Friday, July 1, 2011

ఆహారంతో అందం

ఎన్ని క్రీములు రాసినా కొందరి ముఖ చర్మంలో ఎటువంటి మార్పూ రాదు అనేకమందికి. టివిలలో మాత్రం అందమైన అమ్మాయిలను చూపించేసి మా క్రీము వాడినందుకే వారు అంతగా అందంగా తయారయ్యారంటూ ప్రకటనదారులు ఊదరకొడుతుంటారు. ఇది చూసిన అనేకమంది ముందూ వెనుకా ఆలోచించకుండా కొనుగోలు చేసి వాడేస్తుం టారు. అయితే కొందరిలో ఇది దుష్పరిణామాలను కూడా కలిగిస్తుంది. వీటికన్నా ముందు ఇటువంటి వారు దృష్టి పెట్టవలసింది లోపలకు తీసుకునే ఆహారం మీద అంటున్నారు సౌందర్య నిపుణులు. పౌష్టికాహారం తీసుకుంటే అదే చర్మానికి కాంతిని, నిగారింపును ఇస్తుందంటున్నారు వారు.

నారింజ...
narinjaదీనిలో విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. ఇది సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావయోలెట్‌ కిరణాల ప్రభావం చర్మంపై పడకుండా కాపాడుతుంది. చర్మం ముడుతలు పడకుండా, టైట్‌గా ఉంచే కొలాజిన్‌ను ఉత్పత్తి చెయ్యడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఒక నారింజను తినడం మంచిది. రోజుకు రెండు వందల గ్రాముల విటమిన్‌సి అవసరమవుతుంది. నారింజ రసం తాగడం కన్నా పండు రూపంలో తినడమే మంచిది.
బొప్పాయి...
papaya-fruitచూడగానే నోరూరించే ఈ పండులో తక్కువ కేలరీలుంటాయి. విటమిన్‌ సి ఎక్కువగా ఉంటుంది. నిర్జీవమైన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. బొప్పాయి గుజ్జుతో ఫేస్‌ ప్యాక్‌ కూడా వేసుకోవచ్చు. ప్రతిరోజూ ఒక కప్పు బొప్పాయి ముక్కలు తింటే మంచిది.

గోధుమలు...
wheat-వీటిలో బి గ్రూపుకు చెందిన విటమిన్‌లు సమృద్ధిగా ఉంటాయి. చర్మంలో మృత కణాల స్థానంలో కొత్త కణాల పెరుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తాయి. స్ట్రెస్‌, ఇన్‌ఫెక్షన్‌ల కారణంగా చర్మం పాడవకుండా కాపాడతాయి. పగిలిన చర్మాన్ని మృదువుగా తయారుచేస్తుంది. వీటిలో ఉండే నియాసిన్‌ చర్మ కణాలు రక్తంలో ఉన్న పోషకాలను గ్రహించేలా చేస్తుంది. గోధుమపిండితో చేసే బిస్కెట్స్‌, బ్రెడ్‌ను ఎక్కువగా తినాలి.

ప్రొద్దుతిరుగుడుపువ్వు గింజలు...
Sunflower_Seedతేలికగా, కరకరలాడే ఈ గింజలలో ఫ్యాటీ యాసిడ్స్‌ ఉంటాయి. ఇవి చర్మం తేమను కోల్పోకుండా చేసి కోమలంగా తయారు చేస్తుంది. బ్లాక్‌ెహడ్స్‌ను నిర్మూలిస్తాయి. మచ్చలు కూడా తగ్గుతాయి. వారానికి రెండు సార్లు రెండు టేబుల్‌ స్పూన్‌ ల ప్రొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. వంటకు కూడా సన్‌ ఫ్లవర్‌ నూనెను ఉపయోగించడం మంచిది.

గింజధాన్యాలు...
చర్మ కణాల పెరుగుదలకు ఉపయోగపడే ప్రోటీన్లు అధిక మోతాదులో ఉంటాయి. చుండ్రును నిర్మూలించే బయోటిన్‌ అనే పోషకం వీటిలో ఉంటుంది. జుట్టు త్వరగా పెరగడానికి తోడ్పడుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా తింటే గోళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. ధాన్యాలను ఉడకబెట్టి గుగ్గిళ్ళ రూపంలో తీసుకంటే చాలా మంచిది.

నట్స్‌...
nutsకేలరీలు, జింక్‌ అధిక శాతం ఉంటాయి. జింక్‌ దుమ్ము, ధూళి, కాలుష్యం వల్ల కలిగే రాషెస్‌ రాకుండా చేస్తుంది. క్రమం తప్పకుండా నట్స్‌ తినడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.


అలొవెరా...
aloeveraప్రతిరోజూ అలొవెరా రసం తాగడం వల్ల చర్మంపై కలిగే దురదలు, మొటిమలు, పిగ్మెంటేషన్‌ సమస్యలను తగ్గించుకోవచ్చు. రోజుకు ముపై మిల్లీ లీటర్ల జ్యూసును తీసుకోవాలి.

No comments: