Tuesday, August 24, 2010

కీళ్లనొప్పులు తగ్గించే గోముఖాసనం

గోవు ముఖం రూపంలో వుండటం వల్ల ఈ ఆసనానికి గోముఖాసనం అని పేరు వచ్చింది.
విధానం : వజ్రాసనంలో కూర్చోవాలి. కుడి కాలు బయటికి తీసి, ఎడమ మోకాలు మీద కుడి మోకాలు వుంచి కుడి మోచేతిని పైకి ఎత్తి ఎడమ చేత్తో కుడి చేతిని వీపు వెనుక నుంచి పట్టుకోవాలి.
శ్వాస వదులుతూ పొట్టను లోపలికి అణచాలి. నుదురును ముందుకు వంచి కుడి మోకాలుకు ఆనించాలి. ఈ విధంగా 4 లేక 5 సార్లు చేయాలి. అదే విధంగా కాళ్ళు చేతులు మార్చి రుూ క్రియ చేయాలి.

thumbz-bigstockphoto-Gomukh 

సూచన : ప్రారంభంలో చేతులు పట్టుకోవడం సాధ్యం కాకపోతే రుమాలును సాధనంగా ఉపయోగించాలి. చేతులు వెనుకకు ఎత్తలేకపోతే పాదాల బొటన వ్రేళ్ళను పట్టుకుని రుూ క్రియ చేయాలి.
లాభాలు : పొట్టలోని అవయవాలకు, పొట్ట కండరాలకు, వెన్నెముకకు లాభకారి. గ్రంధుల్లో చురుకుతనం తెస్తుంది. మెడ నొప్పులు తగ్గుతాయి. మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపోటు, హెర్నియాలకు ఈ ఆసనం పనిచేస్తుంది. శరీర అవయవాల సంధుల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

- డాక్టర్‌ ప్రవీణ్‌ కాపడియా

No comments: