Sunday, July 25, 2010

చందనంతో.. అందం

చందనం వృక్షరూపంలో మన దేశంలోనే విస్తారంగా లభిస్తుంది. ప్రస్తుతం చైనా, ఇండోనీషియాల్లోనూ చందనం చెట్లను పెంచుతున్నారు. మైసూర్‌ చందనం విశ్వ విఖ్యాతి గాంచింది. ఇది కర్ణాటక, తమిళనాడు, కోయంబత్తూర్‌లో దొరుకుతుంది. ఇవాళ విదేశాల్లోనూ చందనానికి ప్రాచుర్యం ఉంది.చందనాన్ని చాలామంది వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. టాల్కం పౌడర్లు, సబ్బులు, అగరుబత్తులు, ఫేస్‌క్రీములు వంటి వాటి తయారీలో చందనం విరివిగా వినియోగించబడుతోంది. అదే సమయంలో మెరుగైన అందాన్ని ఇవ్వడానికి కూడా చందనం ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.

sandalwoodచందనం పట్టు వేసుకుంటే చలువ చేసి, తల నొప్పి తగ్గుతుందని మన బామ్మలు వైద్యం చేస్తుండేవారు. ఆరోగ్యానికే కాకుండా, అందానికి సైతం చందనం వాడుకలో ఉంది. పరిమళాలీనే చంద నం, భారతీయుల మనసుల్లో ఒక ప్రముఖస్థానాన్ని ఆక్రమించే ఉంది. పూజల తరువాత నుదుట పెట్టుకు నే తిలకంగానో, వేసవిలో ఎండ వేడిమి తట్టుకునేందుకు లేపనంగానో అందరూ వాడుతున్నాము. చందనం లోని యాంటి సెప్టిక్‌ గుణాల వల్ల, రకరకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నాము. చందనం వేసవిలో సూర్యరశ్మిలోని అల్ట్రా మయొలెట్‌ కిరణాలు నుంచి చర్మానికి రక్షణ కలిగిస్తుంది. అందుకని చందనం కలిసిన సన్‌లోషన్స్‌ వాడుతున్నారు. సౌందర్యసాధనంగా చందనం గురించి తెలుసుకుందాం.

ముఖాన్ని తాజాగా ఉంచేందుకు......
1 చెంచా చందనం పొడికి 1 చెంచా తేనె, సగం చెంచా పసుపు చేర్చి, బాగా కలపాలి. ఈ లేపన్నాన్ని ము ఖం, మెడకు రాసుకుని, 20 నిమిషాల తరువాత, చల్లని నీటితో కడిగేయాలి. ఇది ఉత్తమమైన ఫేస్‌ మాస్క్‌ లా పని చేస్తుంది. ఇది సహజసిద్ధమైన మాస్క్‌ కనుక ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అందుకే బ్యూటీపార్లర్‌ వంటివాటికి వెళ్లి కృత్రీమ రసాయనాలు వాడడం కంటే చందనం వాడడం ఉత్తమం.

మొటిమలను తొలగించటంలోనూ......
మొటిమలు పోవడానికి రక ర కాల క్రీములువాడుతుంటా రు. కానీ దానితో పోలిస్తే చ ందనం ఎంతో ఉపయుక్తం. 2 చెంచాల సెనగ పిండి కి, సగం చెంచా పన్నీరు, 2 చెం చాలు నీరు, 1 చెంచా చంద నం పొడి చెర్చాలి. బాగా కలి పి ముఖానికి పట్టించుకోవాలి. ఎండిపోయాక, ముఖం మీద నీ రు చిలకరించుకుంటూ శుభ్రం చే సుకోవాలి. ఇలా కొన్ని రోజుల పాటు ని యమబద్ధంగా చేస్తే ముఖం కాంతివం తం కావటమే కాకుండా, క్రమంగా మొటిమలూ పోతాయి.

ఎండ వేడిమి నుంచి రక్షణకు...
చందనం పేస్ట్‌ను ముఖానికీ, మెడకూ రాసుకుని, ఎండిపోయాక చల్లని నీటితో కడిగేయాలి. ఈ చందనం పేస్ట్‌ తయారు చేసుకోవటం కూడా సులువే. చందనం కర్రను నీటిలో అరగదీస్తే, పేస్ట్‌ తయారవుతుంది. దీనిలో తగినంత ఖీరాల రసం లేదా పన్నీరు కలిపి, ఉపయోగించుకోవచ్చు.
ముల్తానీ మట్టి, గుడ్డులోని పసుపు సొన, తేనె, ఆలివ్‌ నూనె, చందనం పొడి కలిపి, పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి లేపనం చేసుకుని ఆరిపోయాక కడిగేయాలి. ఇలా చేస్తే ఎండకు కమిలిన చర్మానికి చల్లదనం కలిగి, మునుపటి స్థితికి వస్తుంది..
వేసవిలో విపరీతంగా చెమట పడుతుంటుంది. చందనం పొడికి పన్నీరు చేర్చి, ఈ మిశ్రమాన్ని శరీరమంతటా లేపనం చేసుకోవాలి. కాసేపు తరువాత స్నానం చేస్తే, శరీరదుర్గంధం పోతుంది.

No comments: