వాకింగ్, యోగా, ధ్యానం.. ఏం చేయాలన్నా మీ 'చేతి'వేళ్లలోనే ఉంది. వేళ్లతో యోగా ఏమిటని తీసిపారేయకండి. చెట్టుకు జీవం వేర్లు ఎలాగో, మీ శరీరానికి వేళ్లు అలాగన్నమాట. మన దేహంలో ఎక్కడెక్కడి నుంచో మొదలయ్యే నరాలన్నీ వేళ్ల చివరి అంచుల దగ్గర ఆగిపోతాయి. చేతికున్న అయిదువేళ్లు పంచభూతాలకు ప్రతీక. బొటనవేలు అగ్ని, చూపుడువేలు వాయువు, మధ్యవేలు ఆకాశం, ఉంగరపు వేలు భూమి, చిటికెన వేలు వరుణులను సూచిస్తాయి.
అందుకే, వేళ్ల చివరి అంచుల్లో జరిగే కదలిక మీ శరీరంలోని ప్రతి అవయవాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది అంటున్నారు యోగా నిపుణులు. ఇంకేం, మీరు ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఎంచక్కా రోజూ 5 నుంచి 15 నిమిషాలు మీ వేళ్లతో ఈ 'ముద్ర'లు వేసి ఆరోగ్యంగా ఉండండి.
జ్ఞాన ముద్ర (నాలెడ్జ్ సీల్)బొటనవేలు, చూపుడువేలు కలిపి గట్టిగా వత్తాలి. మిగిలిన మూడు వేళ్లను నిటారుగా పెట్టుకోవాలి. ఈ ముద్ర పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది.
దీనివల్ల అధికరక్తపోటు తగ్గుతుంది. మైగ్రెయిన్ తలనొప్పికి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా సాధనచేస్తే మానసిక గందరగోళం విడిపోయి, స్థిరమైన ఆలోచనలు సిద్ధిస్తాయి.
వాయు ముద్ర (విండ్ సీల్)బొటనవేలును కొద్దిగా వాల్చి, చూపుడువేలును సున్నా ఆకారంలో మడవాలి.
ఈ ముద్ర వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
శూన్య ముద్ర (జీరో సీల్)మధ్యవేలుతో బొటనవేలును గట్టిగా బంధించాలి. మిగిలిన మూడు వేళ్లు నిటారుగా ఉంచాలి.
ఈ ముద్రతో ఎన్నో ఉపయోగాలున్నాయి.
చెవిపోటు తగ్గుతుంది. ఉన్నట్లుండి తలతిరగడాన్ని (వెట్రిగో) తగ్గిస్తుంది. థైరాయిడ్ సమస్యలను నయం చేస్తుంది.
రెండుమూడు రోజులు చేస్తే ఫలితం ఉండదు. రెగ్యులర్‌గా చేయాలి.
అపానా ముద్ర (డిసెండింగ్ ఎనర్జీ సీల్)మధ్యవేలు, ఉంగరంవేలు రెండింటినీ బొటనవేలు చివరన తాకేలా చేయాలి. చిటికెనవేలు, చూపుడువేలు లాగిపెట్టాలి.
కలిసిన మూడువేళ్ల మధ్యా కాస్త ఒత్తిడి కలిగించాలి.
ప్రొస్టేట్, మెనోపాజ్ సమస్యలను ఇది బాగా తగ్గిస్తుంది.
శరీరంలోని విషతుల్య పదార్థాలను బయటికి విసర్జించేందుకు సహాయపడుతుంది .
అపనా వాయుముద్ర (డిసెండింగ్ విండ్ సీల్)వాయుముద్రలాంటిదే ఇది. చిటికెన వేలు తప్ప మిగిలిన నాలుగువేళ్లను చివరి అంచులతో బంధించాలి.
ఈ ముద్ర హృద్రోగాల తీవ్రతను తగ్గిస్తుంది.
జీర్ణకోశ సంబంధ వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
పృథ్వీ ముద్ర (ఎర్త్ సీల్)ఉంగరం వేలు, బొటనవేలు అంచులను కలిపి.. ఒత్తిడి కలిగించాలి. మిగిలిన మూడువేళ్లు ఆకాశంవైపు చూస్తుండాలి.
ఈ ముద్ర మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.
అధికబరువును తగ్గించడమే కాదు, భవిష్యత్తులో బరువు పెరగకుండా కూడా చూస్తుంది.
సూర్య ముద్ర (సన్ సీల్)బొటనవేలు, ఉంగరంవేలు రెండూ మడవాలి. మిగిలిన మూడువేళ్లు నిటారుగా పెట్టుకోవాలి.
ఈ ముద్ర రెగ్యులర్‌గా చేస్తే, మానసిక నిగ్రహం పెరుగుతుంది.
అధిక ఒత్తిళ్ల వల్ల వచ్చే మధుమేహాన్ని నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగకుండా కాపాడుతుంది.
శక్తి ముద్ర (విటల్ ఎనర్జీ సీల్)చివరి రెండు వేళ్లను బొటనవేలితో కలపాలి. మిగిలిన రెండువేళ్లు ఒకదానికొకటి తాకుతూ ఉండాలి.
శక్తిముద్ర అన్నిటికంటే శక్తివంతమైనది. జీవన సామర్థ్యాన్ని పెంచుతుంది.
దృష్టిలోపాలను సరిచేస్తూనే కంటిచూపును మెరుగుపరుస్తుంది.
వరుణ ముద్ర (వాటర్ సీల్)బొటనవేలు, చివరివేలు కలిపితే వరుణముద్ర. మిగిలిన మూడువేళ్లను ఒకదానికొకటి తాకకుండా కాస్త ఎడంగా ఉంచాలి.
ఈ ముద్ర వల్ల కిడ్నీల సామర్థ్యం పెరుగుతుంది.
ప్రొస్టేట్ సమస్యలు తొలగిపోతాయి. రాత్రిళ్లు పక్కతడిపే అలవాటు తగ్గిపోతుంది.
అందుకే ఏ రెండు వేళ్లనయినా కలపండి. మీ ఒంట్లో ఏదో ఒక భాగం ఆరోగ్యంగా ఉంటుంది. కేవలం ఈ ముద్రలు వేస్తూనే నిండు ఆరోగ్యంగా ఉంటామనుకోకండి.
పోషక విలువలున్న ఆహారం తీసుకుంటూ, చక్కటి వ్యాయామం చేస్తూ ఈ ముద్రలు వేస్తే ప్రయోజనం ఉంటుంది.

1. వమనం (మూలికలను ఇవ్వడం ద్వారా పేరుకు పోయిన మలినాలను బయటకు వచ్చేలా చేయడం)
ఈ ప్రక్రియలు మలినాల మూలాలను తాకి వాటిని తొలగిస్తాయి. అందుకే పంచకర్మ ప్రక్రియను 1. ఆరోగ్యం కాపాడుకునేందుకు 2. రోగ చికిత్స 3. పునఃశక్తిని పొందేందుకు చికిత్సకు ముందస్తు ప్రక్రియ అనే లక్ష్యాలను సాధించేందుకు ఉపయోగిస్తారు.
(వమన తదిర ప్రాధమిక ప్రక్రియలు) ఈ ప్రక్రియలు శరీరాన్ని డీటాక్సిఫై చేసి, కణజాలాన్ని పరిపుష్టం చేస్తుంది.
ం డాక్టర్ నవీన్‌కుమార్ వెనిగళ్ళ,
ఒక్కోసారి రక్తం గూడు కట్టినట్లు అనిపించి మన శరీరంలో ఆ భాగమంతా తీవ్రంగా నొప్పి కలిగినా...ఇదే చికిత్సా విధానాన్ని కొనసాగించవచ్చును. దెబ్బల తాలూకు నొప్పి కూడా మెల్లిగా తగ్గిపోతుంది. ముక్కులో రక్తం కారితే..కొందరు పిల్లల్లో ముక్కు నుండి అదే పనిగా ధారాపాతంగా రక్తం కారిపోతుంటుంది. కర్చీఫ్ పెట్టినా...మరేది పెట్టినా అలా ధారలా కారుతుంటుంది. అలాంటప్పుడు ముక్కు రంధ్రం వద్ద ఐస్ ముక్కలతో అదిమిపెట్టి ఉంచితే రక్తం కారడం తగ్గుతుంది. ఆ తర్వాత కూడా ముక్కు చుట్టూ ఐస్ ముక్కలతో మెల్లిగా రాస్తూ ఉండాలి. బెణుకులకీ..ఒక్కోసారి రోడ్డుమీద మనం వెళుతుండగా...చూడకుండా గోతిలో పడి కాలు జారి పడిపోయే ప్రయత్నంలో పడిపోకుండా మన శరీరాన్ని ఏదో విధంగా ఆపు జేస్తాము. అయితే ఒక్కోసారి శరీరంలో ఏదో ఒక భాగం బెణికి తీవ్రంగా బాధిస్తుంటుంది. అలాంటప్పుడు ఇంటి వైద్యంగా ఈ ఐస్ ముక్కలను బెణికిన ప్రాంతంలో రాస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. గొంతులో కిచ్‌కిచ్.. ఒక్కోసారి మనం ఎన్ని మందులు వాడి నా గొంతు గరగరలాడుతూ చాలా ఇబ్బంది కలిగిస్తుం టుంది.
మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాము. అలాంటప్పు డు ఐస్ ముక్కలను గొంతులో వేసుకోకుండా గొంతు పైభాగంపై పూతలా రాస్తే గరగరలాడే గొంతు మళ్లీ శ్రావ్యతను సంతరించుకుంటుంది. గాయాలకు మందు..శరీరం కాలిపోయి నల్లగా కమిలిపోయినప్పుడు...అందుబాటులో ఉండే చవకైన చికిత్స ఐస్‌ముక్కల వైద్యం మాత్రమే. వెంటనే ఆ భాగంలో ఐస్ ముక్కలు వేసి మృదువుగా రుద్దాలి. కొంత ఫలితం ఉంటుంది. బాధ నుండి సత్వరమే ఉపశమనం కలుగుతుంది. కీళ్ల వ్యాధులకు...కొంత మందికి చిన్న వయసులోనే కీళ్లు , మోకాళ్లు నొప్పులు వస్తుంటాయి. అలాంటి వారికి ఐస్ ముక్కలను తీసుకుని నొప్పి ఉన్న ప్రాంతంలో రాస్తూ ఉండాలి. ఇలా చేస్తే కొన్నాళ్లకు కీళ్లనొప్పులు మటుమాయం అవుతాయి.
కుంకుమ పువ్వును ఇంగ్లీషులో శాఫ్రాన్ ఫ్రాన్ అంటారు. ఇది జాఫరాన్ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. అరబిక్‌లో జాఫరిన్ అంటే పసుపు అని అర్థం. కుంకుమ పువ్వు అందించే మొక్కలను ప్రత్యేకంగా పెంచుతారు. పువ్వు మధ్య ఉండే రేణువులను తీసి కుంకుమ పువ్వు తయారు చేస్తారు. ఒక కిలో కుంకుమపువ్వు తయారు చేయాలంటే కనీసం రెండులక్షల పూలు అవసరమవుతాయి. అందుకే వీటి ధర చాలా అధికంగా ఉంటుంది. కుంకుమ పువ్వు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటుంది.
ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్మిటర్లను, డోపమైన్ ఫైన్లను వృద్ధి చేస్తుంది. దీనిలో క్యాన్సర్‌ను నివారించే కీమో-ప్రివెంటివ్ లక్షణాలున్నట్లు కూడా తాజా పరిశో ధనలో గుర్తించారు. అయితే కిడ్నీ, నరాలకు ఇబ్బంది కలిగించే టాక్సిన్ దీనిలో వుంది కాబ ట్టి ఎక్కువ మోతాదులో వినియోగించవద్దని వైద్యుల సూచన.గర్భవతులు అయిన స్త్రీలు కుంకుమపువ్వు పాలల్లో వేసుకుని తాగితే పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుడతారని అంటారు. అది వాస్తవమే అయినప్పటికీ కేవలం గర్భవతులే కాదు. కుంకుమ పువ్వును ఎవ్వరైనా తీసుకోవచ్చు. కుంకుమ పువ్వు తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగవుతుందని వైద్యులు అంటున్నారు.

పన్నేండేళ్లలోపు చిన్నారులకు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది. వారికి స్నాక్స్ ఇవ్వాల్సి వస్తే తాజా పండ్లను ముక్కలుగా కోసి ఇవ్వాలి. నట్స్‌రూపంలోనూ స్నాక్స్ ఇవ్వొచ్చు. వీటినే కాస్త రోస్ట్ చేసి ఇస్తే ఆ రుచే వేరు. ఒక వేళ చిన్నారులకు శాండ్విచ్ ఇష్టమైతే మధ్యలో ఫ్రూట్ ముక్కలుంచి ఇస్తే సరిపోతుంది. జంక్‌ఫుడ్ తగ్గించేందుకు ఇదో మార్గం. ఉడికిన పచ్చి బఠాణీలు, అటుకుల మిక్చర్, ఫ్రూట్‌జెల్లీ కూడా చిన్నారులతో తినిపించవచ్చు. ప్రోటీన్స్, కాల్షియం కాంబినేషన్స్‌తో స్నాక్స్ ఇస్తే మంచిది.





ఎందుకంటే ఆ ప్రాంతానికి రక్తం అందక పోవడంతో ఆహారం, ఆక్సిజన్ అందదు కదా! గుండె ముడుచుకుపోవడం ద్వారానే రక్తనాళాల ద్వారా ఇలా రక్తం శరీరమంతటికీ చేరుతుంది. కాబట్టి గుండె చేసే కార్యం చాలా గొప్పదే కదా! శరీరమంతటికి వెళ్ళే రక్తం గుండెద్వారా వెళ్తున్నా, గుండెకు ఎంత రక్తం తగ్గినా ఆ రక్తంలోంచి తీసుకోదు. తనకి రక్తం సరఫరా చేసే నాళాల నుంచి వచ్చే రక్తాన్నే గుండె పనిచేయడానికి తీసుకుంటుంది. అంటే గుండె ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో గమనించారా ? అదే నిస్వార్ధ బుద్ధి ని, నిర్విరామ కృషిని మనం గుండె నుండి నేర్చుకోవాలి.