చర్మ సంరక్షణలో సుగంధ తైలాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ సుగంధ తైలాలను అరోమా, ఎసెన్షియల్, వోలటైల్ ఆయిల్స్ అని అంటారు. ఇవి మొక్కలు, వృక్షాలకు సంబంధించిన శుద్ధమైన, సహజసిద్ధమైన నూనెలు. ఆహ్లాదాన్ని కలిగించే వాసనలు ఉండటంతో అరోమా అని, అణువణువూ పిండి, వడగాచి తీయడంతో ఎస్సెన్షియల్ అని, ఇగిరిపోయే గుణం ఉండటం వల్ల వోలటైల్ అని పిలుస్తారు. ఈ తైలాలను వనమూలికలకు సంబంధించిన వేరు, కాండం, ఆకు, పూవు, తొక్క, గింజ భాగాల నుంచి సేకరిస్తారు.
మెదడుకు సంబంధించిన దాదాపు అన్ని నాడులూ చర్మంపైకి చేరుకునేవే. చర్మంలోనికి తెరుచుకున్న ఇతర జ్ఞాన కర్మేంద్రియాల ఉపరితల భాగం (ఎపిథీలియం, మ్యూకస్ పొరలు) కూడా చర్మంలో అంతర్భాగమే. అలాగే మెదడుకు మనసుకు ఉన్న సంబంధం విడదీయరానిది. ఆహ్లాదంగా ఉన్న మెదడు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే చాలా రకాల చర్మవ్యాధులు మానసిక ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు తీవ్రమవుతాయి. మనసుకు ఆహ్లాదం కలిగించడం ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించి, తద్వారా చర్మ వ్యాధులను నివారించడం సుగంధ తైలాల ప్రత్యేకత.
సుగంధ తైలాలు ఎంత ఆహ్లాదకరమైనవో అంతే తీక్షణమైనవి. కాబట్టి వీటి వాడకానికి ఆవిరికాని, ఇగిరిపోని గుణాలుండే వెజిటబుల్ ఆయిల్స్‌ను వాహక తైలాలుగా వాడాల్సి ఉంటుంది. అలాకాకుండా నేరుగా తీసుకుంటే శ్వాసతీసుకోవడం కష్టంగా మారవచ్చు. అందుకే ముందుగా తైలాన్ని ప్యాచ్ టెస్ట్ చేసి చూసుకోవాలి. అరోమా అయిల్స్‌తో ఆల్మండ్, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆలివ్ నూనెలను క్యారియర్ ఆయిల్స్‌గా వాడతారు. ఒక్కోసారి ముక్కు ద్వారా ఈ తైలాలను ఉపయోగించాల్సి వచ్చినపుడు నీళ్లలో కలిపి ఆవిరిగా పట్టడం, స్ప్రే చేస్తారు. కడుపులోనికి తీసుకోవాల్సి వచ్చినపుడు ఆల్కహాల్, నీటిలో కలిపి టింక్చర్‌గా తీసుకోవచ్చు.
చర్మవ్యాధులకు చికిత్సగా అరోమా తైలాలు (అరోమా థెరపీ) మూడు రూపాలలో వాడతారు. 1) చర్మ సంరక్షణ(బాడీకేర్) 2) సౌందర్య సంరక్షణ(బ్యూటీ కేర్) 3) కేశ సంరక్షణ(హెయిర్ కేర్). ఈ రకమైన చికిత్సలు అందించేటప్పుడు అరోమా తైలాలు యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెల్యూలైట్, యాంటీ సెప్టిక్ వంటి ఫార్మకలాజికల్ గుణాలలో ఒకటి కంటే ఎక్కువ రూపాలలో పనిచేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సూక్ష్మరూపంలో ఉండటంతో చర్మం నుంచి రక్తంలోకి త్వరగా చేరుతుంది.
చర్మ సంరక్షణ(బాడీకేర్)
చర్మ సంరక్షణలో భాగంగా తైలాలను నీళ్లలో కలిపి స్నానం రూపంలో గానీ, వెజిటబుల్ నూనెల్లో కలిపి అభ్యంగం రూపం(మసాజ్)లో గానీ ఉపయోగించాల్సి ఉంటుంది.
పొడి చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కాంపౌండ్ తయారు చేసుకోవడానికి.. (ఎసెన్షియల్ ఆయిల్) జిరేనియమ్ - 8 చుక్కలు, కెమొమిల్ - 6 చుక్కలు, మంచి గంధం - 6 చుక్కలు, వర్టివెర్ట్ - 8 చుక్కలు (బే సాయిల్), ఆల్మండ్ - 30 మి.లీ, అప్రికాట్ - 20 మి.లీ జిడ్డు చర్మం : 50 మి.లీ అరోమా ఆయిల్ కోసం (ఎస్సెన్షియల్ ఆయిల్) జనిఫెర్ బెర్రీ - 6 చుక్కలు, లెమన్ - 7 చుక్కలు, రోజ్‌వుడ్ - 6 చుక్కలు, ఇలాంగ్ ఇలాంగ్ - 5 చుక్కలు (బే సాయిల్), గ్రేప్ సీడ్ - 40 మి.లీ, జోజోబ - 10 మి.లీ, ముడుతల చర్మం : (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫాకిన్ సెన్స్ - 6 చుక్కలు, క్యారట్ సీడ్ - 8 చుక్కలు, పట్ చవులీ - 8 చుక్కలు, స్పికెనార్డ్(జటామాంసి) - 4 చుక్కలు (బే సాయిల్), అప్రికాట్ - 35 మి.లీ, ఈవెనింగ్ ప్రైమ్‌రోజ్ - 5 మి.లీ, క్యారట్ సీడ్ - 5 మి.లీ, అశ్వగంధ - 5 మి.లీ
ఒబెసిటీ
50 మి.లీ యాంటీ సెల్యూలైట్ తయారీకి.. (ఎస్సెన్షియల్ ఆయిల్) ఫెన్నెల్ - 5 చుక్కలు, జనిఫెర్ బెర్రీ - 5 చుక్కలు, పట్ చవులీ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 5 చుక్కలు, గ్రేప్‌సీడ్ - 5 చుక్కలు (బే సాయిల్) , నువ్వుల నూనె - 50 మి.లీ
కేశ సంరక్షణ(హెయిర్‌కేర్) :
శిరోజాలు రాలడాన్ని తగ్గించుటకు :(50 మి.లీ తయారీకి), (ఎస్సెన్షియల్ ఆయిల్) స్పికెనార్డ్ - 5 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, సుగంధ్ కోకిల - 6 చుక్కలు, కర్రీ లీవ్స్ - 6 చుక్కలు, (బేసాయిల్) నువ్వుల నూనె - 45 మి.లీ, ఆముదం నూనె - 5 మి.లీ చుండ్రు నివారణకు : (50 మి.లీ తయారీకి) (ఎస్సెన్షియల్ ఆయిల్) పట్ చవులీ - 6 చుక్కలు, రోజ్‌మెరీ - 6 చుక్కలు, టీ ట్రీ - 6 చుక్కలు, సెడార్ వుడ్ - 6 చుక్కలు (బేసాయిల్), నువ్వుల నూనె - 45 మి.లీ, ఆలివ్ ఆయిల్ - 5 మి.లీ,
ముఖం శుభ్రపరచుకోవడానికి(క్లెన్సింగ్): శుభ్రమైన నీటిలో గానీ, క్లెన్సింగ్ మిల్క్‌లో (1-2 స్పూన్‌లు)గానీ రెండు చుక్కల మోతాదులో క్లేరీసెజ్, లెమన్, లైమ్, రోజ్‌మెరీ, కామెమైల్, లావెండర్, జిరానియమ్, టర్మరిక్.. వీటిలో ఏదైనా ఒకదానిని కలిపి ముఖానికి పట్టించి, మెత్తటి గుడ్డతో తుడిచినట్లయితే మేకప్ మరకలు తొలగి ముఖం నిగనిగలాడుతుంది.
ముఖానికి లేపనము : (ఫేషియల్ ప్యాక్)
పొడి చర్మానికి: గంధం నూనె - 2 చుక్కలు, మీగడ, తేనె - 1 స్పూన్, శనగపిండి, ముల్తాన్ మట్టి - అర స్పూన్ వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి. జిడ్డు చర్మానికి : ఇలాంగ్ ఇలాంగ్ - 1 చుక్క, జిరేనియమ్ - 1 చుక్క, పుచ్చకాయ లేక టమాట గుజ్జు - 2 స్పూన్‌లు, ముల్తానిమట్టి - అర స్పూన్, వీటన్నింటినీ ఒక గిన్నెలో కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కాసేపు ఆరిన తరువాత గోరువెచ్చటి నీళ్లతో కడిగేయాలి.
డాక్టర్ చిలువేరు రవీందర్
అసిస్టెంట్ ప్రొఫెసర్,
డాక్టర్ బిఆర్‌కెఆర్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల,
హైదరాబాద్,
ఫోన్: 9848750720.

No comments:
Post a Comment