క్రిటికల్ కేసు అయినా, ఎంత రిస్కు ఉన్నా ఆపరేషన్ విజయవంతమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుందేమో అన్నది చాలామంది అనుమానం. అయితే తీసుకునే కొద్ది ఆహారంలోనే అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవడం అవసరం. ఇందుకోసం సర్జరీ తరువాత డాక్టర్లు సూచించిన డైట్‌చార్జ్‌ను తప్పక పాటించాల్సి ఉంటుంది.

సైడ్ ఎఫెక్ట్‌లుంటాయా?

బరువు తగ్గించే పిల్స్ మాదిరిగా ఈ ఆపరేషన్ వల్ల సైడ్ ఎఫెక్టులు ఉండవు. ఇకపోతే ఈ ఆపరేషన్ కీహోల్ ద్వారా చేస్తారు కాబట్టి శరీరంపై గాయం ఉండదు. ఇన్‌ఫెక్షన్ల అవకాశమూ ఉండదు. ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండాల్సిన అవసరం ఉండదు. వారం రోజుల తరువాత అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చు. ఆరు నెలల నుంచి ఏడాదిలోగా బరువు తగ్గుతారు. ఒక్కసారిగా బరువు తగ్గరు కాబట్టి మళ్లీ లావెక్కే అవకాశం కూడా ఒక్కసారిగా ఉండదు. ఆపరేషన్ తరువాత ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకుంటే స్థూలకాయ సమస్య మళ్లీ తలెత్తదు.
డాక్టర్ టిఎల్‌విడి ప్రసాద్‌బాబు
బేరియాట్రిక్ అండ్ సర్జికల్
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
సికింద్రాబాద్ - హైదరాబాద్
ఫోన్ : 9550001010

తిండి మానేస్తే చాలదు..!

'ఏంటే లంచ్ చెయ్యవా..'? 'లేదే... ఉపవాసం'.
'ఎప్పుడూ లేనిది ఏంటీ ఈరోజు స్పెషల్! ఏ పండగో పబ్బమో కూడా లేదు కదా!'
'హూ.. ఏం చెప్పనే. నిన్న పెళ్లికి వెళ్లామా.. అన్ని వెరైటీలు చూసేసరికి నోరూరిపోయింది. ఒక్కోటి ఒక్కో ముద్ద రుచి చూశాను గానీ రోజూ తినేదాని కన్నా రెండొంతులు పొట్టలోకి వెళ్లిపోయింది. ఆ ఆయాసం ఇప్పుడే తగ్గింది. అసలే డైటింగ్ మొదలుపెట్టి వారమే అయ్యింది. అందుకే ఈ రోజంతా తినడం మానేస్తే సరి. అంతా సర్దుకుంటుందని నిర్ణయించా.' నీరసంగా బదులిచ్చింది నీరజ.ఆమె లాంటి వాళ్లు చాలామందే ఉంటారు. కాని అలా కడుపు మాడ్చుకోవడం సరికాదంటున్నారు నిపుణులు.


*** ఒక క త్రీనా కైఫ్... ఒక కరీనా కపూర్.... జీరో ప్యాక్! అమ్మాయిల ఆకాంక్ష ఇది. నాజూకైన శరీరం కోసం పడని పాట్లు లేవు. ఎక్కడ ఏ ఫిట్‌నెస్ సెంటర్ కనిపించినా బరువు తగ్గించుకోవడానికి అక్కడ వాలిపోతూ ఉంటారు. డైటింగ్‌లతో కడుపు మాడ్చుకుంటూ ఉంటారు. డైటింగ్ చేయడం అంటే తిండి మానేయడం కాదు... క్రమబద్ధంగా తినడం అని అర్థం. కానీ ఉపవాసాలు చేయడమే డైటింగ్ అనే అపోహ చాలామందిలో ఉంది. నోటికి రుచిగా ఉంది కదా అని ఏది పడితే అది ఎడాపెడా లాగించేయడం... తరువాత పశ్చాత్తాపపడి రెండు రోజులు తిండి మానేయడం... చాలామందికి ఇది అలవాటయిపోయింది. కానీ ఇది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.

ఏది డైటింగ్...?

ఏదైనా జబ్బు చేస్తే కొద్దిరోజులు మందులు వాడతాం. అవసరమైన చికిత్సలు తీసుకుంటాం. కొన్నాళ్ల తరువాత అనారోగ్యం తగ్గగానే వాటి అవసరం ఉండదు. కానీ డైటింగ్ అలా కాదు... అధిక బరువు జబ్బు కాదు... డైటింగ్ చికిత్స కాదు. ఏదో కొంతకాలం డైటింగ్ పాటించేస్తే ఇక సమస్యలు రావు అనుకోవడానికి. జీవితాంతం పాటించాల్సిన విధానమిది. డైటింగ్ గురించి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుంటారు.

కొందరు పూర్తిగా పచ్చి కూరగాయలు, పండ్లు మాత్రమే తీసుకోవాలంటారు. మరి కొందరు రోజుకి ఒక పూటే భోజనం చేయాలంటారు. నిజానికివేవీ కరెక్ట్ కాదంటారు పోషకాహార నిపుణులు. మన శరీరానికి ప్రొటీన్లు, మినరల్స్, విటమిన్లు ఎంత అవసరమో కేలరీలు కూడా అంతే అవసరం. కాకపోతే ఇవి కాస్త తక్కువ మోతాదులో అవసరం. కేలరీలు తక్కువ అయితే కూడా పోషకాహార లోపం ఏర్పడి జబ్బు పడవచ్చు. కేవలం పచ్చి కూరగాయలు తిని వుండటం వల్ల శరీరానికి కేలరీలు అందవు.

మూడు పూటల భోజనం ఒక్కపూటే లాగించేయడమూ సరికాదు. కేలరీలందించే వాటితో పాటు అన్ని రకాల ఆహార పదార్థాలు సమపాళ్లలో తీసుకుంటేనే అందమూ, ఆరోగ్యమూను. కొంచెం కొంచెం ఎక్కువసార్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మరింత చురుగ్గా పనిచేయగలుగుతుంది. కడుపులో ఎలకలు పరుగెట్టి, కళ్లు తేలేసేంత ఆకలి కాకముందే ఏదో ఒకటి తినేస్తాం కాబట్టి ఎక్కువ మోతాదు ఆహారం తీసుకోం. అందుకే క్రమబద్దమైన ఆహారమే మేలు.

మాడితే బరువు పెరగడం ఖాయం

నిజానికి కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గడం మాట అటుంచి ఇతరత్రా సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. బరువు పెరిగే అవకాశం రెండింతలుందంటున్నారు నిపుణులు. తగినంత ఆహారం తీసుకోకుండా కడుపు మాడ్చడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అందవు. నీరసించిపోతారు. శరీరం బలహీనమైతే మెదడు కూడా చురుగ్గా పనిచేయదు. బలహీనంగా ఉన్నప్పుడు ఇన్‌ఫెక్షన్ల అవకాశాలూ పెరుగుతాయి.

అంతేగాకుండా ఎప్పుడైతే సరిపడా ఆహారం తీసుకోమో.. వెంటనే మన శరీర ం తాను నిలవ చేసుకున్న కొవ్వులను కరిగించి ఆ కేలరీలను శక్తి వినియోగానికి వాడేస్తుంది. ఈ కొవ్వు నిల్వలు అయిపోయిన తరువాత...? ఈ ముందుచూపు మన శరీరానికీ ఉంది. అందువల్ల మనం తిన్న ఆహారంలో ఎక్కువ మొత్తంలో కొవ్వులుగా మార్చేసి నిల్వ చేసుకుంటుంది. దాంతో కొవ్వు నిల్వలు పెరిగిపోతాయి. ఆ తరువాత మనం ఆహారం మామూలుగా తీసుకున్నప్పటికీ శరీరం తన అలవాటును మార్చుకోదు. అలా కడుపు ఖాళీగా ఉంచినా కొవ్వు పెరిగే అవకాశాలుంటాయి. అంతేగాక గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా తలెత్తుతాయి. అందుకే కడుపు మాడ్చితే బరువు తగ్గుతామన్నది కేవలం అపోహే.

శరీరానికీ క్రమశిక్షణ

మనం ఎలా అలవాటు చే స్తే మన శరీరం అలా తయారవుతుంది. పొట్టకి కొంచెమే ఆహారం ఇస్తే అక్కడితోనే సరిపెట్టుకుంటుంది. ఎక్కువ వేస్తూ పోతే అది కూడా బెలూన్‌లా ఉబ్బిపోతుంది. తిరిగి అంతే మోతాదులో తింటే తప్ప కడుపు నిండదు.

అందువల్ల మొదట్లోనే శరీరాన్ని క్రమశిక్షణలో పెడితే ఆ తరువాత అనారోగ్యాల పాలు కావాల్సిన పరిస్థితులు ఏర్పడవు. రోజూ ఒకే సమయానికి తింటే ప్రతిరోజూ ఠంచనుగా అదే సమయానికి ఆకలేస్తుంది. ఎన్ని ముద్దలు తింటే కరెక్ట్‌గా అంత తినగానే ఆకలికి బ్రేక్ పడుతుంది. కాబట్టి బరువు పెరిగిన తరువాత బాధపడి కడుపు మాడ్చుకునే బదులు ముందుగానే క్రమబద్ధమైన ఆహారం తీసుకోవడం సరైన డైటింగ్ పద్ధతి అన్నది నిపుణుల సూచన.

డైటింగ్ సూత్రాలు
*ఎక్కువ సార్లు తక్కువ మోతాదులో తినండి. రెండు మూడు గంటలకు ఓసారి ఏదో ఒకటి (ఫాస్ట్‌ఫుడ్ కాకుండా) తినండి. వేగంగా నోట్లో కుక్కేయకుండా మెల్లగా రుచిని ఆస్వాదిస్తూ తింటే త్వరగా కడుపు నిండుతుంది. తిన్న తృప్తి ఉంటుంది.
* ప్రాసెస్ చేసిన ఆహారం వద్దు. ఉదాహరణకి పండ్లరసాల కన్నా పండు తినడం మేలు. రోజులో నాలుగైదు సార్లు పండ్లు, సలాడ్స్ తీసుకోండి.
* సలాడ్స్ మేలు చేస్తాయని అన్నం తినడం మానేసి పూర్తిగా సలాడ్స్‌పైనే ఆధారపడటం మంచిది కాదు.
* ఎక్కువగా ఫ్రై చేసిన వాటి జోలికి వెళ్లవద్దు. మరీ తినాలనిపిస్తే ఎప్పుడో ఒకసారి కొద్దిగా రుచి చూడండి.
* కార్బోహైడ్రేట్లు, కొవ్వు పదార్థాల కన్నా ప్రొటీన్స్ ఉన్న ఆహారానికి పెద్దపీట వేయండి.

*మనం పోషకపదార్థం పరిగణించని ముఖ్యమైన పోషకం మంచినీళ్లు. సరిపడా నీళ్లు తాగడం మరవకండి.
* ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ లేబుల్స్ చూసి ఎంతైనా తీసుకోవచ్చని భ్రమపడకండి. అవి కేలరీ ఫ్రీ కాదు. ఎక్కువ కేలరీలు తీసుకుంటున్నారంటే ఎక్కువ ఫ్యాట్ ని ఆహ్వానిస్తున్నట్టే. అందుకే ఏదైనా మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోండి.
* ఆహారంతో పాటు ప్రధానమైనది వ్యాయామం. మంచి ఆహారంతో పాటు వాకింగ్ కూడా దినచర్యలో భాగమైతే బరువు పెరిగితే అడగండి.

