చురుకైన జీవనం కోసం
చురుకుగా, ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్‌నెస్ ఎంతో అవసరం. ఫిట్‌నెస్ సరిగా లేకపోతే ఏపనీ సరిగా చేయలేము. శరీరం ఫిట్‌గా ఉంటేనే శరీరాకృతి బాగుంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవన శైలి ప్రభావం మహిళల శరీరాకృతిపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది. క్రమం తప్పకుండా ప్రార్థన చేయడం ద్వారా ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండవచ్చంటున్నారు ఫిట్‌నెస్ నిపుణులు. అదెలాగో చూద్దాం.
- కాసేపు ప్రార్ధనలో గడిపితే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.
- అలసట, ఆందోళన, నీరసాన్ని పోగొట్టి సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
- ప్రతిరోజూ క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవారికి అనారోగ్యం వచ్చే అవకాశాలు తక్కువ. ఏదైనా అనారోగ్యం బారిన పడినా త్వరగా కోలుకుంటారు.
- ప్రార్థన చేసే వారిలో డిప్రెషన్ దరిచేరదు.
- బిపిని తగ్గిస్తుంది.
- కొలెస్ట్రాల్ లెవల్స్ పెరగకుండా చూస్తుంది. దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం క్రమబద్దీకరించబడుతుంది.
- దీనితో బరువు తగ్గుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇది మీలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
- ప్రార్థనతో పాటు వాకింగ్, చిన్న చిన్న వ్యాయామాలు క్రమం తప్పకుండా చేసిచూడండి.
- మీ శరీరాకృతిలో వచ్చే తేడాను చూసి మీరే ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదేమో!
- మన కోసం మరొకరున్నారనే భావన, మనకు అండగా నిలబడతారనే భావన రావడం వల్ల వ్యక్తిలో ఆందోళన తగ్గుతుంది.
- దీనికి వ్యాయామాన్ని జోడిస్తే మరి చురుకుదనమే కాదు మనమీద మనకున్న భరోసాతోఅందం పెరుగుతుంది.
No comments:
Post a Comment