పాదాలు పగలడం, రక్తాలు రావడం, నడవలేకుండా అవ్వడం వంటి సమస్యలు చాలా మందిలో తలెత్తుతాయి. పాదాలను సంరక్షించుకోవడానికి పెడిక్యూర్ ఒక మంచి పద్ధతి. మన ఇంటిలోనే ఈ పద్ధతి ద్వారా పాదాలను అందంగా ఉంచుకోవచ్చంటున్నారు సౌందర్యనిపుణులు.
పాదాలను సంరక్షించుకోవాలంటే వాటిని క్రమం తప్పకుండా శు భ్రం చేస్తూ ఉండాలి. పాదాలను శుభ్రంగా ఉంచడానికి, అందంగా కనిపించడానికి పెడిక్యూర్ చేయడం ఒక మంచి పద్దతి. నెలలో రెండుసార్లు పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం బయటికెళ్ళకుండా ఇంట్లోనూ చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు...
నెయిల్ బ్రష్, నెయిల్ క్లిప్పర్స్, ప్యూమిక్ స్టోన్, మసాజ్ క్రీమ్, నెయిల్ వార్నిష్, ఒక చిన్న టబ్ పెడిక్యూర్ చేయడానికి ఉపయోగపడుతాయి.
లాభాలు...
పాదాలను ఆరోగ్యంగా ఉంచడానికి పెడిక్యూర్ ఉపయోగ పడుతుంది. పాదాలకి కావల్సినంత మసాజ్, టోనింగ్ లభిస్తుంది రక్తసరఫరా పెరుగుతుంది. దాంతో పాదాలా దృఢంగా ఉంటాయి.
ఎలా చేయాలి...
పెడిక్యూర్ చేయడానిి ఒక టబ్‌లో గోరువెెచ్చని నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లలో షాంపూ, సగం నిమ్మకాయ, ఏదైనా ఆయిల్, చిటికెడు ఉప్పు వేయాలి. ఇప్పుడు 20 నిమిషాలు ఈ టబ్‌లో కాళ్లు పెట్టి కూర్చోవాలి. అంతన్నా ముందు పాదాల గోర్లపై ఉన్న నెయిల్ పాలిష్‌ను రిమూవర్ సహాయంతో తొలగించాలి. కొద్దిసేపు పాదాలను నీళ్లలో పెట్టిన తర్వాత మడమలు,అరికాళ్లను ప్యూమిక్ స్టోన్ లేదా ఇసుక, మట్టితో రుద్ది శుభ్రం చేయాలి.
గోర్ల చుట్టు పక్కల ఉన్న చర్మాన్ని, చర్మం వెనుక భాగాన్ని బాగా పుష్ చేయాలి. గోర్లను కట్టర్‌తో జాగ్రత్తగా కత్తిరించి ఒక షేప్ ఇస్తే బాగుంటుంది. గోర్లు కత్తిరించే సమయంలో గాయపడకుండా చూసుకోవాలి.ఆ తరువాత ఏదైనా మంచి నూనె లేదా క్రీముతో గోర్లను,పాదాలను మాలిష్ చేయాలి. ఒక వేళ మీకిష్టమైతే పాదాలు శుభ్రం చేసుకోడానికి నెలలో ఒకసారి బ్లీచ్ లేదా వారంలో ఒకసారి స్క్రబ్ చేయవచ్చు. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్‌ను పాదాలపై అప్లై చేయాలి. ఇలా చేస్తే పెళుసుదనం తగ్గి పాదాలు అందం గా కనిపిస్తూ ఆరోగ్యంగా దృఢంగా ఉంటాయి. అందమైన పాదాలకు ఆ మాత్రం శ్రద్ధ అవసరమే మరి.
No comments:
Post a Comment