మలద్వారము దగ్గర చీలిక ఏర్పడడాన్ని ఆనల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల అల్సర్ తయారై దురద, నొప్పి, రక్తంకారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు
- ఎక్కువ కాలం మలబద్దకం లేక విరేచనాలు ఉండటం వల్ల నరాల మీద ఒత్తిడి పెరిగి మలద్వారం చీరుకుపోయి అల్సర్ తయారవుతుంది.
- మలబద్దకం ఉన్నప్పుడు మలవిసర్జన గట్టిగా జరగడం వల్ల చీలికవచ్చే అవకాశం ఉంది. విరేచనాల వల్ల ఎక్కువసార్లు కడగటం వల్ల మలద్వారం ఉబ్బిపోతుంది.
- ఆనల్ క్రిప్ట్‌లో సూక్ష్మజీవులు ప్రవేశించడం వల్ల క్రిప్టైటిస్ వచ్చి చీలిక ఏర్పడి అల్సర్‌గా మారుతుంది.
- కొంతమందిలో ఆనల్ ఫిషర్ నయం కాకుండా చాలా సార్లు దెబ్బతినడం వల్ల విపరీతమైన నొప్పి వస్తుంది.
- మల విసర్జనలో సరిగా అరగని పదార్థాలు ఉండటం వల్ల మలద్వారం దగ్గర ఉన్న చర్మం చీలుకుపోతుంది.
- ఆనోరెక్టల్ సర్జరీ, ప్రొక్టైటిస్, క్షయ, క్యాన్సర్ వల్ల కూడా ఆనల్ ఫిషర్ వచ్చే అవకాశాలున్నాయి.
లక్షణాలు
- మలద్వారంలో చీలిక
- దురద, నొప్పి, రక్తంకారటం.
- మల విసర్జన తరువాత నొప్పి గంట వరకు ఉండటం.
-ఎర్రటి రక్తం మలంతో కలిసి గానీ, తురువాత గానీ రావటం.
-మలవిసర్జన సమయంలో నొప్పిగా ఉండటం.
- ఆనల్ ఫిషర్ రావడానికి ఆనల్్ ఆబ్సిస్(చీముగడ్డ)కూడా కారణమే.
నిర్ధారణ
మలద్వారం దగ్గర చర్మం వేలాడుతూ ఉంటుంది. అల్సర్ కనిపిస్తూ ఉంటుంది. సిగ్నాయిడ్ స్కోప్, ఆనోస్కోప్, కొలనోస్కోప్ ద్వారా పరీక్షించి వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు.
చికిత్స
యాభైశాతం మందిలో ఫిషర్స్ ఎటువంటి ఆపరేషన్ లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. మలద్వారం దగ్గర పరిశుభ్రంగా ఉంచుకోవటం, మల విసర్జన తరువాత కాటన్ గుడ్డతో తుడవటం వల్ల ఫిషర్ తొందరగా మానిపోతుంది. ఒకవేళ ఫిషర్ ఎక్కువ రోజులు ఉంటే మానడం కష్టమవుతుంది. సిట్స్ బాత్ (మలద్వారాన్ని ఇరవై నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచడం) వల్ల ఫిషర్ వల్ల వచ్చే సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకోవటం, సమయానుసారంగా తినడం, సమయానికి మలవిసర్జనకు పోయే అలవాటు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే ఎనస్తటిక్ ఆయింట్‌మెంట్ పైపూతగా రాసుకోవడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
హోమియో మందులు
ఆసిడ్ నైట్రికమ్ : ఈ మందు ముఖ్యంగా శ్లేష్మపొర, చర్మం కలిసే దగ్గర సమస్య ఉంటే పనిచేస్తుంది. కుచ్చినట్లుగా నొప్పి, చిరాకు ఎక్కువగా ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావటం, మలవిసర్జన తరువాత గంటల తరబడి నొప్పి ఉండటం, మలంతో పాటు రక్తం పడుతుండటం, త్వరగా అలసిపోవటం, రాత్రివేళ చలిగానీ, వేడిగానీ ఎక్కువ ఉంటే బాధలు ఎక్కువ కావటం, ప్రయాణం చేస్తున్న సమయంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలున్న వారికి ఈ మందు ఉపయోగకరంగా ఉంటుంది.
ఆస్కులస్ హిప్ : ఈ ఔషధం పేగు కింది భాగంలో ఎక్కువగా పనిచేస్తుంది. పైల్స్‌తో పాటు నడుము నొప్పి ఉండటం, రక్తం తక్కువగా పడటం, హెమరాయిడల్ వీన్స్(సిరలు)నిండుగా ఉబ్బిపోయి ఉండటం, మలాశయం దగ్గర చిన్న చిన్న పుల్లలు ఉన్నట్లుగా అనిపించటం, నొప్పి కింది నుంచి పైకి వెళుతున్నట్లు అనిపించటం, నడిచినపుడు, మలవిసర్జన సమయంలో నొప్పి ఎక్కువ కావడం వంటి లక్షణాలున్న వారు వాడదగిన మందు ఇది.
అలోస్ సొకట్రీన : ఎక్కువ సమయం కూర్చుని ఉండే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో చక్కగా పనిచేస్తుంది. మలాశయం దగ్గర నొప్పి, రక్తం ఎక్కువగా పడటం, చల్లటి నీటితో కడగినపుడు ఉపశమనంగా అనిపించటం, మలం జిగటగా రావడం, పైల్స్ బయటకు వేళాడుతూ ఉండటం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన ఔషధం.
రటానియా: ఈ మందు ముఖ్యంగా మలాశయం పైన పనిచేస్తుంది. విపరీతమైన వెక్కిళ్లు, మలాశయం దగ్గర నొప్పి, మలవిసర్జన తరువాత నొప్పి కొన్ని గంటల వరకు ఉండటం, మలవిసర్జనకు కష్టపడాల్సి రావడం, మంట, చల్లటి నీటితో కడగటం వల్ల ఉపశమనంగా ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.
మెర్క్‌కార్: మలవిసర్జన సమయంలో తీవ్రమైన బాధ, మలం వేడిగా, రక్తంతో కలిసి రావడం, జిగటగా, దుర్వాసనకూడా ఉండటం, రాత్రి సమయంలో బాధ ఎక్కువగా ఉండటం, కదలకుండా ఉన్నప్పుడు ఉపశమంగా అనిపించడం వంటి లక్షణాలున్నవారు వాడదగిన మందు.
పమోనియా : మలవిసర్జన తరువాత దురద, మంటగా ఉండటం, కాళ్లపైన, పాదాలపైన, మలాశయం వద్ద పుండ్లు తయారవడం, పైల్స్ లేత వంకాయ రంగులో ఉండటం వంటి లక్షణాలున్న వారికి సూచించదగిన మందు.
నక్స్‌వామికా: ఆధునిక జీవనం వల్ల ఈ సమస్య వచ్చినవారికి ఉపయోగపడే మందు. ఎక్కువ సమయం కూర్చుని పని చేసే వారికి ఈ మందు ఇవ్వవచ్చు. మలబద్ధకం, తరచుగా మలవిసర్జనకు వెళ్లాలనిపించడం, మలవిసర్జన కొంచెం కొంచెంగా రావటం, దురద, నొప్పి ఎక్కువగా ఉండటం, పైల్స్, ఉదయంపూట బాధ ఎక్కువవడం, నిద్ర పోయినపుడు ఉపశమనంగా అనిపించడం వంటి లక్షణాలున్న వారు ఉపయోగించదగిన మందు.
సల్ఫర్: వేడి పడదు, నీళ్లు అంటే ఇష్టం ఉండదు. చర్మం, వెంట్రుకలు పొడిబారి ఉంటాయి. ఎక్కువ సేపు నిలబడి ఉండలేరు. మలద్వారం వద్ద మంట, దురద ఉంటుంది. పొద్దున లేచిన వెంటనే విరేచనాలు అవుతాయి. పైల్స్ నుంచి రక్తస్రావం, పొడిగా, వెచ్చగా ఉండే వాతావరణంలో ఉపశమనంగా అనిపించటం వంటి లక్షణాలు ఉన్న వారు వాడదగిన మందు.
డా. మురళి అంకిరెడ్డి, హోమియోకేర్ ఇంటర్నేషనల్,
ఫోన్ : 9550001133, 9550001199
ఫోన్ : 9550001133, 9550001199
No comments:
Post a Comment