Tuesday, December 28, 2010

శిశువులపై ఆహార ప్రభావం

గర్భిణిలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పెద్దలందరూ చెబుతుంటారు. దీన్ని నిర్ధారిస్తూ ఎన్నో పరిశోధనా ఫలితాలు వెలువడ్డాయి కూడా. అయితే గర్భిణులు తీసుకునే ఆహార పదార్థాల రుచులు పుట్టబోయే శిశువుల మెదడు ఆకారాన్ని నిర్దేశించడంతోపాటు వారి ఆసక్తులపై ప్రభావం చూపిిస్తాయని తాజా సర్వే ఒకటి పేర్కొంటోంది.

గర్భిణిలు తీసుకునే ఆహారాన్ని బట్టే భవిష్యత్తులో శిశువులు ఆహార పదార్థాలను ఇష్టపడడం ఉంటుందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఎంత పోషకాహారం తీసుకుంటే శిశువుల తెలివితేటలు అంతగా వృద్ధి చెందుతాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో న్యూరోసైంటిస్ట్ డిగోరెస్ట్రెపో పేర్కొంటున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా గర్భంతో ఉన్న ఎలుకలను మూడు మూడు బృందాలుగా చేశారు.

ఒక బృందానికి రుచులులేని సాధారణ ఆహారం, మరో బృందానికి అన్నిరకాల రుచులను, మూడో బృందానికి ఘాటు రుచులున్న ఆహారాన్ని ఇచ్చారు. అవి ప్రసవించిన తర్వాత వాటి పిల్లలు తీసుకునే ఆహారాన్ని పరిశీలించగా అవి తల్లి గర్భంతో ఉన ్నప్పుడు తీసుకున్న ఆహారాన్ని పోలిఉండడం గమనించారు. అంటే గర్భిణులుగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారం బిడ్డ ఇష్టాఇష్టాలను నిర్ధేశిస్తుందని ఈ అధ్యయనం వెల్లడిస్తోంది.

No comments: