
ఉందా అని. కడుపులో పుండ్లు పడ్డాయంటే అనుమానించేది... మద్యం
తీసుకుంటుంటారా అని. కాలేయాన్ని, కడుపును అంత నేరుగా ప్రభావితం
చేస్తుంది మద్యం. ఇతరత్రా అవయవాల మీద పరోక్ష ప్రభావమేమో గాని...
నోట్లోంచి కడుపులోకి మద్యం జారగానే అటు ప్రత్యక్ష దుష్ర్పభావాలూ,
పరోక్ష ప్రభావాలూ రెండూ కడుపు మీదే. తాగగానే నోట్లోనైనా అది పెద్దగా
ఉండకపోవచ్చేమోగాని... కడుపులోకి జారగానే అక్కడ కాసేపు ఉంటుంది
కాబట్టి అంతటి బలమైన ప్రభావం! దాంతో పోషకాలు అందకపోవడం,
విషపదార్థాలు ఉత్పత్తి అవడం, బరువు తగ్గడం, కాలేయం దెబ్బతినడం,
రోగనిరోధకశక్తి తగ్గడం వంటి అనేక దుష్ఫలితాలు!! ఉపద్రవంతో కొంప
మునిగినట్టు... మద్యం అనే ద్రవం కడుపును ముంచేయడం ఖాయం!!!
మద్యం అలా కడుపు (అన్నకోశం)లోకి వెళ్లీ వెళ్లగానే దాని దుష్ర్పభావం మొదలవుతుంది. అన్నకోశంలోకి వెళ్లగానే అక్కడ రెండు విధాలుగా దాని ప్రభావం చూపుతుంది. ఒకటి దాని నిర్మాణం మీద. రెండోది దాని విధులపైన. తొలుత అన్నకోశం నుంచి ఆల్కహాల్ రక్తంలో కలవడం ప్రారంభమవుతుంది. చాలా భాగం జీర్ణప్రక్రియకి గురి కాకుండానే రక్తంలో కలుస్తుంది. మద్యం నేరుగా చాలాసేపు అన్నకోశంలో ఉండటం వల్ల అక్కడి మృదువైన పొరలు (మ్యూకోజా) దెబ్బతింటాయి. అక్కడి మ్యూకోజాపై అది దీర్ఘకాలం పాటు ఉండటం వల్ల జీర్ణకోశం పై భాగంలో అనేక మార్పులు వస్తాయి. ఫలితంగా అప్పటికప్పుడు తగిలే దెబ్బతో పాటు దీర్ఘకాలికంగా ఉండే దుష్పరిణామాలు సైతం ఉంటాయి.
అన్నకోశంలోని మ్యూకోజాతో పాటు ఇతరత్రా కణజాలాన్ని మద్యం దెబ్బతీయడం వల్ల జీర్ణప్రక్రియ జరిగే క్రమంలో మార్పు వస్తుంది. జీర్ణక్రియ సమర్థంగా జరగకపోవడం ఫలితంగా శరీరానికి అందాల్సిన అవసరమైన పోషకాలు అందకపోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు. పైగా నిత్యం ఆల్కహాల్ తీసుకుంటూ ఉండటం వల్ల మ్యూకోజాపై రోజూ ప్రభావం పడి అక్కడ పుండ్లు, కురుపులు పడవచ్చు.

పాంక్రియాస్‌పై కూడా ప్రభావం.
పాంక్రియాస్ అన్నది జీర్ణప్రక్రియలో పాలుపంచుకునే మరో కీలక అవయవం. ఇది రక్తంలో గ్లూకోజ్ పాళ్లను నియంత్రణలో ఉంచే ఇన్సులిన్ హార్మోన్‌ను స్రవిస్తుంది. జీర్ణక్రియలో కొవ్వులు, ప్రోటీన్లు, పిండిపదార్థాలు జీర్ణమయ్యేలా దోహదపడుతుంది. మద్యం వల్ల ఈ అవయవం కూడా దెబ్బతిని తీవ్రమైన పాంక్రియాటైటిస్‌కు దారితీయవచ్చు. దానివల్ల కడుపులో నొప్పి, వాంతులు, ఊపిరి అందకపోవడం, కడుపులో ఇబ్బంది లాంటివి కనిపించవచ్చు. ఎప్పుడో ఒకసారి తాగేవారు మితం లేకుండా సేవించడం వల్ల ఈ సమస్య రావచ్చు. ఇలా పాంక్రియాటైటిస్ వచ్చిన వారిలో 15 శాతం మందిలో అది ప్రాణాంతకం కావచ్చు. ఇలాంటి సమయాల్లో వచ్చే నొప్పి కడుపు నుంచి మొదలై వీపుకు వ్యాపించవచ్చు. ఈ సమస్య వచ్చినప్పుడు కొవ్వులు సరిగా జీర్ణం కాకపోవడంతో మలం జిగటగా అనిపించవచ్చు.
1-దశ
మైల్డ్ ఫ్యాటీ లివర్

2-దశ
ఆల్కహాలిక్ హెపటైటిస్

3-దశ
ఆల్కహాలిక్ సిర్రోసిస్

కాలేయంపై దుష్ర్పభావం ఎందుకు..?

మద్యం తీసుకునేవారిలో పొట్ట వస్తుండటం సాధారణంగా చూసేదే. మద్యం తీసుకున్న తర్వాత చాలా మందిలో కనిపించే పరిణామం ఇది. మరీ పెరిగినప్పుడు బెలూన్‌లో నీళ్లు నింపి కదిలిస్తే కదిలినట్లుగా పొట్టలో నీరు చేరి కదులుతూ ఉంటుంది. మద్యం అలవాటు పెరిగినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. దీన్నే ‘అసైటిస్’ అంటారు. ఇది కూడా మద్యం వల్ల వచ్చే అనర్థమే.
చికిత్స...
కాలేయ సమస్యలకు మద్యం మానడంతోనే చికిత్స మొదలైనట్లు లెక్క. నిజానికి అదే పెద్ద చికిత్స అన్నమాట.
మొదటిదశ ఫ్యాటీ లివర్‌కు, రెండోదశ ఆల్కహాలిక్ హెపటైటిస్‌కు మద్యం నుంచి దూరంగా ఉండటం ప్రధానం.
కాలేయం దాదాపు 75 శాతం చెడిపోయినా తాను నిర్వహించే విధులలో ఎక్కడా లోపం కనిపించనివ్వదు. తనను తాను రిపేర్ చేసుకుంటుంది. ఇక అది మూడో దశకు వచ్చిందంటే మళ్లీ తిరిగి మునుపటి ఆరోగ్యాన్ని పొందడం చాలా కష్టం. ‘సిర్రోసిస్’ అనే దశకు చేరుకుంటే కేవలం కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని తెలుసుకోవాలి.
కొంతమందికి ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా చికిత్స అవసరం. మరికొందరికి అవసరాన్ని బట్టి శస్తచ్రికిత్స చేయాల్సి ఉంటుంది.
No comments:
Post a Comment