ప్రతి రోజూ ఓ గంట లేదా అరగంట పాటు సేపు చేసే వ్యాయామం ఎన్నో రోగాలను దరి చేయనీయకుండా కాపాడుతుంది. చిన్న చిన్న వ్యాధుల నుండి, అసాధారణ వ్యాధుల వరకూ వ్యాయామం చేసే వారి దగ్గరకు రావా లంటే కాస్త జంకుతాయి. ఎందుకంటే వ్యాయామంతో శరీరంలోని ప్రతి అవ యవానికి ఎంతో లాభం చేకూరుతుంది. అది రోగాలను దూరంగా వుంచడంలో సాయపడుతుంది. వ్యాయామం వల్ల శరీరంలోని ఏ ఏ భాగానికి ఏవిధంగా మేలు జరుగుతుందో తెలుసుకుందాం.
గుండె :
క్రమం తప్పకుండా చేసే వ్యాయామం హై బ్లడ్ ప్రెషర్ రాకుండా నిరో దిస్తుంది. లోబీపీ ఉన్న వారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేందుకు డాక్టర్ సలహా మేరకు వ్యాయామాన్ని ఆశ్రయించవచ్చు. అధి శాతం హై కొలెస్ట్రాల్ లెవల్స్ హృద్రోగాలకు, హార్ట్ ఎటాక్‌లకు మూలకారణంగా నిలు స్తాయి. క్రమం తప్పని వ్యాయామం ద్వారా వీటికి దూరంగా వుండొచ్చు. వ్యాయామం చేసే వారితో పోలిస్తే వ్యాయామం చేయని వారిలోనే గుండె సంబంధిత వ్యాధులకు ఎక్కువగా అవకాశం వుంటుంది.
ఎముకలకు బలం : వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనమ వుతాయి. ముఖ్యంగా మహిళల్లో మోనోపాజ్ దశ అనంతరం ఈ పరిణామం చోటు చేసుకుంటుంది. ఇతరత్రా కూడా శరీరం బలహీనం కావడం వంటి కారణాల వల్ల కింద పడి ఎముకలు విరగొట్టుకునే అవకాశం వుంటుంది. వ్యాయామం చేసే వారితో పోలిస్తే, వ్యాయామం చేయని వారిలోనే ఈ రక మైన ప్రమాదాలకు ఎక్కువగా అవకాశం ఉంది. క్రమం తప్పకుండా వ్యాయా మం చేయడం కండర పటుత్వాన్ని పెంచడమే కాకుండా ఎముకలు కాల్షి యాన్ని నిలిపి వుంచుకునేలా చేస్తుంది. శరీరం శక్తిని కోల్పోకుండా చూస్తుం ది. తద్వారా సాధారణ ప్రమాదాల బారిన పడే అవకాశాన్ని ఒక వేళ ప్రమాదా లకు గురైనా వాటి తీవ్రతనూ తగ్గిస్తుంది.
మధుమేహం :
మధుమేహంతో బాధపడేవారికి ఇచ్చే చికిత్స ఫలితం రోగుల స్థూల కాయం తదితర అంశాల కారణంగా ప్రభావితం అవుతుంది. ఈ నేప థ్యంలో చికిత్స తీసుకునే వారు బరువు తగ్గితే చికిత్స ప్రభావ పూరితంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మైల్డ్ డయాబెటిస్‌ను మందు ద్వారా కన్నా కూడా ఆహారం, వ్యాయామం ద్వారా నియంత్రించుకోవడం సులభం.
క్యాన్సర్ :
శారీరకంగా చురుగ్గా ఉండని వారిలో పెద్దపేగు సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా వుంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. బ్రెస్ట్ క్యాన్సర్, లైంగిక అవయవాల సంబంధిత క్యాన్సర్లు క్రీడాకారిణులకు రావడం తక్కువే.
No comments:
Post a Comment