అలర్జీలు రావడానికి కారణాలు తెలియనప్పటికీ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ అలర్జీల బెడద ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, ధూళి, మంచు, కొన్ని రకాల ఆహార పదార్థాలు, కొన్ని రకాల చెట్లు, పూల పుప్పొడి, పెర్‌ఫ్యూమ్స్, కాస్మొటిక్స్ మొదలైన వాటి వల్ల అలర్జీ వచ్చే అవకాశం ఉంది.
అలర్జిక్ రైనైటిస్
మనకు సరిపడని ప్రేరణలు ముక్కుకు తగిలి, అలర్జీ మొదలైతే హిస్టామిన్ విడుదలవుతుంది. దీంతో ముక్కులోని పొరలు ఉబ్బిపోతాయి. తుమ్ములు, ముక్కు వెంట నీరు కారడం, తరువాత ముక్కులు బిగుసుకుపోవడం(నాసల్ బ్లాక్), కళ్లలో దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. దుమ్ము, ధూళి, చల్లటి పదార్థాలు, ఘాటు వాసనలు, వాతావరణ మార్పుల మూలంగా ఈ బాధలు అధికమవుతాయి. ముఖ్యంగా ముక్కులోని పొరలు వాచిన కొద్దీ వాసన పీల్చే శక్తి తగ్గిపోతుంది.
అలర్జిక్ సైనసైటిస్
ముక్కుకు ఇరువైపులా నుదుటిపైన సైనస్ గదులు ఉంటాయి. ఈ గదుల గుండా గాలి స్వేచ్ఛగా లోపలికి రావడం, బయటకు వెళ్లడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఉండే మ్యూకస్ గాలిలోని సూక్ష్మక్రిములను అడ్డుకుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గినపుడు లేక ఇతర ఇన్‌ఫెక్షన్ల వల్ల ఈ గదుల్లో చీము చేరి నొప్పి ఏర్పడుతుంది. చీముతో గదులు మూసుకునిపోవడం వల్ల గాలి తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడుతుంది.
దీనివల్ల తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ ఏర్పడుతుంది. దీన్నే సైనసైటిస్ అంటారు. తలనొప్పి, కళ్ల మధ్య, బుగ్గలపైన, నొసటిపైన నొప్పితో పాటు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, చెవి నొప్పి వంటి లక్షణాలు సైనసైటిస్‌లో కనిపిస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్‌కు గురి కావడం కూడా జరుగుతుంది. తరచుగా జలుబు చేయడం, వైరల్, బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లకు గురికావడం, అలర్జీ కారణాల వల్ల సైనసైటిస్ వస్తుంది. చల్లటి గాలికి తిరగడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం కూడా కారణమే. ఆల్కహాల్, స్మోకింగ్, కొన్ని రకాల ఫర్‌ఫ్యూమ్‌లు సైనసైటిస్‌కు కారణమవుతాయి. అలాగే ముక్కులోపల పాలిప్స్ పెరగడం, ముక్కు దూలం వంకరంగా ఉండటం కూడా కారణమవుతుంది.
ఆస్తమా
ముక్కుల్లో వచ్చే అలర్జీ, ఊపిరితిత్తులలోనికి పాకితే ఆస్తమా,బ్రాంకైటిస్ వంటివి మొదలవుతాయి. శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా ఏర్పడుతుంది. సాధారణ జలుబు, తమ్ములు, ముక్కుకారడంతో మొదలయి దగ్గు. ఆయాసం, పిల్లి కూతలు వంటి లక్షణాలు ఆస్తమాలో కనిపిస్తాయి. చల్లగాలి, దుమ్ము, ధూళి, అలర్జీ కారకాలు, వైరల్ ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్స్, మానసిక ఒత్తిడి ఆస్తమాకు కారణమవుతాయి. ఆస్తమా త్రీవమైతే శ్వాసకు ఇబ్బంది ఏర్పడుతుంది.
నాసల్ పాలిప్స్
ముక్కులోపల నీటి తిత్తుల్లా పెరుగుతాయి. వీటివల్ల ముక్కు మార్గాలు మూసుకుపోయి, శ్వాస ఆడక, రాత్రిపూట ఇబ్బందిపడతారు. శస్త్రచికిత్స చేసినా ఇవి తిరిగి ఏర్పడుతుంటాయి.
చికిత్స
అలర్జీ సమస్యకు అల్లోపతిలో యాంటీ హిస్టామైన్స్, డీకంజెస్టంట్స్, కార్టికోస్టిరాయిడ్స్ ఇస్తారు. వీటివల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. వ్యాధి పూర్తిగా తగ్గిపోదు. అంతేకాకుండా ఈ మందుల వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీన పడి కొన్ని సైడ్ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. పైగా రోగనిరోధక వ్యవస్థను పెంపొందించి అలర్జీని తగ్గించడంలో తోడ్పడతాయి. హోమియో చికిత్స తీసుకోవడంతో పాటు ఏయే పదార్థాల అలర్జీ వస్తుందో గుర్తించి వాటికి దూరంగా ఉండాలి. శస్త్రచికిత్సతో ప్రయోజనం ఉంటుంది కానీ, మూల కారణాన్ని గుర్తించి, నివారించకపోతే జీవితాంతం అలర్జీ సమస్య బాధిస్తూనే ఉంటుంది. అలర్జీని సమూలంగా తొలగించాలంటే హోమియో మందుల వల్లే సాధ్యమవుతుంది.
డా. మధు వారణాసి, ఎం.డి
ప్రముఖ హోమియో వైద్యులు
ప్లాట్ నెం 188,
వివేకానందనగర్ కాలనీ,
కూకట్‌పల్లి, హైదరాబాద్,72,
ఫోన్ : 8897331110, 040-23161444.

No comments:
Post a Comment