Wednesday, March 9, 2011

ఐదు ప్రేమ ఫలాలు...

  దుటివారి ప్రేమను పొందడానికి పండ్లు ఫలాలు కూడా సహాయకారులేనని తాజాగా నిర్ధారణయ్యింది. అందులోనూ ఓ ఐదు ఫలాలు తింటే అన్యోన్యత మరింత పెరుగుతుందట. ఈ పండ్లలోని పదార్థాలు హార్మోనులపై ప్రభావం చూపి మానవ సంబంధాల మెరుగుదలకు తోడ్పడుతాయని పరిశీలకుల అభిప్రాయం.

స్ట్రాబెర్రీ... 
http://www.prajasakti.com/images_designer/article_images/2010/4/16/aptn-1271420183054.jpg
మనసు పలికే మాట వీటిని ఆరగించడంలో ప్రేమికులు పేటెంట్ పొందవచ్చట. స్ట్రాబెర్రీ వలన అంత ఉపయోగం ఉంటుందని అంటున్నారు. వీటిలో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. అది శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతూ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. 

తోటకూర ... కలకాలం తోడుగా 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiaKFfIstL3Hh6WsEqEFcKtIC3-R6MzrSz43OaWc1WiOzy-XbGjqzm-O4bZGSUeZ4yyzfZiR3x3d342-7OliCrpfbT55M2Jh4x7FaCQLXFjQmX_w_ZvaXzDNrmZS_bOnXOr5sHqbZaACt0/s400/f+thotakura.JPGఆకుకూరలు ఎల్లప్పుడూ ఆరోగ్యదాయకం. అందులో తోటకూర ప్రేమికులకు చాలా మంచిది అంటున్నారు. తోటకూరలోని పోషకాలు భావోద్వేగాలను నియంత్రిస్తాయని, దాంతో ఒకరిపై మరొకరు కోపతాపాలు ప్రదర్శించకుండా ఉంటారని అంటున్నారు.

ఫిగ్... ప్రేమికుల పాలిట ఫెవికాల్ కాల్షియం, పొటాషియంలను కలిగిన ఫిగ్ ఆరోగ్యాన్నిస్తుంది. ఆరోగ్యవంతమైన మనసులు చక్కని అనుబంధానికి పునాదులు వేస్తాయి.

అవకడో... జీవితానికో హాయి 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg6YCm8kfyeX-_FupzM_qOUOhmkNVHBvX6HLY2klDTx8Wiz7eA7YMIOijRYW7G4-Lii52Q68bcfddfbV_IVV8TXNsz1_3MfHmOoW5xlfkMANBRCKfGiPdeNmxvKWxS-LVL1UQkV-en_5y6D/s400/avocado.jpg
తన కడుపులో విటమిన్ బి6ను దాచుకున్న అవకడో కూడా చక్కని ప్రేమ ఫలం. మానసిక ఆనందానికి ఈ ఫలం ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒత్తిడిని ఎదుర్కొనే శక్తినిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితానికి అంతకుమించిన సౌఖ్యం ఇంకేం ఉంటుంది.

అరటి...
ఆరోగ్య కష్టాలు జీర్ణం ప్రేమ ఫలాల జాబితాలో చివరి స్థానం అరటిపండుది. భోజనానంతరం దీనిని సేవించమంటున్నారు. ఇది జీర్ణశక్తిపై ప్రభావం చూపుతుంది. సత్‌ఫలితాలనిస్తుంది. దీంతో ఆరోగ్యం సొంతమవుతుంది. చికాకులు చెదిరిపోయి ఆనందాలు, ఆప్యాయతలు పెరుగుతాయి.