
చేతికున్న అయిదువేళ్లు పంచభూతాలకు ప్రతీక. బొటనవేలు అగ్ని, చూపుడువేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణులను సూచిస్తాయి.
అందుకే, వేళ్ల చివరి అంచుల్లో జరిగే కదలిక మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు యోగా నిపుణులు. ఇంకేం, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎంచక్కా రోజూ 5 నుంచి 15 నిమిషాలు మీ వేళ్లతో ఈ 'ముద్ర'లు వేసి ఆరోగ్యంగా ఉండండి.

బొటనవేలు, చూపుడువేలు కలిపి గట్టిగా వత్తాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది.
దీనివల్ల అధికరక్తపోటు తగ్గుతుంది. మైగ్రెయిన్ తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధనచేస్తే మానసిక గందరగోళం విడిపోయి, స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.

బొటనవేలును కొద్దిగా వాల్చి, చూపుడువేలును సున్నా ఆకారంలో మడవాలి.
ఈ ముద్ర వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.
ఈ ముద్రతో ఎన్నో ఉపయోగాలున్నాయి.
చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్లుండి తలతిరగడాన్ని (వెట్రిగో) తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది.
రెండుమూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి.

మధ్యవేలు, ఉంగరంవేలు రెండింటినీ బొటనవేలు చివరన తాకేలా చేయాలి. చిటికెనవేలు, చూపుడువేలు లాగిపెట్టాలి.
కలిసిన మూడువేళ్ల మధ్యా కాస్త ఒత్తిడి కలిగించాలి.
ప్రొస్టేట్, మెనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది.
శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటికి విసర్జించేందుకు సహాయపడుతుంది .

వాయుముద్రలాంటిదే ఇది. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగువేళ్లను చివరి అంచులతో బంధించాలి.
ఈ ముద్ర హృద్రోగాల తీవ్రతను తగ్గిస్తుంది.
జీర్ణకోశ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

ఉంగరం వేలు, బొటనవేలు అంచులను కలిపి.. ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడువేళ్లు ఆకాశంవైపు చూస్తుండాలి.
ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.
అధికబరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చూస్తుంది.

బొటనవేలు, ఉంగరంవేలు రెండూ మడవాలి. మిగిలిన మూడువేళ్లు నిటారుగా పెట్టుకోవాలి.
ఈ ముద్ర రెగ్యులర్‌గా చేస్తే, మానసిక నిగ్రహం పెరుగుతుంది.
అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.

చివరి రెండు వేళ్లను బొటనవేలితో కలపాలి. మిగిలిన రెండువేళ్లు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.
శక్తిముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది.
దృష్టిలోపాలను సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.

బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన మూడువేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి.
ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది.
ప్రొస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్కతడిపే అలవాటు తగ్గిపోతుంది.
అందుకే ఏ రెండు వేళ్లనయినా కలపండి. మీ ఒంట్లో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తూనే నిండు ఆరోగ్యంగా ఉంటామనుకోకండి.
పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే ప్రయోజనం ఉంటుంది.