Monday, October 31, 2011

ఫ్యాటీలివర్ సమస్యకు శాశ్వత పరిష్కారం

శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. ఇది జీర్ణప్రక్రియకు తోడ్పడే రసాలను ఉత్పత్తి చేస్తుంది. కొందరు అధికంగా బరువు పెరగడం, కొవ్వు ఎక్కువగా పెరిగిపోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, డయాబెటిస్ వంటి కారణాల వల్ల కాలేయం కొవ్వును తొలగించలేకపోతుంది. దీనివల్ల కొవ్వు పదార్థాలు కాలేయంలో నిలువ ఉండిపోతాయి. కాలేయం సాధారణ పరిమాణం కంటే పెద్దగా అవుతుంది. సామర్థ్యం తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీలివర్ అంటారు. ఇతర సమస్యలకోసం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడు ఈ సమస్య బయటపడుతూ ఉంటుంది.

కారణాలు

కాలేయ వ్యాధులకు ప్రధాన కారణం హెపటైటిస్ ఇన్‌ఫెక్షన్. ఇదే కాకుండా ఆల్కహాల్, దీర్ఘకాలంపాటు మందులు వాడటం, విల్‌సన్స్ డిసీజ్, రోగనిరోధక వ్యవస్థలో కలిగే లోపాలు ఫ్యాటీ లివర్‌కు కారణమవుతాయి. డయాబెటిస్ ఉన్న వారు, స్థూలకాయులు, హైపర్‌ట్రైగ్లిసరిడీమియా, ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉన్న వారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

నిర్థారణ పరీక్షలు

కంప్లీట్ బ్లడ్ పిక్చర్(సి.బి.పి), లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్.ఎఫ్.టి), సి.టి లివర్, యూఎస్‌జి అబ్డామిన్, లివర్ బయాప్సీ, లిపిడ్ ప్రొఫైల్, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, ఆర్‌బిఎస్ పరీక్షలు చేయించడం ద్వారా కాలేయ పనితీరు, వ్యాధులను నిర్ధారించుకోవచ్చు.

చికిత్స

కాలేయ వ్యాధులకు హోమియోలో చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. ఫ్యాటీ లివర్ సమస్యను హోమియో మందులతో పూర్తిగా తగ్గించుకోవచ్చు. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పరిశీలించి, వ్యాధి తీవ్రతను బట్టి మందులు ఇవ్వడం జరుగుతుంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఈ మందులు వాడితే వ్యాధి త్వరగా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది.

కార్డస్‌మరైనస్ : ఈ మందు కాలేయం, నరాల మీద మంచి ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉండటం, శరీరంలో నీరు పట్టడం, కాలేయం పరిమాణం పెరగడం, ఆకలి మందగించడం, మలబద్ధకం, అర్షమొలలు, శ్వాసతీసుకోవడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ ఔషధం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఛెలిడోనియమ్ : కాలేయం సమస్యలు, తల బరువుగా ఉండటం, తల తిరగడం, కాలేయం వాపు, పచ్చకామెర్లు, పిత్తాశయంలో రాళ్లు, మలబద్ధకం, ఆయాసం, మెడనొప్పి, కుడి భుజంనొప్పి, శరీరం పచ్చరంగులోకి మారడం వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

సియోనాంతస్ : ఇది కాలేయం, ప్లీహం మీద మంచి ప్రభావం చూపుతుంది. మలేరియా, రక్తహీనత, ప్లీహం వాపు, కుడిపైపు కడుపు నొప్పి, కాలేయ వాపు, నడుం నొప్పి, అర్జంటుగా మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఉపకరిస్తుంది. లైకోపోడియమ్ : కొంచెం ఆహారం తీసుకోగానే కడుపు నిండిన ఫీలింగ్ కలగడం, కాలేయం వద్ద నొప్పి, శరీరంలో నీరు పట్టడం, కాలేయ వాపు, అర్షమొలలు, మలబద్ధకం, ఉత్సాహంగా లేకపోవడం, తీపిపదార్థాలంటే ఇష్టపడుతుండటం, చల్లదనానికి, రాత్రివేళ నొప్పి నుంచి ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలు ఉప యోగించవచ్చు.

కాల్కేరియా కార్బ్ : తెల్లగా, లావుగా ఉండి ఎక్కువ చెమటలు పట్టే తత్వం ఉన్నవారికి మంచి మందు. వంగినపుడు కాలేయం వద్ద నొప్పి, కడుపు ఉబ్బడం, ఇంగ్వైనల్ మీసెంటరిక్ గ్రంథుల వాపు ఉంటుంది. చల్లదనానికి, నిలబడినపుడు ఈ లక్షణాలు ఎక్కువవుతుంటాయి. పొడి వాతావరణంలో నొప్పి ఉన్న వైపు పడుకుంటే ఉపశమనం ఉంటుంది. ఈ తరహా లక్షణాలతో బాధపడుతున్న వారు ఈ మందు వాడవచ్చు.

మెర్క్‌సాల్ : దాహం అధికంగా ఉండటం, జీర్ణశక్తితగ్గడం, కాలేయ వాపు, పచ్చకామెర్లు, రక్తం, జిగురుతో కూడిన విరేచనాలు వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది.

మాగ్‌మూర్ : ఇది కాలేయంపైన మంచి ప్రభావం చూపుతుంది. జీర్ణశక్తి లోపించిన మహిళలకు ఇది దివ్యౌషధం. గర్భాశయ సమస్యలతో బాధపడే వారు ఉపయోగించవచ్చు. నాలుకు పచ్చరంగులో ఉండటం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అర్షమొలలు వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఉపయోగించదగిన మందు.

నక్స్‌వామికా : తేన్పులు, వికారం, వాంతులు, జీర్ణశక్తిలోపించడం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఉన్నప్పుడు నక్స్‌వామికా మందు పనిచేస్తుంది.

ఫాస్‌ఫరస్ : ఫ్యాటీ లివర్, పచ్చకామెర్లు, కడుపునొప్పి, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు, మలబద్ధకం వంటి వ్యాధి లక్షణాలు ఉన్నప్పుడు ఉపయోగించదగిన మందు.
నివారణ

* అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి.
* క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి.
* ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి.
* కొవ్వుపదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు.

డాక్టర్ టి. ప్రభాకర్, ఎండి హోమియో
హోమియో కేర్ ఇంటర్నేషనల్
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, 
ఫోన్ :955000339, 9550001188

No comments: