Friday, October 1, 2010

మెరిసిపోయే ముఖారవిందానికి...!

అందమైన ముఖం చూసేవారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే ముఖాన్ని అంత అందంగా తీర్చిదిద్దుకోవడం పెద్ద కష్టమేం కాదని అర్థమవుతుంది. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి.

- పచ్చి కొబ్బరి పాలలో దూదిని ముంచి దాంతో పెదాలు, ముఖంపై రాసుకుంటే మరింత కాంతివంతంగా కనిపిస్తాయి.
- కొద్దిగా దూదిని తీసుకుని పచ్చిపాలలో ముంచి ముఖం, మెడపై రాసుకోవాలి. 15 నిమిషాలు అలానే ఉంచి తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేయడం వల్ల ముఖం తళతళా మెరిసిపోతుంది.
- దోసకాయ చెక్కలతో ముఖంపై గుండ్రంగా రుద్ది 15 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత కడిగేసుకోవాలి.
- పై విధంగానే టమాటా ముక్కలతో కూడా చేసుకోవచ్చు.
- నిమ్మతొక్కలతో ముఖం, మెడపై రుద్దుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
- రోజులో ఒకసారి ఐస్‌గడ్డతో ముఖంపై మర్దన చేసుకోవం వల్ల ముఖం తాజాగా కనిపిస్తుంది.
- యాపిల్ ముక్కలను ముఖంపై ఉంచుకుంటే ముఖం పై పొరల్లో ఉన్న జిడ్డునంతటినీ పీల్చివేస్తుంది.
- ఆముదం నూనెకి ముడతలను నివారించే గుణం ఉంది. ముడతలతో బాధపడుతున్నవారు దీన్ని ముఖానికి రాసుకుని చూడండి.
- ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలమీగడని బాగా కలిపి ముఖానికి రాసుకోవాలి. కొంత సమయం తర్వాత కడిగి చూడండి ఫలితం మీకే తెలుస్తుంది.
- పచ్చి బంగాళాదుంపని కట్‌చేసి ముఖంపై రుద్దుకుంటే చర్మంపై ఉన్న మచ్చలు పోతాయి.
- దోసకాయ రసం, గ్లిజరిన్, రోజ్‌వాటర్ ఈ మూడింటిని కలిపి ముఖంపై రాసుకుంటే చల్లగా ఉండడంతోపాటు ఎండ నుంచి చర్మానికి రక్షణ లభిస్తుంది.
- సాధారణ చర్మం ఉన్నవారు ఒక టేబుల్ స్పూన్ బత్తాయి రసం, టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కప్పు పెరుగులో కలుపుకోవాలి. దీన్ని ముఖానికి మాస్క్‌లా వేసుకుని 15 నిమిషాలపాటు అలానే ఉంచుకుని తర్వాత కడిగేయాలి. దీంతో ముఖం మరింత వెలుగును సంతరించుకుంటుంది.

- చర్మానికి కూడా తగినంత పోషణ కావాల్సి ఉంటుంది. ప్రొటీన్ మాస్క్ వేసుకోవడం ద్వారా దీన్ని భర్తీ చేయవచ్చు. ఒక టీ స్పూన్ మినప్పప్పు, 6 బాదం పప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టాలి. దీన్ని మెత్తటి పేస్ట్‌లా రుబ్బుకుని ముఖంపై ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగినంత పోషణ లభించడంతోపాటు ముఖవర్చస్సు పెరుగుతుంది.

- పత్తిగింజలను చిన్న రోలులో రుబ్బుతూ దానికి పాలను కలుపుకోవాలి. మెత్తగా అయిన తర్వాత ఆ పేస్ట్‌ని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై మచ్చలు పోవడంతోపాటు మెటిమలు రాకుండా ఉంటాయి.

- మసూర్ పప్పుని పొడిగా చేసుకోవాలి. ఆ పొడిలో నెయ్యి, పాలు కలుపుకుని మొత్తటి పేస్ట్‌గా చేసుకోవాలి. దాన్ని ముఖానికి ఫ్యాక్‌లా వేసుకుంటే చర్మం తాజాగా మెరిసిపోతుంది.

- చందనం, పసుపు పొడికి పాలు కలిపి పేస్ట్‌లా కలుపుకోవాలి. దాన్ని ముఖానికి ప్యాక్‌లావేసుకుని కొంచెం సమయం తర్వాత కడిగేయాలి. దీనివల్ల చర్మం కొత్తదనాన్ని సంతరించుకుంటుంది.

-గుడ్డులో తెల్ల సొనని వేరుచేసి దానికి పాలు కలుపుకోవాలి. దాన్ని బ్రష్‌తో ముఖం, మెడపై కింది నుంచి పైకి రాసుకోవాలి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి.

- శుభ్రమైన టవల్‌ని వేడినీటిలో తడిపి నీళ్లు పిండేయాలి. దాన్ని ముఖంపై ఒక నిమిషంపాటు ఉంచుకుంటే చర్మం పొరలు విచ్చుకుంటాయి. ఇప్పుడు తేనెను ముఖానికి, మెడకు రాసుకుని కొంత సమయం తర్వాత వేడి నీటితో కడిగేయాలి.
అరగంట తర్వాత మరోసారి చల్లటి నీటితో కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

No comments: