అందం కోసం మహిళలు తరచూ రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఇందులో భాగంగా వారి ఆహారపు అలవాట్లలోనూ మార్పులు, చేర్పులూ చేసుకుంటుంటారు. అయినప్పటికీ తమ అందం మరింతగా పెరగాలని, ఇతరులు తమ అందాన్ని ప్రశంసించాలని కోరుకుంటారు. దీనికి వారు మంచి ఆహారం తీసుకోవడంతోపాటు ఆనందంగానూ వుండాలంటున్నారు సౌందర్య నిపుణులు. ఆరోగ్యంగా వుండాలంటే..
అందంగా వుండాలంటే ముందుగా ఆరోగ్యం గా వుండాలి. ఆరోగ్యంగా వుండేందుకు పోషక విలువలు కలిగిన ఆహారం తీసు వాల్సివుంటుంది. వీలైనంత వరకు నూనెతో కూడుకున్న ఆహారపదా ర్థాలకు దూరంగా వుండేందుకు ప్రయత్నించాలి. అలాగే ఆహారంలో రైస్‌తో చేసే పదార్థాలు తక్కువగా వుం డేలా చూసుకోవాలి. తీసుకునే ఆహా రంలో పోషక విలువలుండేలా చూసుకో వాలి. కార్పొహైడ్రేట్‌లు తక్కువగా ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఆహారంలో ముఖ్యంగా పీచు పదార్థా లుండేలా చూసుకోవాలి. మాంసా హారు లైతే కోడిగుడ్డు లోని తెల్లసోన మాత్రమే తీసుకోవాలి. కోడి కూర, చేపలు తప్పనిసరిగా తీసుకోవ చ్చు. పొట్టేలు, మేమాంసం కు దూరంగా వుండటమే మంచిది.
సంతోషంగా వుండేందుకు..
ఆరోగ్యంగా వుండేందుకు ఆహారపు అలవాట్ల గురించి చెప్పుకున్నాం. కాని దీంతో పాటు అందంగా వుండేందుకు సంతోషంగానూ వుండాలి. సంతోషంగా వుండేందుకు ప్రశాంత వదనంతో ఉండేందుకు ప్రయత్నించాలి. మీ చుట్టుపక్కల వున్న వారి గురించి కూడా కాస్త పట్టించుకోవాలి. వారు సంతోషంగా వుంటే మీరు కూడా సంతోషంగా వుండగలరు. మీ కార్యాలయంలో లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్లతో వీలైనంత వరకు సరదాగా వుండేందుకు ప్రయత్నించాలి. సమస్యల్లో వున్న వారికి మీకు తోచిన సాయం చేసేందుకు ప్రయత్నించాలి.
సమస్యలు అనేవి ప్రతి ప్రాణికి వుంటాయి. కాని మనిషికి మరీ ఎక్కువగా వుంటాయి. ఇందులోనూ సంతోషంగా వుండేందుకు స్వతహాగా ప్రయత్నిస్తే సమస్యలు అనేవి దూరమయిపోతాయి. పైగా మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే మానసికపరమైన ఒత్తిడి శరీరంలో ఉండదో అప్పుడు మీ అందం ద్విగుణీకృత మౌతుందంటున్నారు సౌందర్య, మానసిక నిపుణులు.
ఒత్తిడి తగ్గించుకునేందుకు..
బత్తిడిని నియంత్రించుకోవడానికి తరచూ స్పాకు వెళ్లండి. వీలైతే వారానికి ఒకసారి శరీరానికి మసాజ్ చేయించుకోవడానికి ప్రయత్నించొచ్చు. పగలంతా బాగా పనిచేసి అలసిపోయిన తర్వాత రాత్రి పడుకునే ముందు మీకు నచ్చిన సంగీతాన్ని వింటూ నిద్రకు ఉప్రకమించొచ్చు. దీంతో శరీరంలోని అలసటతోపాటు మానసికపరమైన ఒత్తిడి కూడా తగ్గి నిద్రబాగా పడుతుంది. వీలైతే కనీసం మూడు నెలలకు ఒక సారి పర్యాటక ప్రదేశాలకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. పర్యాటక ప్రదేశాలకు వెళ్లడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా తయారవ్వొచు. ఎప్పుడైతే ఉత్సాహంగా ఉల్లాసంగా వుంటారో అప్పుడు మీరు మరింత అందంగాకనబడే అవకాశాలు వున్నాయంటున్నారు నిపుణులు.
No comments:
Post a Comment