Saturday, August 21, 2010

ఆరోగ్యప్రదాయిని దానిమ్మ

anag
పరిచయం అవసరంలేని పళ్లలో ఒకటి దానిమ్మ. కవుల వర్ణనలలో చోటుచేసుకునేవి దానిమ్మ గింజలు, దానిమ్మ మొగ్గ. ప్రత్యేకమైన విందులలో దానిమ్మరసం ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఆరోగ్యవంతులూ, అనారోగ్యవంతులూ కూడా నిస్సంకోచంగా సేవించగలిగినదీ, సేవించదగినది. దానిమ్మకి ఆరోగ్యసంరక్షణలో, అనారోగ్య చికిత్సలలో కూడా స్థానం ఉంది.

దానిమ్మ అన్ని కాలాల్లోనూ దొరికేపండు. రుచితో పాటు అన్ని ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమ్మలో అనేకం ఉన్నాయి. కేవలం ఆహారంగా తీసు కోవడానికే కాకుండా దాని గిం జల నుంచి తీసిన రసాన్ని జ్యూస్‌ గా కూడా తాగుతారు. దానిమ్మలోని అన్ని భాగాలు కూడా ఉపయోగపడేవే కావడం విశేషం. దీనిలో ఎన్నో రకాల ఖనిజ లవణాలతో పాటు ఔషధగుణాలు కూడా ఉండడం మూలంగా దీన్ని ఆరోగ్య ప్రదాయిని అనడంలో సందేహం లేదు.

ఏ భాగం వాడాలి?
వేరు, బెరడు, ఆకులూ, పువ్వులూ, పండు మీద ఉండే తొక్క, గింజలూ, రసం అన్నింటిలోనూ ఔషధగుణాలు ఉన్నాయి.

ప్రత్యేక గుణాలు : ప్రధానంగా జీర్ణమండలానికి సంబంధించిన అనేక సమస్యలలో ఔషధంగా వాడతారు. ఇది గుండెకీ, కాలే యానికీ, మూత్రపిండాలకీ కూడా మంచి టానిక్‌. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మరసంలో శరీరానికి అవసరమైన ఖనిజలవణాలన్నీ లభ్యమవుతున్నాయి.

pomegranate
ప్రయోగాలూ - ప్రయోజనాలూ : మాంసాహారం తినే వారిలో టేప్‌ వార్మ్‌ అనే పురుగు ఉండే అవకాశం ఉంది. ఈ పురుగు లేదా దాని గుడ్లు కడుపులో లేదా శరీరంలోని రకరకాల భాగాలలో ప్ర వేశించి అనేక అనారోగ్యాలకి కారణం అవుతాయి. కడు పులో ఉన్న టేప్‌వర్మ్‌ని బయటికి తీసుకురావడానికి దానిమ్మ మంచి మందు. దానిమ్మ వేర్లు లేదా చెట్టు బెర ుకి సుమారుగా నాలుగు రెట్లు నీరు చేర్చి, బాగా దంచి, రసం తీయాలి. ఈ విధంగా గంటకి ఒకసారి చొప్పు న మూడుసార్లు తీసుకోవాలి. మూడుసార్లూ అయిన తర్వాత విరేచనాలు కావ డానికి ఆముదం లేదా ఇతర ఔషధాలు తీసుకోవాలి. అప్పుడు విరేచనం ద్వారా టేప్‌ వర్మ్‌లు బయటికి వస్తాయి. వికారం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, ఇటు వంటి సమస్య లు ఉన్నవారు 10-15 మిల్లిలీటర్ల దానిమ్మరసంలో సమానంగా తేనె కలుపు కొని రోజుకి రెండుమూడు సార్ల చొప్పున వాడాలి. దీని వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది. కొంత కాలం క్రమం తప్పకుండా వాడితే కడుపులో మంట పూర్తిగా తగ్గి పోతుంది.

నీళ్ల విరేచనాలూ, లేదా జిగట విరేచనాలూ అవుతుంటే 50 మి.లీ. దానిమ్మ రసాన్ని మాటిమాటికీ ఇస్తూంటే విరేచనాలు తగ్గుతాయి. డిహైడ్రేషన్‌ సమస్య రాకుండా రక్షణ కూడా కలుగుతుంది.
దానిమ్మరసం జ్వరం తగ్గడానికి, జ్వరం వచ్చిన సందర్భంలో నోరు తడి ఆరిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఆసనం దగ్గర దురదగా ఉంటే - దానిమ్మపండు తొక్కని పెళుసుగా అయ్యే వరకూ వేయించి (నూనెలో కాదు వట్టిగానే), పొడి చేసి, కొద్దిగా నువ్వుల నూనెలో కలిపి, ఆసనం దగ్గర రాస్తూంటే తగ్గుతుంది.
మూత్రపిండాలలో లేదా మూ త్రాశయంలో చిన్న చిన్న రాళ్లు ఉన్న వారు దానిమ్మ గింజలని ముద్దగా నూరి, ఒక చెంచాముద్దని ఒక కప్పు ఉలవచారులో కలిపి, ప్రతిరోజూ తాగుతూంటే నెమ్మదిగా ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటికి వచ్చే స్తాయి.

చిగుళ్లు గట్టిపడడానికి, చిగుళ్ల నుండి రక్తం కారకుండా ఉండడానికీ, దంతాల ఆరోగ్యానికీ, దానిమ్మపండు తొక్క ఎంతగానో ఉపకరిస్తుంది. తొక్కని ఎండబెట్టి, మిరియాలూ, ఉప్పూ చేర్చి మూడిం టినీ మెత్తటి చూర్ణంగా చేసి, దానిని దంతధావనానికి వాడితే దంత సమస్యలు పరిష్కారమవు తాయి.

ఔషధాలు : దానిమ్మను పలు ఔషధా లలోనూ వాడుతారు. దా నిమ్మ పండ్ల తొక్కలని ప్రధానంగా వాడే ఔషధా లలో ప్రధానమైనవి దాడి మాష్టకచూర్ణం, భాస్కర లవణం.
దాడిమాది పానకంలో కూడా దానిమ్మరసాన్ని వాడతారు.

డాక్టర్‌ గాయత్రీ దేవిgayatridevi
ఆయుర్వేద వైద్య నిపుణులు
ఆరోగ్య పీఠం, మోతీనగర్‌, హైదరాబాద్‌,
వృక్షశాస్త్ర పరిభాషలో : Punica granatum

సంస్కృతంలో : దాడిమ

No comments: