దీర్ఘకాలిక వ్యాధి అయిన సొరియాసిస్‌కు శాస్త్రీయ చికిత్స చేయించుకోకుంటే ఇది మరింత జటిలమై సొరియాటిక్ ఆర్థరైటిస్‌గా రూపాంతరం చెందుతుంది. మానసికంగా, శారీరకంగా రోగి జీవనశైలిని నియంత్రిస్తున్న సొరియాసిస్‌కు సొంత వైద్యం చేస్తే దుష్ఫలితాలు వస్తాయి. సొరియాటిక్ ఆర్థరైటిస్‌కు హోమియోలో మెరుగైన చికిత్స ఉందంటున్నారు సీనియర్ హోమియో వైద్యులు డాక్టర్ శ్రీకర్ మనూ. సొరియాటిక్ ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడిన వారి దైనందిన జీవితం దుర్భరంగా వుంటుంది. చర్మం ఎర్రబడటం, దురద, మంటతో పాటు చర్మం పొలుసులుగా రాలటం సొరియాసిస్ లక్షణాలు. ఈ లక్షణాలతోపాటు కీళ్లవాపు, నొప్పి, బిగుసుకుపోవటం వంటి లక్షణాలు తోడైనపుడు 'సొరియాటిక్ ఆర్థరైటిస్'గా గుర్తించవచ్చు. సొరియాసిస్ రోగుల్లో పదిశాతం మందిలో సొరియాటిక్ ఆర్థరైటిస్ లక్షణాలు కనిపిస్తాయి.
ఈ సమస్య స్త్రీ,పురుష భేదం లేకుండా వయసు పెరుగుతున్న కొద్దీ వస్తుంది. 40 నుంచి 50 సంవత్సరాల వయసు వారిలో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుందని అధ్యయనంలో తేలింది. 80 శాతం మంది సొరియాసిస్ వ్యాధి సోకిన తరువాత ఆర్థరైటిస్ సమస్యకు గురవుతున్నారు. 15 శాతం మందిలో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత సొరియాసిస్ బారిన పడటం కనిపిస్తుంది.
కారణాలు
జన్యువులు, వాతావరణం, రోగనిరోధక వ్యవస్థ, మానసిక కారణాలు, వాడుతున్న మందుల దుష్ప్రభావం వంటి కారణాల వల్ల సొరియాటిక్ ఆర్థరైటిస్ వస్తుంది. సొరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య తో బాధపడుతున్న వారిలో 50 శాతం మందిలో హెచ్ఎల్ఎ-బి27 జీన్స్ ప్రభావం వల్ల ఈ సమస్య వస్తున్నదని తేలింది. రోగనిరోధక వ్యవస్థలోని హెల్పర్ టీ కణాల సంఖ్య తగ్గటం కూడా ఈ వ్యాధి రావటానికి ఒక కారణమని తాజా పరిశోధనలు చెపుతున్నాయి.
ముఖ్య లక్షణాలు
కీళ్ల నొప్పి, వాపు లేదా బిగుసుకు పోవటం ఈ వ్యాధి లక్షణం. కీళ్లపై ఉన్న చర్మం ఎర్ర బడటం, వేడిగా అనిపించటం, కీళ్లు ముఖ్యంగా చేతులు, కాళ్లు వంకర పోవటం వంటి మార్పులు వస్తాయి. చేతులు, కాలి గోర్లలో మార్పులు రావటం, వాపుతో నిర్మాణ మార్పులు వస్తాయి. కీళ్ల చుట్టూ ఉన్న నరాల్లో సొరియాటిక్ ఆర్థరైటిస్ ప్రభావం వల్ల కండరాలు, ఊపిరితిత్తులు, నడుములోని రక్తనాళాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి.
దీనివల్ల ఛాతినొప్పి, గుండె సమస్యలు తలెత్తవచ్చు. శరీరాన్ని కాపాడే రోగ నిరోధక కణాలు శరీరంలోని ముఖ్య అవయములపైన దుష్ప్రభావం చూపటం వల్ల ఈ లక్షణాలు మొదలవుతాయి. కేసు హిస్టరీతో పాటు శారీరక పరీక్షలు, రక్తపరీక్షలు, ఎక్స్‌రే వంటివి చేయటం ద్వారా సొరియాటిక్ ఆర్థరైటిస్‌ను నిర్ధారించవచ్చు. ఇవే కాకుండా హెచ్ఎల్ఎ బి-27, సీటీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు కూడా కొన్నిసందర్భాల్లో చేయాల్సి రావచ్చు.
అపోహలు
సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే. జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు. సొరియాటిక్ ఆర్థరైటిస్ కేవలం చర్మానికి, కీళ్లకు సంబంధించిన వ్యాధి కాదు.
సరైన చికిత్స చేయించుకోలేక పోయినపుడు ప్రాణాంతకంగా కూడా మారే దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధి నిర్ధారణ అంత సులభం కాదు. ఒక్కో సారి మిగిలిన చర్మవ్యాధులు అంటే డర్మటైటీస్, గజ్జి లేదా ఎలర్జీ వంటి వాటితో తప్పుడు నిర్ధారణ చేస్తారు. సొరియాసిస్ లేదా ఆర్థరైటిస్‌కు చికిత్స లేదనటం కేవలం అపోహ మాత్రమే. మనిషి జన్యు నిర్మాణ వ్యవస్థను బలోపేతం చేసి, ఎలాంటి లోపాన్ని అయినా సరిచేయగలిగిన ఏకైక చికిత్సా విధానం హోమియోపతి. హోమియోపతి వైద్యం ద్వారా ఇలాంటి రుగ్మతల నుంచి సంపూర్ణ విముక్తి పొందే అవకాశముంది.
మేలైన హోమియో వైద్యం
ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స చేయటం హోమియో వైద్యుల అదనపు బలం. సొరియాసిస్ చికిత్సలో హోమియో వైద్యుడు ఎలాంటి తైలాలు, పైపూతలు లేకుండా కేవలం మందులతో నయం చేయవచ్చు. మార్పులు మనిషి జన్యు నిర్మాణాన్ని బట్టి ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం, శారీరక పరిశ్రమ చేయటం, పౌష్టికాహారం తీసుకోవటం లాంటివి చాలా ముఖ్యం.
హోమియో మందులు కీళ్లపై దాడి చేస్తున్న కణాలను నియంత్రించే జన్యువుల సంకేతాలను సరిచేయటం ద్వారా చికిత్సా విధానం ఆరంభమవుతుంది. తద్వారా శరీర అవయవాల్లో జరిగే జీవనక్రియల్లో సమతౌల్యం ఏర్పరచటం వల్ల వ్యాధిని సమూలంగా తగ్గించే వీలుంటుంది. ఈ చి కిత్సా విధానంలో వ్యాధి తిరగబెట్టే ప్రసక్తే వుండదు. దీనికోసం రోగి సహకారం అత్యంత ముఖ్యం.
సొరియాసిస్ లేదా సొరియాటిక్ ఆర్థరైటిస్ గాని అంటువ్యాధులు కావు. రోగితో సహజీవనం చేయటం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవు. పరిశుభ్రత లేని కారణంగా సొరియాసిస్ రావటం అనేది కేవలం అపోహ మాత్రమే.జన్యుపరంగా వ్యాధి వచ్చే అవకాశం ఉన్న వారికి ఇన్‌ఫెక్షన్, మానసిక ఆందోళన, చర్మానికి గాయం, హార్మోన్‌ల ప్రభావం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం వంటి ప్రేరేపకాలు తోడైనపుడు ఈ వ్యాధి రావచ్చు.
- డాక్టర్ శ్రీకర్ మనుఫౌండర్ ఆఫ్ డా.మనూస్
హోమియోపతి,
ఫోన్స్: 9032 108 108
9030339999
మనిషి ఆత్మజ్ఞాన సాధన కోసం చేసేదే క్రియాయోగం. పతంజలి మహ ర్షి తన యోగ శాస్త్రంలో చెప్పిన క్రియా యోగం, భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన కర్మయోగం సంధానం చేసి క్రియాయోగంగా ప్రపంచానికి అందించారు శ్యామాచరణ లాహిరి. ఆయన శిష్యులలో అతి ముఖ్యులు, క్రియాయోగాన్ని విశ్వవ్యాపితం చేయడానికి కృషి చేస్తున్న డాక్టర్ అశోక్ కుమార్ చటర్జీ 79వ జన్మదినం నేడు.
కుల, మత, జాతి, పేద, ధనిక అనే తారతమ్యాలు లేకుండా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు, ఆత్మజ్ఞాన పిపాసులందరికీ క్రియాయోగ దీక్షని శ్యామాచరణులు అందచేశారు.'నీవు ఎవరికి చెందవు..అలాగే నీకూ ఎవరూ చెందరు. ఏదో ఒకరోజు హఠాత్తుగా ఈ లోకంలోని సమస్తాన్ని త్యజించవలసి వస్తుంది. ఇప్పటి నుంచే దైవంతో సాన్నిహిత్యాన్ని పొందు. క్రియోయోగం ద్వారా దైవంతో సంభాషించు. సత్యం నీకు గోచరిస్తుంది. ధ్యానం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకో. జీవితంలో నీకు ఎదురయ్యే అన్ని చిక్కు ప్రశ్నలకు ధ్యానంలో సమాధానాలు లభిస్తాయి' అని శ్యామాచరణులు తన శిష్యులకు ఉద్బోధించేవారు.







ఈ ఆసన స్థితిలో ఊపిరితిత్తులు గాలితో నిండి శరీరం చేపలాగ నీటి మీద తేలడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీనిని మత్స్యాసనం అంటారు. ఈ యోగసాధన ద్వారా ఊపిరితిత్తులకు వ్యాయామం అందుతుంది. దాంతో ఆస్త్మా వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు నయమవుతాయి. దీనిని ఎలా చేయాలంటే...
థైరాయిడ్, పారా థైరాయిడ్ గ్రంథులు, కంఠం ద్వారా మెదడుకు వెళ్లే నరాలు ఉత్తేజితమవుతాయి.
సర్వైకల్ స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు ఈ ఆసనాన్ని చేయకూడదు.
కిస్‌మిస్, వాల్‌నట్స్, బొప్పాయి, ఆపిల్, పాలకూర, కాకరకాయ, గుమ్మడికాయ, అరటి (కూరగాయ), మొలకెత్తిన గింజలు, రాగులు, సజ్జలు వంటి పొట్టుతో కూడిన చిరుధాన్యం, విటమిన్ ‘సి, ఇ, బీటాకెరోటిన్’ పుష్కలంగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఊపిరితిత్తుల పనితీరును నియంత్రించడం, మెరుగుపరడచంలో విటమిన్లు, మినరల్స్ ప్రధానమైనవి. కాబట్టి ఇవి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. 
పాలు, చెరకు, ద్రాక్ష పండ్లు ముఖాన్ని శుభ్ర పరచడంలో అత్యుత్తమంగా పని చేస్తాయి.అలాగే ఆలివ్ ఆయిల్‌ను, ఆవనూనెను మేకప్‌ను తొలగిం చేందుకు వినియోగించవచ్చు.మొటిమలు బాగా వస్తుంటే స్ట్రాబెర్రీలను వినియోగించ వచ్చు. ఇందులో సహజంగా ఉండే సలిసైలిక్ ఆసిడ్ చర్మం లోని అధిక జిడ్డును పీల్చి వేసి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది.
చర్మం ఎండిపోయినట్టు ఉంటే బాగా పండిన అరటిపండు, బొప్పాయిని చిదిమి, అందులో గుడ్డును కలపడం వల్ల చర్మానికి తగినంత మాయిశ్చర్ అందుతుంది. అలాగే, గసగసాలు, బఠాణీలు వంటి వాటిల్లో సహజ నూనెలు ఉం టాయి. వాటిని పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించడం వల్ల మంచి మెరు పు వస్తుంది. డల్‌గా ఉండే చర్మానికి పెరుగు కూడా మంచి మందు.జిడ్డోడే చర్మానికి గుడ్డులో ఉండే తెల్లసొన చాలా మంచి ఆహారం లాంటిది. మెంతులు, కం దులు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టిస్తే జిడ్డును నియంత్రించి, మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది.
ఇంట్లో సౌందర్య పోషణ చేసుకునే ముందుగా ముఖానికి ఆవిరిపడితే చర్మ రంధ్రాలు తెరుచుకొని సహజ ఉత్పత్తులో ఉండే పోషకాలను చ ర్మం మరింత బాగా పీల్చుకుంటుంది. ముఖం నున్నగా, పట్టులా మృదువుగా ఉండాలంటే షవర్ చేసే సమయంలో బేకింగ్ సోడాను శరీరం మొత్తానికి పట్టించాలి. ముఖం మీద బ్లాక్ హెడ్స్‌ను తొలగించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. కొంతమంది బాహుమూలాల్లో, అరికాళ్ళల్లో చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటుంది. అటువంటివారు వెనిగర్‌ను, నీటిని సమపాళ్ళలో తీసుకుని డియోడరెంట్‌కి బదులుగా దానిని వాడాలి. 



నిటారుగా నిలుచోండి. చేతులు ఫొటోలో చూపిన విధంగా పెట్టండి. మొ దట్లో కాలుని చాలా తేలికగా పైకి ఎత్తుతూ ఉన్నచోటే పరు గుపెట్టండి. క్రమంగా.. వేగాన్ని పెంచండి. చేతులను, భుజాల దాకా చాపి, క్రిందికి దింపుతూ, ముందుకు వెనక్కి కదిలించాలి. మీ శ్వాసక్రియ ఊపందుకొని, రొప్పే దశకు చేరుకున్నప్పుడు తిరిగి వేగాన్ని తగ్గిస్తూ.. పరుగు ఆపండి.
ముందు నిటారుగా నిలబడండి. కాళ్ళు బాగా విడదీయండి. చేతుల్ని చెరోవైపు సాగదీసీ చాపి గెంతండి. కాళ్ళను మళ్లీ దగ్గర చేర్చండి. చేతుల్ని మీ తొడలమీదకు చేర్చండి. మళ్లీ గెంతండి. కాళ్ళు ఎడంగా పెట్టి చేతులు చాపండి. క్రమంగా వేగం పెంచండి. కాళ్ళు, చేతులు గట్టిగా సాగదీయడం బట్టి మీ గెంతులో ఊపు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం రొప్పేదాకా చేసి ఆపండి.
(ఎ) నిటారుగా నిలబడండి. పాదాలను విడిగా వుంచండి. చేతుల్ని ఫొటోల్లో చూపిన విధంగా పెట్టండి. (బి) క్రిందికి మోకాళ్ళు పైకూర్చోండి. పిరుదులు మడమలకు తగలాలి. (సి) తరువాత చేతుల్ని ముందుపెట్టి పాదాల్ని వెనక్కి తీసుకు వెళ్లి ముని వేళ్లపై ఆన్చండి. తిరిగి లేచి నిలుచోండి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి వేగం పెంచండి. రొప్పే దాకా చేసి ఆపండి.
నిటారుగా నిలుచోండి. (ఎ) చేతుల్ని నడుము మీద ఉంచుకోండి. (బి) అడుగు ముందుకువేసి కుడికాలుని కర్ణదిశగా పెట్టి ఫొటోలో చూపిన విధంగా రెండు చేతులతో తొడను బంధించండి. ఇలాగే కుడి కాలితో కూడా చేయండి. ఈ వ్యాయామాన్ని పదిసార్లు రిపీట్ చేయండి. రొప్పేదాకా ఇలా చేసి ఆపండి.
కుడికాలికి, ముందర ఎడం కాలు పెట్టి నిటారుగా నిలబడండి. చేతుల్ని ఇలా తల వెనుక మీ శరీరాన్ని మోకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ... చేతుల్ని ఇలా తలవెనుక మీ శరీరాన్ని మొకాళ్ళు వంచడం ద్వారా ఆరు అంగుళాలు క్రిందికి వంచండి. మీ మోకాళ్ళను తిన్నగా చేస్తూ.. ఒక్కసారి స్ప్రింగులా గెంతి మీ పాదాలతో నేలను తన్నండి. కాళ్ళు పెట్టే దిశను మార్చి రిపీట్ చేయండి. ఇలా పదిసార్లు చేయండి. ఊపరి వేగం పుంజుకున్నాక ఆపండి.
నిటారుగా నిలబడండి. మీ మొండాన్ని ముందుకు వంచి చేతులిలా పెట్టండి (ఎ) మీ చేతుల వేళ్ళతో నేలను తాకే ప్రయత్నం చేయండి. మోకాళ్ళు వంగకూడదు. తరువాత నిటారుగా నిలబడి భుజాలను వాల్చండి. తరువాత వెనక్కి వంగం డి. ప్రతీసారీ వీలైనంత ఎక్కువగా వెనక్కి, క్రిందికి వంగటానికి ప్రయత్నించండి (బి). అయిదుసార్లు ఇలా చేయండి. కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్లీ అయిదుసార్లు చేయండి.





మెదడు శుభ్రపడడంతోపాటు, ఆలోచనశక్తి, స్మరణశక్తి పెరుగుతాయి
హైబీపీ, కడుపులో ట్యూమర్లు, హెర్నియా, గుండెజబ్బుల వాళ్లు, గర్భిణులు, పీరియడ్స్ సమయంలోనూ చేయకూడదు.
కపాలభాతి బాహ్య వ్యాయామం మాత్రమే కాదు అంతర వ్యాయామం కూడ. సాధారణ వ్యాయామాలతో దేహంలో అన్ని భాగాల మీద ఒత్తిడి పడుతుంది, కాని కడుపు భాగం మీద ఒత్తిడి కలగదు. కపాలభాతి ద్వారా ఉదరం, ఛాతీ కండరాలకు చక్కటి వ్యాయామం అందుతుంది. దాంతో కొవ్వు కరుగుతుంది. వీటితోపాటు జీర్ణాశయం, క్లోమం, కాలేయం, ప్లీహం, మూత్రాశయం వంటి భాగాల కండరాలు కూడా ఉత్తేజితమవుతాయి. కాబట్టి ఆయా భాగాల నుంచి ఉత్పత్తి కావల్సిన ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి, పనితీరు మెరుగవుతుంది. ఉదాహరణకు క్లోమ గ్రంథి ఉత్తేజితమై ఇన్సులిన్ ఉత్పత్తి క్రమబద్ధమై మధుమేహం నియంత్రణ అవుతుంది. చర్మానికి దేహభాగాలకు మధ్య నున్న కొవ్వు కాని, అంతర భాగాలు, కండరాల మధ్య నున్న కొవ్వు కరగాలన్నా ఇది మంచి వ్యాయామం. భోజనం చేసిన తర్వాత, ఉదర, ప్లీహ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు కపాలభాతి సాధన చేయరాదు.