క్యాన్సర్... తొలిదశలోనే గుర్తిస్తే నయమయ్యే వ్యాధే అయినా నిర్లక్ష్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కువ శాతం మంది క్యాన్సర్ బాధితుల్లో వంశపారపర్యం, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణమని పలు అధ్యయనాల్లో వెల్లడయిన సంగతి తెలిసిందే. మరి దీన్ని ఎదుర్కొనే మార్గమే లేదా? అంటే చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని పరిశోధకులు అంటున్నారు.
అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్, వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్‌లు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడయింది. బరువు, ఆహారం, వ్యాయామం... ఈ మూడు మనిషి ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు దరి చేరకూడదంటే ఆరోగ్యకరమైన బరువు ఉండటం చాలా అవసరం. అంతేకాకుండా ప్రతిరోజు అరగంటపాటు వ్యాయామం చేయాలి. సమయానికి భోజనం చేయాలి.
పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలకు, ఫాస్ట్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. ఈ రకమైన మార్పులతో క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గించుకోవచ్చని అధ్యయనంలో తేలింది. వీటికి తోడుగా పోగాకు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అప్పుడే క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చని అధ్యయనంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

No comments:
Post a Comment