జుత్తు పొడవుగా ఉన్నా పొట్టిగా ఉన్న ఒత్తుగా ఉండాలని కోరుకోని మహిళలు ఉండరు. పెరిగిపోతున్న కాలుష్యం, ఆధునిక జీవన శైలి కారణంగా అనేకమంది జుత్తు చిన్న వయసులోనే పల్చబడడమే కాదు రంగు కూడా మారిపోతున్నది. నెత్తి మీద దువ్వెన పెడితే తుట్టెలు తుట్టెలుగా వెంట్రుకలు ఊడొస్తుంటే బెంగపడిపోతుంటారు మహిళలు. అయితే ఊరికే బెంగపడకుండా తమ ఆహారపు అలవాట్లను ఒకసారి పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆహారంలో కొన్ని మార్పులను చెప్తున్నారు.
కారెట్లు...
విటమిన్ ఎ అధికంగా ఉండే కారెట్లను తీసుకోవడం వల్ల కేవలం కంటికే కాదు జుత్తకు కూడా మంచిదంటున్నారు నిపుణులు. మాడు ఆరోగ్యంగా ఉంటే నల్లగా మెరిసే, బలమైన జుత్తు పెరుగుతుందిట. ప్రోటీన్లు, పళ్ళు, కాయగూరలు, పప్పులు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్న పాల ఉత్పత్తులు ఇవన్నీ కూడా జుత్తు ఆరోగ్యంగా పెరగడానికి దోహదం చేస్తాయి.
ఎండుద్రాక్షలు...
జుత్తు ఎండిపోయినట్టు గడ్డిలా ఉండి, పల్చబడిపోయి, రంగు వెలిసిపోయినట్టు ఉంటే లేదా తెగ ఊడిపోతుంటే అందుకు కారణం శరీరంలో ఐరన్ శాతం తగ్గిపోవడమే. ఎండు ద్రాక్షలలో ఐరన్ శాతం ఎక్కువగా ఉండడమే కాక జుత్తు క్వాలిటీ పెరిగేలా చేస్తుంది. దీనితో పాటుగా ఆకుకూరలు, బీట్‌రూట్‌లు కూడా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
పచ్చి బఠాణీలు...
పచ్చి బఠాణీలలో యాంటీ ఆక్సిడెంట్లు తక్కువగా ఉన్నా, నిర్దిష్టమైన విటమిన్ లేదా మినరల్స్ ఎక్కువగా లేకపోయినా వాటిలో విటమిన్లు, మినరల్స్, ఐరన్, జింక్, బి గ్రూప్ విటమిన్లు సమతులంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యవంతమైన జుత్తుకు మంచివి.
ఓట్స్...
ఓట్లలో ఫైబర్ అధికంగా ఉం టుంది. ఇది గుండెకు సంబం ధించిన ఆరోగ్యాన్ని సంరక్షించి, విసర్జనను క్రమబద్ధం చేస్తుంది. ఫైబర్‌తో పాటుగా జింక్, ఐరన్, ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. వీటన్నింఇనీ పాలి అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్లని అంటారు. ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి, జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. ఇది కేవలం ఆహారం ద్వారానే లభ్యమవుతుంది కనుక బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్ ఉండేలా చూసుకోవడం మంచిది.
చిన్న రొయ్యలు...
చిన్న రొయ్యలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.ఇందులో ఉండే విటమిన్ బి12, ఐరన్, జింక్ జుత్తు ఊడిపోకుం డా కాపాడుతుంది. రెడ్ మీట్‌ను అతి గా తీసుకోవడం మాని అందుకు ప్రత్యామ్నాయంగా వీటిని ఎంచుకోవచ్చు.
గుడ్లు...
ఒతైన నల్లని ఆరోగ్యవంతమైన జుత్తు కోసం కోడిగుడ్లను ఉంచుకోవడం మంచిది. ప్రోటీన్లు, విటమిన్ బి 12, ఐరన్, జింక్, ఒమేగా 6 ఆమ్లాలు అధికంగా ఉంటాయి. విటమిన్, మినరల్ లోపాలు ఉన్నప్పుడు జుత్తు ఆరోగ్యంగా కనుపించదు. గుడ్లలో ఉండే బయోటిన్ (విటమిన్ బి7) అనే పదార్ధం జుత్తు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది.
కొవ్వు తక్కువ పాలు, పెరుగు...
కొవ్వు తక్కువగా ఉన్న పాలు, పెరుగులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది జుత్తు పెరగడానికి దోహదం చేస్తుంది. దీనితో పాటుగా హైక్వాలిటీ ప్రోటీన్లైన వే, కేసిన్‌లు ఇందులో ఉంటాయి.