Pages

Thursday, August 26, 2010

మీ ఆరోగ్యం మీ'చేతి'లో!

వాకింగ్, యోగా, ధ్యానం.. ఏం చేయాలన్నా మీ 'చేతి'వేళ్లలోనే ఉంది. వేళ్లతో యోగా ఏమిటని తీసిపారేయకండి. చెట్టుకు జీవం వేర్లు ఎలాగో, మీ శరీరానికి వేళ్లు అలాగన్నమాట. మన దేహంలో ఎక్కడెక్కడి నుంచో మొదలయ్యే నరాలన్నీ వేళ్ల చివరి అంచుల దగ్గర ఆగిపోతాయి.

చేతికున్న అయిదువేళ్లు పంచభూతాలకు ప్రతీక. బొటనవేలు అగ్ని, చూపుడువేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణులను సూచిస్తాయి.

అందుకే, వేళ్ల చివరి అంచుల్లో జరిగే కదలిక మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు యోగా నిపుణులు. ఇంకేం, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎంచక్కా రోజూ 5 నుంచి 15 నిమిషాలు మీ వేళ్లతో ఈ 'ముద్ర'లు వేసి ఆరోగ్యంగా ఉండండి.

జ్ఞాన ముద్ర (నాలెడ్జ్ సీల్)
బొటనవేలు, చూపుడువేలు కలిపి గట్టిగా వత్తాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది.

దీనివల్ల అధికరక్తపోటు తగ్గుతుంది. మైగ్రెయిన్ తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధనచేస్తే మానసిక గందరగోళం విడిపోయి, స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.





వాయు ముద్ర (విండ్ సీల్)
బొటనవేలును కొద్దిగా వాల్చి, చూపుడువేలును సున్నా ఆకారంలో మడవాలి.

ఈ ముద్ర వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.





శూన్య ముద్ర (జీరో సీల్)
మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.
ఈ ముద్రతో ఎన్నో ఉపయోగాలున్నాయి.

చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్లుండి తలతిరగడాన్ని (వెట్రిగో) తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది.
రెండుమూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి.



అపానా ముద్ర (డిసెండింగ్ ఎనర్జీ సీల్)
మధ్యవేలు, ఉంగరంవేలు రెండింటినీ బొటనవేలు చివరన తాకేలా చేయాలి. చిటికెనవేలు, చూపుడువేలు లాగిపెట్టాలి.
కలిసిన మూడువేళ్ల మధ్యా కాస్త ఒత్తిడి కలిగించాలి.

ప్రొస్టేట్, మెనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది.
శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటికి విసర్జించేందుకు సహాయపడుతుంది .


అపనా వాయుముద్ర (డిసెండింగ్ విండ్ సీల్)
వాయుముద్రలాంటిదే ఇది. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగువేళ్లను చివరి అంచులతో బంధించాలి.

ఈ ముద్ర హృద్రోగాల తీవ్రతను తగ్గిస్తుంది.
జీర్ణకోశ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.




పృథ్వీ ముద్ర (ఎర్త్ సీల్)
ఉంగరం వేలు, బొటనవేలు అంచులను కలిపి.. ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడువేళ్లు ఆకాశంవైపు చూస్తుండాలి.

ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.

అధికబరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చూస్తుంది.



సూర్య ముద్ర (సన్ సీల్)
బొటనవేలు, ఉంగరంవేలు రెండూ మడవాలి. మిగిలిన మూడువేళ్లు నిటారుగా పెట్టుకోవాలి.

ఈ ముద్ర రెగ్యులర్‌గా చేస్తే, మానసిక నిగ్రహం పెరుగుతుంది.

అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.



శక్తి ముద్ర (విటల్ ఎనర్జీ సీల్)
చివరి రెండు వేళ్లను బొటనవేలితో కలపాలి. మిగిలిన రెండువేళ్లు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.

శక్తిముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది.
దృష్టిలోపాలను సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.



వరుణ ముద్ర (వాటర్ సీల్)
బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన మూడువేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి.

ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది.
ప్రొస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్కతడిపే అలవాటు తగ్గిపోతుంది.



అందుకే ఏ రెండు వేళ్లనయినా కలపండి. మీ ఒంట్లో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తూనే నిండు ఆరోగ్యంగా ఉంటామనుకోకండి.

పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే ప్రయోజనం ఉంటుంది.

పునరుజ్జీవం కోసం పంచకర్మ

ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వైద్య విధానం, భారతీయ సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం. ఇది కేవలం ఒక వైద్య విధానమే కాదు ప్రకృతితో సహకరిస్తూ, సహజీవనం చేయించే జీవన విధానం కూడా. చికిత్సను విస్మరించకుండానే వ్యాధి నిరోధకతను నొక్కి చెప్పే ఎనిమిది ప్రధాన శాఖలు కలిగిన విధానం ఆయుర్వేద.

mortar_pestle
అలోపతి వైద్యులలా లక్షణాలపై కాక మూల కారణంపై దృష్టిని కేంద్రీకరించే ఆయుర్వేదంలో చికిత్స కూడా వ్యక్తి శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది తప్ప కేవలం వ్యాధిని బట్టి మాత్రమే కాదు. అంతేకాదు కేవలం మందులు ఇవ్వడమే కాక ఆహారం, రోజువారీ కార్యక్రమాలు, పరిసరాలు, మానసిక ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని చేసే చికిత్సకు ప్రాధాన్యతను ఇస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం సరైన జీవన విధానంతో కూడిన స్వీయ సంరక్షణను తెలిపే శాస్ర్తీయ విధానం. సాధారణ చికిత్సతో పాటుగా ఆయుర్వేదంలో ‘పంచకర్మ’ అనే ప్రత్యేక చికిత్సా పద్ధతి ఉన్నది. ఆయుర్వేద చికిత్సా శాస్త్రానికి ఈ పంచకర్మ పక్రియ కీలకమైన అంశమే కాదు ప్రాధమిక మూలం కూడా. శరీరంలోని పేరుకుపోయిన మలినాలను నిర్విషీకరణ (డీటాక్సిఫై) చేసి తిరిగి పుష్టిగా చేసేందుకు గల ప్రాచీన శాస్ర్తీయ పద్ధతే పంచకర్మ.

ఈ అయిదు పద్ధతులు:
Nasya1. వమనం (మూలికలను ఇవ్వడం ద్వారా పేరుకు పోయిన మలినాలను బయటకు వచ్చేలా చేయడం)
2. విరేచన: (మూలికలను ఇవ్వడం ద్వారా పొట్టలో పేరుకు పోయిన మలినాలను మలం ద్వారా బయటకు వచ్చేలా చేయడం)
3. వస్తి ( మందుల ద్వారా ఎనిమా)
4. నశ్య (ముక్కు ద్వారా మందులు ఇవ్వడం)
5. రక్త మోచన (శరీరంలో పేరుకుపోయిన మలిన రక్తాన్ని బయటకు పంపే ప్రక్రియ)
పంచకర్మ పద్ధతులు శరీర సహజ ప్రక్రియలను ప్రోత్సహిస్తూ అనవసరమైన మలినాలను, విషపదార్ధాలను తొలగిస్తాయి. ఆయురారోగ్యాల కోసం వాతావరణం మారినప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కర్మలు చేయించుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి లేదా శరీరంలో ఏర్పడిన రుగ్మతలను తొలగించుకోవడానికి దీనిని ఉపయోగించవచ్చు. శుశ్రుతుడు వీటిని చికిత్సలో భాగంగా పరిగణించగా, చరకుడు పంచకర్మను ప్రత్యేక విభాగంగా పేర్కొన్నాడు.

PindaSwedanaఈ ప్రక్రియలు మలినాల మూలాలను తాకి వాటిని తొలగిస్తాయి. అందుకే పంచకర్మ ప్రక్రియను 1. ఆరోగ్యం కాపాడుకునేందుకు 2. రోగ చికిత్స 3. పునఃశక్తిని పొందేందుకు చికిత్సకు ముందస్తు ప్రక్రియ అనే లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగిస్తారు.

పంచకర్మను మూడు దశలలో నిర్వహిస్తారు.
పూర్వ కర్మ: శరీరంలోని కణజాలంలో పేరుకుపోయిన మలినాలను, విషపదార్ధాలను తొలగించేందుకు ముందుకు అవి ఒక చోట చేరేలా సేకరిస్తారు.తదనంతర ప్రక్రియ ద్వారా వాటిని శరీరంలో నుంచి బయటకు వెళ్ళేలా చేస్తారు

ప్రధానకర్మ:scan (వమన తదిర ప్రాధమిక ప్రక్రియలు) ఈ ప్రక్రియలు శరీరాన్ని డీటాక్సిఫై చేసి, కణజాలాన్ని పరిపుష్టం చేస్తుంది.

పశ్చాత్‌ కర్మ: రోగి సాధారణ ఆరోగ్య స్థాయిని సాధించడానికి, జీర్ణ ప్రక్రియ మెరుగుపడటానికి అతడు/ఆమె ఆరోగ్య, శరీర తీరును బట్టి తగు ఆహార నియమాలు, మందులను ఇస్తారు. పంచకర్మలో అనుసరించే కొన్ని పద్ధతులు భౌతికంగా ఉన్న లోపాలను సరి చేయడమే కాక కణజాలాన్ని పరిపుష్టం చేసే ప్రత్యేకమైన భౌతిక చికిత్సలా ఉంటాయి. ఈ పద్ధతులు చికిత్స చేస్తున్న అంగాన్ని పరిపుష్టం, బలోపేతం చేయడమేకాక శరీరంలోని లోపాలను సరి చేసే, ఆయా అంగాల పనితీరు మెరుగుపరుస్తాయి.

చికిత్స చేస్తున్న అంగంలో రక్తసరఫరా, జీవప్రక్రియ కార్యకలాపాలు, వివిధ పద్ధతుల ద్వారా వేడిమిని ఉపయోగించి చర్మంలోని రంధ్రాలను తెరచి మసాజ్‌ చేయడం ద్వారా నిర్దేశిత అంగాలకు మందులను, పౌష్టిక పదార్ధాలను పంపడం, చర్మంలోని మలినాలను తొలగించడం ఈ ప్రక్రియలో చోటు చేసుకుంటుంది.ఆయుర్వేదంలోని పంచకర్మ థెరపీని అనేక లక్షణాలు కలిగిన సమగ్రమైన భౌతిక చికిత్సగా చెప్పుకోవచ్చు. ఆయుర్వేద వైద్య శాస్త్రంలో వ్యాధి నిర్వహణలో కీలక పాత్ర పోషించే ప్రక్రియే పంచకర్మ.
swathi
- డా స్వాతి
ఎం.డి. (ఆయుర్వేద)
గాయత్రి ఆయుర్వేదిక్‌ మల్టీ స్పెషాలిటీ సెంటర్‌,
రామచంద్రనివాస్‌ అపార్ట్‌మెంట్స్‌,
వెంగళరావ్‌నగర్‌, హైదరాబాద్‌
ఫోన్‌: 99082 53783

పక్షవాతం * ఆమూడు గంటలే అత్యంత కీలకమా?

పక్షవాతం లక్షణాలు గమనించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం చాలా అవసరం. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సిజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన 3-4 గంటల తరువాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి. ఆ తరువాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు.
పక్షవాతం ఒక భయంకర విపత్తు. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వలన కానీ, రక్తనాళాలు చిట్లడం వలన కానీ పక్షవాతం వస్తుంది. మెదడుకు అందవలసినంత రక్తం అందకపోవడం వల్ల మెదడులోని కణాలు చనిపోవడం వల్ల వచ్చే పక్షవాతాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు. 80 శాతం సందర్భాలలో ఇలా జరిగే అవకాశం ఉంటుంది. మెదడులోని రక్తనాళాలలో వచ్చే మార్పుల వలన అవి చిట్లినప్పుడు రక్తస్రావం జరిగి పక్షవాతం వస్తే దానిని హిమర్రేజిక్ స్ట్రోక్ అంటారు.

గుర్తించడం ఎలా?
అకస్మాత్తుగా కాలు, చేయి పనిచేయకుండా పోవడం, మూతి వంకరపోవడం, మాట్లాడలేకపోవడం, చూపు తగ్గిపోవడం, అకస్మాత్తుగా భరించలేని తలనొప్పి రావడం, తల తిరగడం, వాంతులు కావడం, నడవలేకపోవడం.. ఇవన్నీ పక్షవాతం లక్షణాలే. ఈ లక్షణాలను తమంతట తాము గుర్తించినా లేక ఇతరులు కనిపెట్టినా వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

కారణాలు ఇవీ..
ధూమపానం, బిపి, మధుమేహం, మద్యపానం వంటి అలవాట్లు ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువ. అధిక కొలెస్టరాల్, జన్యుపరమైన కారణాల వలన కూడా పక్షవాతం రావచ్చు.

వేగంగా స్పందించాలి..
పక్షవాతం లక్షణాలు గమనించిన వెంటనే రోగిని ఆసుపత్రికి తరలించడం చాలా అవసరం. మెదడుకు రక్తం సరఫరా తగ్గినప్పుడు క్షణక్షణానికీ మెదడులోని కణాలు (న్యూరాన్లు) ఆక్సిజన్ అందక చనిపోతూ ఉంటాయి. పక్షవాతం వచ్చిన 3-4 గంటల తరువాత ఈ కణాలు తిరిగి కోలుకోలేని రీతిలో చనిపోతాయి. ఆ తరువాత వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆ కణాలను తిరిగి బతికించలేరు. కాబట్టి పక్షవాతం వచ్చిన మొదటి మూడు గంటల్లోనే ఆసుపత్రికి వెళితే వైద్యులు టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ అనే మందులను ఇంజక్షన్ ద్వారా రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.

దీనివల్ల రక్త నాళాలలో ఏర్పడిన పూడికలు తొలగిపోతాయి. దీంతో మళ్లీ యథావిధిగా మెదడుకు రక్తం సరఫరా అయి అప్పటికే దెబ్బతిన్న మెదడులోని కణాలు తిరిగి కోలుకుంటాయి. టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ మందు ఇచ్చిన తరువాత 50 శాతం రోగుల్లో వెంటనే కాలు, చెయ్యి పని చేస్తాయి. లేదా సమస్య జటిలం కాకుండా ఆగిపోతుంది. ఫలితంగా పక్షవాతం వచ్చినప్పటికీ వారు త్వరితగతిన కోలుకునే అవకాశాలు ఏర్పడతాయి.

అయితే పక్షవాతం వచ్చిన తరువాత మూడు గంటల సమయం ఉంది కదా అని అలసత్వం ప్రదర్శించకూడదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆసుపత్రికి తీసుకువచ్చి టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇప్పిస్తే జబ్బు నయం కావడానికి అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి.

అపోహలు..
పక్షవాతం వచ్చిన వ్యక్తి శరీర బరువును బట్టి ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ రూ.45,000-60,000 వరకు ఖర్చు అవుతుంది. ఈ ఇంజక్షన్ అతి ఖరీదైనది అయినా, దీనిని తీసుకోవడం వలన 50 శాతం రోగుల్లో పక్షవాతం పూర్తిగా నయమయ్యే అవకాశముంటుంది. కాలు, చెయ్యి పడిపోవడం వలన వారం నుంచి నెల వరకు ఆసుపత్రిలో ఉండడం, ఆ కాలంలో ఉద్యోగానికి వెళ్లలేకపోవడం, కుటుంబానికి భారం కావడం వంటి వాటితో పోల్చితే ఈ ఇంజక్షన్‌కు అయ్యే ఖర్చు తక్కువే. ఈ ఇంజక్షన్ వలన మెదడులో రక్తస్రావం కావడం అరుదుగా జరగవచ్చు. అయితే కేవలం 4 నుంచి 7 శాతం మందిలో మాత్రమే ఇలా జరుగుతుంది.

ఇంజక్షన్ తీసుకోవడం ఎలా?
చాలా సందర్భాలలో పక్షవాతం వచ్చిన వెంటనే రోగిని కుటుంబ సభ్యులో, బంధువులో, స్నేహితులో వారి ఇంటికి దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇప్పించాలని భావించినప్పుడు కచ్చితంగా సీటీ స్కాన్ యంత్రం ఉండి, ఇరవైనాలుగు గంటలూ న్యూరాలజిస్ట్ అందుబాటులో ఉండే ఆసుపత్రికి తీసుకెళ్లడమే మంచిది.

అలాగే అక్కడ ఉండే డాక్టర్‌కి ఈ ఇంజక్షన్ ఇవ్వడం గురించి పూర్తి అవగాహన ఉండాలి. కాబట్టి ఎవరికైనా పక్షవాతం లక్షణాలు కనిపించినప్పుడు వారి కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు దగ్గరలో ఉన్న ఆసుపత్రి ఎమర్జెన్సీ ఫోన్ నంబరులోగాని, అక్కడ ఉండే న్యూరాలజిస్ట్‌ను ఫోన్ ద్వారా సంప్రదించి రోగిని తీసుకెళ్లడం మంచిది. ఇలా చేయడం వల్ల వెళ్లగానే వెంటనే రోగిని పరీక్షించి, సీటీ స్కాన్ చేసి, టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ ఇవ్వడానికి వీలవుతుంది.

అవగాహన పెంచాలి..
నిజానికి పాశ్చాత్య దేశాలలో పక్షవాతానికి ఈ రకమైన చికిత్స పదేళ్ల క్రితం నుంచే అందుబాటులో ఉంది. అయితే మన దేశంలో కొద్దిమంది డాక్టర్లకే ఈ టిష్యూ ప్లాస్మినోజన్ యాక్టివేటర్ ఇంజక్షన్ గురించి అవగాహన ఉండడంతో ఎక్కువ మంది పక్షవాత రోగులు తక్షణ చికిత్స పొందలేకపోతున్నారు. పాశ్చాత్య దేశాలలో మాదిరిగా మన దేశంలోనూ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయడంతోపాటుగా పక్షవాతానికి సంబంధించి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరచడం ద్వారా ఈ చికిత్సను అందరికీ అందుబాటులోనికి తీసుకురావచ్చు
.
డాక్టర్ నవీన్‌కుమార్ వెనిగళ్ళ,
కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్,
అవేర్ గ్లోబల్ హాస్పిటల్, ఎల్‌బి నగర్,
హైదరాబాద్.

ఫోన్ : 040-24111111

Tuesday, August 24, 2010

కీళ్లనొప్పులు తగ్గించే గోముఖాసనం

గోవు ముఖం రూపంలో వుండటం వల్ల ఈ ఆసనానికి గోముఖాసనం అని పేరు వచ్చింది.
విధానం : వజ్రాసనంలో కూర్చోవాలి. కుడి కాలు బయటికి తీసి, ఎడమ మోకాలు మీద కుడి మోకాలు వుంచి కుడి మోచేతిని పైకి ఎత్తి ఎడమ చేత్తో కుడి చేతిని వీపు వెనుక నుంచి పట్టుకోవాలి.
శ్వాస వదులుతూ పొట్టను లోపలికి అణచాలి. నుదురును ముందుకు వంచి కుడి మోకాలుకు ఆనించాలి. ఈ విధంగా 4 లేక 5 సార్లు చేయాలి. అదే విధంగా కాళ్ళు చేతులు మార్చి రుూ క్రియ చేయాలి.

thumbz-bigstockphoto-Gomukh 

సూచన : ప్రారంభంలో చేతులు పట్టుకోవడం సాధ్యం కాకపోతే రుమాలును సాధనంగా ఉపయోగించాలి. చేతులు వెనుకకు ఎత్తలేకపోతే పాదాల బొటన వ్రేళ్ళను పట్టుకుని రుూ క్రియ చేయాలి.
లాభాలు : పొట్టలోని అవయవాలకు, పొట్ట కండరాలకు, వెన్నెముకకు లాభకారి. గ్రంధుల్లో చురుకుతనం తెస్తుంది. మెడ నొప్పులు తగ్గుతాయి. మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపోటు, హెర్నియాలకు ఈ ఆసనం పనిచేస్తుంది. శరీర అవయవాల సంధుల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

- డాక్టర్‌ ప్రవీణ్‌ కాపడియా

ఒత్తిడి నుండి ఉపశమనం

మానసిక ఒత్తిడిని అధిగమించడానికి కొన్ని రకాల ఆహారపదార్థాలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. మనం నిత్యం తీసుకునే ఆహారపదార్థాలకు భిన్నంగా శరీరానికి, మన సుకు ఒత్తిడినుంచి విముక్తి కలిగించడానికి పండ్లు, వ్యాయమాలు, సం గీతం వంటివి ఎంతగానో ఉపయోగపడుతాయని వారంటున్నారు.

కొబ్బరి : లేత కొబ్బరి నీటిని మించిన పానీయం మరొకటి లేదు. కోల్పో యిన సత్తువ తిరిగి పొందడానికి కొబ్బరి నీరు బాగా తోడ్పడుతుంది. ఆరోగ్య రక్షణలో కొమ్మరి బొండాం బాగా పనిచేస్తుంది. ప్రకృతిలో క్రిము లు లేని అతిశుభ్రమైన, ఉల్లాసాన్నిచ్చే పానీయం.. ఒక గ్రాము ఎండు కొబ్బరిలో 175 కాలరీల శక్తి ఉంటుంది. చక్కెరపదార్థాలు, ఖనిజలవణాలు, విటమిన్లతో సమృద్ధమైన కొబ్బరి నీరు ఎంత అలసటనైనా సరే ఇట్టే పోగొట్టేస్తుంది. రక్తశుద్ధిలో కొబ్బరి నీళ్ళ పాత్ర అమోఘం. ఒక్కమాటలో చెప్పాలంటే కొబ్బరినీరు గ్లాసుడు పాలకంటే కూడా పుష్టికరమైనవి. పైగా, ఇందులో తల్లిపాలలో ఉండే లారిక్‌ యాసిడ్‌ లాంటి సుగుణాలన్నీ కూడా కలగలిసి ఉన్నాయి.

ఆరెంజ్‌ : ఆరెంజ్‌లో అత్యధికంగా లభించే సి విటమిన్‌ వల్ల ఒత్తిడి ఫలితంగా ్రశమించే హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించి మే లు చేకూరుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.

చాక్లెట్‌ : వీటిలో సహజంగా ఉండే ఫెనిలెథిలమైన్‌ (పిఇఎ) ఎండార్ఫిన్‌ స్థాయిల్ని తొలగించి సహజ సిద్దమైన యాంటీ - డిప్రెెసెంట్‌గా పనిచేస్తుంది. ఇవి కాకుండా యాప్రికాట్‌లోని కెరోటిన్‌ ఒత్తిడిని తగ్గిస్తే, పెరుగులోని విటమిన్‌ బి నెర్వస్‌ నెస్‌ను తగ్గిస్తుంది. గోధుమలో ఉండే ఐరన్‌ మెదడుకు ఆక్సి జన్‌ను ఇచ్చి ఒత్తిడిని, టెన్షన్‌ను నివారిస్తుంది. ఒమెగా3 ఫ్యాటీయాసిడ్లు అత్యధికంగా లభించే చేపలు ఒత్తిడిని తగ్గి స్తాయి. పాలలోని ల్యాక్టోస్‌ మంచి నిద్రనిచ్చి మెదడును తాజాగా, చురు కుగా ఉంచేందుకు సహకరిస్తాయి.

doit-yourself-fruitబొప్పాయి : బొప్పాయిని చాలామంది తినడానికి ఇష్టపడరు కానీ దీనిలో అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. దీనిలో ఉండే కెరోటిన్‌ విషతుల్యాల్ని తొలగిస్తుంది. దీనివల్ల శరీరం, మనస్సు తేలికపడి ఒత్తిడి ఇట్టే తగ్గిపోతుంది.

బంగాళదుంప : జింక్‌, విటమిన్‌ సి పెరిగి రోగనిరోధక శక్తి ఇనుమడిం చి మనస్సును దృఢం గా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఒత్తిడి మాయం కావాలంటే : బ్రిస్క్‌వాక్‌: జాగింగ్‌ వంటి ఏ వ్యాయా మం అయినా ఫీల్‌గుడ్‌ ఎండార్ఫిన్లను వి డుదల చేస్తుంది. వీటి తాలూకు ఫలితం దాదాపు 24 గం టల పాటు సాగుతుంది. అలానే బాగా ఇష్టపడే వ్యక్తి చేతిని పట్టుకుం టే కార్టిసాల్‌ అనే స్ట్రెస్‌ హార్మోన్‌ చాలా సులభంగా విడుదలవుతుంది. ఇది మనిషి మానసిక ఒత్తిడిని తగ్గించి వేస్తుంది.

సంగీతం, సినిమా : మెదడుపై సంగీతం మంద్రమైన ప్రభావాన్ని చూపుతుంది. నవ్వు కార్టిసాల్‌ స్థాయిల్ని తగ్గించి రోగనిరోధకశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. ప్రకృతిని వీక్షించడం ద్వారా ఏకాగ్రత పెరగడంతో పాటు పరిస్థితుల్ని సరైనా ఆలోచనతో ఎదుర్కోవడానికి, నాడీవ్యవస్థకు ప్రశాంతత చేకూర్చడానికి సహకరిస్తుందని ఆరోగ్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మేలు చేసే ఐస్‌ ముక్కలు


మేలు చేసే ఐస్‌ ముక్కలు
పిల్లలు ఐస్‌ ముక్కలన్నా...ఐస్‌ గడ్డలన్నా ఎంతగానో ఇష్టపడతారు. వాటితో వాళ్లు ఆనం దంగా ఆడుకుంటుంటారు. అవి శరీరానికి చల్లగా తగులుతుంటే పిల్లలు అదేపనిగా నోట్లో పెట్టుకుంటూ సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు. కానీ అదేదో ప్రమాదం అన్నట్లు జలుబుచేసేస్తుందని చెప్పి తల్లులు పిల్లలను వారిస్తుంటారు. అరుుతే మంచు ముక్కలు మనకు తెలియకుండానే చాలా సహాయం చేస్తాయట...అదేంటో తెలుసుకోవాలంటే ఇది చదవండి....


సాదారణంగా సున్నా డిగ్రీల సెల్సియస్‌ వద్ద నీరు ఘనీభవించి మంచు ముక్కలా తయారవుతుందని మనం చిన్నప్పుడు సైన్స్‌ పాఠాల్లో చదువుకున్నాం. అదే ఫార్ములాను ఉపయోగిం చి డీప్‌ ఫ్రిజ్‌లో ఐస్‌ క్యూబ్‌ ఫ్రేమ్‌ బాక్స్‌లో నాలుగు పలకలుగా తయారు చేసుకునే విధంగా అందులో నీరు పోసి ఉంచితే అది గడ్డ కట్టి ఐస్‌ ముక్కలు తయారవుతాయి. వాటిని బయటకు తీసి కొన్ని రకాల రుగ్మతలకు వైద్యం చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. దెబ్బలు తగిలినప్పుడు...ఒక్కోసారి ఆటల్లోగానీ, చిన్న చిన్న ప్రమాదాలలోగానీ బలంగా దెబ్బలు తగిలి కొందరికి రక్తం ఆగకుండా ధారాపాతంగా కారిపోతుంటుంది. అటువంటప్పుడు ఐస్‌ ముక్కలను మెత్తని గుడ్డలో చుట్టి ఆ భాగం తో దెబ్బ గట్టిగా తగిలిన ప్రాంతంలో నిదానంగా అదుముతు ంటే కొద్దిసేపటికి రక్తం కారడం తగ్గిపోతుంది.

cubesఒక్కోసారి రక్తం గూడు కట్టినట్లు అనిపించి మన శరీరంలో ఆ భాగమంతా తీవ్రంగా నొప్పి కలిగినా...ఇదే చికిత్సా విధానాన్ని కొనసాగించవచ్చును. దెబ్బల తాలూకు నొప్పి కూడా మెల్లిగా తగ్గిపోతుంది. ముక్కులో రక్తం కారితే..కొందరు పిల్లల్లో ముక్కు నుండి అదే పనిగా ధారాపాతంగా రక్తం కారిపోతుంటుంది. కర్చీఫ్‌ పెట్టినా...మరేది పెట్టినా అలా ధారలా కారుతుంటుంది. అలాంటప్పుడు ముక్కు రంధ్రం వద్ద ఐస్‌ ముక్కలతో అదిమిపెట్టి ఉంచితే రక్తం కారడం తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ముక్కు చుట్టూ ఐస్‌ ముక్కలతో మెల్లిగా రాస్తూ ఉండాలి. బెణుకులకీ..ఒక్కోసారి రోడ్డుమీద మనం వెళుతుండగా...చూడకుండా గోతిలో పడి కాలు జారి పడిపోయే ప్రయత్నంలో పడిపోకుండా మన శరీరాన్ని ఏదో విధంగా ఆపు జేస్తాము. అయితే ఒక్కోసారి శరీరంలో ఏదో ఒక భాగం బెణికి తీవ్రంగా బాధిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంటి వైద్యంగా ఈ ఐస్‌ ముక్కలను బెణికిన ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గొంతులో కిచ్‌కిచ్‌.. ఒక్కోసారి మనం ఎన్ని మందులు వాడి నా గొంతు గరగరలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తుం టుంది.

julyమాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. అలాంటప్పు డు ఐస్‌ ముక్కలను గొంతులో వేసుకోకుండా గొంతు పైభాగంపై పూతలా రాస్తే గరగరలాడే గొంతు మళ్లీ శ్రావ్యతను సంతరించుకుంటుంది. గాయాలకు మందు..శరీరం కాలిపోయి నల్లగా కమిలిపోయినప్పుడు...అందుబాటులో ఉండే చవకైన చికిత్స ఐస్‌ముక్కల వైద్యం మాత్రమే. వెంటనే ఆ భాగంలో ఐస్‌ ముక్కలు వేసి మృదువుగా రుద్దాలి. కొంత ఫలితం ఉంటుంది. బాధ నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల వ్యాధులకు...కొంత మందికి చిన్న వయసులోనే కీళ్లు , మోకాళ్లు నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఐస్‌ ముక్కలను తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లకు కీళ్లనొప్పులు మటుమాయం అవుతాయి.

ఆరోగ్యానికి కుంకుమపువ్వు

కుంకుమ పువ్వు అనగానే మనకు గుర్తొచ్చేది గర్భవతులైన స్ర్తీలు, ఆ తరువాత అందంలో దాని వినియోగం. కానీ కుంకుమ పువ్వు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇప్పటి మాట కాదు. మన పూర్వీకులు ఎప్పుడో ఔషధాల తయారీలో కుంకుమ పువ్వును వాడేవారని తెలుస్తోంది. దీన్ని ఎన్నో రకాల వ్యాధులను నయం చేసే మందుల్లో అప్పట్లో వారు వినియోగించేవారట. శాస్ర్తీయంగా కూడా కుంకుమ పువ్వు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య శాస్త్రం కూడా చెబుతోంది.

safronకుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్‌ ఫ్రాన్‌ అంటారు. ఇది జాఫరాన్‌ అనే అరబిక్‌ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్‌ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.

కుంకుమ పువ్వు ఉపయోగాలు...
కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది. కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.

kunkum ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్‌ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్‌ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన.గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు.

Saturday, August 21, 2010

ఉపాహారం.. ఇలా తీసుకుందాం

'హెవీగా ఫుడ్ తీసుకోవడం వల్ల విపరీతంగా లావెక్కుతున్నామని ఉపాహారం(స్నాక్స్)తో సరిపుచ్చుతుంటే... బరువు మాత్రం తగ్గడం లేదు'. ఇది మనకు కామన్‌గా నగరవాసుల నుంచి వినిపించే మాట. వాస్తవానికి స్నాక్స్‌ను ఎక్కువ పరిమాణంలో లాగించేయడమే దీనికి కారణం అంటున్నారు పోషకాహార నిపుణులు. భోజనం ముందు, తర్వాత తీసుకునే ఉపాహారం క్రమపద్ధతిలో ఉంటే బరువు తగ్గడం, ఆరోగ్యం కాపాడుకోవడం చాలా సులువు అంటున్నారు. వయసురీత్యా స్నాక్స్‌ని ఎలా తీసుకోవాలి, ఏ ఏ రూపాల్లో, ఎలాంటి సమయంలో తీసుకోవాలనేది పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.

పన్నేండేళ్లలోపు చిన్నారులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. వారికి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తే తాజా పండ్లను ముక్కలుగా కోసి ఇవ్వాలి. నట్స్‌రూపంలోనూ స్నాక్స్ ఇవ్వొచ్చు. వీటినే కాస్త రోస్ట్ చేసి ఇస్తే ఆ రుచే వేరు. ఒక వేళ చిన్నారులకు శాండ్‌విచ్ ఇష్టమైతే మధ్యలో ఫ్రూట్ ముక్కలుంచి ఇస్తే సరిపోతుంది. జంక్‌ఫుడ్ తగ్గించేందుకు ఇదో మార్గం. ఉడికిన పచ్చి బఠాణీలు, అటుకుల మిక్చర్, ఫ్రూట్‌జెల్లీ కూడా చిన్నారులతో తినిపించవచ్చు. ప్రోటీన్స్, కాల్షియం కాంబినేషన్స్‌తో స్నాక్స్ ఇస్తే మంచిది.

పన్నెండేళ్లు దాటిన వారికి
ఈ వయసు పిల్లల ఎదుగుదలకు ప్రోటీన్‌తో కూడిన ఆహారం చాలా కీలకం. డ్రై ఫ్రూట్స్, మొలకెత్తిన విత్తనాల్లో ప్రొటీన్లు కావాల్సిన మోతాదులో లభిస్తాయి. సెనగలు, పెసలు లాంటి సంప్రదాయ స్ప్రౌట్స్‌ని ఇస్తే కొవ్వు తక్కువగా ఉంటుంది. యుక్త వయసు వారికి పిజ్జా, బర్గర్లపై దృష్టి ఉంటుంది. వాళ్ల టేస్ట్‌కి తగ్గట్టుగా వెజిటబుల్ కట్‌లెట్‌ని ఇస్తే మేలు.

ఈ వయసులో కాల్షియం కూడా అవసరం. సాయంత్రం వేళల్లో స్నాక్స్‌కి బదులుగా మిల్క్‌షేక్స్ లాంటివి తీసుకోవచ్చు. పిజ్జా రూపంలో అయితే తక్కువ కొవ్వున్న చీజ్ ఇవ్వొచ్చు. సాధారణ బరువు ఉండే వారికి వారానికి ఒకసారి చీజ్, సోయా పన్నీర్ ఇవ్వడం మంచిది. అధిక బరువుతో ఇబ్బంది పడేవారికి ఇది అవసరం లేదు. ఉదయం అల్పాహారం మొదలుకొని లంచ్, డిన్నర్‌తోపాటు మనం తీసుకునే స్నాక్స్ క్యాలరీలు రెండు వేలకు మించకూడదు. ఒకవేళ స్నాక్స్ ఎక్కువగా తీసుకోవాల్సి వస్తే... మెయిన్ మీల్ తగ్గించుకోవాలి.

టీనేజర్స్ ఇలా తీసుకుంటే చాలు
సమయానికి భోజనం చేయకపోవడం యుక్త వయసు వారిలో ఉండే ప్రధాన సమస్య. ఉదయం టిఫిన్ మొదలుకొని రాత్రి భోజనం వరకు ఏదీ సమయానికి తీసుకోరు. ఇలాంటివారు ఒకేసారి ఆకలితో హెవీ మీల్స్ చేయడం వల్ల అధిక బరువు పెరుగుతారు. వీరు చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు పాటించాలి. బ్రేక్ ఫాస్ట్ పూర్తయిన రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ రూపంలో తాజా పండ్లను తీసుకోవాలి. దీంతో కావాల్సినన్ని క్యాలరీలు లభిస్తాయి. కడుపు నిండినట్లు ఉంటుంది.

మధ్యాహ్న భోజనం తరువాత కూడ ఇదే చేయాలి. మొలకెత్తిన విత్తనాలు, ఫ్యాట్ తక్కువగా ఉండే మజ్జిగ, ఇతర మిల్క్‌షేక్స్, ఫ్లేవర్ మిల్క్‌లాంటివి తీసుకోవాలి. సాధారణంగా మహిళలు 30 ఏళ్లు, పురుషులు 35 ఏళ్లు దాటిన తరువాత బరువు పెరగడం మొదలవుతుంది. అది ఊబకాయానికి దారి తీయవచ్చు. క్రమేణా రక్తపోటు, మధుమేహం వంటి రుగ్మతలకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలోనే నోటిని అదుపులో ఉంచుకోవాలి.

బ్యాలెన్స్ తప్పితే అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. బరువులేని వారు తగినంత బరువు పెరగాలంటే... మెయిన్‌మీల్‌తో పాటు పాప్‌కార్న్, మరమరాలు, చాక్లెట్ ఫ్లేవర్స్, కొవ్వు పరిమాణం తక్కువగా ఉండే స్నాక్స్ తీసుకోవాలి. బేకరీ ఐటమ్స్‌లో మైదా ఎక్కువగా ఉంటుంది. వీటిని చిన్నారులకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వయసు పైబడిన వారు
వయసుపెరిగే కొద్దీ శారీరక శ్రమ తగ్గుతుంది. బీపీ, షుగర్ దరిచేరుతుంది. దీంతో జీర్ణశక్తి సన్నగిల్లుతుంది. పెరిగే వయసురీత్యా స్నాక్స్ రూపంలో బొప్పాయి, దానిమ్మ పండ్లు, కీర దోస, క్యారెట్లు తీసుకోవడం మేలు. ఆహారంలో విటమిన్-ఎ, సి ఉండేటట్లు చూసుకోవాలి. ఓట్స్, బిస్కెట్స్‌లాంటివి కూడా తీసుకోవచ్చు.

వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. స్నాక్స్ సరైన సమయంలో తీసుకోవాలి. ఉదయం టిఫిన్ తిన్న రెండు మూడు గంటల తరువాత స్నాక్స్ తీసుకోవాలి. లంచ్ ఒంటి గంటకు ముగిస్తే 4 గంటల సమయంలో మళ్లీ స్నాక్స్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల్లోగా డిన్నర్ తప్పకుండా ముగించాలి. ఈ విధంగా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

సకల వ్యాధి నివారిణి మొరోనీ

fruit
చూపులకు సీతాఫలంలా...పై చర్మం తీసేస్తే పైన్‌యాపిల్‌లా సాదాసీదా గా కనిపించే ఆ పండు మనిషి శరీరం మీద దాడిచేసే అనేక రుగ్మతలకు కారణభూతమైన రోగధాతువుల మీదేగాక...మానవ శ రీరంలో మృతకణాలను సై తం పునరుజ్జీవింపజేయడం లో అలుపెరుగని సైనికునిలా అ విశ్రాంత పోరాటం చేసే ది వ్యౌషధ గుణాలను కలిగిన ఫలం మొరోనీ.

పదివేల సంవత్సరాల క్రితమే మొరిండా సిట్రోఫోలి యా సంతతికి చెందిన మొరోని పండు భారతదేశ ంలో విరివిగా లభ్యమయ్యే ది. అప్పట్లో ప్రజలు దీనిని ఆయుష్షు పెంచే ఫలంగా గుర్తించి ఆయుష్షుఫలం అ ని పిలిచేవారు. దీని ఫలం తీసుకుంటే రోగనిరోధకంగా పనిచేస్తుందని తన పరిశోధన ల సారాంశం చెప్పాడు.

ఏఏ రోగాలపై పనిచేస్తుంది: 1953లో డాక్టర్‌ రాల్ఫ్‌హెన్సికి అ నే బయోకెమిస్ట్‌ చేసిన విస్తత్ర పరిశోధనల్లో మొరోని ఫలం అద్భుత ఫ లితాలనిచ్చింది. రోగనిరోధక ఎం జైములు కొందరిలో చాలా తక్కువ శా తం ఉంటాయి. అటువంటివారికి రోజువారీగా మొరోనీఫలం జ్యూస్‌ క్రమం తప్పకుండా తీసుకుం టే వారిలో రోగనిరోధక శక్తి క్రమం గా పెరిగిం దని వైద్యులు ధ్రువీకరించారు.

రక్తపోటు తగ్గిస్తుంది:
noni-fruit
కొందరు హైబిపి, లోబిపితో బాధపడుతుంటారు. అయితే రక్తపోటుతో వచ్చే అనర్థాలను మొరోనీ దూరంగా ఉంచుతుంది. అధికరక్తపోటుకు గురయ్యే వ్యక్తికి గుండెజబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంతుడైన మనిషి ఈ ఫలం రోజూ తిం టే గుండెజబ్బుకు గురవకుండా ఉంటాడు.రక్తప్రసరణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందని పరిశోధనల్లో రుజువయింది.

కొలెస్ట్రాల్‌ నివారణ :మొరోనీలో కావలసిన పరిమాణంలో కాల్షియం, ఫైబర్‌ ఉండటంతో మనిషి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు శాతం కరిగించి అధిక కొలెస్ట్రల్‌తో బాధపడేవారిని ఆరోగ్యంగా ఉంచగలిగేలా చేస్తుంది.బ్రెయిన్‌, కిడ్నీ, లివర్‌:ఆరోగ్యంగా ఉన్నవాళ్లు సైతం దీనిని ప్రతినిత్యం తీసుకుంటే బ్రెయిన్‌, కిడ్నీ, లివర్‌లకు సంబంధించిన రోగాలు దరిచేరకుండా ఉంటాయి. కొంతమందికి జ్ఞాపకశక్తి ఎక్కువగా క్షీణించిపోతూ ఉంటుంది. చదువుల్లో కూడా వెనకబడిపోతుంటారు. అటువంటి వారికి కూడా ఈ ఫలం దివ్యంగా పనిచేస్తుందని పరిశోధనల్లో తేలింది.

క్యాన్సర్‌ నివారణలో...క్యాన్సర్‌ వ్యాధికి కారకమైన అల్సర్లు రాకుండా జీర్ణవ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది.కడుపులో వుండే వ్రణాలను కూడా పెరగనివ్వకుండా చేయడంలో మొరోని పాత్ర అమోఘం.ఆస్త్మాను అదుపు చేస్తుంది:నేటి కాలుష్యకారక వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ఆస్త్మా వ్యాధిగ్రస్తులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఆస్త్మాని నివారించడంలో మొరోనీకి సాటి మరొకటి లేదు.

నూతన యవ్వనం:మొరోనీ ఫలం గుజ్జును విదేశాలలో ఫేషియల్‌ క్రీమ్‌గా కూడా వాడుతున్నారు.శరీరంపై ముడుతలు, నల్లని చారలు, తెల్లమచ్చలు తొలగిపోయి శరీరం మృదువుగా తయారవుతుంది.

హెచ్‌ఐవి నివారణలో: ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే ఇటీవల 105 మంది హెచ్‌ఐవి రోగులపై దీనిని ప్రయోగించి చూడగా దాదాపు 56 శాతం అద్భుత ఫలితాలు వచ్చాయి. ఇంకా పూర్తిస్థాయిలో దీనిమీద పరిశోధనలు సాగిస్తున్నారు. ముందు ముందు ఎయిడ్స్‌ నివారించడం లోనూ ఇది ప్రముఖపాత్ర వహిస్తుం దంటే ఆశ్చర్యమే మరి.

ఆరోగ్యప్రదాయిని దానిమ్మ

anag
పరిచయం అవసరంలేని పళ్లలో ఒకటి దానిమ్మ. కవుల వర్ణనలలో చోటుచేసుకునేవి దానిమ్మ గింజలు, దానిమ్మ మొగ్గ. ప్రత్యేకమైన విందులలో దానిమ్మరసం ఉన్నత స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఆరోగ్యవంతులూ, అనారోగ్యవంతులూ కూడా నిస్సంకోచంగా సేవించగలిగినదీ, సేవించదగినది. దానిమ్మకి ఆరోగ్యసంరక్షణలో, అనారోగ్య చికిత్సలలో కూడా స్థానం ఉంది.

దానిమ్మ అన్ని కాలాల్లోనూ దొరికేపండు. రుచితో పాటు అన్ని ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు దానిమ్మలో అనేకం ఉన్నాయి. కేవలం ఆహారంగా తీసు కోవడానికే కాకుండా దాని గిం జల నుంచి తీసిన రసాన్ని జ్యూస్‌ గా కూడా తాగుతారు. దానిమ్మలోని అన్ని భాగాలు కూడా ఉపయోగపడేవే కావడం విశేషం. దీనిలో ఎన్నో రకాల ఖనిజ లవణాలతో పాటు ఔషధగుణాలు కూడా ఉండడం మూలంగా దీన్ని ఆరోగ్య ప్రదాయిని అనడంలో సందేహం లేదు.

ఏ భాగం వాడాలి?
వేరు, బెరడు, ఆకులూ, పువ్వులూ, పండు మీద ఉండే తొక్క, గింజలూ, రసం అన్నింటిలోనూ ఔషధగుణాలు ఉన్నాయి.

ప్రత్యేక గుణాలు : ప్రధానంగా జీర్ణమండలానికి సంబంధించిన అనేక సమస్యలలో ఔషధంగా వాడతారు. ఇది గుండెకీ, కాలే యానికీ, మూత్రపిండాలకీ కూడా మంచి టానిక్‌. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. దానిమ్మరసంలో శరీరానికి అవసరమైన ఖనిజలవణాలన్నీ లభ్యమవుతున్నాయి.

pomegranate
ప్రయోగాలూ - ప్రయోజనాలూ : మాంసాహారం తినే వారిలో టేప్‌ వార్మ్‌ అనే పురుగు ఉండే అవకాశం ఉంది. ఈ పురుగు లేదా దాని గుడ్లు కడుపులో లేదా శరీరంలోని రకరకాల భాగాలలో ప్ర వేశించి అనేక అనారోగ్యాలకి కారణం అవుతాయి. కడు పులో ఉన్న టేప్‌వర్మ్‌ని బయటికి తీసుకురావడానికి దానిమ్మ మంచి మందు. దానిమ్మ వేర్లు లేదా చెట్టు బెర ుకి సుమారుగా నాలుగు రెట్లు నీరు చేర్చి, బాగా దంచి, రసం తీయాలి. ఈ విధంగా గంటకి ఒకసారి చొప్పు న మూడుసార్లు తీసుకోవాలి. మూడుసార్లూ అయిన తర్వాత విరేచనాలు కావ డానికి ఆముదం లేదా ఇతర ఔషధాలు తీసుకోవాలి. అప్పుడు విరేచనం ద్వారా టేప్‌ వర్మ్‌లు బయటికి వస్తాయి. వికారం, ఆకలి లేకపోవడం, కడుపులో మంట, ఇటు వంటి సమస్య లు ఉన్నవారు 10-15 మిల్లిలీటర్ల దానిమ్మరసంలో సమానంగా తేనె కలుపు కొని రోజుకి రెండుమూడు సార్ల చొప్పున వాడాలి. దీని వలన తక్షణ ఉపశమనం కలుగుతుంది. కొంత కాలం క్రమం తప్పకుండా వాడితే కడుపులో మంట పూర్తిగా తగ్గి పోతుంది.

నీళ్ల విరేచనాలూ, లేదా జిగట విరేచనాలూ అవుతుంటే 50 మి.లీ. దానిమ్మ రసాన్ని మాటిమాటికీ ఇస్తూంటే విరేచనాలు తగ్గుతాయి. డిహైడ్రేషన్‌ సమస్య రాకుండా రక్షణ కూడా కలుగుతుంది.
దానిమ్మరసం జ్వరం తగ్గడానికి, జ్వరం వచ్చిన సందర్భంలో నోరు తడి ఆరిపోకుండా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఆసనం దగ్గర దురదగా ఉంటే - దానిమ్మపండు తొక్కని పెళుసుగా అయ్యే వరకూ వేయించి (నూనెలో కాదు వట్టిగానే), పొడి చేసి, కొద్దిగా నువ్వుల నూనెలో కలిపి, ఆసనం దగ్గర రాస్తూంటే తగ్గుతుంది.
మూత్రపిండాలలో లేదా మూ త్రాశయంలో చిన్న చిన్న రాళ్లు ఉన్న వారు దానిమ్మ గింజలని ముద్దగా నూరి, ఒక చెంచాముద్దని ఒక కప్పు ఉలవచారులో కలిపి, ప్రతిరోజూ తాగుతూంటే నెమ్మదిగా ఆ రాళ్లు మూత్రం ద్వారా బయటికి వచ్చే స్తాయి.

చిగుళ్లు గట్టిపడడానికి, చిగుళ్ల నుండి రక్తం కారకుండా ఉండడానికీ, దంతాల ఆరోగ్యానికీ, దానిమ్మపండు తొక్క ఎంతగానో ఉపకరిస్తుంది. తొక్కని ఎండబెట్టి, మిరియాలూ, ఉప్పూ చేర్చి మూడిం టినీ మెత్తటి చూర్ణంగా చేసి, దానిని దంతధావనానికి వాడితే దంత సమస్యలు పరిష్కారమవు తాయి.

ఔషధాలు : దానిమ్మను పలు ఔషధా లలోనూ వాడుతారు. దా నిమ్మ పండ్ల తొక్కలని ప్రధానంగా వాడే ఔషధా లలో ప్రధానమైనవి దాడి మాష్టకచూర్ణం, భాస్కర లవణం.
దాడిమాది పానకంలో కూడా దానిమ్మరసాన్ని వాడతారు.

డాక్టర్‌ గాయత్రీ దేవిgayatridevi
ఆయుర్వేద వైద్య నిపుణులు
ఆరోగ్య పీఠం, మోతీనగర్‌, హైదరాబాద్‌,
వృక్షశాస్త్ర పరిభాషలో : Punica granatum

సంస్కృతంలో : దాడిమ

ఆరోగ్యానికి ఆముదం

castor-plant-bean
ఆముదం చెట్లలో తెలుపు, ఎరుపు, పెద్దాముదం అనే మూడు జాతులన్నాయి. చిన్న ఆకులు గల ఆముదం చెట్టునే చిట్టాముదపు చెట్టు అంటారు. ఇది పెద్దాముదము చెట్టుకన్న శ్రేష్ఠమైనది. పొడవైన అయిదు కొనలు కలిగి అరచేయిలాగా ఆకు ఉంటుంది. ఆరోగ్యాన్ని అందివ్వటంలో మాదెప్పుడూ పై చేయి అన్నట్లుగా ఈ చెట్ట ఆకులు ఎల్లప్పుడూ పైకి ఎత్తుకునే ఉంటాయి. క్రిందికి వాలవు.

గుణాలు...
ఇది కారం, చేదు రుచులతో వేడి చేసే స్వభావం కలిగి ఉంటుంది. సమస్త వాతరోగాలనూ పోగొట్టడంలో అగ్రస్థానం దీనితే. కడుపులోను, పొత్తికడుపులోను వచ్చే నొప్పులను, రక్తవికారాలను నివారింప చేస్తుంది.
మొలలు హృద్రోగము, విషజ్వరము,కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర బంధము మొదలైన సమస్యలను కూడా సులువుగా పోగొడుతుంది. శరీరంలో పేరుకుపోయిన దుష్ట విష పదార్థాలను కరిగించి బయటకు తోసివేస్తుంది. నరాలకు సత్తువ కలిగిస్తుంది. కడుపు నొప్పిని తగ్గించటంలో ఇంత నాణ్యమైనది మరొకటి లేదని కూడా చెప్పవచ్చు.

ఆముదం వల్ల ఉపయోగాలు :
చెవిపోటుకు...
ఆముదపు ఆకులను నిప్పులపైన వెచ్చచేసి దంచి రసం తీసి, దానితో సమానంగా అల్లం రసం, నువ్వుల నూనె, అతి మధు రం, ఉప్పు కలిపి తైలం మిగిలేవరకు చిన్న మంట మీద మరగబెట్టి వడపోసి, ఆ నూనె చెవిలో పది చుక్కలు వేస్తే వెంటనే చెవిపోటు తగ్గిపోతుంది.

శరీరంపై నల్ల మచ్చలకు...
ఆముదపు గింజలు 225 తీసుకొని పై పెచ్చులు తీసివేసి, లోపలి పప్పులో 12 గ్రాముల శొంఠి పొడి కలిపి మెత్తగా నూరి, కుంకుడు గింజలంత మాత్రలు చేసి నిలువ ఉంచుకొని, పూటకు ఒక మాత్ర చొప్పున రెండు పూటలా మంచి నీళ్ళతో వేసుకొంటూ ఉంటే రెండు లేక మూడు నెలల్లో నల్లమచ్చలన్నీ సమసిపోతాయి.

బోదకాళ్ళకు...
ఆముదం వేళ్ళు, ఉమ్మెత్త వేళ్ళు, వావిలి చెట్టు వేళ్ళు, తెల్ల గలిజేరు వేళ్ళు, మునగ చెట్టు వేళ్ళు, ఆవాలు వీటిని సమానంగా తీసుకొని మంచి నీటితో దంచి రసాలు తీసి, ఆ రసం ఎంత ఉంటే అంత ఆముదం కలిపి, నూనె మాత్రమే మిగిలే వరకు మరగబెట్టి, వడపోసి, ఆ నూనెలో సగభాగం తేనె మైనం కలిపి ఆయింట్‌మెంట్‌లాగా తయారు చేసుకొని నిలువ ఉంచి, బోదకాల మీద లేపనం చేస్తూ ఉంటే కాలు యధాస్థితికి వచ్చే అవకాశం ఉంది.

దగ్గుకు...
ఆముదంలో తాలింపు వేసిన చామదుంపల కూర తింటూ ఉంటే దగ్గులు తగ్గిపోతాయి.
మూత్రపిండ వ్యాధులకు...
మంచి ప్రశస్తమైన ఆముదాన్ని రోజూ రాత్రి పడుకోబోయే ముందు పది గ్రాముల మోతాదుగా నియమబద్ధంగా శారీరక శక్తిని బట్టి సేవిస్తూ ఉంటే మూత్రపిండాలు బాగుంటాయి. మూత్ర బంధం విడిపోతుంది. మూత్ర కోశంలోని రాళ్ళు కరిగిపోతాయి.

అరికాళ్ళ మంటలకు...
ఆముదము, కొబ్బరి నూనె సమానంగా కలిపి అరికాళ్ళకు బాగా మర్దనా చేస్తూంటే, అతిత్వరగా అరికాళం్ళ మంటలు అణగిపోతాయి.

కీళ్ళ నొప్పులకు...
ఆముదము చెట్టు చిగురాకులు, ఉమ్మెత్త చిగురాకులు, జిలేే్లడు చిగురాకులు, పొగాకు చిగురాకులు వీటిని భాగాలుగా తీసుకొని మెత్తగా నూరి శనగ గింజలంత మాత్రలు చేసి గాలికి ఆరబెట్టి నిలువ ఉంచుకొని, పూటకొక మాత్ర మంచినీళ్ళతో సేవిస్తూ ఉంటే కీళ్ళ నొప్పులు హరించి పోతాయి.

సుఖనిద్రకు...
ఎర్రాముదం చెట్టు వేరు 10 గ్రాములు మోతాదుగా తీసుకొని నలగ్గొట్టి పావు లీటర్‌ నీటిలో వేసి సగం నీళ్ళు మిగిలేలా మరగబెట్టి, వడపోసి త్రాగితే సఖంగా నిద్ర పడుతుంది.

అతి నిద్రకు...
ఆముదపు చెట్టు పూవులను పాలతో నూరి కణతలకు పట్టువేసి, తల పైన కూడా వేసి కట్టుకడితే అతి మగతగా ఉండి ఎక్కువగా నిద్ర వచ్చే సమస్య నివారణ అవుతుంది.

రేచీకటికి...
మంచి వంటాముదాన్ని ప్రతి రోజూ క్రమం తప్పకుండా తలకు పెడుతూ ఉంటే, రెండు మూడు నెలలలో రేచీకటి తగ్గి పోతుంది.

గుండె గుట్టు తెలుసుకోండి

గుండె ఎలా పనిచేస్తుంది...
గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. శరీరమంతటి నుంచి రక్తం గుండెకు వెళ్ళి, అక్కడ నుండి ఊపిరి తిత్తులకు వెళ్ళడం ద్వారా రక్తంలోని కార్బన్‌డై ఆకై్సడ్‌ బయటకు నెట్టివేయబడుతుంది.అలాగే ఆక్సిజన్‌ ఊపిరితిత్తులనుండి గుండెకు చేరి అక్కడినుండి రక్తంద్వారా ఆహార పదార్ధాలతో కలిసి శరీరంలోని అన్ని భాగాలకు వెళ్తుంది.ఏ భాగానికి రక్తం అందకపోయినా ఆ భాగం దెబ్బతింటుంది. అలా దెబ్బతినడాన్ని గాంగ్రిన్‌ అంటారు.

Heartఎందుకంటే ఆ ప్రాంతానికి రక్తం అందక పోవడంతో ఆహారం, ఆక్సిజన్‌ అందదు కదా! గుండె ముడుచుకుపోవడం ద్వారానే రక్తనాళాల ద్వారా ఇలా రక్తం శరీరమంతటికీ చేరుతుంది. కాబట్టి గుండె చేసే కార్యం చాలా గొప్పదే కదా! శరీరమంతటికి వెళ్ళే రక్తం గుండెద్వారా వెళ్తున్నా, గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్నే గుండె పనిచేయడానికి తీసుకుంటుంది. అంటే గుండె ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో గమనించారా ? అదే నిస్వార్ధ బుద్ధి ని, నిర్విరామ కృషిని మనం గుండె నుండి నేర్చుకోవాలి.

గుండె దెబ్బతినేందుకు కారణాలు...
గుండె దెబ్బతిన్నా గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా ఇతర రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడ్డా కూడా శరీరంలో రక్త ప్రసరణ దెబ్బతింటుంది. గుండె దెబ్బతిన్నా, ఏ ప్రాంతంలో రక్తనాళాలు దెబ్బతిన్నా కూడా మందులతో కాక పోతే శస్తచ్రికిత్సల ద్వారా సరిచేయవచ్చు. గుండెకు రక్తం సరఫరా చేసే కరోనరీ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే హార్ట్‌ ఎటాక్‌ (గుండెపోటు) వస్తుంది. మెదడుకు సరఫరా చేసే కెరోటిడ్‌ ఆర్టరీలో అడ్డంకులు ఏర్పడితే స్ట్రోక్‌ (పక్షవాతం) వస్తుంది. గుండె నిర్విరామంగా కొట్టు కోవాలంటే దాని గోడలు బలంగా ఉండాలి.

గుండె గోడలు నీరసిస్తే గుండె సరిగా కొట్టుకోలేక హార్ట్‌ ఫెయి ల్‌ అవుతుంది. పుట్టుకతోనే గుండె నిర్మాణంలో కొన్ని లోపాలు ఏర్పడవచ్చు. వీటిని కంజెనైటల్‌ హార్ట్‌ డిసీజెస్‌ అంటారు. వీటిని శస్త్ర చికిత్సలతో సరిచేయవచ్చు. కాబట్టి పుట్టగానే పిల్లల్లో గుండెలోపాలుంటే నిర్లక్ష్యం చేయక వైద్యులను కలవాలి. ఇది వంశ పారంపర్య అనారోగ్యం. సిగరెట్లు తాగడం, క్రొవ్వు పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం లేకుండా ఉండటం, ఒత్తిడి ఎక్కువ కావడం లాంటి జీవన విధానాల వల్ల రక్తపోటు పెరుగుతుంది. దాంతో గుండె దెబ్బ తింటుంది. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోవాలి. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.గుండె కవాటాల లోపం రావచ్చు, గుండె గోడలలో చిల్లులు ఏర్పడవచ్చు. ఇలా రకరకాల గుండె అనారోగ్యాలు కలుగవచ్చు.

భయపడక్కరలేదు...
గుండె శస్త్ర చికిత్సలనగానే ఛాతీలో ఎముకలు కత్తిరిస్తారు, గుండె కొట్టుకోవడాన్ని ఆపి, కృత్రిమ గుండెకు కలిపి శస్త్ర చికిత్సలు చేస్తారు. కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది.చాలామందికి భయం ఉంటుంది.అది నాటి మాట. మరినేడు గుండెను ఆపకుం డా... బీటింగ్‌ హార్ట్‌మీదే శస్తచ్రికిత్సల్ని విజయవంతంగా నిర్వహిస్తు న్నారు. అదీ పెద్ద పెద్ద కోతలు లేకుండా ఒక సన్నటి కీహోల్‌ ద్వారా ఆపరేషన్‌ చేస్తున్నారు.గుండెకి శస్త్ర చికిత్సల్ని కీ హోల్‌ ద్వారా నిర్వహిస్తుండడంతో పెద్దకోతలు చేయాల్సిన పనిలేదు.చిన్న కోతలే కాబట్టి త్వరగా నయం అవుతుంది. రక్తస్రావం బాగా తక్కువ వుతుంది. నొప్పి తక్కువ .

హాస్పటల్‌లో ఉండే సమయం తక్కువ. ఖర్చూ తక్కువే. బైపాస్‌ సర్జరీ, కవాట మార్పిడి లాంటి శస్త్ర చికిత్సల్ని కీ హో ల్‌ ద్వారా గ్లోబల్‌ ఆసుపత్రిలో నయం చేస్తున్నాం. గుండె శస్త్ర చికి త్స లంటే ఇప్పుడు భయపడాల్సిన పని లేదు.బైపాస్‌ చేయడానికి రక్తనాళం కాలులోంచి తీసు కోవడానికి కుడా పెద్ద గాయం చేయనవసరం లేదు. చిన్న కోతతో ఇప్పుడు కాలులోంచి రక్తనాళాల్ని తీస్తున్నాం.

మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది...
గుండె అరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. అందుకు వంశపారంపర్యంగా వచ్చే వాటిని మనం ఏమీ చేయలేము కానీ, మన అలవాట్లను మాత్రం మానుకోగలం. అలా మానుకుంటూ కొత్త జీవన విధానాన్ని అలవర్చుకోవడం, గుండె ఆరో గ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ఇప్పుడు జీవన విధానం వల్ల యువతీ యువకుల్లో కూడా గుండె జబ్బులు వస్తున్నాయి.

చుట్టూ ఉన్న వాతావరణంతో పాటు మన పద్ధతులే దానికి కారణం. అందుకని మన జాగ్రత్తతో ఆరోగ్యాన్ని కాపాడు కుందాం. ఒక వేళ అనారోగ్యాలున్నా ప్రథమ దశలోనే గుర్తించాలి. అందుకు ఆరోగ్య అవ గాహనా సదస్సులు తోడ్పడ తాయి. వ్యాధిని ప్రథమ దశలోనే గుర్తిస్తే వెంటనే చికిత్స పొందవచ్చు. ఒకవేళ ఆలస్యంగా గుర్తించినా ఇప్పుడు భయ పడాల్సిన పనిలేదు. అన్నిరకాల చికిత్సలను ఇపుడు దిగ్వి జయంగా నిర్వహిస్తు న్నాం... కీ హోల్‌ లాంటి నూతన విధానాలూ అందు బాటు లో ఉన్నాయి. గుర్తించుకోండి.మీ గుండె ఆరోగ్యం మీచేతుల్లో ఉంది.

- డాక్టర్‌. ఆళ్ళ గోపాలకృష్ణ గోఖలే
గుండె శస్తచ్రికిత్సా నిపుణులు,
గ్లోబల్‌ హాస్పటల్స్‌,లకిడికాపూల్‌,
హైదరాబాద్‌-4, మొబైల్‌:98480 45810